ఔరంగాబాద్‌లోని జనానీ మసీదులో ముస్లిం మహిళలు దివ్య ఖురాన్ పాఠాలు నేర్చుకుంటున్నారు.
జనానీ మసీదు 350 సంవత్సరాల క్రితం మొఘల్ కాలంలో నిర్మించబడింది. దివ్య ఖురాన్ మరియు హదీస్‌లను అధ్యయనం చేయడానికి చాలా మంది ముస్లిం బాలికలు మరియు మహిళలు జనానీ మసీదు వద్దకు వస్తారు.
భారతదేశంలో ముస్లిం మహిళలు మసీదులలో ప్రార్థనలు
చేయడమే కాకుండా వాటిని నిర్మించారు కూడా. మధ్యయుగ భారతదేశంలోని అనేక మసీదులను రాజ కుటుంబ
స్త్రీలు నిర్మించారు. మొఘల్ చక్రవర్తుల భార్యలు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో
మసీదులు, మదర్సాలు మరియు సరాయిల నిర్మాణాలను
పర్యవేక్షించారు మరియు వాటి నిర్వహణ లో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈద్ వంటి
ప్రత్యేక సందర్భాలలో వారు మసీదులకు హాజరు అయ్యారు అని చరిత్రకారులు చెబుతున్నారు.
మధ్యయుగ భారతదేశంలో, అనేక మసీదులకు రాజ కుటుంబాలు లేదా
ఉన్నత కుటుంబాలకు చెందిన మహిళలు తరచుగా వచ్చేవారని చెబుతారు. మసీదుల్లోకి మహిళలు
ప్రవేశించడాన్ని నిషేధించడానికి చారిత్రక
ఆధారాలు లేవు..
ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా ఇస్లాం మతం
మహిళలను సామూహిక ప్రార్థనలలో చేయడానికి అనుమతిస్తుందని అంగీకరించింది. కాని భారతదేశంలోని
చాలా మసీదులలో మహిళలకు వేరుగా ప్రార్ధనా వసతి లేదు. దీనికి ఒక మినహాయింపు
ఔరంగాబాద్‌లో మూడు మసీదులు. ఇక్కడ మహిళలు ప్రార్థనలు చేస్తారు మరియు ఇతర ఖురాన్
కోర్సులతో పాటు ఖురాన్ పఠనాన్ని కూడా నేర్చుకుంటారు.
అటువంటి మసీదులలో ఒకటి 350
సంవత్సరాల క్రితం మొఘల్ కాలంలో ఔరంగజేబు చేత నిర్మించబడిన జనానీ మసీదు. ఖురాన్
మరియు హదీస్‌లను అధ్యయనం చేయడానికి చాలా మంది ముస్లిం బాలికలు మరియు మహిళలు జనానీ
మసీదు కు వస్తారు. ఈ కోర్సులు ఉచితంగా అందించబడతాయి మరియు అర్హత కలిగిన మహిళా
ఖారీస్ ద్వారా బోధించబడతాయి
సమీపంలోని ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న
బాలికలు ఈ శిథిలావస్థలో ఉన్న మసీదులో మధ్యాహ్నం పూట నమాజ్ చేసేవారు. క్రమంగా
చుట్టుపక్కల ఉన్న ఇతర మహిళలు మసీదు సమీపంలోని పార్కులో ప్రార్థనలు చేసేవారు. మరియు కొంతమంది మహిళలు వారి ఉదయం నడక తర్వాత ఖురాన్ పఠించేవారు..ప్రజలు
అభ్యంతరం చెప్పడంతో, ఈ మహిళలు జనానీ మసీదుకు రావడం ప్రారంభించారు.
శిథిలావస్థలో ఉన్న జనానీ మసీదు బాగు
చేయడానికి దాదాపు రూ.కోటి అవసరమవుతుందని అంచనా వేశారు. అందులో 20,000/- మసీదు
మరమ్మతులు చేయడానికి అవసరం అవుతుంది. దీని
కోసం వారు ఒక బిల్డర్‌ను సంప్రదించారు, అయితే అతను వారి నుండి డబ్బు తీసుకోకుండా
చేశాడు. ఇది 2012 సంవత్సరంలో జరిగింది.
2013లో, అఫ్సారీ బేగం అనే సీనియర్ సిటిజన్, దగ్గర్లో నివసించే స్త్రీల బృందంలో
చేరి, బోధించడానికి మరియు మసీదు కోసం నిధుల
సమీకరణకు చొరవ తీసుకుంది. త్వరలో, చిన్న
మసీదు మరమ్మత్తు చేయబడింది,
విద్యుత్ మరియు నీటి కనెక్షన్ కూడా
ఇవ్వబడింది. దాత సహకారంతో ఒక బోరు బావిని తవ్వారు,నీరు ప్రవహిoచడానికి పైప్‌లైన్‌లను అమర్చారు.
తద్వారా మస్జిద్ పూర్తి స్థాయి తరగతుల నిర్వహణ కు సిద్ధంగా ఉంది.
పది మంది స్త్రీలతో ప్రారంభించినది త్వరలో
దాదాపు 40 మంది స్త్రీలకు చేరుకుంది.ముస్లిం మహిళలు తాజ్‌వీద్‌తో ఖురాన్ చదవడం, హదీసులు నేర్చుకోవడం మరియు వాటిని కంఠస్థం చేయడం నేర్చుకోవడంలో
ఆసక్తి చూపుతున్నారు..
“ఈ తరగతులు గత 7-8
సంవత్సరాలుగా జరుగుతున్నాయి మరియు ఇటీవల మరుగుదొడ్లు మరియు అభ్యంగన స్థలాలను కూడా
నిర్మించారూ.. ప్రతిరోజు ఉదయం అఫ్సారీ బేగం మరియు మరో ఇద్దరు అలిమాలు స్త్రీలకు
రెండు గంటల పాటు బోధిస్తారు.మహిళలకు, యుక్తవయస్సులో ఉన్న బాలికలకు నమాజ్, మంచి నడవడిక మరియు ఇస్లాం యొక్క ప్రాథమికాలను నేర్పుతారు.. ఎటువంటి
రుసుము తీసుకో బడదు
ఇక్కడికి నిత్యం వచ్చే మహిళల్లో అత్యధికులు 30 ఏళ్లు పైబడిన వారు, బీపీఎల్ (దారిద్య్ర రేఖకు దిగువన)
కుటుంబాలకు చెందిన వారు.
జనానీ మసీదు మరియు దాని కార్యకలాపాలు ఇస్లామిక్
విలువలను ప్రోత్సహించడానికి ఔరంగాబాద్ నగరంలో అరబిక్ విద్యను అందించడానికి ఇతర
ముస్లిం మేనేజ్‌మెంట్ పాఠశాలలు మరియు మస్జిద్‌లను ప్రేరేపించాయి.
ఈ మసీదులోని మహిళా విద్యార్థులు ఔరంగాబాద్‌లోని
దారుల్ ఖిరాత్ కలీమియా అనే సెమినరీలో తాజ్‌వీద్ పరీక్షకు హాజరవుతున్నారు.ఈ
పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, వారు ఖారీగా మారడానికి మరియు ఇతరులకు బోధించడానికి అర్హత సాధించే
ధృవీకరణ పత్రాలను అందజేస్తారు. జీవనోపాధికి ప్రత్యామ్నాయ వనరు కోసం చూస్తున్న
మహిళలకు ఈ సర్టిఫికెట్లు ప్రయోజనకరంగా ఉంటాయి..
ఔరంగాబాద్‌లోని జనానీ మసీదుతో పాటు, ఈ చారిత్రక నగరంలో తోటికి మసీదు మరియు
మహమ్మదీయ మసీదు వంటి మరికొన్ని మసీదులు కూడా మహిళలకు కేటాయించిన స్థలం ఉన్నందున
మహిళలు ప్రార్థనలు చేయడానికి మరియు ఇస్లాంను అభ్యసించడానికి అనుమతిస్తాయి. అయితే, జనానీ మసీదు మాత్రమే మహిళలకు
ప్రత్యేకం.
No comments:
Post a Comment