పదమూడవ శతాబ్దం నుండి, క్రిమియా
(క్రిమియన్ ద్వీపకల్పం అని కూడా పిలుస్తారు) సుదీర్ఘమైన మరియు సంక్లిష్టమైన చరిత్రను
కలిగి ఉంది.
క్రిమియన్ టాతర్స్ నల్ల సముద్రం యొక్క ఉత్తర తీరంలో
క్రిమియన్ ద్వీపకల్పానికి చెందిన ఒక ముస్లిం జాతి స్థానిక సమూహం. వోల్హినియా మరియు
పోడోలియా వంటి ఇతర ప్రాంతాలలో లిప్కా తాతర్ యొక్క కాలనీలు ఉన్నప్పటికీ, ముస్లిం స్థావరాలు దక్షిణ భాగంలో ఉన్న
దేశాలలో, ముఖ్యంగా క్రిమియాలో కేంద్రీకృతమై
ఉన్నాయి.
మొదట్లో
క్రిమియా మంగోలియన్ గోల్డెన్ హోర్డ్‌లో
భాగంగా ఉండేది, తర్వాత స్వతంత్ర ముస్లిం క్రిమియన్
ఖానేట్, ఆ తర్వాత ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగం, ఆ తర్వాత జారిస్ట్ రష్యన్ సామ్రాజ్యం,
ఆ
తర్వాత సోవియట్ యూనియన్ తర్వాత ఉక్రెయిన్,
మరియు
ఇప్పుడు మళ్లీ రష్యా పాలన లో ఉంది.
15వ శతాబ్దంలో ముస్లింలు క్రిమియన్ ఖానేట్‌ను స్థాపించారు. ఖానేట్
త్వరలో దాని సార్వభౌమత్వాన్ని కోల్పోయింది మరియు ఒట్టోమన్ సామ్రాజ్యానికి
లొంగిపోయింది. అయినప్పటికీ
దాని స్థానిక పాలకులు గణనీయమైన స్థాయిలో స్వయంప్రతిపత్తిని కలిగి ఉన్నారు.
పదహారవ
శతాబ్దపు క్రిమియన్ తాతర్ ఖానాటే రాజవంశం
యొక్క స్థాపకుడు, మెన్లీ I
గిరే. ఇతను చెంఘిజ్ ఖాన్, బటు ఖాన్ మరియు కుబ్లా ఖాన్‌ల సుదూర
వారసుడు. ఖాన్ గిరే "రెండు ఖండాల సార్వభౌమాధికారి మరియు ఖాన్ ఆఫ్ ఖాన్స్ అఫ్
టు సీస్ " అనే సామ్రాజ్య బిరుదును కూడా కలిగి ఉన్నాడు..
1764లో, మరొక
ఖాన్, కిరీమ్
గిరే క్రిమియన్ టాతర్ ఖానేట్ యొక్క ఇస్లామిక్ బఖీసరే ప్యాలెస్("రష్యన్
అల్హంబ్రా లేదా రష్యన్ తాజ్ మహల్”) నిర్మిoచినాడు.దానిలో ఫౌంటెన్‌ను
నిర్మించడానికి పెర్షియన్ వాస్తుశిల్పి మాస్టర్ ఒమెర్‌ను నియమించాడు. ఫౌంటెన్ పైన ఖాన్‌ను
ప్రశంసిస్తూ బంగారంతో చెక్కబడిన అనేక కవితలు కలవు. కొంత భాగం ఖురానిక్
కాలిగ్రఫీని కలిగి ఉంది.
1783లో
నల్ల సముద్రపు ద్వీపకల్పాన్ని(క్రిమియా) జారిస్ట్ రష్యా స్వాధీనం చేసుకున్న తర్వాత
చెంఘిజ్ ఖాన్ వారసుల రాజవంశం తొలగించబడింది .18వ శతాబ్దపు చివరిలో రష్యా-టర్కిష్ యుద్ధాల
తర్వాత రష్యన్ ప్రభావం పెరిగి ఖనాటే రష్యన్ సామ్రాజ్యంలో విలీనం కాబడినది. ఖానాట్
రష్యాతో విలీనం చేయబడిన సమయంలో, దాని రాజధాని బఖ్చిసరాయ్‌లో అనేక మదర్సాలతో
పాటు కనీసం 18 మసీదులు ఉన్నాయి
“సల్సాబిల్” అని పిలువబడే బఖీసరే ప్యాలెస్ ను అనేక మంది రాజ ప్రముఖులు,
కవులు, కళాకారులు దర్శించారు మరియు దాని
సౌందర్యానికి ముగ్ధులై ప్రశంసించారు.
టాతర్
ఖానేట్‌లోని ప్యాలెస్‌లోని ఫౌంటెన్ 18వ శతాబ్దపు రష్యాకు చెందిన కేథరీన్ ది
గ్రేట్ మరియు గొప్ప గేయ కవి అలెగ్జాండర్ పుష్కిన్ చే దర్శింపబడినది.కేథరీన్ ది
గ్రేట్ 1787లో 500 ఏళ్ల నాటి విలాసవంతమైన బఖ్చిసారే
(అంటే "తోటలోని ప్యాలెస్") కాంప్లెక్స్ ని సందర్శించింది, ఆమె అక్కడ మూడు రోజులు ఉండి,
ఫౌంటైన్‌లు, మసీదులు మరియు సమాదుల తో నిండిన ఈ ప్రదేశం యొక్క అందాన్ని స్మరిస్తూ కవితలు
కూడా రాసింది. 1820లో ఈ పట్టణాన్ని సందర్శించిన పుష్కిన్
తన 3500 పదాల పద్యం "ది ఫౌంటెన్ ఆఫ్
బఖ్చిసరే" (1824) రాశాడు.
క్రిమియన్
టాటర్ ప్యాలెస్‌ను సందర్శించిన వివిధ దేశాల (పోలాండ్, ఉక్రెయిన్ మరియు రష్యా) కవులు మరియు కళాకారులు అత్యంత ప్రసిద్ధ రచనలు
చేసారు. వాటిలో ఒకటి, పుష్కిన్ కవిత ఆధారంగా బోరిస్ అసఫీవ్ యొక్క 1934 బ్యాలెట్ "ది బఖీసరే ఫౌంటెన్”
తరువాత 1917లో రష్యన్ విప్లవం సమయం నాటికి ముస్లింలు క్రిమియా
జనాభాలో మూడింట ఒక వంతు ఉన్నారు. క్రిమియాలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో
గణనీయమైన ముస్లిం జనాభా ఉంది. అయినప్పటికీ,
రష్యన్
సామ్రాజ్యం ముస్లింలను హింసించడం ప్రారంభించింది.
1944లో క్రిమియాలోని ముస్లిం టాతర్లు రెండోవ ప్రపంచయుద్దం సమయం లో నాజీ జర్మనీకి
మద్దతు ఇచ్చినందుకు రష్యా నాయుకుడు జోసెఫ్ స్టాలిన్ చేత సామూహిక బహిష్కరణకు
గురయ్యారు, వారు నాజీ జర్మనీకి సహకరించారని ఆరోపించబడినది.
అనేక వేల మంది క్రిమియన్ తాతర్లు రెడ్ఆర్మీలో
పనిచేస్తున్నప్పటికీ ముస్లింల గురించి ఈ కళంకం ప్రచారం చేయబడింది.
మే, 1944లో కేవలం రెండు రోజుల్లో క్రిమియా నుండి మొత్తం ముస్లిం టాతర్ జనాభాను మధ్య ఆసియాకు, ప్రధానంగా ఉజ్బెకిస్తాన్‌కు
బహిష్కరించబడ్డారు. (దాదాపు 230,000) బలవంతంగా బహిష్కరించడం వల్ల
ఉజ్బెకిస్తాన్‌కు వెళ్లే మార్గంలో దాదాపు 100,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిని పశువుల రైళ్లలో బలవంతంగా ఎక్కించి
బహిష్కరించారు. వీరిలో సగం మంది కఠినమైన ప్రయాణం, ఆకలి చావులు, తదనంతర
వ్యాధుల కారణంగా మరణించారని అంచనా. క్రిమియా లోని ముస్లిం తాతర్లను సోవియట్ నాయకుడు జోసెఫ్ స్టాలిన్ బహిష్కరించబడటం
లేదా దాదాపు నిర్మూలించబడటం జరిగింది.
1991లో సోవియట్ యూనియన్ విచ్చినం తరువాత, క్రిమియన్
ద్వీపకల్పం ఉక్రెయిన్‌లో భాగమైంది మరియు బహిష్కరించబడిన ముస్లింలను తమ స్వదేశానికి
తిరిగి రావాలని ఉక్రెయిన్ కోరింది. స్వదేశానికి పంపడం 1989లో
ప్రారంభమైనప్పటికీ, 1991 తర్వాత వేగవంతమైంది. తిరిగి వచ్చిన వారు
బహిష్కరణకు ముందు వారు గతంలో కలిగి ఉన్న గృహాలను కొనుగోలు చేయడం లేదా అద్దెకు
తీసుకోవడం వంటి సమస్యలను ఎదుర్కొoటున్నారు.
క్రిమియా
ద్వీపకల్పం నుండి దాదాపు 750,000 మంది ముస్లింలు శరణార్ధులుగా ఉక్రెయిన్ రాజధాని కైవ్ మరియు
దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ నగరానికి తరలివెళ్లారు. ఉక్రెయిన్‌లో
300,000 మంది క్రిమియన్ టాతర్‌లు ఉన్నారు. దీనికి తోడు క్రిమియన్ టాతర్ ముస్లిములు మాస్కోలో మరియు సమీపంలోని కజాన్‌లో
చిన్న మైనారిటీగా ఉన్నారు.
వివాదాస్పద
మరియు అంతర్జాతీయంగా తిరస్కరించబడిన ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత మార్చి 2014లో రష్యా క్రిమియాను తిరిగి స్వాధీనం చేసుకుంది.
క్రిమియన్
ముస్లిములు -వారి బాష,చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపద పై
క్రెమ్లిన్ నిర్భందాలు:
మార్చి 2014లో, ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత క్రిమియా మళ్లీ రష్యాలో చేరింది.
82 శాతానికి పైగా ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. 96 శాతం కంటే ఎక్కువ మంది
ఉక్రెయిన్ నుండి విడిపోవడాన్ని సమర్థించారు మరియు రష్యాతో తిరిగి కలపడానికి
అనుకూలంగా మాట్లాడారు.
మధ్యధరా వాణిజ్య అవుట్‌పోస్టులు, యురేషియన్ స్టెప్పీలు మరియు
తూర్పు ఐరోపా మధ్య గల క్రిమియా, బైజాంటైన్ చక్రవర్తులు, మంగోల్ ఖాన్‌లు మరియు
ఒట్టోమన్ సుల్తానులను ఆకర్షించింది.
క్రిమియా ద్వీపకల్పంలోని
బహుళజాతి జనాభాలో టర్కిక్ మాట్లాడే సంచార జాతులు, గ్రీకులు, గోత్‌లు
మరియు అర్మేనియన్లు ఉన్నారు.
క్రిమియా ప్రజలు చాలామంది ఇస్లాంను అంగీకరించారు, కానీ హార్టికల్చర్ మరియు
అధునాతనమైన సంగీతం వంటి సాంస్కృతిక లక్షణాలను కలిగి ఉన్నారు.
క్రిమియా ముస్లిం
సంస్కృతికి ఒక ముఖ్యమైన కేంద్రంగా మారింది "జారిస్ట్ ప్రభుత్వ విధానాలను
అనుసరించి, క్రిమియన్ టాటర్లు
క్రిమియాను విడిచిపెట్టవలసి వచ్చింది మరియు వారి ఏకైక చారిత్రాత్మక మాతృభూమిలో
మైనారిటీలుగా మారారు" అని చరిత్రకారుడు బెకిరోవా చెప్పారు
క్రిమియన్ టాటర్లు స్వీకరించిన అరబిక్ లిపిని ఉపయోగించారు, కానీ జోసెఫ్ స్టాలిన్
ఆధ్వర్యంలో, వారు సిరిలిక్ లిపికి
మారవలసి వచ్చింది మరియు వారి తరువాతి తరం వారి సోవియట్ పూర్వ సాహిత్యాన్ని
చదవలేకపోయింది.
సోవియట్ ప్రభుత్వం అనుసరించిన మత వ్యతిరేక ప్రచారాల
సమయంలో, క్రిమియా ద్వీపకల్పంలోని చాలా మసీదులు మూసివేయబడ్డాయి.వారి భాషపై
వర్చువల్ నిషేధం వారి మత మరియు సాంస్కృతిక గుర్తింపును మరింత క్షీణింపజేసింది.
రష్యాలో రెండవ అత్యధికంగా
మాట్లాడే భాష మరియు క్రిమియన్ టాటర్ బాష యొక్క నిర్బంధ తరగతులను క్రెమ్లిన్
నిషేధించింది.
క్రిమియా
ను క్రెమ్లిన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత 250,000-బలమైన ముస్లిం జాతి క్రిమియన్
తాతర్లు తమ గుర్తింపును కోల్పోతుందని
భయపడుతున్నారు
రష్యన్ అధికారులు క్రిమియా
ముస్లిముల చారిత్రిక వారసత్వం ను, కళా సంపదను, చారిత్రిక చిహ్నాలను నాశనం
చేయసాగారని క్రిమియన్ ముస్లిములు ఆరోపిస్తున్నారు. క్రిమియాను మాస్కో రెండోసారి
స్వాధీనం చేసుకున్న తర్వాత, రష్యా
అనుకూల అధికారులు బఖ్చిసరయ్ ప్యాలెస్ కాంప్లెక్స్‌లోని పురాతన మరియు పవిత్రమైన
భాగాన్ని పునరుద్ధరించడం ప్రారంభించారు 1532లో నిర్మించిన బిగ్ ఖాన్ మసీదు యొక్క
పునరుద్ధరణ, మొత్తం బఖ్చిసరయ్ ప్యాలెస్‌ను పునరుద్ధరించే ప్రణాళికలను కూడా రష్యా ప్రారంభించినది. ఇది భవనం యొక్క ప్రామాణికతకు దూరంగా ఉందని క్రిమియన్
సంఘం నాయకులు తెలిపారు. 250,000 మంది కల క్రిమియన్ తాతర్స్ ముస్లిం జాతి సాంస్కృతిక
గుర్తింపును పునర్నిర్మించడానికి, నిషేధించడానికి మరియు తుడిచివేయడానికి క్రెమ్లిన్ యొక్క
డ్రైవ్‌లో భాగమని వారు దీనిని పిలుస్తారు.
టర్కిక్-మాట్లాడే క్రిమియన్
జాతి సమూహం ఒకప్పుడు గ్రేట్ సిల్క్ రోడ్ యొక్క పశ్చిమాన ఉన్న శాఖను నియంత్రించింది
మరియు శతాబ్దాలుగా మాస్కోతో పోరాడింది. క్రిమియన్ టాటర్స్ రాజభవనాన్ని తమ కోల్పోయిన
రాజ్యాధికారానికి అత్యంత ముఖ్యమైన చిహ్నంగా భావిస్తారు
రష్యా అధికారులు పునర్నిర్మించిన బఖ్చిసరయ్ ప్యాలెస్ లోపలి భాగాన్ని మరింత యూరోపియన్‌గా కనిపించేలా మార్చారు. వారు విస్తృతమైన కుడ్యచిత్రాలను చెరిపేసారు, అనేక భవనాలను ధ్వంసం చేశారు మరియు బఖ్చిసరయ్ ప్యాలెస్ విస్తీర్ణాన్ని తగ్గించారు. పునరుద్ధరణ అనేది క్రిమియన్ తాతర్ కమ్యూనిటీపై క్రెమ్లిన్ యొక్క విస్తృత ప్రచారంలో భాగం.
క్రిమియాను స్వాధీనం చేసుకున్న కొద్దికాలానికే, మాస్కో ATR మరియు అనేక ఇతర మీడియా
సంస్థలను నిషేధించింది. తాతర్-భాషా కిండర్ గార్టెన్‌లను ద్విభాషగా మార్చింది
మరియు ప్రభుత్వ పాఠశాలల్లో టాటర్ తరగతులను వారానికి రెండు స్వచ్ఛంద గంటలకు
తగ్గించింది
క్రిమియన్ తాతర్లు రష్యాను
ఎలా దోచుకున్నారు, వేల
మంది బందీలను బానిసలుగా చేసి విక్రయించారు మరియు జార్ యొక్క ప్రధాన శత్రువులైన
ఒట్టోమన్ సుల్తాన్‌లకు విధేయతతో ఎలా సేవ చేశారో వివరించే చరిత్ర పాఠ్యపుస్తకాలను
మాస్కో పరిచయం చేసింది.క్రెమ్లిన్-నియంత్రిత మీడియా తాతర్ వ్యతిరేక భావాలను
రేకెత్తించింది.
"క్రిమియన్ ముస్లిం జాతి
గుర్తింపు మరియు స్వీయ-గుర్తింపును నాశనం చేసే లక్ష్యంతో రష్యా నిరంకుశ మరియు
దూకుడు విధానాలను అనుసరిస్తుంది.ఈ విధానాలు మాస్కో "క్రిమియన్ ద్వీపకల్పాన్ని
పూర్తిగా వలసరాజ్యం చేయడానికి నిర్వహిస్తున్న జాతి మారణహోమం"లో భాగము అని క్రిమియన్
ముస్లిం వాదులు ఆరోపిస్తున్నారు.
No comments:
Post a Comment