• అండర్గ్రాడ్యుయేట్ స్ట్రీమ్ లో 2 వ స్థానంలో ఇంజనీరింగ్ స్థానం లో బేసిక్ సైన్స్ చేరింది.
• .సైన్స్ కోర్సులు భారతదేశం యొక్క రెండవ అత్యంత పాపులర్ అండర్గ్రాడ్యుయేట్ స్ట్రీమ్ గా తిరిగి ఉద్భవించాయి.
• ఆర్ట్స్ ఎల్లప్పుడూ అతిపెద్ద ఆకర్షణ గా ఉంది మరియు ఇదే ధోరణి భవిష్యత్ లో కొనసాగుతుంది.
• 2016-17లో 97.3 లక్షల మంది విద్యార్ధులు BA లో చేరగా, 47.3 లక్షల మంది విద్యార్ధులు BSc కోర్సులను ఎంచుకున్నారు మరియు 41.6 లక్షల మంది ఇంజనీరింగ్ ఎంచుకొన్నారని HRD మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది.
ఇంజనీరింగ్ ఆకర్షణ కోల్పోయి, అండర్గ్రాడ్యుయేట్ స్ట్రీమ్ లో సైన్స్ కోర్సులు దేశం లో తిరిగి అత్యంత ప్రాచుర్యం పొందినవి. యువకులలో సివిల్స్, కాంపిటిటివ్ ఎగ్జామ్స్ పై మోజు పెరుగుట వలన ఆర్ట్స్ ఎల్లప్పుడూ అతిపెద్ద ఆకర్షణగా నిలిచినది మరియు రాబోయే సంవత్సరాలలలో ఇదే ధోరణి కొనసాగుతుంది.
కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం 2016-17లో బీఏలో 97.3 లక్షల మంది విద్యార్థులు చేరగా, బిఎస్సీ కోర్సులoదు 47.3 లక్షల మంది మరియు 41.6 లక్షల మంది ఇంజనీరింగ్ కోర్స్ లలో చేరారు.
BSc లోని కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్ మరియు ఫార్మ వంటి శాఖల పట్ల పెరుగుతున్న ఆకర్షణవల్ల సైన్స్ విద్యార్ధులకు ఇష్టమైన కోర్స్ గా మారింది. ప్రఖ్యాతి పొందిన విద్యా సంస్థలో పొందిన ఇంజనీరింగ్ డిగ్రీ కు మాత్రమె విలువ ఉంది. ఈ నాడు ఇంజనీరింగ్ విద్యార్ధులు సాధారణ ఉద్యాగాల కోసం BA, BSc పొందిన విద్యార్ధులతో పోటిపడుతున్నారు. ఇంజనీరింగ్ ఆకర్షణ తగ్గటం తో అనేక ఇంజినీరింగ్ కాలేజి లను మూసివేయడం జరిగింది. నాణ్యత(quwality) గురించి ఆలోచిస్తున్నారు. ఈ ధోరణి ఈలాగే సాగితే నాణ్యత లేని కోర్స్లు, కాలేజి లు మూతబడవచ్చు.
గత అర్ధ-దశాబ్దంలో అండర్గ్రాడ్యుయేట్ దరఖాస్తుదారుల ఎంపికలు గణనీయంగా మారాయి. ఐదు సంవత్సరాల క్రితం వరకు వాణిజ్యం(కామర్సు) ఆర్ట్స్ తరువాత 2వ స్థానం లో ఉన్నది ఆ తరువాత సైన్స్, ఇంజనీరింగ్ మూడవ స్థానంలో నిలిచాయి.
2013 లో బిఏ కోర్సుల్లో 75.1 లక్షల మంది విద్యార్ధులు చేరగా కామర్స్ లో 28.9 లక్షల మంది విద్యార్థులు చేరినారు. . బి టెక్ 17.9 లక్షలు; BE లో 16.4 మంది విద్యార్ధులు, బిఎస్సి లో 25.4 లక్షల మంది విద్యార్ధులు చేరినట్లు హెచ్ఆర్డి మంత్రిత్వశాఖ డేటా తెలుపుతుంది.
అకస్మాత్తుగా, వాణిజ్యం (కామర్స్) దాని ఆకర్షణను కోల్పోయింది మరియు నాల్గవ స్థానానికి దిగజారింది. 2014-2015 ఇంజనీరింగ్ విద్యార్ధులకు గోల్డెన్ పిరియాడ్ గా నిలిచినది. 2014-2015లో, ఐటి రంగం లో ఎక్కువ నియామకాల జరగడం తో ఇంజినీరింగ్ రెండో అత్యంత ప్రజాదరణ పొందిన కోర్సుగా నిలిచినది. దానితో B-స్కూల్స్ లో విద్యార్ధులు కూడా తగ్గారు.
కానీ ఇప్పుడు నాణ్యత, సౌకర్యాలు, విద్యార్ధులు లేని ఇంగజినీరింగ్ కాలేజి ల విస్తరణ ఇంజినీరింగ్ విద్యార్ధుల పట్ల ఒక శాపం గా మారింది.
2015-16 మరియు 2016-17 ల డేటా సైన్స్ అడ్మిషన్ లో పెరుగుదల చూపిస్తుంది మరియు ఇంజనీరింగ్ లో నియామకాలు(placements) తగ్గుదలను చూపుతున్నాయి.
No comments:
Post a Comment