20 March 2018

విద్యా సాధికారికత సాధించిన ముస్లిం మహిళలు మార్పుకు సంకేతాలు


-
భారతదేశం ప్రపంచం లో మెరుగైన స్థానాన్ని సంపాదించడానికి శక్తివంతమైన ఆయుధం విద్య.

ముస్లిం మహిళల సాధికారత, విద్య కోసం ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ పిలుపు కు విస్తృతమైన అంగీకారం మరియు మద్దతును లబించవచ్చునని ప్రభుత్వ పక్షం ఉహించినది. కాని దీనికి బిన్నంగా జరిగినది. విభిన్న కారణాల వలన  పలు రంగాల్లో ప్రతిఘటన ఎదురైంది. కొంతమంది దీనిలో మోడీ రాజకీయ చతురతను చూశారు. ముస్లిం మహిళల విద్య మరియు సాధికారికత విషయం లో అసలు  మోడీ ఏమైనా చేసాడా అని కొందరు ప్రశ్నించారు? దీనికి ట్రిపుల్ తలాక్ వివాదానికి సంభంధం ఉండుట వలన దీనిని కొందరు తీవ్రంగా  వ్యతిరేకించారు.

ఏది ఏమైనా భారతదేశం తన సంపూర్ణ సామర్థ్యాన్ని సాధించడానికి మరియు భారత ముస్లిం మహిళలను శక్తివంతం చేయటానికి విద్య ఒక స్పష్టమైన సంకేతం మరియు ఆయుధం. 2001 నాటి జనాభా లెక్కల ప్రకారం ముస్లిం అక్షరాస్యత రేటు కేవలం 59% మాత్రమే.

ముస్లింలు మరియు ఇతరు బలహీన వర్గాలకు సంబంధించిన వేనుకుబాటు తనంకు కారణాలు కనుగొనటానికి 2006 లో  ఏర్పాటు చేయబడిన సచార్ కమిటీ నివేదిక అనేక రంగాలలో ముస్లింల వెనుకుబాటుతనంను వెల్లడించింది. ఈ నివేదిక మైనారిటీల అభివృద్ధికి అనేక ప్రోగ్రామ్స్  సృష్టించింది. ఈ కార్యక్రమాలు ప్రయోజనకరమైన ప్రభావాన్ని కలిగిoచినవి.

2011 జనాభా లెక్కల్లో ముస్లింల మొత్తం అక్షరాస్యత శాతం 68.5 శాతం పెరిగింది. అది మంచి వార్త.జాతీయ అక్షరాస్యత శాతం  74 శాతానికి వరకు పెరిగింది.

ముస్లిమ్స్ మహిళలు -తక్కువ  అక్షరాస్యత
కానీ గణాంకాలు వేరే కథను చెప్పుతున్నాయి. భారతదేశంలో ముస్లిం మహిళల అక్షరాస్యత రేటు 52% కంటే తక్కువగా ఉంది. అది ఆందోళనకు కారణం అవుతుంది.

ఉన్నత విద్య పరంగా ముస్లింల స్థితి మరింత ఆందోళనగా ఉంది. 2013 లో విడుదల చేసిన  అమెరికన్-ఇండియా పాలసీ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం, సచార్ రిపోర్టు సమర్పించిన  ఆరు సంవత్సరాల తరువాత భారతదేశంలో ముస్లింలలో ఉన్నత విద్య కేవలం 11% మాత్రమే జాతీయ సగటు  19% ఉంది. ఈ రిపోర్ట్ ప్రకారం జనరల్ కేటగిరి ఉన్నత విద్య లో ముస్లింల పరిస్థితి తగ్గుదల లో ఉంది.

అక్షరాస్యత రేటు మరియు ఉన్నత విద్య గణాంకాలు ముస్లిం మహిళల సాధికారతకు డబల్ అడ్డంకిగా ఉన్నాయి. విద్యలో అక్షరాస్యత అనేది ప్రారంభ శ్రేణి మరియు ఉన్నత విద్య అనేది సాధికారికత పొందడానికి పూర్తిస్థాయి లో  తోడ్పడుతుంది. ఈ గణాంకాల ప్రకారం తగినంత మంది ముస్లిం మహిళలు ప్రారంభ శ్రేణిని దాటలేదని, చాలా కొద్దిమంది మాత్రమే  పూర్తి స్థాయి కి చేరుతారని తెల్పుతున్నాయి.

ముస్లిం మహిళలు -పూర్తి విద్యా కొనసాగి౦పు:
ఇది తప్పనిసరిగా జరగాలి. ముస్లిం మహిళల మొత్తం విద్యా కొనసాగింపు పూర్తి స్థాయి లో జరగాలి.   ముస్లిం మహిళలు -పూర్తి విద్యా కొనసాగి౦పు ముస్లిం మహిళ, ముస్లిం కుటుంబం మరియు భారతదేశం యొక్క భవిష్యత్తు కోసం కీలకమైనది.

ఒక ముస్లిం మహిళ కోసం, విద్య సాధికారికంగా ఉంది. ఇది అజ్ఞానం యొక్క సంకెళ్ళు తొలగిస్తుంది. ఇది జ్ఞానం, నైపుణ్యాలు మరియు వైఖరులను అభివృద్ధి చేస్తుంది. ఇది స్వీయ గౌరవం మరియు విశ్వాసం పెంచుతుంది. విద్య ఒక బహుమతి లాంటిది  భవిష్యత్తులో ఇది ఒక సృష్టికర్త మరియు వంతెన లాంటిది.

ముస్లిం కుటుంబానికి, విద్య ఒక మార్పు ఏజెంట్ అది  ముస్లిం మహిళకు  సాధికారికతను  కల్పిస్తుంది.  చాలా ముస్లిం కుటుంబాలు పేదరికంలో చిక్కుకున్న కారణంగా విద్య పొందలేకపోతున్నారు.  ముస్లిం మహిళ తన స్వంత విద్యతో తన పిల్లలను విద్యావంతులను చేయగలదు. పేదరికం నుండి బయటికి రావడానికి ముస్లిం మహిళలకు విద్య తోడ్పడుతుంది. విద్య శక్తివంతమైన సాధనం.
 
విద్య అనేది  భారతదేశం కోసం ప్రపంచంలో అతిపెద్ద ప్రాతినిద్య  ప్రజాస్వామ్య వాగ్దానం అందిస్తుంది. ఆ వాగ్దానికి కేంద్రం సమానత్వం, అవకాశం మరియు సంపూర్ణ ఆర్థిక చలనశీలత. విద్య సాధికారికత  వాగ్దానం ను నిజం చేస్తుంది. వాగ్ధానం నిజం అయినప్పుడు ముస్లిం మహిళ భారతదేశం ఉన్నతి కి తోడ్పడగలదు. వారు భారతదేశం చిత్ర పటాన్ని ప్రపంచ స్థాయి లో మార్చగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.

21 వ శతాబ్దంలో, ఉన్నత విద్య అనేది విజయపు   నిచ్చెన పైకి ఎక్కడానికి చాలా ముఖ్యమైనది. ఉన్నత విద్య అనగా కేవలం కళాశాలలు లేదా విశ్వవిద్యాలయాలు కాదు. దానిలో సెకండరీ స్థాయిలో సాంకేతిక, వృత్తిపరమైన మరియు వృత్తిపరమైన విద్య కూడా కలిసి ఉంది. అజంఘర్  ఫాతిమా గర్ల్స్ ఇంటర్ కాలేజీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, అబ్దుల్లా మహిళల కళాశాలలోని  యువ ముస్లిం మహిళా విద్యార్థులు ఉన్నత విద్య పై సానుకూల దృక్పదాన్ని, నిబద్ధతను చూపారు.

భారత ముస్లిం మహిళా సముదాయం నుండి "భారతదేశం మరియు ప్రపంచాన్ని మెరుగు పరిచే భవిష్యత్తు నాయకులు  వస్తారు".
.
ముస్లిం మహిళలను విద్యాభ్యాసం పొందుతారు మరియు ఇతర ముస్లిం మహిళలకు సాధికారికత కల్పిస్తారు. ఇలా  చక్రం కొనసాగుతుంది.

అది సంభవించినప్పుడు, ముస్లిం మహిళల సంపూర్ణ సామర్థ్యo బయట పడుతుంది. వారు భారతదేశం మరియు ప్రపంచాన్ని గెలుస్తారు.  వారు విజయం సాధించినప్పుడు, మనమందరం విజయవంతం అవుతారు. భారతదేశం విజయం సాధించింది. ప్రపంచం విజయవంతమవుతుంది.

No comments:

Post a Comment