20 March 2018

విద్యా మౌలిక సదుపాయాల కల్పన పట్ల తక్షణ శ్రద్ద చూపాలి Educational Infrastructure Challenges Deserve Instant Attention. -




విద్య   వ్యక్తిగతంగా మరియు సామాజికంగా అభివృద్దికి కి వెన్నెముకగా పరిగణించబడుతుంది  మరియు   చివరికి అది జాతీయ వృద్ధి కి  చిహ్నoగా పరిగణించబడుతుంది. ఇది మార్పు కోసం వ్యక్తిగత ఆలోచనా ప్రక్రియలను ఇంధనంగా మార్చడం ద్వారా సామాజిక, దేశ స్వరూపాన్ని మార్చే  సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది అన్ని సందర్భాలలోనూ విజయం మరియు శ్రేయస్సు కు నిచ్చెనగా పరిగణించబడుతుంది.  కానీ దశాబ్దాలు  గా దీనిని గుర్తించడం లో  మన విధాన రూపకర్తలు నిర్లక్షం ప్రదర్శించారు.  ఎన్నికల సమయములో లేదా జాతీయ బడ్జెట్ల రూపకల్పన సమయం  లో కూడా విద్య తగిన స్థానం పొందలేదు.

ఐఐఎంలు, ఐఐటిలు వంటి భారతదేశంలోని ప్రధాన విద్యా సంస్థల ప్రదర్శనలను అంచనా వేసేటప్పుడు మనం గర్వపడతాము కానీ నిజానికి  దేశం లోని  అధిక  ప్రాంతాల్లో విద్యా మౌలిక సదుపాయాలన్నీ శూన్యంగా ఉన్నాయని చెప్పటానికి వెనుకాడతాము. స్మార్ట్ క్లాసెస్ మరియు ఇ-లెర్నింగ్ గురించి గొప్పగా చెప్పుకొంటాము కాని గ్రామిణ ప్రాంతాలలో విద్యార్ధులు పాఠశాలలకు చేరుకోవడానికి గంటల కొద్ది  నడవడం, అడవుల  గుండా వెళ్ళడం లేదా వారి పాఠశాలలను చేరుకోవడానికి పడవలను ఉపయోగించడం, సరిఅయిన స్కూల్ బిల్డింగ్ వారి లోకాలిటి లో లేకపోవడం వలన బాలికల డ్రాప్-అవుట్ ఎక్కువడం గురించి ప్రస్తావించం.

శిధిలమైన పాఠశాల నిర్మాణాలు, పగిలిన గోడలు,  కారుతున్న కప్పులు, మురికి గదులు, పారిశుధ్య కొరత  మరియు అపాయకరమైన వాతావరణo మరియు అనేక సందర్భాల్లో తరగతి గదులు లేక పాఠశాల భవనాలు లేకపోవడం  మరియు  ఏక  ఉపాధ్యాయుడుని కలిగి ఉండటం  ఇవి అసలైన గ్రౌండ్ రియాలిటీని ప్రదర్శిస్తాయి. కొన్నిసార్లు, పైభాగం లో కప్పు లేకపోవడం మరియు నాలుగు గోడలు కూడా లేకపోవడం వలన పిల్లలు ఆరుబయట విద్యను   అధ్యయనం చేయవలసి వస్తుంది. సంబంధిత వ్యక్తులు ప్రతి సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల పెంపు కోసం వారి సూచనలను పంపుతూనే ఉంటారు అలాగే  ఈ సంవత్సరం కూడా అదే విధమైన డిమాండ్లు చేసారు కాని ఏ మాత్రం ఫలితం  లేదు.

ఈ సంవత్సరం, భారత ప్రభుత్వం విద్య కోసం 85,000 కోట్ల రూపాయలు కేటాయించింది (US $ 13.26 బిలియన్). వీటిలో, రూ 50,000 కోట్ల పాఠశాల విద్య కోసం ఉద్దేశించబడింది, మిగిలినది ఉన్నత విద్య కోసం. ఇది మునుపటి సంవత్సరంలో పోలిస్తే సుమారు 8% ఎక్కువ.

అదే రకంగా సెకండరీ విద్య కు బడ్జెట్ కేటాయింపు పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో సెకండరీ విద్య కు బడ్జెట్ కేటాయింపు రూ. 3,900 కోట్ల(17-18) నుంచి రూ 4,200 కోట్లకు పెరిగింది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాలలో  విద్యాభివ్రుద్ది నిరాశగా ఉన్నప్పటికీ, స్థూల జాతీయ ఉత్పత్తి (జిడిపి) లో ఈ విభాగం లో కేటాయింపు కేవలం 3.8% మాత్రమే ఉంది. దశాబ్దాలుగా ఈ రంగానికి కేటాయింపు సంతృప్తికరంగా లేదు. నిజానికి, గత దశాబ్దంలో ఈ ముఖ్యమైన రంగంపై భారతదేశ కేటాయింపు మొత్తం ఖర్చులో 3.8-4.0% మధ్య ఉంది.

అసోసియేషన్ ఫర్ ఇండియన్ యూనివర్సిటీస్ సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ ఫుర్ఖన్ కమర్ ఇలా అంటున్నారు  "విద్యకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది, విద్యలో మన ప్రభుత్వ పెట్టుబడులను గణనీయంగా పెంచాలి. ప్రైవేటు భాగస్వామ్యం స్వాగతించదగినది, అయితే అది పబ్లిక్ పెట్టుబడుల అవసరాన్ని భర్తీ చేయలేదు”.

భారతదేశం మరియు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలోని ప్రజలు విద్య కోసం బడ్జెట్ కేటాయింపును పెంచాలని డిమాండ్ చేస్తున్నప్పుడు అమెరికా లోని డోనాల్డ్ ట్రంప్ ప్రబుత్వం  మాత్రం విద్యా బడ్జెట్ను 5 శాతం తగ్గించాలని కోరింది. విద్యా బడ్జెట్ను తగ్గించాలి అన్న  ట్రంప్ ప్రతిపాదనను విమర్శిస్తూ  FI ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ప్రముఖ పెట్టుబడిదారుడు, పౌర నాయకుడు మరియు అమెరికా యొక్క ప్రఖ్యాత విద్యా దాత ఫ్రాంక్ ఇస్లాం, "విద్యా బడ్జెట్ లో తగ్గింపు  మరియు సైనిక బడ్జెట్ లో  భారీ పెరుగుదల కు అస్సలు అర్ధమే లేదు. ప్రజాస్వామ్యం యొక్క భవిష్యత్తు కోసం సైనిక బలం వలె విద్య కూడా చాలా ముఖ్యమైనది మరియు   ఆ దేశం యొక్క పౌర శక్తికి విద్య దోహదపడుతుంది” అని అన్నారు.

ప్రైవేట్  పాఠశాలకు ప్రాధాన్యత ఇవ్వవాలన్న ప్రతిపాదన పై  ఫ్రాంక్ ఇస్లాం మాట్లాడుతూ "ప్రభుత్వ పాఠశాలల కన్నా ప్రైవేట్ పాఠశాలల  నిర్వహిణ ఉత్తమమని  సాక్ష్యాలు ఉన్నట్లయితే ఇది మంచి విషయంగా ఉండవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా జరిపిన పరిశోధనలు  దానికి వ్యతిరేకం ఉన్నవి మొత్తంమీద, లేదా కొన్ని చోట్ల లేదా కొన్ని ప్రాంతాలలో పబ్లిక్ స్కూల్స్  మెరుగైన ప్రదర్శనను కలిగి ఉన్నవి.

గ్రామిణ ప్రాంతాలలో విద్యా స్థితి నిరాశలో ఉన్నప్పటికీ భారతదేశంలో విద్య కోసం బడ్జెట్ కేటాయింపు అనేది చాలా తక్కువగా ఉంది. 8 వ ఏ అల్ ఇండియా స్కూల్ ఎడ్యుకేషన్ సర్వే (ఎఐఎస్ఈఈ) నివేదిక ప్రకారం మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 6.75 లక్షల ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 1.18 వేల డిగ్రీ కళాశాలలతో పాటు 3.04 లక్షల ఉన్నత ప్రాధమిక(అప్పర్ ప్రైమరీ), 82.8 వేల సెకండరీ మరియు 36.9 వేల హయ్యర్ సెకండరీ పాఠశాలలు ఉన్నాయి. ప్రాధమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల శాతం స్కూల్ కు కేవలం 2.2 చొప్పున ఉంది.

అదేవిధంగా, తరగతి గదులు, సురక్షితమైన త్రాగునీటి, టాయిలెట్ సౌకర్యాల గణాంకాల దృష్ట్యా గ్రామీణ భారతదేశంలోని పాఠశాల అవస్థాపన సౌకర్యాల కల్పన పై తక్షణ శ్రద్ధ చూపవలసిన అవసరం ఉంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో విద్యా మౌలిక సదుపాయాల పై తక్షణం ద్రుష్టి సారించవలసిన అవసరం ఉంది అదేవిధంగా ఇప్పటికే ఉన్న పథకాలు మరియు నిబంధనలను మరింత శ్రద్దగా అమలు చేయడం అవసరం.

ఒక అంచనా ప్రకారం, 80 మిలియన్ల మంది పిల్లలు ఇప్పటికీ పాఠశాల వెలుపల/బయట  ఉన్నారు, మరియు 10 శాతం పాఠశాలలు ఇప్పటికీ ఒక్క ఉపాధ్యాయుడిని కలిగి  ఉన్నాయి. ఇప్పటికీ భారతదేశం అంతటా పాఠశాలల్లో ఒక మిలియన్ టీచర్ పోస్ట్స్ ఖాళీగా ఉన్నట్లు అంచనా వేయబడింది. 2015-16 నాటికి మొత్తం పాఠశాలల్లో 62 శాతం మాత్రమే విద్యుత్ సౌకర్యాలు కలిగివున్నాయి, దాదాపు 24 శాతం ఫంక్షనల్ కంప్యూటర్లు కల్గి ఉన్నవి.

గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 9 శాతం స్కూల్స్  విద్యుత్ కనెక్షన్, ఫంక్షనల్ కంప్యూటర్ల రెండింటిని కలిగి ఉన్న పరిస్థితులలో డిజిటల్ పురోగతి విస్తరించాలనే ఆలోచించడం సాధ్యమేనా? గ్రామీణ మరియు పట్టణ విద్యా వ్యవస్థ మరియు అవస్థాపన యొక్క సమస్యలు ముందుగానే పరిష్కారమైతేనే తప్ప  2022 నాటికి 'అప్-గ్రేడింగ్  ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2022' మరియు 'బ్లాక్ బోర్డ్ నుండి డిజిటల్ బోర్డ్లకు ట్రాన్స్ఫార్మింగ్' వంటి నినాదాలు ఉపయోగపడవు.

అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, గ్రామీణ గృహాలలో 86 శాతం మరియు పట్టణ కుటుంబాలలోని 96 శాతం మంది తమ ఇళ్ళ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నత ప్రాధమిక పాఠశాలలను(UP స్కూల్స్) కలిగి ఉన్నారు. గ్రామిణ ప్రాంతాల్లో పురుషులు 4.5 శాతం మరియు 2.2 శాతం మంది స్త్రీలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు కాగా, పట్టణ ప్రాంతాల్లో 17 శాతం పురుషులు, 13 శాతం స్త్రీలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

2014 సంవత్సరపు జాతీయ శాంపిల్ సర్వే అఫ్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 6-13 (సర్వ శిక్ష అభియాన్ లో ఉన్నవారు ) వెల్లడించిన అంశం ప్రకారం భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని  60 లక్షల స్కూల్ విద్యార్ధులలో 77  శాతం మంది స్కూల్ వెలుపల/బయట ఉన్నారు.

ఇటీవల బడ్జెట్లో(18-19), ఆరోగ్యం, విద్య మరియు సాంఘిక రక్షణపై ప్రభుత్వం అంచనా వేసిన బడ్జెట్ వ్యయం 1.38 లక్షల కోట్లు ఉంది అని ఈగ్ను(IGNOU) మాజీ వైస్ ఛాన్సలర్, అఖిల భారత విద్యా ఉద్యమం (AIEM) యొక్క అధినేత అన్నారు.  ప్రొఫెసర్ M. అస్లాం ప్రకారం. ఇది 2017-18లో 1.22 లక్షల కోట్ల గా అంచనా వేయబడింది. ఇది విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన వ్యయాలను కలిగి ఉంటుంది. విద్యా రంగంలో కావలసిన విజయం సాధించడంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలక పాత్ర పోషిస్తుంది.

మౌలిక సదుపాయాల సమస్యపై, ప్రొఫెసర్ అస్లాం ఇలా అంటున్నారు, "గ్రామీణ విద్యా అవస్థాపన సౌకర్యాలు  లేకపోవటం అనేది ఇప్పుడు దీర్ఘకాల విద్యా విధాన ప్రణాళికా రచయితలకు తీవ్రమైన ఆందోళన కలిగించే అంశము. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చాలా పాఠశాలల్లో ఇంకా మరుగుదొడ్లు లేదా నిరంతర విద్యుత్తు లేదు. పాఠశాలల్లో అధిక భాగం ఇప్పటికీ నల్లబోర్డులు మరియు చాక్ ను  ప్రధాన బోధనా పరికరాలుగా ఉపయోగిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చాలా పాఠశాలల్లో మూడింట ఒక వంతు సింగిల్ టీచర్ ఉన్నారు.

ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక మంత్రిత్వశాఖ జారి చేసిన ఒక ప్రకటనలో, "విద్య మరియు సాంకేతిక పరిజ్ఞానంలో డిజిటల్ తీవ్రతను పెంచుకోవడమనేది విద్య నాణ్యతను మెరుగుపరుచుకోవడంలో అతిపెద్ద డ్రైవర్ గా  వ్యవహరిస్తుంది" అని  అంది. ఇది వాస్తవాలకు దూరంగా ఉంది. అవసరమైన ప్రాథమిక మౌలిక సదుపాయాలు లేనప్పుడు డిజిటల్ బోర్డులు రియాలిటీ కాగలవా? కొత్త టెక్నాలజీ అమలు చేయడం చాలా సులభం, కానీ ముందు దాని ఉపయోగాన్ని సమర్థించడం కష్టం.

భారతదేశం లో  కొత్త మల్టీ-మోడ్ సాంకేతిక జోక్యాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అది  బోధన యొక్క సాంప్రదాయ మార్గాలు మరియు నూతన సమాచార ప్రసార సాంకేతిక ఉపకరణాల మధ్య సమతుల్యాన్ని స్థాపించాలి. పాఠశాల అవస్థాపన, ప్రత్యేకించి గ్రామీణ భారతంలో మరింత మెరుగుపరచవలసిన  అవసరం ఉంది.

“తగినంత గదులు, సురక్షితమైన తాగునీటి సౌకర్యాలు, ఆటంకాలు లేని విద్యుత్తు, టాయిలెట్ సౌకర్యాలు మరియు ఇతరులను  అందించే సమయ పరిమితి కార్యక్రమం అవసరం ఉంది. తగినంత మౌలిక సదుపాయాల లేకుండా డిజిటల్ ప్రపంచo సరి అయినది కాదు. అది సాధారణ ప్రజల విద్యాపరమైన ఉద్ధరణపై ఏమాత్రం ప్రభావం చూపదు "అని ఇగ్నో మాజీ వైస్ ఛాన్సలర్ వాదించాడు.

ఒక పెద్ద ప్రశ్న ప్రస్తుత సందర్భంలో మన మనసులోకి వస్తుంది: దాదాపు అన్ని రంగాల్లో, అన్ని ప్రాంతాలలో  గ్రామీణ మరియు పట్టణ విభజన మద్య ఎందుకు పెద్ద అంతరం  ఉంది? ఈ లోపం పట్టణ దృక్పథం ఆధిపత్యం వహించే మన ఆలోచనా ప్రక్రియ లేదా విధానం లో ఉందా? ఈ గ్రామీణ-పట్టణ విభజన భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో ఎందుకు కొనసాగుతోంది మరియు ప్రజల ఎన్నికల ఓట్ల విలువ రెండు ప్రాంతాలలో సమానంగా ఉన్నప్పుడు ఎందుకు నాయకులు లేదా ప్రభుత్వాలు ఈ విభజనను అనుమతించాయి?

No comments:

Post a Comment