20 March 2018

సిరియా చరిత్ర History of Syria
ఇస్లామిక్ సిరియా చరిత్ర   
సిరియా ఆసియాఖండం లోని పశ్చిమాసియా ప్రాంత  దేశము. దీని రాజధాని డమాస్కస్.  పూర్తి పేరు సిరియన్ అరబ్ రిపబ్లిక్ Syrian Arab Republic
Al-Jumhūriyyah al-ʿArabiyyah as-Sūriyyah الجمهورية العربية السورية
(అల్ జుమురియా అల్ అరబియ అస్ సుర్రియా). దేశ అధికార బాష అరబిక్ మరియు సిరియా లో అద్యక్ష గణతంత్ర రాజ్యము అమలులో ఉన్నది.  దేశ అద్యక్షుడు బషర్ అల్ అస్సాద్. ఫ్రాన్స్ నుండి 1946 లో స్వాతంత్ర్యం పొందినది.దాదాపు 2 కోట్లకు పైగా జనాభాను కలిగి ఉంది. మానవాబ్రివ్రుద్ది సూచికలో 107 స్థానం పొందినది. దేశ కరెన్సీ సిరియన్ పౌండ్స్. దేశం లో  90 శాతం ముస్లిములు, 8 శాతం క్రైస్తవులు,1 శాతం మిగిలిన ఇతర మతాల వారు ఉన్నారు. పత్తి, పళ్ళు, బంగాళదుంపలు, చెరకు, గోధుమలు, బార్లీ, కూరగాయలు మొదలైన పంటలు పండిస్తారు.  చమురు సహజవాయువులు, దుస్తుల పరిశ్రమలు, పళ్ళు, కూరగాయల ప్రాసెసింగ్, బార్లీ, ఊలు, సిమెంటు, తోలు వస్తువులు, గ్లాస్, మెటల్ పరిశ్రమలు కలవు. ఇరాక్జోర్డాన్ఇజ్రాయెల్లెబనాన్టర్కీమధ్యధరా సముద్రం తో సరిహద్దులు కలవు.

సిరియా చరిత్ర పూర్వ కాలం లో:

క్రీ.పూ. 2500 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రజలు  ఉన్న దాఖలాలు ఉన్నాయి. రాజధాని డమాస్కస్ నగరంలో ఆనాటి ఆనవాళ్ళు ఇప్పటికీ కనబడుతున్నాయి. క్రీస్తుకు పూర్వం 10 వ శతాబ్దం లో నియో-అస్సీరియన్ సామ్రాజ్యo యొక్క రాజధాని నగరం అషుర్ (Ashur)  నుండి "సిరియా" అనే పేరు ఉద్భవించింది. ఈ భూభాగంను వివిధ కాలాలలో  వివిధ పాలకులు స్వాధీనం చేసుకున్నారు, మరియు వివిధ ప్రజలు అక్కడ  స్థిరపడ్డారు.

క్రీస్తు కు పూర్వం 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు ఫోనీషియన్లు,  ఫోనేషియన్ల తర్వాత గ్రీకులురోమన్లుబైజాంటైన్ రాజులు పరిపాలించారు దేశంలో ఎక్కువగా పర్వత ప్రాంతాలు, ఎడారి ఆక్రమించి ఉన్నాయి. ప్రజలు ఎక్కువగా రాజధాని డమాస్కస్ ప్రాంతంలో నివసిస్తుంటారు. 'సిరియన్లు'’ ఎక్కువగా వ్యాపార రంగంలో ఉన్నారు. చైనాభారతదేశంఅరబ్బు దేశాలతో వ్యాపార సంభందాలను కలిగి ఉన్నారు.

 ఖలీఫాల పరిపాలన లో సిరియా :

క్రీస్తు శకం 634-640 లో ఖలీద్ ఇబ్న్ అల్-వాలిద్ నేతృత్వంలోని రాషీదున్ సైన్యం రూపంలో ముస్లిం అరబ్లు సిరియాను స్వాధీనం చేసుకున్నారు, ఫలితంగా సిరియాదేశం ఇస్లామిక్ సామ్రాజ్యంలో భాగమైంది. కొన్ని వందల సంవత్సరాలపాటు ఖలీఫాలు పరిపాలించారు.

7 వ శతాబ్దం మధ్యకాలంలో ఉమయ్యద్ రాజవంశం తమ సామ్రాజ్య రాజధానిని  డమాస్కస్లో ఉంచారు. డమాస్కస్, హోమ్స్, పాలస్తీనా మరియు జోర్డాన్ అనే నాలుగు  జిల్లాలుగా సిరియాను విభజించారు. ఇస్లామిక్ సామ్రాజ్యం వేగంగా విస్తరించింది. స్పెయిన్ నుండి భారతదేశం మరియు మధ్య ఆసియా వరకు విస్తరించింది. అందువల్ల సిరియా సామ్రాజ్యపరంగా, సామ్రాజ్య కేంద్రంగా ఉంది. అబ్దుల్ మాలిక్ మరియు అల్-వాలిద్ I వంటి ప్రారంభ ఉమ్మాయాద్ పాలకులు ముఖ్యంగా డమాస్కస్, అలెప్పో మరియు హోమ్స్ వంటి  సిరియా లోని ప్రాంతాలలో  అనేక అద్భుతమైన రాజభవనాలు మరియు మసీదులు నిర్మించారు.ఉమ్మయ్యాద్ ఖలీఫాలు క్రైస్తవుల పట్ల మత సహనం  చూపారు. అర్మినియన్లు మరియు ఈశాన్య అస్సీరియన్లు అనేక ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు.

8 వ శతాబ్దం మధ్యకాలంలో ఖలీఫాత్ రాజవంశ పోరాటాలు, ప్రాంతీయ తిరుగుబాట్లు మరియు మతపరమైన వివాదాల మధ్య కుప్పకూలింది. ఉమాయ్యాద్ రాజవంశం స్థానం లో  750 లో అబ్బాసిద్ వంశస్తులు అధికారం లోనికి వచ్చారు.  సామ్రాజ్యం యొక్క రాజధాని బాగ్దాద్కు తరలించబడింది. అబ్బాసిద్ యుగంలో అరబిక్ అధికార బాష అయినది.

ఆ తరువాత అనేక సంవత్సరాల  వరకు సిరియాను ఈజిప్టు నుంచి తులనిడ్స్ (887-905) అ తర్వాత ఇఖిషీద్డ్స్ Ikhshidids (941-969) అనంతర కాలం లో ఉత్తర సిరియా అలెప్పో యొక్క హమ్దానిడ్స్Hamdanids క్రింద వచ్చింది. ఆలీ సైఫ్ అల్-దౌలా యొక్కఆస్థానం, 'స్వోర్డ్ ఆఫ్ ది స్టేట్' (944-967) సంస్కృతికి కేంద్రంగా ఉంది, అరబిక్ సాహిత్యం పోషించబడినది.  సిరియాను తిరిగి పొందడానికి బైజాంటైన్ ప్రయత్నాలను అతడు అడ్డుకున్నాడు.

అతని మరణం తరువాత బైజాంటైన్లు ఆంటియోచ్ మరియు అలెప్పోలను(969) స్వాధీనం చేసుకున్నారు హమ్దానిడ్స్, బైజాంటైన్స్ మరియు డమాస్కస్ ఆధారిత ఫాతిమడ్స్  మధ్య అంతర్యుద్దం లో సిరియా చిక్కుకోంది. బైజాంటైన్లు మొత్తం సిరియాను 996 లో స్వాధీనం చేసుకున్నారు, కానీ 11 వ శతాబ్దంలో సిరియాను సెల్జక్ టర్క్లు (1084-1086) స్వాధీనం చేసుకున్నారు. సెల్జుక్ పాలనలో ఒక శతాబ్దం తరువాత, సిరియాను (1175-1185) ఈజిప్ట్ యొక్క అయ్యూబిడ్ రాజవంశం స్థాపకుడైన సలాదిన్ జయించారు.

12 వ -13 వ శతాబ్దాలలో, సిరియా యొక్క భాగాలు క్రుసేడర్ (క్రైస్తవ) రాజ్యాల పాలనలోకి వచ్చాయి. 1260 లో సిరియా ను మంగోలులు జయించారు.  ఆ తరువాత ఈజిప్ట్ యొక్క మమ్లుకులు సిరియాను జయించారు. మామ్లుక్ నాయకుడు బైబార్లు,  కైరో ప్రధాన రాజధానిగా మరియు  డమాస్కస్ ను  ఒక ప్రాంతీయ రాజధానిగా రూపొందించాడు. మమ్లుకులు సిరియాలోని క్రూసేడర్స్ ను తొలగించి అనేక మంగోల్ దండయాత్రలను తిప్పికొట్టారు.

అలెప్పో యొక్క కోట ప్రపంచంలోని పురాతన మరియు అతిపెద్ద కోటలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 1400 లో, తైమూర్ లెంక్ లేదా తమెర్లేన్, సిరియాపై దాడి చేసి, అలెప్పో వద్ద మమ్లుక్ సైన్యాన్ని ఓడించి డమాస్కస్ను స్వాధీనం చేసుకుంది. నగరం యొక్క నివాసితులు చాలామంది సంహరించబడ్డారు, శిల్పకారులను మినహాయించి మిగతా  వారిని సమర్ఖండ్ కు  తరలించారు. ఈ సమయంలో సిరియా క్రైస్తవ జనాభా హింసకు గురయింది.

1516 లో ఒట్టోమన్ సామ్రాజ్యం సిరియాను జయించారు.

ఒట్టోమన్ యుగం లో :


ఒట్టోమన్ సుల్తాన్ సెలిమ్ అలెప్పో సమీపంలోని మార్జ్ దబిక్ యుద్ధంలో మామ్లుక్లను ఓడించిన తరువాత 1516 లో సిరియాలో చాలా ప్రాంతం స్వాధీనం చేసుకున్నాడు. 1516 నుండి 1918 వరకు ఒట్టోమన్ సామ్రాజ్యంలో సిరియా భాగంగా ఉంది, అయితే ఇరానియన్ సఫావిడ్స్, ముఖ్యంగా షా ఇస్మాయిల్ I మరియు షా అబ్బాస్ 2 చేత  స్వల్ప కాలం సిరియా  ఆక్రమించ బడింది.

 ఒట్టోమన్ పాలన లో అరబిక్ దివ్య ఖురాన్ బాషగా గౌరవించబడినది మరియు డమాస్కస్ మక్కాకు ప్రధాన రహదారి ప్రదేశంగా మారింది, మరియు ఇది మక్కా యాత్రకు హాజరైన యాత్రికుల బార్కాహ్ (ఆధ్యాత్మిక శక్తి లేదా దీవెన) కారణంగా ముస్లింలకు పవిత్రమైన స్థలం గా రుపొందింది.

ఒట్టోమన్ టర్కులు సిరియాను ఒక పెద్ద ప్రావిన్స్ మార్చారు. ప్రావిన్స్ తిరిగి అనేక జిల్లాలు లేదా   సంజక్స్ గా  ఉపవిభజన చేశారు. 1549 లో సిరియా రెండు ప్రావిన్స్ గా పునర్వ్యవస్థీకరించబడింది; డమాస్కస్ ప్రావిన్స్ మరియు అలెప్పో ప్రావిన్స్. 1579 లో లాటాకియా, హమా మరియు హోమ్స్ లను కలిగి ఉన్న ట్రిపొలీ ప్రావిన్స్ స్థాపించబడింది. 1586 లో తూర్పు సిరియాలో రక్కా  ప్రావిన్స్ స్థాపించబడింది.

ఒట్టోమన్ పరిపాలన లో నాలుగు వందల సంవత్సరాల పాటు సిరియన్ సమాజం శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించింది. ప్రతి రిలీజియస్  మైనారిటీ - షియా ముస్లిం, గ్రీక్ ఆర్థోడక్స్, మరానైట్, అర్మేనియన్ మరియు యూదులు  కలసి మెలసి ఉన్నారు. సమాజంలోని మతపరమైన అధిపతులు అన్ని వ్యక్తిగత హోదా చట్టాలను నిర్వహించారు మరియు కొన్ని పౌర కార్యక్రమాలను నిర్వహించారు.ఆధునిక ఒట్టోమన్ పరిపాలనలో ఆధునిక సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్, జోర్డాన్, పాలస్తీనా అథారిటీ, గాజా స్ట్రిప్ మరియు టర్కీ మరియు ఇరాక్ ప్రాంతాలలో గ్రేటర్ సిరియా భూభాగం ఉంది.


మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అక్టోబర్ 1918 లో అరబ్ మరియు బ్రిటీష్ దళాలు సిరియా లోకి ప్రవేశించి డమాస్కస్ మరియు అలెప్పోను ఆక్రమించారు. సైక్స్-పికోట్ (Sykes-Picot agreement) ఒప్పందానికి అనుగుణంగా, 1920 లో ఫ్రెంచ్ నియంత్రణలో సిరియా లీగ్ ఆఫ్ నేషన్స్ ఆదీన ప్రాంతం  అయ్యింది. 17 ఏప్రిల్, 1946లో   సిరియా దేశం స్వాతంత్య్రం పొందిందిNo comments:

Post a Comment