పాశ్చాత్య మీడియా ఎల్లప్పుడూ బ్రూస్ లీ, జాకీ చాన్ మరియు జెట్ లి చిత్రాలతో నిండి ఉంది, కానీ మనం విననిది ఇస్లాం మరియు యుద్ధ కళల మధ్య ఉన్న సంబంధం.
చైనీస్ సంస్కృతి నిపుణుల అభిప్రాయం ప్రకారం ‘ముస్లిం కుంగ్ ఫూ’ అనేది చైనాలో ఇస్లాం యొక్క ముఖ్యమైన వారసత్వం. ‘ముస్లిం కుంగ్ ఫూ’ ను ‘ముస్లిం మాస్టర్స్’ అభివృద్ధి చేశారు, ముస్లిం మాస్టర్స్ నిరంతరం మరియు కష్టపడి శిక్షణ పొందారు, భౌతిక మరియు ఆధ్యాత్మిక పరిపూర్ణత వైపు మరియు చైనిస్ ముస్లిం సమాజాలకు మరియు చైనాకు జీవితాంతం ప్రేరణను అందించారు. ఇస్లాంతో చైనీస్ సంస్కృతి యొక్క ప్రత్యేకతను పొందుపరిచారు.
అరబ్ ముస్లింలు మరియు చైనీయుల మధ్య ప్రారంభ వాణిజ్యం దూర ప్రాచ్యంలో ఇస్లాం వ్యాప్తిలో మరియు ముస్లిం-చైనీస్ గుర్తింపును స్థిరపరచడంలో కీలక పాత్ర పోషించింది. 12వ శతాబ్దం నాటి నుంచి , సైనిక నాయకత్వ స్థానాల్లో ప్రారంభ చైనీస్ ముస్లింలు పోషించిన పాత్రలు, ప్రత్యేకమైన సంబంధo ‘ముస్లిం కుంగ్ ఫూ’ కి నాంది పలికాయి.
చైనాలో హుయ్ ప్రజలు దేశంలో అతిపెద్ద ముస్లిం మైనారిటీగా ఉన్నారని నమోదు చేయబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం మరణించిన దాదాపు 19 సంవత్సరాల నుండి చైనా మరియు అరేబియా మధ్య సంబంధం ఉంది.
ఈ ప్రాంతంలో ఇస్లాం వ్యాప్తికి మొదటి ప్రయత్నాలను ప్రారంభించినది మూడవ ఖలీఫా (ఖలీఫా) ఉస్మాన్ (RA), తరువాతి వాణిజ్య, వర్తక సమూహాలు కూడా ఇస్లాం వ్యాప్తికి దోహదపడ్డాయి.
అరేబియా మరియు చైనిస్ ప్రజల కలయిక తో ఆవిర్భవించిన హుయ్ ముస్లిములు చైనీస్ సంస్కృతిని
ఇస్లామిక్ సంప్రదాయంతో మిళితం
చేసినారు. రెజ్లింగ్, విలువిద్య మరియు కత్తిసాము వంటి కార్యకలాపాల ద్వారా ప్రవక్త ముహమ్మద్(స)
ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడం నుండి ప్రేరణ పొందారు.
యుద్ధ కళలు సుదీర్ఘ సముద్రయాన వాణిజ్య మిషన్ల కోసం రక్షణ యొక్క ఆచరణాత్మక అంశాలతో కలిసిపోవడమే కాకుండా, చాలా మంది చైనిస్ ముస్లిం మాస్టర్ల ఆధ్యాత్మిక సాధనంగా కూడా ఉంది. స్వీయ నియంత్రణ మరియు సంయమనం యొక్క అవసరం యుద్ధ కళలు మరియు సాంప్రదాయ ఇస్లామిక్ బోధనలలో ప్రతిబింబిస్తుంది.
యుద్ధ కళల అబ్యాసం హుయ్ ముస్లింలచే చైనా
యొక్క వాయువ్య ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్నాయి. యుద్ధ కళల అభ్యాసం ఇప్పటికీ
దేశంలోని వివిధ మసాజిద్ (మసీదులు)లలో జరుగుతుంది, యుద్ధ
కళలు ఇస్లామిక్ శాస్త్రాలు
ఒకే సమయంలో బోధించబడుతున్నాయి.
మసీదులలో లేదా నియమించబడిన ప్రాంతాలలో ప్రార్థనల తర్వాత (ఫజ్ర్/మగ్రిబ్) ప్రతిరోజూ సాధన చేస్తారు మరియు క్రమశిక్షణను పెంపొందిస్తారు.
భౌతిక రంగంలో కూడా యుద్ధ కళల మాస్టర్లు ఇస్లామిక్ స్వీయ నియంత్రణ భావనను
ఉపయోగించారు. అభ్యాసకులు శిక్షణ యొక్క ఆధ్యాత్మిక మరియు శారీరక అంశాలపై ప్రాధాన్యత
ఇవ్వడంతో. ప్రశాంతంగా మరియు సమీకృత నిర్ణయం తీసుకోవడం ముస్లింలు సమర్థించే
సంప్రదాయం, దీనిని ప్రవక్త సంప్రదాయంలో చూడవచ్చు "బలవంతుడు
తన బలంతో ప్రజలను అధిగమించేవాడు కాదు, బలవంతుడు
కోపంలో ఉన్నప్పుడు తనను తాను నియంత్రించుకునేవాడు."
ముస్లిం మాస్టర్స్ “కుంగ్ ఫూ” యొక్క అంతర్గత మరియు బాహ్య రూపాన్ని సమన్వయం చేయడంలో విజయం సాధించారు, ముస్లిం మాస్టర్స్ తమ అసలు విశ్వాసానికి దగ్గరగా ఉండి, తమ మతం ఆధారంగా ప్రభావవంతమైన స్వదేశీ యుద్ధ కళలను ఉత్పత్తి చేయడంలో "ఇజ్తిహాద్"(శ్రద్ధ) (ప్రయత్నం)ను ప్రయోగించారు.
ముస్లిం యుద్ధ కళల మాస్టర్లు భౌతిక రంగంలో కూడా ఇస్లామిక్ స్వీయ నియంత్రణ భావనను ఉపయోగించారు. యుద్ధ కళల అభ్యాసకులు శిక్షణ యొక్క ఆధ్యాత్మిక మరియు శారీరక అంశాలపై ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ స్వీయ-క్రమశిక్షణ, నిగ్రహం మరియు అంతర్గత శాంతిని సాధించడం, మతపరమైన బోధనలను పూర్తి చేయడం వంటి ఇస్లామిక్ భావనలను ప్రతిబింబిస్తుంది
దేశీయ
ముస్లిం యుద్ధ కళలు తరచుగా విలక్షణమైన ఇస్లామిక్ (అరబిక్) పేర్లతో పిలవబడినాయి.సిలాట్
మరియు వుషు Silat and Wushu వంటి వివిధ కళారూపాలు గత కొన్ని వందల సంవత్సరాలగా ముస్లింలచే పరిపూర్ణం చేయబడ్డాయి, జాక్వాన్ మరియు పిగుక్వాన్
వంటి అనేక ఒరిజినల్ యుద్ధ కళలు కూడా ముస్లింలచే సృష్టించబడ్డాయి లేదా
స్వీకరించబడ్డాయి.
చక్వాన్ (చా స్టైల్ బాక్సింగ్),
తంతుయ్
(స్ప్రింగ్ లెగ్) మరియు టాంగ్పింగ్‌గాంగ్ (వాటర్ బాటిల్ స్టైల్) వంటి ప్రత్యేక
రూపాలను అభివృద్ధి చేశారు. టాంగ్పింగ్ (వజు కోసం నీటి కెటిల్) వంటి వస్తువులు స్వచ్ఛత
గుర్తింపుకు చిహ్నాలుగా మారాయి.
ముస్లింలను రక్షించడానికి కొంతమంది ఆర్మీ అధికారులచే సృష్టించబడిన ఒరిజినల్ యుద్ద కళల సాధనాలు, ముస్లిం సమాజాలలో తరతరాలుగా రహస్యంగా అందించబడుతున్నాయి.
యుద్ధ కళలు మరియు ఇస్లాం చరిత్రలో, పరిగణించవలసిన పేర్లు చాలా ఉన్నాయి. ముఖ్యంగా వాంగ్ జి పింగ్ (1881 – 1973) & చాంగ్ తుంగ్ షెంగ్ (1908 – 1986) వంటి మాస్టర్స్. జనరల్ చా షాన్ మీర్ (జామిర్)
ముస్లిం మాస్టర్స్ క్రమశిక్షణతో శిక్షణ పొందారు, అదే సమయంలో తమ విశ్వాసాన్ని నిలుపుకున్నారు మరియు అల్లాహ్ & ఇస్లాంకు దగ్గరగా రావడానికి యుద్దకళలను ఒక మార్గంగా ఉపయోగించారు.
మాస్టర్ వాంగ్ జి-పింగ్ (1881–1973) చైనీస్ మార్షల్ ఆర్ట్స్ మరియు సాంప్రదాయ వైద్యంలో చైనీస్ ముస్లిం ప్రాక్టీషనర్. మాస్టర్ వాంగ్ జి-పింగ్ 1928లో మార్షల్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ యొక్క షావోలిన్ కుంగ్ ఫూ విభాగానికి నాయకుడిగా పనిచేశారు మరియు చైనీస్ వుషు అసోసియేషన్ వైస్ చైర్మన్ కూడా
వుషు మాస్టర్‌గా కూడా గుర్తింపు పొందిన మాస్టర్ వాంగ్ జి పింగ్ ఇస్లాంకు సంబంధించి పండితుడు. మాస్టర్ వాంగ్ జి-పింగ్ ఖురాన్ పఠిస్తూ బరువైన రాళ్లను ఎత్తేవారని ప్రసిద్ధి చెందారు.
చైనాలోని ముస్లింల చరిత్రతో సంబంధం ఉన్న ప్రసిద్ద క్విన్‌జౌ మసీదు తలుపులను బలవంతం గా తీసుకుపోవడానికి ప్రయత్నించిన జర్మన్ దళాల పట్ల మాస్టర్ వాంగ్ జి పింగ్ వ్యతిరేకత గురించి ఒక ప్రసిద్ధ కథ కలదు. మాస్టర్ వాంగ్ వారిని తలుపులు తీసుకెళ్లనివ్వలేదు మరియు జర్మన్ సైనికులను వెయిట్ లిఫ్టింగ్ పోటీకి సవాలు చేసి గెలిచాడు!
యుద్ద కళల ఇతర వివిధ ఇతర విభాగాలలో కూడా ప్రావీణ్యం ఉన్న వాంగ్ జి పింగ్ ముస్లిం మరియు ముస్లింయేతర ప్రజలకు ఒక ప్రేరణగా నిలిచాడు. వాంగ్ జి పింగ్ కు యుద్ధ కళలలో గల ప్రావీణ్యం ఆయనను వివిధ విదేశీ ప్రత్యర్థులపై విజయం సాధించడానికి వీలు కల్పించింది, ఇది ఇతర చైనీస్ విద్యార్థలు యుద్ద కళలు నేర్చుకోవడానికి మరియు చైనీస్ ప్రజలలో ఇస్లాంను వ్యాప్తి చేయడానికి దారితీసింది.
చాంగ్ తుంగ్-షెంగ్ (1908-1986) మరొక హుయ్ మార్షల్ ఆర్టిస్ట్. చాంగ్ తుంగ్-షెంగ్ అత్యంత ప్రసిద్ధ చైనీస్ రెజ్లింగ్ (దీనిని షుయ్ జియావో అని కూడా పిలుస్తారు) ప్రాక్టీషనర్లు మరియు ఉపాధ్యాయులలో ఒకడు. చాంగ్ ప్రాక్టీస్ చేసే ముస్లిం. తన ప్రత్యర్థులను చుట్టుముట్టి ఉచ్చులో పడవేసే సామర్థ్యం కారణంగా చాంగ్ తుంగ్-షెంగ్ కు "ఫ్లయింగ్ సీతాకోకచిలుక" అనే మారుపేరు ఇవ్వబడింది.
గ్రాండ్‌మాస్టర్ చాంగ్ గురువు ప్రసిద్ధ చాంగ్ ఫాంగ్-యెన్, అతను “పావో-టింగ్ షుయ్-చియావో” అనే యుద్ద కళ యొక్క 3 ప్రధాన శాఖలలో అత్యంత వేగవంతమైన & శక్తివంతమైన నిపుణుడు. తన అత్యంత ప్రసిద్ధ మ్యాచ్‌లలో ఒకదానిలో, చాంగ్ మంగోలియన్ రెజ్లింగ్ ఛాంపియన్ హుక్లీని సవాలు చేశాడు, మంగోలియన్ రెజ్లింగ్ ఛాంపియన్ హుక్లీ 7 అడుగుల పొడవు మరియు 400 పౌండ్ల బరువు కలిగి ఉన్నాడు. పరిమాణంలో తేడా ఉన్నప్పటికీ, చాంగ్ పదే పదే హుక్లీని పడగొట్టాడు.
మరొక హుయ్ మార్షల్ ఆర్టిస్ట్ అంజిద్ అలీ వింగ్ చున్ బోధకుడు మరియు ప్రాక్టిస్ ముస్లిం కూడా. ఇస్లామిక్ మరియు మార్షల్ ఆర్ట్ బోధనల మధ్య సారూప్యతలపై అంజిద్ అలీ ఆసక్తికరమైన అంతర్దృష్టిని అందిస్తాడు
వాస్తవానికి, యుద్ధ కళలు మరియు ఇస్లామిక్ సంప్రదాయం ఒక ప్రత్యేకమైన చరిత్రను
పంచుకుంటాయి, రెండు
రెండు ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించడానికి మార్గాలు కలిగి ఉంటాయి, ఒకదానికొకటి ప్రతిబింబాలుగా పనిచేస్తూ, చైనాలో
ఇస్లాం చరిత్ర ప్రపంచంలోని తూర్పు మూలలకు మతం విస్తరించడానికి దారితీసింది. యుద్ధ
కళల యొక్క ఆచరణాత్మక స్వభావం ఈ సంప్రదాయాన్ని రక్షించడంలో సహాయపడింది, తద్వారా
చైనీస్ సంస్కృతి యొక్క ప్రత్యేకతను, ఇస్లాం
మతం యొక్క సంపూర్ణతను నిలుపుకుంది.
No comments:
Post a Comment