18 May 2024

ఒత్తిడి, విసుగు లేదా అలసట - యునైటెడ్ స్టేట్స్‌లో విద్యార్థులలో ఆత్మహత్య ధోరణి ఎందుకు పెరుగుతోంది? Stressed, bored or tired - Why suicidal tendency on rise among students in United States?

 


US విశ్వవిద్యాలయాలు ఇటీవల మూడు కారణాల వల్ల వార్తల్లో ఉన్నాయి, ఇవన్నీ ఆందోళన కలిగిస్తాయి మరియు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి.

మొదటిగా, గాజాపై ఇజ్రాయెల్ దాడి కి వ్యతిరేకంగా విద్యార్ధుల పెద్దఎత్తున నిరసనలు.

రెండవది, సామాజిక ఆందోళనల సమస్యల పై విద్యార్థులు మరియు అధ్యాపకులు చేస్తున్న ఆందోళనల పట్ల విశ్వవిద్యాలయ పరిపాలనా యంత్రాంగం ఏమాత్రం సానుభూతి చూపుటలేదు. విద్యార్థి నిరసనకారులను అరెస్టులు చేయడానికి మరియు పోలీసులను క్యాంపస్ లోనికి తీసుకురావడానికి విశ్వవిద్యాలయ పరిపాలనా యంత్రాంగం అన్యాయమైన మార్గాల్లో అనవసరమైన తొందరపాటుతో వ్యవహరిస్తున్నారు..

మూడవదిగా, విద్యార్థులు చదువు కోసం చేసిన  అప్పుల భారం  చాలా ఎక్కువ గానే ఉంది మరియు ఉపశమనాన్ని అందించడానికి అడపాదడపా ప్రయత్నాలు చేసినప్పటికీ,. వృత్తి, కుటుంబ జీవితాన్ని ప్రారంభించే యువతకు ఇవి పెనుభారంగా మారాయి. వాస్తవానికి, గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేని వారిని కూడా అప్పుల భారం వేధిస్తుంది.

వాస్తవానికి USA వంటి సంపన్న దేశం  తన యువత కష్టమైన అప్పుల్లో చిక్కుకోకుండా సంపూర్ణంగా విద్యావంతులను చేయగలదు. కాని ఇది యువతను అప్పులతో కట్టివేయడానికి ప్రయత్నించే పెట్టుబడిదారీ విధానం యొక్క పెరుగుతున్న ధోరణికి ప్రతిబింబం గా మారింది. అప్పుడప్పుడు కొంత రాయితీలు ఇచ్చినప్పటికీ, విద్యార్థుల రుణాన్ని శాశ్వతం చేయడానికి వ్యవస్థ పరంగా మరింత కట్టుబడి ఉంది.

ఇక అమెరికా లోని ఉన్నత పాఠశాలల పరిస్థితి పరిశీలించుదాము.

2011-21 సంవత్సరాలకు USAలోని సెంటర్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విడుదల చేసిన యూత్ రిస్క్ బిహేవియర్ సర్వైలెన్స్ డేటా సర్వే మరియు ట్రెండ్స్ రిపోర్ట్ యొక్క డేటా ప్రకారం 2021లో 42% మంది హైస్కూల్ విద్యార్థులు మరియు 57% మంది మహిళా విద్యార్థులు "నిరాశ లేదా నిస్సహాయత యొక్క నిరంతర భావాలను" అనుభవిస్తున్నారు.  .

హై-స్కూల్ విద్యార్ధులలో నిరాశ, నిస్సహాయత భావాలు  ఒక దశాబ్ద కాలం లో (2011-2021), పెద్ద ఎత్తున 28% నుండి 42%కి పెరిగినవి, ఇది చాలా వేగవంతమైన పెరుగుదల రేటు. సాపేక్షంగా చాలా ఎక్కువ విద్యా మరియు ఆరోగ్య వ్యయంతో సంపన్న దేశాల్లో ఒకటి అయిన అమెరికాలో విచారం మరియు నిస్సహాయత ఎందుకు విస్తృతంగా వ్యాపించింది?

2021లో 22% మంది హైస్కూల్ విద్యార్థులు ఆత్మహత్యకు "తీవ్రంగా ప్రయత్ని౦చారు " అని డేటా బేస్ వెల్లడించింది ఇది మహిళా హై-స్కూల్ విద్యార్థులలో  30% వరకు ఉంది.

2021లో 10% మంది హైస్కూల్ విద్యార్థులు (13% మంది బాలికలు) ఆత్మహత్యకు ప్రయత్నించారు.

వినోదం మరియు క్రీడలకు ఎక్కువ అవకాశం ఉన్న అమెరికా లాంటి  సంపన్న దేశంలో, ఉన్నత పాఠశాల విద్యార్థులలో ఇంత అధిక స్థాయి బాధ మరియు ఒత్తిడి ఎందుకు ప్రబలంగా ఉంది.?

USA సర్జన్ జనరల్ 2021లో జారీ చేసిన మానసిక ఆరోగ్యంపై సలహా ప్రకారం, 2007 నుండి 2018 వరకు USAలో 10-24 సంవత్సరాల వయస్సు గలవారిలో ఆత్మహత్యల రేటు 57%. పెరిగింది.

2018లో 10-24 సంవత్సరాల వయస్సు గలవారిలో, మరణానికి ఆత్మహత్య రెండవ ప్రధాన కారణం.

సర్జన్ జనరల్ అడ్వైజరీ మరియు అనేక ఇతర నివేదికల ప్రకారం, COVID కాలంలో ఇది మరింత వేగంగా పెరిగింది..

USA సర్జన్ జనరల్ అడ్వైజరీ ప్రకారం, USAలోని కౌమారదశలో ఉన్న బాలికలు ఆత్మహత్యాయత్నాలకు సంబంధించి అత్యవసర విభాగం సందర్శనల సంఖ్య 2021 ప్రారంభంలో 51% పెరిగింది.

2021 చివరలో, పిల్లల ఆరోగ్యంలో USA యొక్క ప్రముఖ ఆరోగ్య నిపుణులు  పిల్లల మరియు కౌమార మానసిక ఆరోగ్యంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించమని కోరారు

ఇవన్నీ ఆందోళనకరమైన వాస్తవాలు మరియు గణాంకాలు.

 "మహమ్మారికి ముందు కూడా, నిస్సహాయత, నిరాశ మరియు ఆత్మహత్య ఆలోచనలతో పోరాడే యువకుల  సంఖ్య పెరిగింది  మరియు గత దశాబ్దంలో ఈ సంఖ్య బాగా  పెరిగింది. ."

సంపన్న దేశాల్లో ఒకటైన అమెరికా లో  పిల్లలు మరియు యుక్తవయస్కులు విచారం, నిస్సహాయత మరియు నిరాశతో కూడిన తీవ్ర దశలో ఎందుకు ఉన్నారు అనే దానిపై విస్తృత స్థాయిలో సమగ్రమైన, విశ్వసనీయమైన వివరణ ఇంకా వెలువడలేదు. ,

పరిశోధకులు మరియు పరిశోధనా సంస్థలు ప్రబలంగా ఉన్న అమెరికాలో ఈ సమస్యపై అనేక వివరణలు అందించబడ్డాయి. వీటిలో చాలా ముఖ్యమైన అంశాలు  దృష్టిని ఆకర్షిస్తాయి మరియు సహాయకరమైన అంతర్దృష్టులను అందిస్తాయి

వెలుబడిన ఒక వివరణ ఏమిటంటే, మహమ్మారికి ముందు దశాబ్దంలో సోషల్ మీడియా మరియు దానితో పాటుగా ఉన్న గాడ్జెట్‌లు విచారం, నిస్సహాయత మరియు నిరాశ పెరుగుదలకు చాలా దోహదపడ్డాయి.

యేల్ సెంటర్ ఫర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మరియు యేల్ చైల్డ్ స్టడీ సెంటర్ ద్వారా 21,678 US హైస్కూల్ విద్యార్థులపై దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో పాఠశాలలకు సంబంధించిన విద్యార్థుల స్వీయ-నివేదిత భావాలలో దాదాపు 75% ప్రతికూలంగా ఉన్నాయని కనుగొన్నారు. ఒత్తిడి, విసుగు, అలసట - ఇవి విద్యార్థులు ఎక్కువగా ఉపయోగించే వ్యక్తీకరణలు.

ప్యూ రీసెర్చ్ సెంటర్ 13-17 ఏళ్ల వయస్సులో (2018 సంవత్సరం) టీనేజ్‌లపై జరిపిన సర్వేలో 57% మంది (64% మంది బాలికలు) తమ పాఠశాలలో కాల్పులు జరగవచ్చని చాలా ఆందోళనగా లేదా కొంత ఆందోళన చెందుతున్నారని కనుగొన్నారు.

ఉన్నత పాఠశాలల సమస్యలపై జరిపిన అనేక అధ్యయనాలు విద్యార్ధులు  సాధించిన స్థాయిల achievement levels గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తాయి.

ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్, 35 OECD లేదా సంపన్న దేశాల ర్యాంకింగ్‌లో, 15 ఏళ్ల పిల్లల గణిత అభ్యాసానికి సంబంధించి USAకి 30వ ర్యాంక్ ఇచ్చింది.

అధ్యయనాలు కళాశాలకు చేరుకునే హైస్కూల్ విద్యార్థులకు ప్రత్యేకించి గణితం మరియు ఆంగ్లంలో నివారణ విద్య remedial education అవసరమని గుర్తించాయి

ఇటీవలి సంవత్సరాలలో, మొత్తం కమ్యూనిటీ కళాశాల విద్యార్థులలో 60% మరియు నాలుగేళ్ల కళాశాలల్లో 40% అండర్ గ్రాడ్యుయేట్‌లకు నివారణ విద్య remedial education అవసరం,

అనేక మంది విద్యావేత్తలు అభిప్రాయం ప్రకారం అమెరికా లో హై-స్కూల్ విద్యావిధానం విద్యార్థులను జీవితంలోని అనేక-వైపుల సవాళ్లకు సిద్ధం చేసే సంపూర్ణ పాఠశాల విద్యను అందించడానికి ప్రయత్నించే బదులు విద్యార్థులను కళాశాలకు సిద్ధం చేయడంలో నిమగ్నమై ఉంది.

ఇతర OECD దేశాలతో పోల్చితే ఒక్కో విద్యార్థికి ఎక్కువ ఖర్చు చేస్తున్నప్పటికీ, USA పాఠశాల వ్యవస్థ తక్కువ పనితీరును నమోదు చేస్తోంది మరియు 1970-2004లో ఖర్చు రెట్టింపు అయినప్పటికీ, పఠన నైపుణ్యం reading proficiency లో పనితీరు మెరుగుపడలేదని అధ్యయనాలు వివరిస్తున్నాయి.

అధ్యయనాల ప్రకారం  మొత్తం విద్యార్థులలో 42% మంది (57% మంది బాలికలు) విచారం మరియు నిస్సహాయత యొక్క నిరంతర భావన కలదు మరియు నివారణ చర్యలు remedial steps మరింత ప్రాముఖ్యతను పొందాలి.

 

No comments:

Post a Comment