శ్రీనగర్:
కాశ్మీర్ లోయలో, షేక్ అని పిలువబడే ముస్లిం స్వీపర్
కమ్యూనిటీ చారిత్రాత్మకంగా విస్మరించబడింది మరియు అట్టడుగున ఉంది. దశాబ్దాలుగా, షేక్ (సాంప్రదాయంగా స్వీపర్లు) కమ్యూనిటీ పారిశుధ్య నిర్వహణకు వెన్నెముకగా నిలిచారు.
కాశ్మీర్
లోయలోని మొత్తం జనాభాలో దాదాపు 20-25% మంది వెనకబడిన, అభివృద్దికి నోచుకోని మరియు
నిర్లక్షం చేయబడిన షేక్-ముస్లిం
స్వీపర్ కమ్యూనిటీ కి చెందినవారు. శతాబ్దాలుగా షేక్- స్వీపర్ కమ్యూనిటీ సమాజం, ప్రభుత్వ
నిర్లక్ష్యం మరియు సామాజిక ఒత్తిళ్ల నుండి ఉత్పన్నమయ్యే సవాళ్లను ఎదుర్కొంటుంది.
"చాలా మంది షేక్ స్వీపర్లు రోజువారీ
కూలీగా పనిచేస్తున్నారు, మరియు నెలసరి రూ. 9,000 జీతం పొందుతున్నారు," ఈ సంపాదన కుటుంబాలను పోషించడం,
పిల్లలకు చదువు చెప్పించడం, ఆరోగ్య సంరక్షణను పొందడం లేదా ఊహించని విపత్తుల కోసం పొదుపు చేయడం వంటి
ప్రాథమిక అవసరాలకు సరిపోదు.
షేక్
స్వీపర్లు తమ విధి నిర్వహణ లో ఎక్కువ కాలం వ్యర్థాలకు గురికావడం వల్ల వ్యాధుల
బారిన పడే అవకాశం ఉంది. స్వీపర్ల సంక్షేమంపై ప్రభుత్వం మరియు
సంబంధిత శాఖ శ్రద్ధ చూపడం లేదని విమర్శ కూడా కలదు.
రోజు
ఉదయం ప్రార్థనల తర్వాత 4 గంటలకు షేక్ స్వీపర్ల పని ప్రారంభమవుతుంది. ఇంటింటి చెత్తను సేకరించడం
మరియు రోడ్లు ఊడ్చడం ద్వారా వారు తమ నిర్దేశిత ప్రాంతంలోని ప్రతి సందు మరియు మూలను
చాలా జాగ్రత్తగా శుభ్రం చేస్తారు.
షేక్
కమ్యూనిటీకి చెందిన చాలా మంది స్వీపర్లు శ్రీనగర్ డౌన్‌టౌన్లోని వాటల్ ప్రాంతంలో నివసిస్తారు. కాశ్మీరీ భాషలో, వాటల్ అనే పదం స్వీపింగ్, క్లీనింగ్ లేదా చెప్పులు కుట్టేవారి
ఉద్యోగాలకు సంబంధించిన వ్యక్తులను సూచిస్తుంది.
షేక్
అనే పదాన్ని ప్రత్యయం suffix, గా ఉపయోగించినప్పుడు, ఆర్థికంగా వెనుకబడిన వ్యక్తులను సూచిస్తుంది,
వారి వృత్తులు నీచంగా
పరిగణించబడతాయి.
స్వీపర్ల
సగటు ఆయుర్దాయం మిగతా సాధారణ జనాభాలో సగం అవుతుంది,
ఎందుకంటే వారు చేసే పని
మరియు దాని సంబంధిత సమస్యలు..
“నేడు మారిన కాలానికి అనుగుణంగా షేక్ స్వీపర్ సంఘంలో కూడా కులాంతర వివాహాలు జరుగుతున్నాయి.
కాశ్మీర్‌లోని
షేక్ స్వీపర్ సమాజంలో దాదాపు సగం మంది మహిళలు ఉన్నారు. స్వీపర్ శ్రామికశక్తిలో
స్త్రీలు అంతర్భాగం. మగవారితో భుజం భుజం కలిపి పనులు అత్యంత చిత్తశుద్ధితో నిర్వహిస్తారు.
షేక్
స్వీపర్ (పారిశుద్ధ కార్మికులు) నిరంతర వివక్షకు గురి అవుతున్నారు. వివాహాలలో భోజన సమయాలలో, వేరు చేయబడి, ప్రత్యేక ప్లేట్లలో వారికి ఆహారం అందిచబడుతుంది.
షేక్
స్వీపర్ కమ్యూనిటీలోని పిల్లలకు విద్యాసౌకర్యాలు తగినంతగా లేవు. కొన్ని షేక్
కుటుంబాలు తమ పిల్లలను పాఠశాలకు పంపుతున్నప్పటికీ,
చాలా మందికి ఇది సుదూర
కలగానే మిగిలిపోయింది. ఫలితంగా, షేక్ సమాజంలో నిరక్షరాస్యత రేట్లు ఎక్కువగానే ఉన్నాయి.
15 ఏళ్లు పైబడి సర్వీస్ చేసిన
తరువాత షేక్ కమ్యునిటీ తమ ఉద్యోగాల్లో శాశ్వత హోదా పొందాలని, దాని వల్ల వచ్చే
ప్రయోజనాలను అనుభవించాలని కలలు కంటున్నారని స్వీపర్ సంఘం వ్యాఖ్యానిస్తుంది.
షేక్ స్వీపర్ కమ్యూనిటీ సభ్యులు అట్టడుగు
వర్గాలకు గల ఆత్మగౌరవానికి నిదర్శనాలు.
No comments:
Post a Comment