8 May 2024

మియాజ్కి, జపాన్ నుండి అత్యంత ఖరీదైన మామిడి పండ్లు Miyazki, costliest variety of mangoes from Japan

 

మామిడి పండ్ల సీజన్‌ లో మార్కెట్ లో  అన్ని రకాల మామిడికాయలు కనిపిస్తాయి.  నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ప్రకారం, భారతదేశం ప్రతి వేసవిలో 1500 రకాల మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తుంది. అయితే వాటిలో చాలా అరుదుగా కనిపించే వెరైటీ ఒకటి ఉంది. దానిని మియాజాకి/ మియాజ్కి Miyazki మామిడి అని పిలుస్తారు (ఇది వాస్తవానికి జపాన్‌కు చెందినది) మరియు ఇది మొత్తం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్ల  జాతిగా పేరుపొందింది. అంతర్జాతీయ మార్కెట్‌లో మియాజాకి మామిడి పండ్లకు కిలో రూ.2.75 నుంచి రూ.3 లక్షల వరకు ధర పలుకుతోంది.

మియాజాకి మామిడి పండ్లు భారతీయ రకం కాదు. జపాన్‌లోని క్యుషు ప్రాంతంలోని మియాజాకి పట్టణంలో వీటిని అభివృద్ధి చేశారు. 1980లలో స్థానిక రైతుల సహకారంతో మియాజాకి యూనివర్సిటీ పరిశోధకుల బృందం వీటిని అభివృద్ధి చేసిందని నమ్ముతారు. జపాన్ చరిత్రలో మీజీ కాలం  (1870)లోనే మియాజాకి మామిడి పండ్లు ఉన్నవి.

జపాన్‌లో మియాజాకి మామిడి పండ్లు ను తైయో-నో-తమగో అంటారు, అంటే సూర్యుని గుడ్డు. ప్రకాశవంతమైన రంగు కలిగీ తెగుళ్లు లేదా కీటకాల బారిన పడకుండా చాలా కాలం పాటు నిలువ ఉండే సామర్థ్యం కారణంగా వీటికి ఆ పేరు పెట్టారు.

మామిడికాయ  రంగు ఊదా నుండి ప్రకాశవంతమైన ఎరుపు వరకు ఉంటుంది. మియాజాకి మామిడి పండు సాధారణంగా ఊదారంగు మామిడిగా మొదలవుతుంది కానీ అది పక్వానికి వచ్చేసరికి తరచుగా ప్రకాశవంతమైన ఎరుపు గా ఉంటుంది. ఒక మియాజాకి మామిడికాయ  350 గ్రాముల బరువు ఉంటుంది మరియు ఏప్రిల్ మరియు ఆగస్టు మధ్య పక్వానికి వస్తుంది.

భారతదేశంలో, మియాజాకి మామిడిని మొదట ఒడిశా మరియు బీహార్‌లో కొద్దిమంది రైతులు పండించారు. వారు జపాన్ నుండి మొక్కలు దిగుమతి చేసుకున్నారు. కానీ వాటి అధిక ధర కారణంగా, కొనుగోలుదారులు చాలా తక్కువ మంది అయ్యారు.

ఇంట్లో పండించే మియాజాకీ మామిడి పండ్లకి మొదట్లో కిలో రూ.10,000 ధర పలికింది. మహారాష్ట్ర, ఆంధ్ర మరియు తెలంగాణలలోని తోటల యజమానులు కూడా మియాజాకీ మామిడి పండ్లను పండించడం ప్రారంభించారు దానితో ధరలు తగ్గాయి. అయితే ఇండియన్ వెరైటీకి అసలు జపనీస్ రకానికి చెందిన టేస్ట్ , టెక్స్చర్ ఉండవని కొందరు అంటున్నారు.

గత ఏడాది పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో జరిగిన మ్యాంగో ఫెస్టివల్‌లో మియాజాకి మామిడిపండ్లు ఎక్కువ పరిమాణంలో అమ్ముడయ్యాయి. మియాజాకి మామిడి పండించే రైతులు సెక్యూరిటీ గార్డులు, కుక్కలు, సీసీ కెమెరాల సాయంతో తోటలను కాపాడుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే దొంగలు అధిక ధర కారణంగా వాటిని తరచూ దొంగిలిస్తారు.

 

No comments:

Post a Comment