1940 దశాబ్దం లో ముస్లిం లీగ్ నాయకుడు M. A. జిన్నాకు వ్యతిరేకంగా భారతదేశ విభజనకు వ్యతిరేకంగా ముస్లింలను ముందుకు నడిపించిన
భారత ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుడు M. Y. నూరీ.
8 జూన్ 1940 అహ్మదాబాద్‌లో కాంగ్రెస్‌కు చెందిన ముస్లిం నాయకుడు M. Y. నూరీ, ముస్లిం లీగ్ మరియు మహమ్మద్ అలీ జిన్నాను విమర్శిస్తూ బహిరంగ సభలో
ప్రసంగించారు. ముస్లిం లీగ్ మద్దతుదారుల గుంపు M. Y. నూరీ పై రాళ్లు రువ్వడం ప్రారంభించింది మరియు కొందరు
M. Y. నూరీ ని కొట్టినారు.
కాంగ్రెస్ ముస్లిం నాయకుడు M. Y. నూరీ పై జరిగిన దాడికి సంభందించిన సంఘటన
వివరాలు 1947లో హోమీ J. H. తలేయార్‌ఖాన్ రాసిన “దే టోల్డ్ మీ సో” అనే
పుస్తకంలో ప్రస్తావించబడినాయి. .
ప్రముఖ ముస్లిం లీగ్ నాయకుడు జిన్నా, M. Y. నూరీని తనకు తీవ్రమైన ప్రత్యర్ధిగా
భావించేవాడు.
ఖిలాఫత్ ఉద్యమం సమయంలో M. Y. నూరీ
రాజకీయాల్లోకి ప్రవేశించారు మరియు మౌలానా షౌకత్ అలీకి సన్నిహితంగా
పరిగణించబడ్డారు. M. Y. నూరీ 1937 ఎన్నికల సమయంలో అహ్మదాబాద్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందినాడు. ఎన్నికల
అనంతరం M. Y. నూరీ కాంగ్రెస్‌లో చేరాడు మరియు బొంబాయి ప్రావిన్స్‌లో పబ్లిక్ వర్క్స్
మంత్రిత్వ శాఖను నిర్వహించాడు (గుజరాత్ ప్రావిన్స్‌లో భాగం).
M. Y. నూరీ అహ్మదాబాద్ మరియు ముంబై ప్రజలలో అత్యంత ప్రసిద్ధ ముస్లిం నాయకుడు. M. Y. నూరీ అనేక కార్మిక సంఘాలకు నాయకుడు కూడా. జిన్నా
పాకిస్తాన్ డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 1940లో అనేక ముస్లిం సంస్థలు కలిసి ఆజాద్ ముస్లిం కాన్ఫరెన్స్‌ను ఏర్పాటు
చేసినప్పుడు, M. Y. నూరీ ఆజాద్ ముస్లిం కాన్ఫరెన్స్ ప్రముఖ నాయకులలో ఒకరు. నిజానికి M. Y. నూరీ బొంబాయి ప్రావిన్స్‌లో జరిగిన ఆజాద్ ముస్లిం
కాన్ఫరెన్స్ సమావేశానికి నాయకుడు.
జిన్నా ముస్లిం లీగ్‌కు వ్యతిరేకంగా ఆజాద్ ముస్లిం కాన్ఫరెన్స్ తరపున
ప్రజలు పెద్ద సంఖ్యలో సమావేశమైనప్పుడు జిన్నా మద్దతుదారులు అనేక సందర్భాల్లో M. Y నూరీపై దాడి చేశారు. క్విట్ ఇండియా ఉద్యమం లో
చురుకుగా పాల్గోన్న౦దుకు M. Y నూరీ అరెస్ట్ చేయబడినాడు.
4 మే 1944న జైలు నుంచి విడుదలైన తర్వాత తీసుకున్న M. Y నూరీ ముస్లిం లీగ్‌కు వ్యతిరేకంగా ఎన్నికలలో
పోరాడేందుకు ‘ఆల్ ఇండియా ముస్లిం మజ్లిస్’ అనే రాజకీయ సంస్థను ఏర్పాటు చేయడం. M. Y నూరీ ముస్లిం మజ్లిస్ యొక్క బొంబాయి శాఖకు
అధ్యక్షుడు.
ముస్లిం లీగ్ హింసాత్మక గుంపుల నుండి ప్రజలను రక్షించడానికి M. Y నూరీ ‘బాంబే పీస్ పెట్రోల్స్’ అనే సంస్థను
ఏర్పరచినారు.. భారతదేశం విభజించబడినప్పుడు, M. Y నూరీ బొంబాయి ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షుడిగా కొనసాగారు
మరియు బొంబాయి ప్రావిన్స్‌లో శాంతి కోసం కృషి చేశారు.
M. Y నూరీ ముస్లిం నాయకుడు కాదు. M. Y నూరీ పేద మరియు సామాన్య ప్రజల నాయకుడు కూడా .
‘నేషనల్ సీమెన్స్ యూనియన్’తో పాటు అనేక సంస్థలకు M. Y నూరీ ప్రధాన
కార్యదర్శిగా పనిచేశారు.
1947కి ముందు గోవా స్వాతంత్ర్యం కోసం పోరాడిన అతికొద్ది మంది భారతీయ నాయకులలో M. Y నూరీ ఒకరు కావడం మరొక ప్రత్యేకత. గోవా కాంగ్రెస్
కమిటీ, గోవన్ యూత్ లీగ్ మరియు నేషనలిస్ట్ క్రిస్టియన్స్
పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో 1946లో గోవాలో
జరిగిన ర్యాలీలలో M. Y నూరీ ప్రసంగించారు. . గోవాలోని సామాన్య ప్రజలలో
భయాన్ని పోగొట్టడం మరియు రాజకీయ చైతన్యాన్ని నింపడం నాయకుల ప్రాథమిక కర్తవ్యం అని M. Y నూరీ చెప్పారు.
No comments:
Post a Comment