వాయువ్యపాకిస్తాన్ లోని మింగోరా లో 12-07-1997 న జన్మించిన మలాలా
యూసఫ్‌జాయ్ ఫస్తున్ తెగ కు చెందిన
సున్ని ముస్లిం బాలిక. ఈమె తండ్రి పేరు జియాఉద్దిన్ యూసఫ్‌జాయ్ తల్లి పేరు తూర్పెకై యూసఫ్‌జాయ్. ప్రముఖ పస్తూన్ కవయిత్రి, పోరాటయోధురాలు మెయివాండ్
మలాలా పేరులోని ‘మలాలా’ను ఆమె తండ్రి
జియావుద్దీన్ కూతురికి పెట్టారు. యూసఫ్‌జాయ్ స్వాత్ లోయలో ప్రముఖ తెగ. మలాలా అంటే
అర్థం – బాధాసర్పద్రష్ట అని అర్ధం అత్యంత పిన్న వయసులో(17 సంవత్సరాలు) 2014 నోబెల్
శాంతి బహుమతి సంయుక్తంగా గెలుచుకున్న పాకిస్థాన్ సాహస బాలిక గా మలాలా యూసఫ్
జాయ్ చరిత్ర సృష్టించారు. కేనడా దేశం ఇమెకు గౌరవ పౌరసత్వం ఇచ్చి సత్కరించనుంది.
అత్యంత పిన్న వయస్సు లో నోబుల్ బహుమతి గెల్చుకొన్న ఏకైక
బాలిక మాలాల. స్త్రీ/బాలిక విద్య సమర్దుకురాలు, సఖరోవ్
ప్రైజ్ విజేత,సిమోన్ డి బ్యురోర్ ప్రైజ్ (2013)మరియు పాకిస్తాన్ జాతీయ యువ శాంతి
ప్రైజ్(2011) విజేత. నోబెల్ విజేత డెస్మండ్ టిటు.ఈమెను అంతర్జాతీయ పిల్లల శాంతి ప్రైజ్ కు
నామినేట్ చేసెను అంతటి పురస్కారం
పరిశీలనకు ఎంపికైన పిన్న వయస్కురాలు మలాలాయే. నాటికి ఆమె వయసు పదిహేనేళ్లు. రెండేళ్ళ క్రితం పాక్‌లో బాలికల విద్యా హక్కు కోసం పోరాటం సాగిస్తున్న తరుణంలో తాలిబాన్ల దాడి లో తీవ్రం గా గాయపడిన
ఈమె కోలుకున్న అనంతరం మలాలా ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని బర్మింగ్ హాంలో తల్లిదండ్రులతో కలిసి జీవిస్తూ అక్కడే విద్యాభ్యాసం చేస్తోంది.
మానవ హక్కుల/స్త్రీ విద్య/బాలికల విద్యా సమర్దుకురాలుగా ప్రపంచవ్యాప్త పేరుగాంచినది.
ప్రపంచ ప్రముఖ యుక్తవయస్కురాలుగా(టీనేజర్) ఈమెను దుష్ వెల్ కిర్తించెను. ఐ యాం
మాలాల అని ఈమె పేరున బ్రిటన్ ప్రధాని గార్డెన్ బ్రౌన్ ఐక్యరాజ్య సమితి పిటిషన్
ప్రారంబించినాడు. ఈ యువతి సాహసంపై
పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ మాట్లాడుతూ మలాలా ఒక వ్యక్తికాదని ఓ శక్తి
అని చెప్పుకొచ్చారు. ఆమె ధైర్యం, తెగింపును ప్రతి
ఒక్కరూ మెచ్చుకోవాలన్నారు. ఉగ్రవాదంపై పోరాడి గెలుపు సాధిస్తామని చెప్పారు.
పాకిస్థాన్ అమ్మాయి మలాలా యూసఫ్ జాయ్
జీవిత చరిత్ర "ఐయామ్ మలాలా" పేరిట పుస్తక రూపంలో రానుంది. ప్రస్తుతం
మలాలా వయస్సు పదిహేనేళ్లు. ఈ చిన్నారి తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను 'ఐయామ్ మలాలా'(నేను మలాలా) అన్న పేరుతో ఆమె ఈ పుస్తకాన్ని రాయనుంది.
మలాలా ఆశయం వైద్యవృత్తి. 2008 సెప్టెంబర్‌లో
పెషావర్ ప్రెస్‌క్లబ్‌లో ఇచ్చిన ఉపన్యాసం లో మలాలా వేసిన ప్రశ్న ‘చదువుకోవడానికి నాకు ఉన్న హక్కుని లాక్కోవడానికి తాలిబన్లు ఎవరు?’మలాలా స్వాత్‌లోయ అనుభవాలను మలాలా ‘గుల్ మకాయ్’ (జొన్న పువ్వు అని అర్థం) అనే మారుపేరుతో డైరీ రూపంలో బీబీసీ కోసం ఉర్దూలో
రాసింది.
ఎన్నో జాతీయ, అంతర్జాతీయ బహుమతులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఆ ప్రయాణం ఎంత స్ఫూర్తిదాయకమో, అంత విప్లవాత్మకం కూడా.
‘ఎవరి మీదో ప్రతీకారం తీర్చుకోవడం గురించి మాట్లాడటానికి
రాలేద’ని సమితి సభలో మలాలా చెప్పింది. ‘ఈ ప్రపంచంలోకి వచ్చిన ప్రతి చిన్నారికి
చదువుకునే హక్కు ఉంది. అది మాట్లాడేందుకు ఇక్కడ నిలబడ్డాను’ అని ప్రకటించింది.
మలాలా మీద ఒక ఆగంతకుడు కాల్పులు జరిపాడు.
బ్రిటన్‌లోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఎట్టకేలకు మలాలా
గెలిచింది. ఈ ఉదంతం విన్న వెంటనే ‘బిగ్గరగా ఏడవాలనిపించింది’ అని వ్యాఖ్యానించింది మడోనా. ఆ రోజు లాస్
ఏంజెలిస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాడిన ‘హ్యూమన్ నేచర్’ అన్న పాటను మలాలాకు అంకితం చేసింది.
ప్రఖ్యాత హాలీవుడ్ నటి ఏంజెలినా
జోలీ వెంటనే ఒక వ్యాసం రాసింది. టీనా బ్రౌన్‌తో కలిసి
పాకిస్థాన్ బాలికల చదువు కోసం విరాళాలు సేకరించి పంపాలని జోలీ నిర్ణయించింది.
హక్కుల కోసం వీరోచిత పోరాటం చేసిన బాలిక మలాలా అని హిల్లరీ క్లింటన్ ఒక సభలో
ప్రశంసించారు. లారా బుష్ ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రికలో ఒక
వ్యాసం రాసింది. నాజీల దురాగతాల గురించి రహస్యంగా డైరీ రాసి చరిత్ర
ప్రసిద్ధికెక్కిన యానీ ఫ్రాంక్‌తో మలాలాను పోల్చింది లారా.
ప్రపంచం మొత్తం మీద విద్యావకాశాన్ని
కోల్పోయిన 5,70,00,000 బాలబాలికల తరఫున 40 లక్షల మంది సంతకాలు చేసిన మహజరును ఉపన్యాసం తరువాత
సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్‌కి మలాలా అందచేసింది. ఒక్క పాకిస్థాన్‌లోనే
చదువుకు నోచుకోని బాలబాలికలు 50 లక్షలు. ఇప్పుడు స్వాత్‌లోయలో ప్రతి బాలిక గొంతు
విప్పుతోంది. ఇక్కడ ప్రతి బాలిక మలాలాయే అని సీఎన్‌ఎన్ విలేకరి ఎదుట బాలికలంతా
ముక్తకంఠంతో చెప్పారు.
‘సాటి మనిషిని ప్రేమించడమే నా కుటుంబం నాకు నేర్పిన
సంస్కారం. నా మీద తూటాలు కురిపించిన తాలిబన్ వచ్చి నా ఎదురుగా నిలిచినా అతడిని
నేను క్షమిస్తాను. గాంధీజీ, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ థెరిసాలే
నాకు ఆదర్శ’మని మలాలా చెప్పింది. తాలిబన్లకు చదువు లేదు, అందుకే ఇలాంటి
దుష్టకార్యాలకు పాల్పడుతున్నారని నిష్కర్షగానే చెప్పింది. కానీ ఆ ఉపన్యాసంలో ఆమె
ప్రపంచ పెద్దలను ఉద్దేశించి పలికిన మాట చరిత్రాత్మకం.
No comments:
Post a Comment