మహాత్మా గాంధీ అభిప్రాయం
లో ముస్లింలు నమాజ్ చదవకుండా ఎవరు అడ్డుకోలేరు. నమాజ్ చదవకుండా ఆటoక
పరచడం మన రాజ్యాంగంలో పొందుపరచబడిన లౌకికవాదం యొక్క ప్రధాన లక్షణం అయిన “సర్వ ధర్మ
సమ భావన“ కు వ్యతిరేకం అని ఆయన భావన.
ఫిబ్రవరి 29, 1920 న హిందూ-ముస్లిం యూనిటి పత్రిక లో రాసిన వ్యాసం లో మహాత్మా
గాంధీ “నుదుటిన తిలకం పెట్టిన ఒక వైష్ణవుడు, రుద్రాక్ష ధరించి సంద్యావందనం ఆచరిoచే
ఒక హిందూ మరియు నమాజ్ చదేవే ఒక ముస్లిం కలసి
మెలసి సోదరులుగా జీవించవచ్చని” అన్నారు. దేవుడు తలస్తే ఆ కల వాస్తవ మవుతుంది అని
ఆయన అన్నారు.
గురుగ్రామ్ లో ఇటివల కొన్ని గ్రూపులు బహిరంగ ప్రదేశాల్లో
నమాజ్ చదవడం వ్యతిరేకించడం గాంధీ
అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. మన
రాజ్యాంగంలో పొందుపరచబడిన లౌకికవాదం యొక్క లక్షణం అయిన “సర్వ ధర్మ సమ భావన” యొక్క ఆదర్శాన్ని
ఇది నిరోధిస్తుంది. హిందూ మతం పేరుతో గాంధీ స్వప్నం ను దెబ్బతీయుటకు కొన్ని విచ్చినకర
శక్తులు ప్రయత్నిస్తున్నాయి. గాంధీ ఉద్దేశం లో
హిందుతత్వం యేసు, ముహమ్మద్ మరియు
జోరోస్టెర్ యొక్క ఆదర్శాలను తనలో ఇముడ్చుకొన్న గొప్ప పరిణామ ప్రక్రియ.
మహాత్మా గాంధీ యొక్క రాబోయే 150 వ వార్షికోత్సవ వేడుకలు
అతని వారసత్వం గురించి తెలుపుతాయి. “సత్యంతో నా ప్రయోగాలు My Experiments with Truth”, గ్రంధం లో మహాత్మా గాంధీ
తన మొదటి సత్యాగ్రహ సమయంలో దక్షిణాఫ్రికాలో స్థాపించిన టాల్స్టాయ్ ఫారంలో
ముస్లింలు ఎటువంటు ఆటంకాలు లేకుండా బహిరంగం గా నమాజ్ ఎలా ఆచరించే వారో
గుర్తుచేసుకొన్నారు.
మహాత్మా గాంధీ అన్ని మత వర్గాల విశ్వాసాలతో సంబంధం కలిగిన “ప్రార్థన”
ను సమర్ధించారు మరియు ఇలా రాశారు, "గాయత్రి , నమాజ్ లేదా క్రైస్తవ
ప్రార్థన యొక్క పఠనం మూఢవిశ్వాసాలకు, అమాకత్వం కు అనుగుణంగా ఉంటుందని అనుకోవటం పెద్ద తప్పు. "ఉపవాసం
మరియు ప్రార్థన అనేవి పరిశుభ్రత యొక్క
అత్యంత శక్తివంతమైన ప్రక్రియ మరియు పవిత్రమైనవి. అది మన పనిని చేయటానికి మరియు మన లక్ష్యాన్ని సాధించడానికి
తోడ్పతాయి." కాబట్టి ముస్లింలను నమాజ్ చేయకుండా నిరోధించడం వారిని బాధ్యతలు కలిగిన
పౌరులుగా రుపొందించ నివ్వదు.
గాంధీ సబర్మతి ఆశ్రంలో ఒక ఆలయాన్ని నిర్మించమని మీరా బెన్ చేసిన
అభ్యర్థనను తిరస్కరించారు. గాంధీ బహిరంగ ప్రదేశం open space తన ప్రార్ధనా మందిరం అని
విశ్వసించారు. దాని పైకప్పు ఆకాశంగా ఉండి నాలుగు వైపులా (తూర్పు, పశ్చిమ, ఉత్తర మరియు దక్షిణం) నాలుగు
గోడలను కలిగి ఉంటుంది. అలాంటి ఓపెన్ హాల్
లో చేసిన ప్రార్థన విశ్వాసం, కులం, భాష మరియు జాతీయత యొక్క
అడ్డంకులను అధిగమించగలదని ఆయన వివరించారు.
భారతదేశం అంతటా అనేక బహిరంగ ప్రార్ధనా సమావేశాలలో పాల్గొని, అలాంటి సందర్భాలలో
మాట్లాడేటప్పుడు, గాంధీ ముస్లింలు నమాజ్ చేసే సమయం లో విరామం యిచ్చేవారు మరియు ఆ తరువాత ప్రసంగించే
వారు. 1946, నవంబరు 16 న ఒక ప్రార్ధన సమావేశంలో ప్రసంగించే సమయంలో, ముస్లింలు నమాజ్ చేయడానికి అనుకూలంగా ఆయన తన ప్రసంగాన్ని
ఆపి వేసారు మరియు సభికులు రణగొణ ధ్వని
చేయడం చూసి, "సంస్కృతి మరియు మంచి
పెంపకం ఇతరుల ప్రార్థన సమయం లో నిశ్శబ్దం
పాటించమని భోదించేవి” అని చెప్పారు.
“నమాజ్” ప్రార్థన యొక్క ఒక రూపం మరియు వ్యాయామం యొక్క ఒక రూపంగా గాంధీ అర్థం
చేసుకున్నారు. 1921 లో "నమాజ్ ద్వారా వ్యక్తి వ్యాయామం చేస్తాడు" అని గాంధి
తన అభిప్రాయాన్ని స్పష్టంగా పలికారు. డిల్లి
లో 1946 లో జరిగిన ప్రార్థన సమావేశంలో మాట్లాడుతూ గాంధీ “తనకు “నమాజ్” ఎలా చేయాలి అనే దానిని గురించి ఒక పుస్తకాన్ని ఎవరో పంపించారని అందులో సమూహా
ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన కన్నా 27 సార్లు ప్రభావవంతంగా ఉందని” అన్నారు. అందరు ప్రార్థనలో
సంపూర్ణంగా హృదయపూర్వకంగా మరియు పద్దతిలో పాల్గొంటే అది వాతావరణాన్ని మార్చి, ఢిల్లీలో అల్లర్లు జరిగేవి
కావని గాంధీ అన్నారు.
“సర్వ ధర్మ సమ భావన” భావనను
అర్ధం చేసుకోటం లో నమాజ్ పై గాంధీ యొక్క ఆలోచనలు ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.
No comments:
Post a Comment