ఇటివల పత్రికల లో ఉఘైర్ ముస్లిం ల పట్ల చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న
అణచివేత మరియు వివక్షతా అన్న వార్తలు తరుచుగా
వినిపిస్తున్నవి. చైనా కమ్యునిస్ట్
పార్టీ అధికారికంగా గుర్తించిన ఐదు మతాలలో ఇస్లాం ఒకటి. 23 మిలియన్ల మంది ముస్లింలు
దేశంలో ఉన్నారు..
చైనా లోని వాయువ్య ప్రాంతం జిన్జియాంగ్ లో ఉఘైర్స్ అనే అల్పసంఖ్యాక
ముస్లిం వర్గం వారు అధికంగా నివసిస్తున్నారు. చైనా లోని వాయువ్య జిన్జియాంగ్
ప్రాంతం రష్యా, మంగోలియా,టిబెట్ మరియు
కజకస్తాన్ తో సరిహద్దులు కలిగి ఉంది. జిన్జియాంగ్ ప్రాంతం లో 10 మిలియన్లకు పైగా
ఉగైర్ మైనారిటి వాసులు ఉన్నారు. వీరు
మతరీత్యా ముస్లింలు. 19 మిలియన్ల జిన్జియాంగ్ యొక్క జనాభాలో 40 శాతం మంది
ఉఘైర్స్. ఉఘిర్స్ సాంసృతికంగా, జాతిపరంగా
తుర్కిలు. మధ్య ఆసియా ప్రాంతంలోని తూర్పు తుర్కెస్తాన్ వాసులు. ప్రధానంగా
వీరు ముస్లిం మత వాసులు.
చైనాలో
అధికారికంగా మత స్వేఛ్చ ఉన్నప్పటికీ నిజానికి అది అమలులో లేదు ఉఘైర్ అల్పసంఖ్యాక వర్గం (ముస్లింలు) వారి ఆచార వ్యవహారాలూ
చరిత్ర-సంస్కృతి పై,మత విశ్వాసాల మీద చైనా ప్రభుత్వం అనేక ఆంక్షలు విదిoచినది. చైనా లో కమ్యునిజం అమలులో ఉంది. అధికార కమ్యునిస్ట్ పార్టి
చెప్పిన ప్రకారo అక్కడ పరిపాలన సాగుతుంది.
తరచుగా ఉగైర్ వాసులకు చైనా బద్రత దళాలకు మద్య
ఘర్షణలు జరుగుతుoటాయి. పెరిగిన ఇస్లామిక్ ఉగ్రవాదం దీనికి కారణం అని అక్కడి
ప్రభుత్వం అంటుంది. ఉగైర్ వాసులు తమ బాష,సంస్కృతి, మత విశ్వాసాల మీద చైనా
ప్రబుత్వం దమన నీతిని అనుసరిస్తుదని అంటారు. చైనాలో అధికారికంగా మత స్వేఛ్చ ఉన్నప్పటికీ నిజానికి
అది అమలులో లేదు.
చైనా పడమట ప్రాంతం లోని జిన్జియాంగ్ ప్రాంతం లో నివసించే
ఉఘైర్ ముస్లింలు రంజాన్ ఉపవాసం పాటించుట
పై చైనా ప్రభుత్వం నిషేధం విదించినది. బక్రీద్ సందర్భం గా కుర్బాని ఇవ్వడాన్ని
నిషేధం విధించినది. ప్రబుత్వమే ఉచితంగా మరియు సబ్సిడీ పై ముస్లిం లకు హలాల్ మాంసం అందిస్తున్నది. గత మూడు సంవత్సరాలుగా రంజాన్ ఉపవాసం పై ప్రభుత్వ నిషేధం
కొనసాగుతున్నది. పౌరులు, అధికారులు, విద్యార్ధులు, టీచర్లు ఉపవాసం పాటించకుండా
వారినుంచి అఫిడవిట్లు తీసుకొన్నారు. అక్కడి కమ్యునిస్ట్ పార్టి తన సబ్యులు ఉపవాసం
ఉండుట పై కూడా నిషేధం విదించినది. పగటి పూట
రెస్టారెంట్లు, హోటల్స్ తెరిచి ఉంటాయి.
ఉఘైర్ ల ఇళ్ళు తరచూ సోదాలకు గురి అవుతున్నవి. ఇస్లాం, దివ్య
ఖురాన్ పై నిషేధం విధించ బడినవి. ఉఘైర్ బాష నిషేదింప బడినది. మత కార్యక్రమాలపై
నిషేధం కోన సాగు తున్నది. . చైనీస్ విధానం మరియు చట్టం ఇస్లాం మతమును
అణచివేయడానికి పాఠశాలలు మరియు ఇంటి లోపల కూడా ఆంక్షలు విదించినది. ఒక అధికారిక
పత్రం ద్వారా తల్లిదండ్రులు మరియు చట్టపరమైన సంరక్షకులు వారి మైనర్లను "మత కార్యకలాపాలు పాల్గొనేందుకు అనుమతి
నిరాకరించినది”. ఉయిఘుర్ల పై చైనా రాజ్య మత నియంత్రణ 'వారి వ్యవస్థీకృత మత కార్యకలాపాలు ,పాఠశాలలు
అలాగే వారి ప్రవర్తన మరియు వారి వస్త్ర ప్రదర్శనను పరిమితం చేసింది.
మత గ్రంధాలు చదవటం, మత సెలవుల సంబరాలు జరుపు కోవడం
మరియు వ్యక్తిగత ప్రదర్శన ద్వారా మతాచారాలను పాటించడం ఖచ్చితంగా రాజ్య
అద్వర్యం లోని సంస్థల్లో నిషేధము విదించబడినది. వేధింపు రోజువారీ జరుగుతుంది
చైనీస్ ప్రభుత్వం ఖురాన్ పై నిషెదం
విదించినది మరియు మస్జిద్ లలో ఇమాం లు ఏమి భోదించాలో నియంత్రిస్తుంది, అధికారులు
తరచూ మసీదులలో నిఘా నిర్వహించడం, ప్రభుత్వ విధానాలకు
వ్యతిరేకంగా నిరాశను వ్యక్తీకరరించటం "వేర్పాటువాదం" గా బావిస్తుంది.
వేర్పాటు వాదం కు చైనీస్ చట్టం కింద మరణశిక్ష విదిస్తారు.
చైనా అధికారులు
ఉయ్ఘుర్ల వివాహాలు, అంత్యక్రియలు మరియు తీర్థయాత్రలను, హజ్ చేయడాన్ని పరిమితం చేసారు. పాఠశాలల నుండి ఉయ్ఘుర్ భాష
నిషేధించబడినది. ప్రభుత్వరంగ కార్యాలయాల్లో రంజాన్ సీజన్ సమయంలో ఉయిఘుర్
ప్రజలు బలవంతంగా తినడం తప్పనిసరి చేస్తూ భోజనాలు
ఏర్పాటు చేశారు. మంచి ఆరోగ్యం అనే మిష తో
"ఉపవాసంకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ఉఘైర్
స్త్రీలు ముసుగులు మరియు హిజాబ్ ధరించడం
విటమిన్ D లోపాలకు కారణం అని
వాదిస్తున్నారు.
ఈ సంవత్సరం రంజాన్ లో
అధికారులు చైనా యొక్క తీవ్రవాద వ్యతిరేక విధానాలు ప్రాపగాండా చేయమని మసీదులను
పురమాయించారు మరియు ఉయ్ఘుర్ ముస్లిం ప్రజల పరిసరాలు మరియు ప్రార్థనా
ప్రదేశాల్లో నిఘా పెంచారు. రంజాన్ కాలం లో
కొత్త మార్గదర్శకాలు కింద అధికారులు చట్టబద్ధంగా ఉయ్ఘుర్ల ఇళ్ళ లోనికి
ప్రవేశించి వారి కుటుంబసభ్యులు అక్రమ మత కార్యకలాపాలు చెయ్యటం లేదని నిర్ధారించడానికి గృహాల అన్వేషణ కు
అనుమతిస్తారు.
చైనా జాతీయ పతాకాన్ని అన్ని
మసీదులలో ప్రముఖంగా ఎగురవేయమని ప్రభుత్వం ఆదేశించినది. అన్ని మసీదు ప్రాంగణాల్లో జెండాలు "ప్రముఖ
స్థానం" లో ఎగరవేయాలని ప్రభుత్వ అధినం లోని చైనా ఇస్లామిక్ అసోసియేషన్ తన
వెబ్సైట్లో ప్రచురించిన ఒక లేఖలో పేర్కొంది.ఇది "జాతీయ మరియు పౌర సిద్ధాంతాల
అవగాహనను మరింత బలపరుస్తుంది, మరియు అన్ని జాతుల
యొక్క ముస్లింలలో దేశభక్తి స్ఫూర్తిని ప్రోత్సహిస్తుంది" అని వెబ్సైటు లో
పేర్కొన్నారు. అన్ని చైనీస్ మసీదులు ముస్లింలలో "దేశభక్తి స్ఫూర్తిని
ప్రోత్సహించడానికి" జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని మరియు అన్ని మసీదు
ప్రాంగణాలలో జెండాలు "ప్రముఖ స్థానం" లో వేలాడతాయని చైనా ఇస్లామిక్
అసోసియేషన్ ఒక లేఖలో పేర్కొంది.
ఇది "జాతీయ మరియు పౌర సిద్ధాంతాల అవగాహనను మరింత బలపరుస్తుంది, మరియు అన్ని జాతుల సమూహాలలోని ముస్లింలలో దేశభక్తిని ప్రోత్సహిస్తుంది" అని చైనా ఇస్లామిక్ అసోసియేషన్ అంది. మసీదులు బహిరంగంగా పార్టీ యొక్క "ప్రధాన సామ్యవాద విలువలు" గురించి సమాచారాన్ని ప్రదర్శిస్తాయి మరియు ఇస్లామిక్ గ్రంథాల ద్వారా భక్తులకు వాటిని వివరించాలి, తద్వారా వారు "ప్రజల హృదయాలలో లోతుగా పాతుకుపోతారు" అని చెప్పింది.
చైనా ఇస్లామిక్ అసోసియేషన్ అనేది ప్రభుత్వ అనుబంధ సంస్థ మరియు ఇమామ్లను నియమించడానికి దానికి అధికారం ఉంది.మసీదు సిబ్బంది చైనీస్ రాజ్యాంగం మరియు ఇతర సంబంధిత చట్టాలపై అధ్యయనం చేయాలి ముఖ్యంగా కొత్త మతపరమైన నిబంధనలు, అని లేఖ తెలిపింది.వారు చైనీస్ సంప్రదాయాలను అధ్యయనం చేయాలి మరియు సాంప్రదాయిక చైనీస్ సంస్కృతిపై విద్యా కోర్సులు ఏర్పాటు చేయాలి అని అంది.
ఇది "జాతీయ మరియు పౌర సిద్ధాంతాల అవగాహనను మరింత బలపరుస్తుంది, మరియు అన్ని జాతుల సమూహాలలోని ముస్లింలలో దేశభక్తిని ప్రోత్సహిస్తుంది" అని చైనా ఇస్లామిక్ అసోసియేషన్ అంది. మసీదులు బహిరంగంగా పార్టీ యొక్క "ప్రధాన సామ్యవాద విలువలు" గురించి సమాచారాన్ని ప్రదర్శిస్తాయి మరియు ఇస్లామిక్ గ్రంథాల ద్వారా భక్తులకు వాటిని వివరించాలి, తద్వారా వారు "ప్రజల హృదయాలలో లోతుగా పాతుకుపోతారు" అని చెప్పింది.
చైనా ఇస్లామిక్ అసోసియేషన్ అనేది ప్రభుత్వ అనుబంధ సంస్థ మరియు ఇమామ్లను నియమించడానికి దానికి అధికారం ఉంది.మసీదు సిబ్బంది చైనీస్ రాజ్యాంగం మరియు ఇతర సంబంధిత చట్టాలపై అధ్యయనం చేయాలి ముఖ్యంగా కొత్త మతపరమైన నిబంధనలు, అని లేఖ తెలిపింది.వారు చైనీస్ సంప్రదాయాలను అధ్యయనం చేయాలి మరియు సాంప్రదాయిక చైనీస్ సంస్కృతిపై విద్యా కోర్సులు ఏర్పాటు చేయాలి అని అంది.
ఉయ్ఘుర్ ముస్లింలు ప్రభుత్వం విధించిన ఇంటర్నెట్ ఆంక్షలు ఎదుర్కొంటున్నారు శాంతియుతంగా ఆన్-లైన్ ద్వార అసమ్మతి వ్యక్తం చేసే ఉయిఘుర్ ప్రజలను ఖైదు చేయవచ్చు మరియు వారికి ఇంటర్నెట్ యాక్సెస్ తొలగించవచ్చు. చైనా యొక్క ఇతర భాగాలకు ప్రయాణం చేసే ఉఘైర్స్ కు తరచుగా స్థానిక పోలీసుల వేధింపులు ఉంటాయి మరియు వీరికి హోటల్స్ లో వసతి ఎవరు ఇవ్వరు. ఉయ్ఘుర్ జాతి గుర్తింపును ఇస్లాం మతం గుర్తింపుగా పరిగణిస్తారు.
చైనీస్ అధికారులు జిన్జియాంగ్ యొక్క ఉత్తర-పశ్చిమ ప్రాంతంలో
ముస్లింలకు వ్యతిరేకంగా తమ ప్రచారాన్ని పెంచారు.జిన్జియాంగ్లో అధికారులు ముస్లిం
కుటుంబాలను మతపరమైన వస్తువులను అప్పగించాలని ఆదేశించారు. అక్కడి చైనీస్ పోలీసు ఆర్డర్ ప్రకారం ఉగైర్
ముస్లిమ్స్ అందరు పవిత్ర ఖురాన్ యొక్క
అన్ని కాపీలు మరియు ప్రార్థన మాట్స్ అప్పగించాలి
లేదా 'కఠినమైన శిక్ష'కు గురిఅవుతారు. చైనా ఉగైర్ తీవ్రవాదాన్ని తగ్గించడానికి మత వ్యవహారాలపై దాని నియంత్రణను పెంచినది.
వేలాదిమంది ఉగైర్స్
నిర్భంద మత ఓరియంటేషన్ విద్య కేంద్రాలకు పంపబడినారు మరియు తగిన కారణం లేకుండ వారిని నిరవధికంగా నిర్భంధం లో ఉంచవచ్చు.
ఉగైర్ ముస్లిమ్స్ మీద పరిమితులు మరియు భారీ పోలీసు ఉనికిని ఇస్లామిక్ తీవ్రవాదం మరియు వేర్పాటువాద ఉద్యమాల వ్యాప్తిని నియంత్రించడానికి ఉద్దేశించినట్లు అధికారులు చెబుతున్నారు, అయితే విశ్లేషకులు ఈ ప్రాంతం బహిరంగ జైలుగా మారింది అంటున్నారు.
హజ్ యాత్ర కు పరిమిత సంఖ్య లో విశ్వాసులను అనుమతిస్తుంది. మత వ్యవహారాల చైనా యొక్క స్టేట్ అడ్మినిస్ట్రేషన్ (SARA) క్రిందటి సంవత్సరం హజ్ యాత్రకు 14,500 చైనీస్ ముస్లింలకు అనుమతి ఇచ్చినది.
ఉఘైర్ ముస్లిమ్స్ తమ వివాహాలను ప్రబుత్వ
అధికారుల వద్ద రిజిస్టర్ చేయవలయును. ఇంటి వద్ద వివాహం/వివాహ వేడుకలను నిర్వహించడం
నేరం. ప్రబుత్వ అధినం లోని ప్రసార
సాధనములను వినకపోవటం లేదా చూడకపోవటం కూడా నేరం గా పరిగణించ బడుతుంది.
దైనందిన వ్యవహారాలలో హలాల్
భావనను పాటించ రాదు.
ఉగైర్
ముస్లిమ్స్ పాస్-పోర్ట్ పొందటానికి ఫోటోలతో పాటు వారి DNA శాంపుల్స్, ఫింగర్ ప్రింట్స్, వాయిస్
ప్రింట్స్ మరియు త్రి డైమన్షన్ ఇమేజ్ ను ఇవ్వవలసి ఉంటుంది. ఇవ్వని వారికీ పాస్-పోర్ట్ లబించదు మరియు వారి ప్రయాణాల పై
అనేక నిర్భందాలు ఉంటాయి.
కొంత కాలం క్రిందట బహిరంగ ప్రదేశాల్లో పొడుగాటి గడ్డాలు మరియు ముసుగులు ధరించడం పై నిషేధo
విధించారు.
ఇటివల
ఉఘైర్ ముస్లిo తల్లిదండ్రులు తమ
పిల్లలకు "ముహమ్మద్, “అరాఫత్", "జిహాద్",
“ఇస్లాం”, “మదీనా” “సద్దాం” “ఇమాం” వంటి పేర్లు పెట్టడం పై అక్కడి ప్రభుత్వం
నిషేధo విధించినది. ఈ నిబంధనలకు కట్టుబడి ఉండకపోతే, విద్య మరియు ఆరోగ్య
సంరక్షణతో సహా తల్లితండ్రులు తమ పిల్లలకు లబించే
కీలకమైన ప్రయోజనాలను కోల్పోతారు.
చైనా
పశ్చిమ ప్రాంతంలోని జిన్జియాంగ్ లో ఉన్న 20 మిలియన్ల ఉఘైర్ ముస్లిమ్స్ లో "మత తత్వ
భావనలను నిరోధించేందుకు" చేస్తున్న
ప్రయత్నంలో భాగంగా ఈ ఆంక్షలు ప్రవేశపెట్టారు.
చైనా యొక్క
ఉత్తర జిన్జియాంగ్ అటానమస్ రీజియన్ లో నివసించే ఉఘైర్ ప్రజలలో కారణం లేకుండా అరెస్ట్, హింస, మరియు
"అదృశ్యం" విస్తృతంగా ఉంది, మరియు బహిరంగ భయం
దేశవ్యాప్తంగా ఉఘైర్ జనాభా లో ఉన్నాయి. మానవ హక్కుల ఉల్లంఘన నడుమ, రాజ్యం మంజూరు వివక్షతల మద్య ఉయ్ఘుర్ నిరసనలు విస్త్రుతమైనవి.
చైనా
ప్రభుత్వం జిన్జియాంగ్ ప్రాంతం ఇస్లామిక్ తీవ్రవాదం, హింస
మరియు వేర్పాటువాద ఆలోచనల యొక్క ముఖ్య
ప్రాంతంగా భావించింది.ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఉయ్ఘుర్ పౌరుల స్వేచ్ఛను పరిమితం
చేయడానికి ప్రభుత్వం పలు నిభందనలను విధించినది. అనేకమంది విద్యార్ధులను, మానవ
హక్కుల కార్యకర్తలను, రచయితలను ఉగ్రవాద నిరోధక చట్టాల క్రింద అరెస్ట్ చేసి జైలు
పాలుచేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు చైనా ప్రబుత్వం ఉఘైర్ ప్రల పట్ల
అనుసరిస్తున్న అమానవీయ,వివక్షత పట్ల నిరసన తెల్పుతున్నారు. చైనీస్ రాడికల్
వాదం మద్య ఉఘైర్ ముస్లిమ్స్ బలిపశువులుగా
మారారు మరియు చైనా చర్యలు ఇప్పటికే క్షీణించిపోతున్న ఉఘైర్ పౌర హక్కులను మరింత
క్షిణిoప చేసినవి.
ఆమ్నేస్టి ఇంటర్నేషనల్ ఉఘైర్ ముస్లిమ్స్ పై
జరుగుతున్న నిర్భంధాలను వారి మత స్వేత్చ, మనవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం ఉఘైర్ల పట్ల విస్తృత వివక్ష, వారి ఉపాధి, గృహము
విద్యా అవకాశాలను దెబ్బతీసింది. అలాగే వారి మత స్వేచ్ఛ రద్దయింది. రాజకీయంగా
వారిని అట్టడుగు స్థాయి లో ఉంచినది. ఇన్ని
భాదలకు వివక్షతకు లోను అవుతున్న ఉఘైర్ ముస్లిం లు తమ చరిత్ర, తమ బాషను, తమ సంస్కృతిని సజీవం గా
ఉంచుటకు ప్రయత్నిస్తున్నారు మరియు సాంస్కృతిక మనుగడ కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నారు.
ఎక్కడో చైనాలో ముస్లిముల గురించి ఇంతలా స్పందించారు. కాశ్మీరు పండితులు బంగ్లాదేశ్ పాకిస్థాన్ లో హిందువుల దుస్థితి గురించి ఎప్పుడైనా ఆలోచించావా బయ్యా.
ReplyDeleteహిందువులపై రొహింగ్యాల హత్యాకాండ : అమ్నెస్టీ ఇంటర్నేషనల్
ReplyDeleteఅమ్నెస్టీ ఇంటర్నేషనల్ అత్యంత దారుణమైన, హృదయవిదారకమైన అంశాలను వెల్లడించింది. రొహింగ్యా ముస్లిం ఉగ్రవాదం నిజ రూపాన్ని బయటపెట్టింది.http://www.andhrajyothy.com/Artical.aspx?SID=582671