13 May 2018

అంబేద్కర్ కు అండగా నిజాం ..

*అంబేద్కర్ కు అండగా నిల్చిన నిజాం ప్రభుత్వం..
*అంబేద్కర్ పోరాటం చేసిన మరఠ్వాడా విశ్వవిద్యాలయ ఏర్పాటు పై స్పందించిన నిజాం..నిర్మాణానికి ఆర్దిక సహాయం..
*1932 లో మొట్టమొదటిసారిగా హైద్రాబాద్ లో పర్యటించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
*నిజాం ప్రభుత్వ 72వ విదేశీ సంబంధాల సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన అంబేద్కర్ ..
*దళిత అభ్యున్నతి కోసం అంబేద్కర్ విన్నపానికి 15 వేల రూపాయలు నిధులు అందజేసిన నిజాం సర్కార్..
*1932 నుంచి మూడేళ్ల వరకు ప్రతి నెల 500 రూపాయల గ్రాంట్ విడుదల చేసిన నిజాం ప్రభుత్వం..
*దళితుల అభ్యున్నతికి క్రుషిచేసిన నిజాం ప్రభుత్వాన్ని కొనియాడిన అంబేద్కర్
*హైద్రాబాద్ ప్రభుత్వ కార్యదర్శి సర్ అక్బర్ హైదరీ..అంబేద్కర్ స్నేహంతో నైజాం రాజ్యంలో దళితు ఉద్యమాలకు నిజాం ప్రభుత్వ అండదండలు..
*కమ్యూనిస్టులు..పలు సంస్దల విషప్రచారంతో కాలగర్బంలో కలిసిన నిజాం ఔదార్యం.. మంచితనం..

నిజాం రాజు అనగానే  నిరంకుశుడు ..రాక్షసుడని ఆయన పాలన అనగానే ఆరాచక పాలన..దోపిడి..దౌర్జన్యం అన్న భావం కల్గుతోంది.నిజాం కు వ్యతిరేకంగా ఆనాటి కమ్యూనిస్టులు చేసిన ప్రచారంతో ఆ భావం ఇంకా ఉంది.ఎంతో పాలనాదక్షుడిగా పేరున్న 7 నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చివరి రెండున్నరేళ్ల పాలనలో జరిగిన సంఘటనలను ప్రచారం చేసిన సంస్దలు , పార్టీలు అంతకు ముందు ఆయన చేసిన మంచి పనులకు గౌరవం ఇవ్వలేదు.నిరంకుశుడు దుర్మార్గుడు అన్న మాటల్లో వాస్తవం లేదన్నది చరిత్ర.. కొందరు కాదని వాదించినా..మూమ్మాటికి నిజం. ఎందరో విద్యార్దులకు అండగా నిలిచిన మంచిమనిషి నిజాం..భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు అండగా నిల్చిన నిజాం దాత్రుత్వం తెలుసుకునే ప్రయత్నం..కమ్యూనిస్టుల హిందూ అతివాదుల వ్యతిరేక ప్రచారంతో నిజాం చేసిన మంచి పనులు మరుగున పడ్డాయి.దళిత ఉద్యమానికి తానున్నంటూ ముందుకొచ్చిన నిజాం అంబేద్కర్ కు చేసిన సహాయం ఆ రోజుల్లో ఏనలేనిది.


1946-1948 మద్య కాలంలో శాంతి భద్రతల విషయంలో నిజాం ప్రభుత్వాన్ని నిందిచాల్సిందే.పదవి లాలసతో సరైన రీతిలో స్పందిచకపోవడం నిజాం ప్రభుత్వ తప్పిదం.తన రాచరికపు పాలనలో ఎన్నో మంచి పనులు చేసిన నిజాం దళితుల పట్ల సానూకూలంగా ఉన్న విషయాన్ని యాది చేసుకోవాల్సిన అవసరం ఉంది..దళిత బహూజనుల విషయంలో వారి విద్యావికాసానికి చేసిన క్రుషిని గుర్తించాల్సిన అవసరం ఉంది.అంబేద్కర్ ను విదేశాలకు పంపించి విద్య నేర్పించిన బరోడా మహారాజు మాదిరిగానే నిజాం సర్కార్ కూడా అంబేద్కర్ కు అండగా నిల్చింది.ఆర్దికంగా ఆదుకుంది.నిజానికి అంబేద్కర్ కు హైద్రాబాద్ రాజ్యానికి అవినాభావ సంబంధం ఉంది.హైద్రాబాద్ రాజ్యంలో భాగమైన మరఠ్వాడా ప్రాంతంలో విద్యావ్యాప్తికై అంబేద్కర్ చేసిన క్రుషి గణనీయమైంది.అక్కడ మిలింద్ కళాశాలను ఏర్పాటు చేశారు.ఔరంగబాద్ లో అంబేద్కర్ వేసిన పునాదులతోనే మరఠ్వాడా విశ్వవిద్యాలయం ఏర్పాటైంది.1978 లో విద్యార్దులు చేసిన ఆందోళనలతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరఠ్వాడడా విశ్వవిద్యాలయంగా మార్చారు.మిలింద్ కళాశాల ఏర్పాటుకు నిజాం ప్రభుత్వం ఆర్దికంగా సహాయం చేసింది.


1932 లోనే నిజాం ప్రభుత్వం అంబేద్కర్ ను భారతదేశ దళిత సామాజిక వర్గం ప్రతినిధిగా గుర్తిస్తూ ఆయన చేస్తున్న ఉద్యమాలకు మద్దతుగా నిల్చేందుకు నిజాం ప్రభుత్వం అండగా నిల్చింది.అంబేద్కర్ మొట్టమొదటి సారి 1932 లో హైద్రాబాద్ లో పర్యటించారు.1932 సెప్టెంబర్ 3న జరిగిన హైద్రాబాద్ రాజ్య 72 వ విదేశీ సంబంధాల కమిటీ సమావేశంలో అంబేద్కర్ ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు.ఈ సమావేశంలో సర్ అక్బర్ హైదరీ , ఆర్.సీ ట్రెంచ్ , ఎం.ఎస్.ఏ హైదరీ , కె.పి మున్షీ పాల్గొన్నారు.దళితుల అభ్యున్నతి కోసం నిజాం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అంబేద్కర్ కొనియాడారు.దళిత బహూజనుల అభ్యున్నతి కోసం తాము చేస్తున్న కార్యక్రమాల విస్తరణ కోసం నిజాం ప్రభుత్వం  సహాయం చేయాలని కోరారు. 2లక్షల రూపాయల గ్రాంట్ ను విడుదల చేయాలని కోరారు.అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న నిజాం ప్రభుత్వం 15 వేల రూపాలయ గ్రాంట్ ను విడుదల చేసింది.1932 నుంచి 3 సంవత్సరాల పాటు నెలకు 500 రూపాయల గ్రాంట్ ను విడుదల చేసింది.నిజాం ప్రభుత్వ కార్యదర్శి సర్ అక్బర్ హైదరీ కుమారుడు బొంబాయిలో అంబేధ్కర్ ను కలుసుకుని 15 వేల రూపాయల చెక్కును ,  నెల వారి గ్రాంట్ 500 చెక్కును అందజేశారు.క్రుతజ్ఘతగా అంబేద్కర్ నిజాం ప్రభుత్వ పొలిటికల్ సభ్యుడైన నవాబ్ మెహదీయర్ జంగ్ కు 1932 అక్టోబర్ 4న ఉత్తరం రాశారు.అంబేద్కర్ కు హైద్రాబాద్ కు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది.

అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో హైద్రాబాద్ రాజ్య ప్రతినిధిగా సర్ అక్బర్ హైదరీ పాల్గొన్నారు.హైద్రాబాద్ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ప్రజాహిత కార్యక్రమాలను ప్రసంశించారు.అక్బర్ హైదరీ అంబేధ్కర్ ల కలయికతో హైద్రాబాద్ ప్రభుత్వం అంబేధ్కర్ ఉద్యమాలకు అండగా నిల్చేందుకు ఉపకరించింది.మహాత్మాగాంధీ సంస్దానాల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని ఆదేశించారు. అదే సమయంలో అంబేద్కర్ షెడ్యూల్ క్యాస్ట్ ఫెఢరేషన్ కార్యకలఫా లను హైద్రాబాద్ లో నిర్వహించారు.అందుకే హైద్రాబాద్ రాజ్యంలో దళితుల్లో రాజకీయ చైతన్యం  అధికంగా ఉండడానికి  ఓ కారణమైంది.

అంబేద్కర్ స్పూర్తితో హైద్రాబాద్ లో బి.శ్యామ్ సుందర్ , బి.ఎస్.వెంకటరావు , ఈశ్వరీబాయి, రాజమణీదేవి , కె.ఆర్ వీరాస్వామి ,  జె.హెచ్ సుబ్బయ్య   , ఎం.ఆర్ క్రిష్ణ లాంటి వారు అనేక ఉద్యమాలు నిర్వహించారు. ఆ తర్వాత కాలంలో వీరందరూ చట్టసభలకు ఎన్నికయ్యారు.హైద్రాబాద్ రాజ్యంలో దళితుల రాజకీయ చైతన్యానికి    పునాది వేయడమే కాకుండా  , నిజాం ప్రభుత్వంతో సఖ్యతతో ఉండి తమ హక్కులను దక్కించుకున్న చరిత్ర వెలుగులోకి రావాల్సి ఉంది.

నిజాం ప్రభుత్వం పై కొందరు చేస్తున్న విష ప్రచారం తో మంచి మరుగున పడింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేధ్కర్ కు అండగా నిల్చిన నిజాం ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం చేసిన ప్రజాహిత కార్యక్రమాలను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ చేసిన పోరాటానికి నిదర్శంగా తమ రాజ్యంలో భాగమైన  మరఠ్వాడా విశ్వవిద్యాలయా నిర్మాణానికి  ఆర్దిక చేసిన ఘనత నిజాం కే దక్కింది. అంబేద్కర్ జయంతి సందర్బంగా  నిజాం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు అండగా నిల్చిన విషయాన్ని మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.1 comment:

  1. Sir can you condemn in equal unequivocal terms the atrocities committed by Nizam and rajakars. Or you are of the opinion that he did no such thing.

    ReplyDelete