ఉపవాసం(రోజా) ఇస్లాం యొక్క ఐదు
మూలస్తంభాలలో ఒకటి. ఇస్లాం యొక్క ఐదు మూలస్తంభాలు 1) ఒకే దేవుని( అల్లాహ్) అందు విశ్వసముంచుట మరియు మహమ్మద్ ప్రవక్తను అంతిమ ప్రవక్తగా
విశ్వసించుట.2)రోజు ఐదు సార్లు
నమాజ్ చేయుట 3)జకాత్ చెల్లించుట 4)రంజాన్
నెల అందు ఉపావాసం ఉండుట 5)హజ్
యాత్ర చేయుట.
విశ్వాసులు రమదాన్ నెలలో నిగ్రహంతో గడుపుతారు. ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదవ నెల అయిన రమదాన్లో తెల్లవారుజాము(సేహ్రి
) నుండి సాయంత్రం(ఇఫ్తార్) వరకు ముస్లింలు ఉపవాసం ఉండటం పవిత్రంగా భావిస్తారు.
ఉపవాసం యొక్క లక్ష్యం తక్కువ అదృష్టవంతులైన
ప్రజల బాధను గుర్తుచేయట మరియు విశ్వాసులను అల్లాహ్ దగ్గరికి తీసుకురావడము. పవిత్ర
గ్రంథం దివ్య ఖుర్ఆన్ లో ప్రస్తావించినట్లు ముస్లింలు ఈ నెలలో పేదవారికి దానం
చేస్తారు మరియు ఆకలితో ఉన్నవారికి తిండి
పెడతారు.
రమదాన్లో ఉపవాసం ఇస్లాం యొక్క ఐదు
స్తంభాలలో ఒకటి. రమదాన్ నెల నిగ్రహంతో కూడిన ఒక స్వీయ-వ్యాయామం లాంటిది. ఇది ఉదయం కాఫీ, ధూమపానం మరియు
మధ్యాహ్నం అల్పాహారం వంటి ప్రేరణలను వదులుకోవటం ద్వారా భౌతికంగా మరియు
ఆధ్యాత్మికంగా అల్లాహ్ కు సన్నిహితమయ్యే మార్గంగా చూడబడుతుంది.
ముస్లిమ్స్ రమదాన్
నెల మొత్తం ఉదయం నుండి సాయంత్రం వరకు తినడం మరియు తాగడం నుండి దూరంగా ఉంటారు.
జీవిత భాగస్వాములతో రోజులో లైంగిక సంబంధం
నుండి దూరంగా ఉంటారు మరియు ముస్లింలు కోపం, నిందారోపణ, పోరాటo, అసూయ, చాడీలు లేదా ఉసుబోక కబుర్లలో పాల్గొనరు.
రమదన్ మాసం లో ముస్లింలు ఐదు పూటల నమాజ్, దివ్య ఖుర్ఆన్
పఠనం తో గడుపుతారు. ఉపవాసం ప్రారంభించడానికి ముందు ముస్లింలు సాధారణంగా "సేహ్రి " భోజనం తో రోజా ప్రారంబిస్తారు. .
ఉపవాస విరమణ ఇఫ్తార్ తో ముగిస్తారు.
ఇఫ్తార్ వివిధ రకాల పండ్లు, మరియు ఇతర రుచికరమైన పదార్ధాల శ్రేణిని
కలిగి ఉంటుంది, వీటిని కుటుంబ సభ్యుల మధ్య పంచుకుంటారు. ఇది
ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే కార్యక్రమం, మరియు దాని కోసం సన్నాహాలు మధ్యాహ్నం నుండి ప్రారంభమవుతాయి.
అరబ్ ప్రపంచం అంతటా, ఆప్రికాట్ల నుండి తయారు చేసిన రసాలు రమదాన్ ఇఫ్తార్ లో ప్రధానమైనవి.
దక్షిణ ఆసియా మరియు టర్కీలలో, పెరుగు ఆధారిత
పానీయాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ముస్లిం ప్రపంచం అంతటా, మసీదులు మరియు సహాయ సంస్థలు రమాదాన్
ప్రతి రాత్రి "ఉచిత" భోజనం తినడానికి ప్రజల కోసం టేబుల్స్ మరియు డేరాలు
ఏర్పాటు చేస్తారు.
పవిత్ర రమదాన్ నెలలో ఉపవాసం అందరు తప్పక పాటించవలసిన అవసరం
ఉందని ఖుర్ఆన్ చెబుతున్నప్పటికీ, కొన్ని
మినహాయింపులకు కూడా అవకాశం కల్పిస్తుంది. పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్న పురుషులు మరియు నెలసరి
(periods)ఉన్న స్త్రీలకు మినహాయింపు
కలదు.
రమదాన్లో ముస్లింలు సాధారణంగా ఒకరినొకరు "రమదాన్
ముబారక్" అని గ్రీట్ చేస్తారు మరియు సున్ని ముస్లింలు ప్రార్ధనలు
చేయటానికి రాత్రికి మసీదుకి వెళతారు, ఈ అభ్యాసంను "తారవీ" అని పిలుస్తారు. ఈజిప్టులో, "ఫానోస్" అని పిలవబడే లాంతరు, తరచుగా ఇఫ్తార్ టేబుల్ మద్యలో ఉంచుతారు.
కొన్నిసార్లు రమదాన్లో దుకాణాల కిటికిలలో మరియు బాల్కనీల్లో ఈ లాంతర్లను చూడవచ్చు.
గల్ఫ్ దేశాలలో, ధనవంతులైన షేక్ లు "మజ్లిస్" ను కలిగి ఉంటారు, అక్కడ ప్రజలందరికీ రాత్రి భోజనం ఉచితంగా
కల్పిస్తారు. అనేక రెస్టారెంట్లు కూడా వాటి తలుపులు ఉదయం వేళ వరకు తెరిచి ఉంచుతాయి
మరియు విలాసవంతమైన భోజనాలను ఉచితంగా అందిస్తాయి.
సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు విలాసవంతమైన మరియు ఖరీదైన ఆహారం అందించే
ఐదు నక్షత్రాల హోటళ్ళలో రమదాన్ గుడారాలు ఎక్కువగా కన్పిస్తాయి.
రంజాన్ సందర్భంగా సాయంత్రం టెలివిజన్ ప్రదర్శనలు, పాకిస్థాన్లో ప్రత్యక్ష ప్రదర్శనలు,
నిర్వహించబడతాయి. అరబ్ ప్రపంచంలో, నెలవారీ సోప్
ఒపెరాస్ ప్రదర్శించ బడతాయి. ఈజిప్ట్ లో
ప్రముఖ టి.వి.నటులు తమ లైవ్ ప్రదర్సనలతో ప్రేక్షకులను ఆనందపరుస్తారు.
ముస్లింలు "లైలతుల్ -ఖదర్" లేదా "ది డెస్టినీ నైట్" తీవ్ర ఆరాధనతో గడుపుతారు. ఈ రాత్రి రమదాన్ యొక్క చివరి పది రాత్రులలో ఒకటి. ముస్లింలు ఈ రాత్రి ప్రవక్త ముహమ్మద్ (స) కోసం జిబ్రెల్ దేవదూతను అల్లాహ్ పంపాడని మరియు దివ్య ఖుర్ఆన్ యొక్క మొదటి ఆయత్ ను అవతరింప జేసినట్లు నమ్ముతారు
కొంతమంది ముస్లింలు అంతిమ పది దినాలలో తమ సమయాన్ని(ఏతికాఫ్) మసీదులో గడుపుతారు
.
ఈద్ అల్-ఫితర్ అని పిలవబడే సెలవు దినం రమదాన్ మాసం యొక్క ముగింపున
జరుపుకుంటారు. పిల్లలు నూతన వస్త్రాలు, బహుమతులు మరియు నగదులను అందుకుంటారు.
dear sir very good blog and very good content
ReplyDeleteTelugu News