భారతదేశంలో హిందువుల తరువాత ముస్లింలు రెండవ అతిపెద్ద మత వర్గము
మరియు వీరు మొత్తం దేశ జనాభాలో పదిహేను శాతం మంది ఉన్నారు. భారత దేశం
లోని ముస్లింలు సంఖ్య దృష్ట్యా ఇండోనేషియా తరువాత రెండో స్థానంలో ఉన్నారు. జమ్మూ- కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, అస్సాం ,కేరళ మరియు భారత దేశం లోని వివిధ
రాష్ట్రాలలో మరియు దేశం లోని అన్ని ప్రాంతాలలో ముస్లిమ్స్ ఉన్నారు.
కానీ భారతదేశంలోని వివిధ ప్రభుత్వ విభాగాలలో ప్రాతినిధ్య
ప్రకారం చూస్తే వారు చాలా తక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అత్యధిక నిర్ణయం
తీసుకునే మరియు అమలు పరిచే సంస్థలలో వారు 02 నుండి 03 శాతం ఉన్నారు. న్యాయస్థానములలో
07 శాతం, వివిధ రాష్ట్ర పోలీసు దళాలలో 04 శాతం
మంది ఉన్నారు. రాజకీయాల్లో వారు 04 నుంచి 05 శాతం ప్రాతినిధ్యంను కలిగి ఉన్నారు.
ప్రస్తుత ప్రజాస్వామ్యం ప్రపంచంలో చట్టబద్దమైన సంస్థలు, కార్యనిర్వాహక వర్గ సంస్థలు, న్యాయవ్యవస్థ, భద్రతా దళాలు, సైన్యం మరియు ఇంటెలిజెన్స్ ఏజెన్సీల వంటి కొన్ని విభాగాలలో
అధికారం ఉంది. మరియు ఈ విభాగాలలో ప్రాతినిద్యం వహించడానికి ఆధునిక విద్య అనేది
ఎంతో అవసరం. కానీ భారతదేశంలో ముస్లిం సమాజము పెద్ద సంఖ్యలో విద్యాసంస్థలను కలిగి లేదు మరియు
వారి సమాజ విద్యవసరాలను తీర్చడానికి మరియు
సమకాలీన ఆధునిక విద్య కోసం అలీగఢ్, జామియా మిలియా, మనూ వంటి కొన్ని ఉన్నత విద్యాసంస్థలు మాత్రమే వారికి
అందుబాటులో ఉన్నాయి
ఆలిగడ్ ముస్లిం యూనివర్శిటీ (AMU), జామియా మిలియా ఇస్లామియా (JMI) న్యూఢిల్లీ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ (MANUU), హైదరాబాద్ వంటి ఉన్నత విద్య సంస్థలను
మైనారిటీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసారు. భారతదేశంలోని రాజ్యాంగ నిబంధనల ప్రకారం, మైనారిటీ సంస్థల హక్కుల కోసం సుప్రీం
కోర్టులో AMU మరియు జామియా ఇప్పటికీ కేసులను
ఎదుర్కొంటున్నాయి.
వీటితో పాటు, మదరసాల రూపంలో
ముస్లింలు సాంప్రదాయ విద్యాలయాలను కలిగి ఉన్నారు, దేశంలోని ప్రతి మూలలో ఇవి విస్తృతంగా వ్యాప్తి
చెందుతున్నాయి, కానీ అవి తమ పాఠ్య ప్రణాళికలో సమకాలీన
ప్రాపంచిక విజ్ఞాన విద్యను జోడించటానికి ఇష్టపడుట లేదు. వాటి ఈ వైఖరి కారణంగా
చాలామంది ముస్లింలు ఈ విద్యాసంస్థలకు తమ పిల్లలను పంపించటానికి విముఖంగా ఉన్నారు.
భారతదేశంలో ముస్లింల విద్యా స్థితిగతులను అంచనా వేయటానికి ఏర్పడిన సచార్ కమిటీ నివేదిక ప్రకారం, ముస్లిం విద్యార్ధులలో కేవలం 04 శాతం మంది మాత్రమే తమ తల్లిదండ్రుల పేదరికం
వలన మదరసాలలో విద్యాబ్యాసం చేస్తున్నారు.
భారతదేశంలో మోడల్ పాఠశాలలు (జిల్లా స్థాయిలో), జవహర్ నవోదయ్ స్కూల్ (గ్రామీణ
ప్రాంతాల్లో), సిబిఎస్ఇకి అనుబంధంగా ఉన్న వివిధ
ప్రేవేట్ పబ్లిక్ స్కూల్స్ మరియు అనేక క్రైస్తవ మిషనరీల కాన్వెంట్ స్కూల్లు వంటి
అనేక మంచి మరియు ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు ఉన్నాయి. అధిక నిరక్షరాస్యత, పేదరికంతో
కారణంగా ముస్లింలకు ఈ నాణ్యత గల పాఠశాలలు అందుబాటులో లేవు
భారతీయ ముస్లింల ఉన్నత విద్యావసరాలను తీర్చడానికి ఆము,
జామియా మను (AMU, Jamia మరియు MANUU ) వంటి విద్యాసంస్థలు ఉన్నాయి, పేద ముస్లింల విద్యా అవసరాలను తీర్చవలసిన
ఈ సంస్థలు తమ స్వంత పరిమితులను కలిగి
ఉన్నాయి.
1947 లో భారతదేశ విభజన అనంతరం, దానికి బాద్యులు ముస్లింలు అనే దోషపూరితమైన
నిందను ఈ దేశం లోని ముస్లిమ్స్ భరించాల్సి వచ్చింది. మరియు దాదాపు ప్రతి
ప్రభుత్వమూ మైనారిటీ వర్గానికి తగిన వాటాను ఇవ్వడo లో ఉద్దేశపూర్వకంగా విఫలమయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ
ఆర్థిక వ్యవస్థ తయారీ, సేవా రంగాలకు ప్రాధాన్యత ఇస్తుంది ఇందుకు
ప్రొఫెషనల్ విద్య తోడ్పడుతుంది. ప్రొఫెషనల్ విద్యను పొందడం లో
భారతదేశపు ముస్లింలు ఘోరంగా వెనుక బడినారు. .
గల్ఫ్ దేశాలలో చమురు అన్వేషణ తరువాత చాలా అవకాశాలు ముస్లింలకు
అందుబాటులోకి వచ్చాయి, కానీ తక్కువ విద్య
poor education కారణంగా, భారతీయ ముస్లింలు
ఆ అవకాశాలను పొందలేక పోయినారు. వారు అక్కడ మాన్యువల్ లేబర్, డ్రైవర్, మరియు ప్లంబర్లు లేదా కొన్ని సెమీ నైపుణ్యం కలిగిన
వృత్తులలో నియమించబడ్డారు.
భారతదేశంలో 1991 లో ప్రారంభం అయిన ఆర్థిక సంస్కరణలు అనేక మల్టీ
నేషనల్/విదేశీ సంస్థల ప్రవేశంకు మార్గం
సుగమం చేసింది. వారు ప్రొఫెషినల్ విద్య కు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ కూడా భారతీయ ముస్లింలు ఆర్థిక సరళీకరణ
ప్రయోజనాలను పొందలేకపోయారు. తొలినుంచి భారతదేశంలో సాంప్రదాయ కళలలో(arts) ముస్లింలు మంచి ప్రవేశం కలిగి ఉన్నా, ఆర్థిక సంస్కరణల కారణంగా పేలవంగా
విఫలమయ్యారు. ఇప్పుడు భారతదేశంలో సాంప్రదాయిక చేతిపనుల
పరిశ్రమ పరిస్థితి నిరాశలో ఉంది.
ఇప్పుడు కావలసినది క్రిస్టియన్ మిషనరీస్ స్కూళ్ళు మరియు
పబ్లిక్ స్కూల్స్ వంటి హయ్యర్ సెకండరి పాఠశాలలను ఏర్పాటు చేయటానికి మరియు నాణ్యమైన
విద్యను భారత దేశం లోని ముస్లిమ్స్ అందరికి అందించటానికి ముస్లిం సమాజం ముందుకు రావాలి. ఉన్నత విద్యను పొందటానికి నాణ్యమైన సెకండరీ విద్య పునాది
వంటిది. ప్రాధమిక విద్య, సెకండరీ విద్య బలంగా
ఉండాలి లేనిచో ఉన్నత విద్య నిరర్ధకం అవుతుంది.
ఇది భారతదేశంలో
ముస్లింలకు అత్యవసర అవసరము. కాని భారతీయ
మాస్ మీడియా ముస్లిం కమ్యూనిటీని ట్రిపుల్ తలాక్, ఉగ్రవాదం, మసీదు-మందిర్ వంటి
సమస్యలపై చర్చలకు ఆకర్షించడంలో బిజీగా
ఉంది. ఇది మైనార్టి కమ్యూనిటీ అవసరాలను ఏమాత్రం సంతృప్తి పరచ జాలదు.
Why don't Muslim intellectuals like you campaign and enlighten to modernise madarsa education. Let them adopt CBSE syllabus.
ReplyDelete