13 May 2018

హైదరాబాద్ గురించి ఆసక్తికరమైన వాస్తవాలు Hyderabad facts:


హైదరాబాద్లోని ప్రదేశాలు మరియు వీధుల పేర్ల వెనుక చరిత్ర మనలో ఎంత మందికి తెలుసు?
హైదరాబాద్ గురించి చరిత్ర నుండి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు ఇక్కడ పొందుపరుస్తున్నాను.

 1) నాంపల్లి:
రజా అలీ ఖాన్, 1670 AD లో నిజాం రాజ్యం  యొక్క దివాన్. అతని బిరుదు  'నెఖ్ నామ్ ఖాన్' ఒక జాగీర్ అతనికి ఇవ్వబడింది. అది  నెఖ్-నాంపల్లి గా  పిలువబడేది. క్రమoగా ఇది 'నాంపల్లి' గా మారింది.

2) బేగం పెట్:
నిజాం II యొక్క కుమార్తె బషీరునిసా బేగం . ఈమె పైగా (Paigah) కులీన వంశజుని వివాహం చేసుకున్నారు. ఆమె కట్నం లో భూములు అందుకుంది. ఈ గ్రామం బెగంపేట్ అని పిలువబడింది.

3) ఖైరతబాద్:
ఇబ్రహీం కుతుబ్ షా యొక్క కుమార్తె  ఖైరన్నిసా బేగంకు  మంజూరు చేయబడిన జాగీర్ ఖైరతబాద్ అని పిలువబడింది.

4) బేగం బజార్:
వాణిజ్యం కోసం హైదరాబాద్ యొక్క వ్యాపారులకు హమ్దా బేగం (నిజాం అలీ ఖాన్ నిజాముల్ ముల్క్ భార్య) బహుమతిగా ఇచ్చిన భూమి బేగం బజార్ గా  అభివృద్ధి చేయబడింది.
 
5) సుల్తాన్ బజార్:
1933 తరువాత, రెసిడెన్సీ బజార్ను సుల్తాన్ బజార్ గా మార్చారు, ఈ ప్రాంతాలు బ్రిటీష్ వారు (రెసిడెన్సీ) నిజాంకు తిరిగి ఇచ్చారు..

6) అఫ్జల్ గుంజ్:
5వ నిజాం అఫ్జల్ ఉద్  దౌలా (Afzalud Dawlah) వాణిజ్యం కోసం ధాన్యం వ్యాపారులకు  భూమి బహుమతిగా ఇచ్చిన స్థలం.   స్థలం కు  అఫ్జల్ గుంజ్ అని పేరు పెట్టారు.

7) సికింద్రాబాద్:
ఈ ప్రాంతం కు సికందర్ ఝా (1806) (III వ నిజం) పేరు పెట్టారు. బ్రిటిష్ దళాలు నివసించిన గ్రామం.

8) మా సాబా కా  తలాబ్:
ఖులీ కుతుబ్ షా-VI యొక్క భార్య హాయత్ బక్షి బేగంను మా సాహెబా అని పిలుస్తారు. మల్లెపల్లి గ్రామము యొక్క భూములను సాగుచేయటానికి ఆమె నిర్మించిన చెరువు  మా-సాహబా -కా -తలాబ్ అని పిలిచేవారు. చివరకు ఇది మాసాబ్ ట్యాంక్ అని పిలువబడింది.

9) కడవా  సాహెబ్ కి గల్లి (లేన్):
ఎల్లప్పుడూ కోపంతో ఉంటూ ఇతరుల పట్ల చెడు గా మాట్లేడే    ఒక వ్యక్తి పేర ఈ వీధికి ఆ పేరువచ్చింది.  ఈ లేన్ పాత నగరంలో ఉంది.

10) హిమాయత్ నగర్:
 7వ నిజాం - ఉన్నస్మాన్ అలీ ఖాన్ (1933 )యొక్క పెద్ద కుమారుడు హిమాయత్ అలీ ఖాన్ - అజమ్ ఝా  పేరు పెట్టబడిన కొత్త ప్రాంతం

11) హైదర్ గుడా:
నిజాం యొక్క భార్య వాహిద్ ఉన్నిసా బేగం పేర గతంలో ఉన్న  జాగిర్ గ్రామం యొక్క  మొదటి తాలుక్ దార్  (జిల్లా కలెక్టర్) హైదర్ ఆలీ పేర మరియు యాజమాన్యంలోని భూములు ఉన్న కొత్త ప్రాంతం ను  హైదర్ గుడా  అని పిలిచారు.

12) బషీర్ బాగ్:
సర్ అస్మాన్ ఝా తోట లో బాసిరుద్-దౌలా – అనే పైగా కులీనుడు  ప్యాలెస్ కలిగి ఉన్న ప్రాంతం.

13) సోమాజిగూడ:
ఈ గ్రామంలో భూములు మరియు నివాసం కలిగిన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగి సోనాజీ. సోనాజీ క్రమంగా సోమాజీ అయ్యాడు మరియు ఈ గ్రామం 'సోమాజిగూడ' అని పిలువబడింది. (గుడా అనేది గూడెం నుండి వచ్చింది అనగా ఒక కుగ్రామం అని అర్ధం).

14) మలక్ పెట్ :
అబ్దుల్లా ఖుతుబ్ షా గోల్కొండ రాజు యొక్క సేవకుడు అయిన మాలిక్ యాకోబ్ నివసించిన మార్కెట్ ప్రాంతం. ఆయన పేరు మీద ఆ ప్రాంతం కు మలక్ పెట్  అనే పేరు వచ్చింది.

15) సైదాబాద్:
సయీద్ మీర్ మోమిన్ గోల్కొండ యొక్క దివాన్ (1591) యొక్క జాగిర్ గ్రామం.

16) అబిడ్స్ షాప్:
ఈ ప్రాంతం లో నిజాం (VI) మహబూబ్ అలీ ఖాన్ యొక్క వాలెట్ మరియు సేవకుడు ఇక్కడ తన మొదటి దుకాణాన్ని కలిగి ఉన్నాడు. 

17) సరూర్ నగర్ :
 ఈ ప్రాంతం కు అరుస్తు ఝా హైదరాబాద్ దీవాన్ యొక్క ఉంపుడుగత్తె  సర్వారీ అఫ్జల్ బాయ్ పేరు పెట్టారు, అతను ఆమెకు జాగీర్ను మంజూరు చేసి, ఆమె కోసం ఒక ప్యాలెస్ మరియు గార్డెన్ను నిర్మించాడు

18) డెబిర్ పుర :
అబ్దుల్ సమాద్ పేరు పెట్టబడినది ఈ గ్రామం; అతని బిరుదులు డబీర్-ఉల్ ముల్క్, ఒక గొప్ప కులీన  వ్యక్తి.

19) నూర్ ఖాన్ బజార్:
2వ నిజాం సమయంలో లక్నో నుండి వచ్చిన నూర్ ఖాన్ అభివృద్ధి చేసిన ఒక మార్కెట్.

20) ఏ.సి. గార్డ్స్ A.C.Guards:
లకడి కా పూల్ యొక్క పశ్చిమ ప్రాంతం. వనపర్తి  రాజా యొక్క అబిస్సినియన్ అశ్వికదళ దళాల శిబిరాలు ఉన్న ప్రాంతం. (1910) (అబిస్సినియా ఇథియోపియా యొక్క పురాతన పేరు, ఈస్ట్ ఆఫ్రికన్ దేశం).


No comments:

Post a Comment