15 July 2018

ఫెమినిజం మరియు ఇస్లాం-ఆధునిక దృక్పధం (Feminism and Islam Modern Perspective)




స్త్రీవాదం అనేది లింగ, లింగ గుర్తింపు మరియు వ్యక్తీకరణ ఆధారంగా సమానత్వ సమస్య ను చాటుతుంది.  మహిళా హక్కుల కోసం అనగా స్త్రీలకు  ఓటు హక్కు, ప్రభుత్వ పదవులను చేపట్టు హక్కు, ఆస్తి హక్కు, విద్యను పొందే హక్కు  మరియు వివాహ విషయం  లో సమాన హక్కుల కోసం స్త్రీ వాద ఉద్యమాలు జరిగింది. రేప్, గృహ హింస మరియు లైంగిక వేధింపుల నుండి మహిళలను రక్షించడానికి కూడా స్త్రీవాదులు పనిచేశారు 

ప్రాచీన గ్రీక్ నగర రాజ్యం ఏథెన్సులో, మహిళల హోదా బానిసల కంటే ఎక్కువ కాదని ఎన్సైక్లోపెడియా బ్రిటానికా చెబుతుంది. వారికి ఎటువంటి విద్య లేదు మరియు వారు గృహాల నుండి బయటకు వెళ్ళటానికి అనుమతి లేదు. వారు ఒక వస్తువుగా వ్యవహరించారు. రోమన్స్ లో ఒక మహిళ మొదటి తండ్రి లేదా సోదరుని  యొక్క ఆస్తి మరియు వివాహం చేసుకొన్న  తరువాత ఆమె భర్త ఆస్తి.

ఈవ్ మూలాన ఆడమ్ ఈడెన్ గార్డెన్ ను వదిలి వెళ్ళాడు అని  క్రైస్తవo లో  నమ్మకం. వారు మహిళలను  రెండవ తరగతి మానవులుగా భావించారు. శతాబ్దాలుగా స్త్రీలు ఈ అదోస్థితి ని అనుభవిస్తున్నారు. అనేక ఇతర హక్కులలో పాటు  ఆమెకు  కుటుంబ ఆస్తిలో హక్కు లేదు.

ఇస్లామిక్ కాలంలో మొదటిసారిగా  కుటుంబ మరియు సాంఘిక విషయాల్లో మహిళలకు సమాన హోదా మరియు సమాన హక్కులు ఇవ్వడం జరిగింది. వారు ఆస్తిపై చట్టపరమైన హక్కులు కలిగి ఉన్నారు. ప్రారంభ ఇస్లామిక్ కాలం లో  ముస్లిం మహిళలు జీవితంలోని ప్రతి రంగం లో పాల్గొన్నారు. వారు వ్యాపార స్త్రీలు, కవులు, న్యాయవాదులు, మత నాయకులు మరియు యోధులు.

మరొక వైపు, పశ్చిమ ఫెమినిజం ఇంటి మరియు కుటుంబ బంధాల విచ్ఛేదనకు ఇష్టపడింది. స్త్రీ-పురుషుల మధ్య జీవసంబంధమైన వ్యత్యాసం ఉందని ఒప్పుకోవటానికి నిరాకరిస్తుంది. పశ్చిమ ఫెమినిస్టులు వివాహం అనే సంస్థ రద్దు మరియు పూర్తి, హద్దులేని మహిళల లైంగిక స్వాతంత్ర్యాన్ని డిమాండ్ చేశారు. వారి ప్రకారం, పిల్లల పెంపకం సమాజ  బాధ్యత. వారు అన్ని పాఠశాలలు సహ-విద్యాభ్యాసం కలిగి ఉండాలని మరియు స్త్రీ-పురుషులు స్వేచ్చగా కలసి  ఉండాలను కుంటున్నారు. పని మరియు ఉత్పత్తి యొక్క అన్ని రంగాలలో స్త్రీ-పురుషులు సమానులని మీడియా ప్రచారం చేయాలనీ కోరుకొంటుoది.

పశ్చిమాన ప్రబలం గా ఉన్న స్త్రీవాద భావన క్రమంగా  ముస్లిం ప్రపంచం అంతటా పెరుగుతోంది. స్త్రీవాదులు ఇస్లాం మరియు ఖురాన్ను   తిరిగి వ్యాఖ్యనించాలని కోరుకుంటారు. ముస్లిం స్త్రీవాదులు తమ జీవితాలను ప్రభావితం చేసే వ్యాఖ్యానాలు, నియమాలు మరియు చట్టాలను ప్రభావితం  చేయడానికి మహిళలకు బలాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని చెబుతారు. 

యూసఫ్ ఖరదావి (Yusuf Qaradawi) ప్రకారం  స్త్రీలు నిర్లక్ష్యం లేదా వదిలివేయవలసిన  వారు కాదు. వారి హక్కులు రద్దు చేయరాదు. విద్యావంతులు, ఆలోచనాపరులు, నాయకులు మరియు సంస్కర్తలు మహిళల విషయంలో ఆసక్తి చూపించారు. వారు మహిళలపై జరుగుతున్న అణచివేతను  రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ నాటికి 14 వ శతాబ్దాల  ముందుగానే  ఇస్లాం మహిళలకు అనేక హక్కులు ఇచ్చింది అప్పుడు  ఇతర నాగరికతలు మహిళలను కనీసం మానవులుగా  పరిగణించలేదు. ఇస్లాం ధర్మం మహిళలకు ఇచ్చిన హక్కులు ఈ కాలానికి కూడా సరిపోతాయి. ఖుర్ఆన్ ఇలా చెబుతోంది " స్త్రీ-పురుషులకు  సమాన హక్కులు ఉన్నాయి”. అదే ఆయత్ “పురుషులకు స్త్రీలపై కొంచం ఆధిక్యం ఉన్నది అంటుంది” -ఖురాన్ 2-228. ఇంకా 4:34 లో అల్లాహ్ చెబుతున్నాడు  'పురుషులు స్త్రీలను కాపాడేవారని, వారిని పోషించేవారని'.

ప్రకృతి పరంగా పురుషులు ప్రయోజనం పొందారు  మరియు అది పురుషులకు విజయం లేదా మహిళలకు అవమానకరo కాదు.  ఇప్పుడు ముఖ్య ప్రశ్న పురుషులు సరిగ్గా తమ బాధ్యతలను నిర్వహిస్తున్నారా? పురుషులు వారి విధులను సరిగా నిర్వహించాలేనప్పుడు  అది స్త్రీలను నేరాలకు మరియు అణచివేతకు గురిచేసింది మరియు వారి గౌరవాన్ని మరియు మర్యాదను తగ్గిస్తుంది.


విద్య మరియు కుటుంబాలపై చట్టాలు మధ్యయుగ ఇస్లామిక్ న్యాయ మీమాంసంపై ఆధారపడి ఉన్నాయి. పండితులు ప్రకారం, ఈ న్యాయ మీమాంస రెండు అంశాలపై ఆధారపడి ఉంది: మతపరమైన మరియు సాంస్కృతిక పరమైన. సాంస్కృతిక భాగం కొన్ని ప్రాథమిక సాంఘిక మరియు రాజకీయ ప్రతిపాదనలకు దారితీసింది.

ముస్లిం ప్రపంచంలో పితృస్వామ్యము వారి ఊహల వలన మాత్రమే కాకుండా, పొరుగున ఉన్న బైజాంటైన్ మరియు పెర్షియన్ సామ్రాజ్యాల నుండి గొప్ప ప్రభావాన్ని పొందింది. మొత్తం ప్రపంచం పితృస్వామ్య సంస్థ యొక్క పట్టు లో ఉంది. పితృస్వామ్య శక్తులు ముస్లిం మహిళలను అపరిపక్వ మరియు ఆధారపడిన వ్యక్తులుగా భావిస్తారు.


ఇస్లామిక్ కాలం ప్రారంభంలో ముస్లిం మహిళల ప్రమేయం మరియు సహకారం ఇస్లామిక్ న్యాయ మీమాంసలో ఉంది.  కాని తర్వాత పితృస్వామ్యభావన  దానిని పూర్తిగా తగ్గించింది. ఉసుల్ అల్-ఫిక్ ఇస్లాం ధర్మం మరియు తార్కికం యొక్క ప్రాథమిక సూత్రం. ముస్లిం మహిళలు దానిని అధ్యయనం చేయాలి.

ముస్లిం స్త్రీవాది ఇర్షాద్ మన్జి (Irshad Manji) ప్రకారం మనం పశ్చిమ దేశాలకు  బదులుగా ఇజితాద్ యొక్క ఇస్లామిక్ సాంప్రదాయంపై ఆధారపడాలి.   ప్రతి ఒకరు స్వతంత్ర తార్కికం కలిగి ఉండాలి మరియు పడమటిచే ప్రభావితమైన పండితుల వైఖరి గురించి పూర్తిగా పునరాలోచించాలి.

ఆమె ప్రకారం  ఖుర్ఆన్ మన హృదయం, మన ఆత్మ మరియు మన జీవుల సంస్కరణలకు మూలం. ఖుర్ఆన్ ఇంకా ఇలా చెబుతోంది: 'విశ్వాసులు మీరు  న్యాయంగా వ్యవహరించి, దేవుని ముందు సాక్ష్యమివ్వాల్సిందే, అది  మీకు లేదా మీ తల్లిదండ్రులు లేదా మీ బంధువులకు వ్యతిరేకంగా  ఉన్న”. ఈ భావనే 7 వ శతాబ్దంలోనే కాకుండా, 21 వ శతాబ్దంలోనూ ఇస్లాంను  విప్లవాత్మకమైనదిగా రూపొందించినది.

ఇజ్తెహాద్ కూడా తెలియకుండానే పితృస్వామ్య విలువలతో ప్రభావితమైంది. అంతేకాకుండా, తరువాత ముస్లిం సమాజాలు (ప్రవక్త ముహమ్మద్(స) మాదిరిగా కాకుండా ) ప్రజా జీవితంలో పాల్గొనడానికి మరియు ఇజెహాద్ (Ijtehad) చేయటానికి మహిళలకు అధికారం ఇవ్వలేదు. అది పురుషుల యొక్క సీమ గా మారింది. ఈ పరిస్థితుల్లో మహిళల స్వరం ఒక విష్పర్ (లోగొంతుక) (whisper) వలె మిగిలిపోయింది. మరోవైపు, ఇజ్హెహాదు పురుషులకు మాత్రమే పరిమితమైంది. ముజ్తాహిద్ (Mujtahid) రాజకీయ అధికారుల చేతుల్లో వారి దుష్ప్రవర్తనతో బాధపడింది

ఈ పరిస్థితులలో, మహిళలు తమ హక్కుల కోసం పోరాడటానికి ఎటువంటి అవకాసం లేదు. "మహిళలు  తెలివిలో కొంచెం తక్కువ." అనే ప్రసిద్ధ హదీథు నుండి వచ్చిన ఈ మాటల వలన  చాలా మంది ముస్లిం పురుషులు స్త్రీలను తక్కువగా చూపించారు. రచయిత అజీజ్ అహ్మద్ ముహమ్మద్ అబు ఖలీఫ్, నకిస్ అల్-అక్ల naqis al-aql భావన సందర్భం నుండి వేరు చేయబడిందని మరియు ఖుర్ఆన్ లేదా హదీథులలో పురుషులకన్నా స్త్రీలు  తక్కువగా ఉన్నట్లు సాక్ష్యాలు లేవని అన్నారు.

ఇజ్తేహాదు (Ijtehad) కొరకు అల్లాహ్ మేధో శక్తిని ఇచ్చాడు. వ్యాఖ్యానాలు అప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇవ్వటం జరుగుతుంది. పూర్వ కాలంలో ప్రపంచంలోని అన్ని నాగరికతలు మహిళలకు సమాన హక్కులు ఇవ్వడానికి సిద్ధంగా లేవు, కానీ ఇప్పుడుపరిస్థితి అందుకు  భిన్నమైనది.


ప్రొఫెసర్ అమిన వాదుద్ ప్రకారం సమానత్వం మరియు న్యాయం పై దివ్య ఖురాన్ వివరణ ముస్లింల అభ్యాసం(practice) మరియు  పితృస్వామ్య ప్రభావo చేత  నిర్లక్ష్యం చేయబడినవి.   సాంప్రదాయ ఉలేమా అనైతికత నుండి సమాజాన్ని కాపాడటానికి మరియు ఇంటి బయట సామాజిక పాత్రలను పోషించకుండా స్త్రీలను ఇంట్లో ఉంచమని అన్నది మరియు వారు మహిళలను  అలా అనుమతిస్తే  సామాజిక విచ్ఛిన్నం మరియు పూర్తి విపత్తు ఉంటుంది అన్నారు..


పశ్చిమ దేశాల్లో మహిళలు అనేక రంగాలలో విజయం పొందినప్పటికి అక్కడ   మహిళలు   వ్యాపార వస్తువులు   మరియు లైంగిక జీవులుగా మారారు.  పశ్చిమాన కనుగొనబడిన ఈ  సాంఘిక చీడలు స్త్రీలను  గృహాలలో  నిర్బంధించటానికి ఉలేమాకు తోడ్పడనవి.  ఇస్లాం మరియు షరిఅహ్ నిబంధనల కంటే మహిళల సమస్యలను  ఇతర అంశాలు  మరింత ప్రభావితం చేసినవి.  ముస్లిం మహిళల యొక్క ప్రతిభ, నైపుణ్యాలు మరియు సామర్ధ్యాలు మరింత కట్టుబడి చేయబడినవి.



మౌలానా అబుల్ అ'ల మౌధుడి వంటి ఆధునిక ఇస్లామిస్ట్ పండితులు మహిళలు మొహం కప్పుకోవాలని అన్నారు.  దాదాపు అన్ని సున్నీ మరియు షియా న్యాయ శాస్త్రాలు తమ ముఖాన్ని చూపటానికి మహిళలను అనుమతిస్తాయి. 20 వ శతాబ్దానికి చెందిన దియోబoద్ పండితుడు మౌలానా అష్రఫ్ అలీ తన్వి ఒక మహిళా పేరు వార్తాపత్రికలో కనిపించరాదని పేర్కొన్నారు. అతని ప్రకారం, ఒక ఆదర్శ మహిళ ఎవరంటే ఆమె పొరుగువారికి కూడా ఆమె  ఉనికి గురించి తెలియదు మరియు, అతని ప్రకారం, అమ్మాయిలు మాత్రమే ప్రాథమిక విద్య పొందటానికి అనుమతి ఉంది.  బరెల్వి శాఖ ప్రముఖుడైన అహ్మద్ రజా ఖాన్ మహిళలు పరిగణించదగిన వారు  కాదని భావిస్తారు. ముస్లిం మహిళల స్వరo కూడా విన్పించరాదని కొందరు ఉలేమాలు  చెబుతున్నారు. మహిళల పట్ల ఉలేమాల అలాంటి విధానాలు సమాజంలో మహిళల పాత్రలను అంగీకరించిన తొలి ఉలేమాతో విరుద్ధంగా ఉన్నాయి.


ఈ మితిమీరిన విపరీతమైన రక్షణాత్మకత యొక్క మూలం చరిత్రలో ఉంది. మధ్యయుగ కాలంలో ఖచ్చితంగా 1258 C.E లో, టాటర్స్ ముస్లిం భూభాగాలను ముట్టడించి వాటిని నాశనం చేసారు. అప్పటి ముస్లిం సమాజం ను  ఏకీకృతం చేయటానికి అనేక మంది ముస్లిం పండితులు స్త్రీలు చదవరాదని, రాయరాదని ఫత్వాలను జారీ చేసారు. ప్రారంభ ఇస్లామిక్  కాలంలో ప్రత్యేకమైన ప్రతిభావంతులైన అక్షరాస్యులైన స్త్రీలు ఉన్నారన్నది వాస్తవం. ఇది ఆరు వందల సంవత్సరాల పాటు అమలులో ఉన్నది మరియు 19 వ శతాబ్దంలో ఫిరంగి మహల్కు చెందిన మౌలానా అబ్దుల్ హేయే మునుపటి భావనకు వ్యతిరేకం గా  మహిళలు చదువుకునేందుకు మరియు వ్రాయడానికి హక్కు కలిగి ఉన్నారని  ఫత్వా ఇచ్చారు.


మనము ఖుర్ఆన్ మరియు హదీసుల వెలుగులో సమస్యను చూసినట్లయితే ఇస్లాం మహిళల శారీరక కదలికను పరిమితం చేయదు. సామాజిక స్థాయిలో, కొన్ని పరిస్థితులలో మహిళలు కొన్ని పరిమితులను అనుసరించాలని ఇస్లాం కోరుతుంది. ప్రారంభ ఇస్లామిక్ కాలాల్లో మహిళల సామాజిక పాత్రలు గుర్తించబడ్డాయి. వారు ఇళ్ళు నాలుగు గోడలకు  పరిమితమై లేరు. రెండవ ఖలీఫా ఉమర్ షియా బింట్ అబ్దుల్లా అల్-అడ్వియా ను  మదీనా మార్కెట్ (ఇస్లామిక్ కాలిఫెట్ రాజధాని) సూపరింటెండెంట్ గా  నియమించారు.  ప్రవక్త ముహమ్మద్ (స) సమయంలో, మసీదులలో ప్రార్థన చేయటానికి మహిళలను   అనుమతించారు మరియు వారు ముస్లిం స్త్రీలు యుద్దభూమిలో యోధులకు  సహాయం చేసారు. స్త్రీలు ప్రవక్త ముహమ్మద్ (స) ఉపదేశాలకు హాజరయ్యారు మరియు తమ ప్రశ్న లకు సమాధానం పొందేవారు.

ఖలీఫా ఉమర్ ఒక ఉపన్యాసం చేస్తున్నప్పుడు అతనిని ఒక  స్త్రీ సరిదిద్దినది  మరియు అతను తన తప్పుని అంగీకరించాడు. మహిళల మనస్సులు మరియు స్వరాలు భదించబడినవి కావు అని ఈ సంఘటనలు చూపిస్తున్నాయి. చాలా హదీసులలో స్త్రీ-పురుషులు తమ ముఖాలను ఒకరినోకరు చూసుకొన్నారు.విశ్వాసుల తల్లులు  పర్దాను పాటించారు   అయితే ప్రవక్త(స) యొక్క పురుష సహచరులు వారి నుండి విద్యను పొందటానికి అనుమతించ బడినారు. అయేషా(ర), ప్రవక్త(స) యొక్క భార్యలలో అతి చిన్నది మరియు ఆమె హదీసు విద్యలో నిపుణులు. ఆమె విద్యార్ధులలో  చాలా మంది మగ విద్యార్థులు  ఉన్నారు.  

దివ్య ఖుర్ఆన్ లో (9:71) 'విశ్వాసులైన  పురుషులు మరియు స్త్రీలు, మరొకరికి రక్షణగా ఉంటారు, వారు మేలు చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు. చెడు చేయవద్దు అని నిరోదిస్తారు” అని పేర్కొన్నారు. వారు  పరస్పర సహకారంతో కలిసి పనిచేయాలి  మరియు వారిద్దరూ వివిధ సామాజిక పాత్రలను నిర్వహిస్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు అతని సహచరులు మహిళలకు వ్యతిరేకంగా ఉన్న పక్షపాత భావన  ను తొలగించడానికి ప్రయత్నించారు

ముస్లిం మహిళలు ఖుర్ఆన్ మరియు హదీసులు స్వయంగా చదివి, వారి హక్కుల గురించి తెలుసుకోవాలి మరియు దాని ప్రకారం తమ జీవితాలు గడపాలి.


No comments:

Post a Comment