.
ఇతడిని ఆల్ఫారబియస్ అని కూడా పిలుస్తారు. అరబ్ శాస్త్రవేత్త మరియు తత్వవేత్త మరియు మధ్యయుగ ప్రముఖ ఆలోచనాపరులలో ఒకరిగా పరిగణించారు. అరబిక్ లో అల్-ముఅల్లిం అల్-థానీగా పిలువబడే అబూ నసర్ ముహమ్మద్ అల-ఫరాబి ను “ఇబ్న్ సిన మరియు అవర్రోస్లతో(Averroes) పాటు ముస్లింలలో పెర్పిటెటిక్స్(Peripatetics) లేదా హేతువాది” గా గుర్తించారు. ప్లాటో మరియు అరిస్టాటిల్ సిద్ధాంతాలను ముస్లిం ప్రపంచానికి పరిచయం చేయడం లో ఒక ముఖ్యమైన పాత్ర వహించిన ఇస్లామిక్ మేధావి అబూ నసరు ముహమ్మద్ అల్-ఫరాబి.
అతను తన పుస్తకం
"రెండు తత్వవేత్తల ఆలోచనలు సేకరించడం" ("The gathering of the ideas of the two
philosophers") లో ప్లేటో మరియు అరిస్టాటిల్ యొక్క ఆలోచనలను
సేకరించేందుకు ప్రయత్నించాడు. ఫరాబి ప్రపంచం లో రెండవ ఉపాధ్యాయుడు (“the second master" of philosophy) (అరిస్టాటిల్
మొదటివాడు) మరియు ప్రపంచం యొక్క గొప్ప తత్వవేత్తలలో ఒకడుగా పిలువబడతాడు. అతని
రచనలు అలెగ్జాండ్రియన్ తాత్విక ఆలోచనను పునరుద్ధరించడం మరియు నూతన రూపు
ఇవ్వడానికి అంకితం చేయబడినవి.
అల్-ఫరాబి తన ప్రాధమిక విద్యను ఫరాబ్ మరియు బుఖారాలో పూర్తి చేసాడు, కాని తరువాత అతను బాగ్దాద్ కు ఉన్నత విద్య కోసం వెళ్ళాడు, అక్కడ అతను చాలాకాలం పాటు చదువుకున్నాడు
మరియు పని చేశాడు. ఈ కాలంలో అతను పలు భాషలపై అలాగే విజ్ఞాన మరియు సాంకేతిక
శాస్త్రాలపై పట్టు సాధించాడు. తత్వశాస్త్రం, తార్కికం, తర్కశాస్త్రం, సామాజిక శాస్త్రం, వైద్యశాస్త్రం, గణితం మరియు సంగీతo అద్యయనం చేసిన అతను ప్రధానoగా తత్వశాస్త్రం, తర్కం మరియు సామాజిక శాస్త్రంలో ఎన్సైక్లోపెడిస్ట్ గా నిలుస్తాడు
ఒక తత్వవేత్తగా, ఫరాబి వేదాంతం నుండి మత శాస్త్రం ను వేరు
చేసాడు. మధ్యయుగాల లో అతని చే ప్రభావితం కాని ముస్లిం మరియు క్రైస్తవ
తత్వవేత్తని గుర్తించడం కష్టం. సమతుల్య తెలివితేటల ద్వారా ప్రపంచాన్ని సృష్టించిన సర్వేశ్వరుని
(Supreme Being)
అందు అతను విశ్వసించాడు. హేతుబద్ధమైన అభివృద్ధి
అమరత్వం ఉన్న మానవుని యొక్క అంతిమ ఉన్నత లక్ష్యంగా వివరించాడు.
ఇతర ఇస్లామిక్ తత్వవేత్తలతో పోలిస్తే
అతను రాజకీయ సిద్ధాంతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అల్-ఫరాబి ప్లాటోనిక్
శైలిలో పాలకుడికి అవసరమైన ఉత్తమ లక్షణాలు
వివరించాడు. అల్-ఫరాబి గ్రీకు తత్వవేత్తల వలే పాలకుడు ఉత్తమ విలువలు కలిగి ఉండాలని
అన్నాడు. ఫరబీ మధ్య యుగాల మేధావుల కోసం స్ఫూర్తి గా పనిచేశాడు మరియు సమకాలిన
ప్రపంచం లో గొప్ప రచనలను చేశాడు. ఫరాబి తరువాత తత్వవేత్తలు మరియు ముస్లిం ప్రపంచం యొక్క ఆలోచనాపరులకు
మార్గం సుగమం చేశాడు.
అరిస్టాటిల్
మరియు ప్లాటోనిక్ ఆలోచనల విశ్లేషణ లో అతని కృషి గొప్పది మరియు
ఇస్లామిక్ ప్రపంచం ఈ సెంట్రల్ ఆసియన్ తత్వవేత్తకి ఎంతోగా రుణపడి ఉంది. అతను గ్రీకు తత్త్వ శాస్త్రాన్ని అభివృద్ధి పరచినాడు. అతను
తత్వశాస్త్రం, గణితం, సంగీతం, మెటాఫిజిక్స్ మరియు
రాజకీయ తత్త్వశాస్త్రంలో ఘటికుడు మరియు అతని రచనలు ఆయా శాస్త్రాలలో
ప్రామాణికాలుగా పరిగణించ బడాతాయి. రాజకీయ తత్త్వ శాస్త్రంలో
అతడి అతి ముఖ్యమైన పుస్తకం “అరా అహ్ల్ అల్ మదీనా అల్-ఫాయీల”.
(అత్యంత ఉన్నత ప్రమాణాలు కల నగర ప్రజల
అభిప్రాయలు) (The Views of
the People of The Virtuous City).
తన ఉన్నత/సంపన్న ప్రమాణాలు
కల నగరం(Virtuous
City) ను, ఆల్-ఫరాబి ప్లాటో రిపబ్లిక్ లో
మాదిరి ధర్మం పై ఆధారపడిన నగరం గా వివరిస్తాడు. దానిలో అతను పౌరుల అంతిమ
సంతోషాన్ని కోరుకుంటాడు మరియు తత్వవేత్తల జ్ఞానోదయ దృక్పథాలతో మార్గనిర్దేశం
చేస్తాడు. ప్రజాస్వామ్యానికి సంబంధించిన సుగుణాలను పరిశీలించిన మొట్టమొదటి ముస్లిం
తత్వవేత్తగా అల్-ఫరాబీని భావిస్తారు.
ఇస్లాం మరియు ప్రజాస్వామ్యం
పరస్పర పూరకాలు అని వాదించిన తత్వవేత్త అల్-ఫరాబి.
ప్రజాస్వామ్యంపై అతని భావాలు ఉన్నతమైనవి. స్వేచ్ఛా సమాజాలలో (free societies) మర్యాదపూర్వకమైన
సమాజాలు (virtuous societies) కావాలని, స్వేచ్ఛా
సమాజాలలో (ఫ్రీ సొసైటీలలో) ఉన్న
మంచి వ్యక్తులు ధర్మం కొనసాగించటానికి స్వేచ్ఛ కలిగి ఉంటారు అని అoటాడు.ఆల్
ఫరాబి గురించి పఠనం విజ్ఞానదాయకంగా, ప్రకాశవంతంగా
ఉంటుంది. అతను రాజకీయల గురించి ఆలోచించటమే కాకుండా మిమ్మిల్లి కూడా రాజకీయాల
గురించి ఆలోచింపజేస్తాడు.
ఫరాబియాన్ జ్ఞాన శాస్త్రం నియోప్లాటోనిక్
మరియు అరిస్టాటిల్ పరిమాణం రెండింటినీ కలిగి ఉంది. అల్-ఫరాబి యొక్క విజ్ఞానo యొక్క
మూలం అతని కితాబిహ్స అల్-ఉలమ్
Kitabihsa al-ulum. ఈ గ్రంధం అల్-ఫరాబి యొక్క నిగూఢ మరియు ఉద్వేగభరితమైన విశ్వాసాలను
విశదపరుస్తుంది. ఇవి అన్ని జ్ఞానం యొక్క ప్రాముఖ్యతపై ప్రాధమిక అరిస్టాటిల్
భావనలుగా ఉంటాయి. అల్-ఫరాబి యొక్క ఎపిస్టమాలజీ నియోప్లాటోనిక్ మరియు అరిస్టాటిల్ ఇద్దరు
అనుసరించిన మార్గం లో ఉంటుంది మరియు శ్రేణి మరియు సంక్లిష్టంగా
ఎన్సైక్లోపెడిక్ గా చెప్పబడుతుంది.
అతను
ప్రారంభ ముస్లిం సామాజిక శాస్త్రం పై పుస్తకాలకు రాసినాడు. అతని , కితాబ్ అల్-ముసీకా (ది బుక్ ఆఫ్ మ్యూజిక్) ఆనాటి పర్షియా
సంగీతం యొక్క అధ్యయనం చేసింది, పశ్చిమంలో ఇది
అరబ్బు సంగీతం పై ఒక పుస్తకం వలె
ప్రవేశపెట్టబడింది. అతను అనేక సంగీత వాయిద్యాలను కనిపెట్టాడు మరియు వివిధ సంగీత నోట్లను
musical notes కనిపెట్టాడు.
అతను సంగీత వాద్యాలను నైపుణ్యంతో వాయించే
వాడు. ఇంట్రెలెక్ట్ యొక్క అల్-ఫరబీ రచన శబ్దాలు సంగీతం థెరపీతో వ్యవహరించేవి, అతను మ్యూజిక్ దేరఫి గురించి చర్చించారు, అతను తన జీవితమంతా అనేక సుదూర ప్రాంతాలకు
ప్రయాణించి అనేక అనుభవాలు పొందాడు.. అనేక కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, అతను పూర్తి అంకితభావంతో పనిచేశాడు మరియు
చరిత్రలో ప్రముఖ శాస్త్రవేత్తగా పేరును సంపాదించాడు. 80 ఏళ్ల వయస్సులో 339 A.H. / 950 A.D. లో డమాస్కస్లో అతను బ్రహ్మచారిగా మరణించాడు.
No comments:
Post a Comment