వివిధ రకాలైన వైవిధ్యాలు, వివిధ రకాలైన మతాలు,
వివిధ రకాలైన ప్రజలను కలిగి ఉండుట భారతదేశం యొక్క ప్రత్యేకత. భారత దేశ ప్రజలు ప్రతి ఒక్కరికీ వేరు వేరు సామాజిక నిబంధనలు
మరియు ఆరాధన యొక్క సొంత మార్గాలు ఉన్నాయి. ఇది ఈ దేశ బహుళ సాంస్కృతికత వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణం లేదా
సారాంశం మరియు శక్తి అని చెప్పవచ్చు. .
భారత దేశం ఒక సంక్షేమ రాజ్యం మరియు ఈ సంక్షేమ రాజ్యం
భావన దేశ పౌరుల సామాజిక మరియు ఆర్ధిక
శ్రేయస్సు యొక్క రక్షణ మరియు ప్రచారం లో కీలక పాత్ర పోషిస్తుంది.భారత దేశం లో ప్రభుత్వం ఏ ఒక్క పౌరుడు లేదా కులo లేదా సమూహలకు ఏ రకమైన ప్రాధాన్యత ఇవ్వకుoడా అందరు పౌరుల అవసరాలు
తప్పని సరిగా తీర్చాలి. దీనితో పాటు, దేశ యొక్క రాజ్యాంగం కుల, లింగం మరియు విశ్వాసంతో సంబంధం
లేకుండా సమానత్వం, సోదరభావం మరియు న్యాయ
హక్కును అందరు పౌరులకు సమానంగా ప్రసాదించినది. దేశ రాజ్యాంగం ప్రకారం, ప్రతి పౌరునికి ప్రభుత్వ
సంక్షేమ కార్యక్రమాలు పొందటానికి సమాన హక్కు ఉంది.
దేశంలో అత్యధిక సంఖ్యలో హిందూ సోదరులు ఉన్నారు. వీరి తరువాత సంఖ్య
ముస్లింలకు వస్తుంది. అయితే, ముస్లింల సామాజిక,
ఆర్ధిక విద్యా పరిస్థితి కడు దమనీయం గా ఉన్నది. ఇతర మత వర్గాలతో పోలిస్తే ముస్లింల
సామాజిక ఆర్థిక పరిస్థితులు చాలా క్షిణిoచినవి. ముస్లిం సమాజం తమ ఆర్థిక స్థితిని
ఎలా మెరుగు పరచుకోవాలి మరియు తమ సాంస్కృతిక మరియు మతపరమైన గుర్తింపును ఎలా
కొనసాగించాలి అనే సందేహం లో ఉంది.
ముస్లింల ఆధిపత్య ప్రాంతాలు అవసరమైన మౌలిక సదుపాయాలను మరియు ఆధునిక నాణ్యత గల
సంస్థలను కలిగి లేవు. ముస్లిమ్స్ తాము
మారడానికి ప్రయత్నించక పోతే ఎవరూ వారిని మార్చలేరు.
వివిధ ప్రభుత్వ నివేదికలు ఇప్పటికే దేశంలో ముస్లింల దమనీయ పరిస్థితిని
తెలియజేసాయి. మరోవైపు, వివిధ రకాల
మైనారిటీ వర్గాల అభివృద్ధికి వివిధ పథకాలు
ఉన్నాయని ప్రభుత్వం వాదిస్తూన్నది.
ముస్లిమ్స్ మైనారిటీ వర్గం క్రిందకు వస్తారు. అందువల్ల వారి సంస్కృతి, వారసత్వ భద్రతను కాపాడుకునే
హక్కు రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముస్లింలకు
ఉంది
మైనార్టీ వర్గాలను చూస్తే మైనారిటీల జాబితాలో వివిధ గ్రూపులున్నాయి. ఈ వర్గాల అభివృద్దికి ప్రభుత్వం ప్రణాళికలను తయారు చేసింది. దేశంలోని
ముస్లిం సమాజo కొరకు ఈ పధకాలు ఎంతవరకు
ఉపయోగ బడుతున్నాయో ఆలోచించండి. ముస్లింలలో
మెజారిటీ ప్రజలకు ఈ పథకాలు సమర్థవంతంగా ఉపయోగ
పడుట లేదు పైగా వాటికి ఎల్లప్పుడూ నిధుల కొరత ఉంటుంది. అంతేకాకుండా, ఈ పధకాలను లేదా విధానాలను
పొందటానికి ముస్లింలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించాలి. ఈ విధానాలు పేదరికం
లో ఉన్న ముస్లిం జనాభా అభివృద్ధికి ఏ మాత్రం సరిపోవు.
ఇటీవలే నీతి అయోగ్
దేశంలోని అత్యంత వెనుకబడిన 20 జిల్లాల డేటాను విడుదల చేసింది, ఇందులో 11 జిల్లాలు
ముస్లిం ఆధిపత్య జిల్లాలుగా ఉన్నాయి. దేశంలో మెజారిటీ జనాభా తరువాత అధిక జనాభా గలిగిన ముస్లిమ్స్ ఆర్ధిక, సామాజిక, రాజకీయ పరిస్థితి బాగా లేదు. ఎన్నికల ర్యాలీలలో నాయకులు
ఇచ్చే ఉపన్యాసాలు మరియు నినాదాలకు, వాగ్దానాలకు
వాస్తవికత చాలా భిన్నంగా ఉంటుంది. ముస్లింల యొక్క ఆందోళనలను
పరిష్కరించడానికి బహుపరిమాణ మరియు సంపూర్ణ దృక్పదం అవసరం.
సచార్ కమిటీ నివేదిక తరువాత, అప్పటి యుపిఎ ప్రభుత్వం ముస్లింల అభివృద్దికి కొన్ని చర్యలు
తీసుకుంది. కానీ సచార్ కమిటీ యొక్క సిఫార్సులు ఎంత వరకు అమలులో ఉన్నాయి అనే ప్రశ్న
ఉంది. కుందు కమిటీ (2013)నివేదిక సచార్
కమిటీ సిఫారసుల యొక్క నిజమైన స్థితిని చూపించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింల
ప్రాతినిద్యం తక్కువని కుందు కమిటీ
నివేదించింది. 15 పాయింట్ల ప్రధాన మంత్రి కార్యక్రమంలో ఉన్న పథకాలు తగిన నిధులను కలిగి
లేవు. విద్య లో డ్రాప్-అవుట్ రేటు
ముస్లిములలో ఇప్పటికీ ఎక్కువగా ఉంది మరియు
దేశం లోని ముస్లిం ఆధిపత్య ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాలు తృప్తికరంగా లేవు.
దీనికి తోడూ మెజారిటీ ముస్లింలకు ప్రభుత్వం యొక్క కార్యక్రమాల గురించి అవగాహన
లేదు. గ్రామిణ ప్రాంతం వారికే కాక పట్టణ ప్రాంత యువతకు వాటి గురించిన సంపూర్ణ అవగాహన
లేదు. ఉదా: డిల్లి నిజాముద్దీన్ ప్రాంతంలోని ముస్లిం యువతకు, జామియా మిలియా విద్యార్ధులకు మరియు ఢిల్లీలోని అనేక ప్రదేశాల్లో గల చాలా మంది ముస్లిం విద్యార్థులకు ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాల గురించి ఆసక్తి/అవగాహన లేనప్పుడు మనము వివక్షత అని ఎలా అనగలుగుతాము.
ముస్లిమ్స్ పేదరికo నుండి బయటకు రావాలని కోరుకుంటే, మొదట అవగాహన ఏర్పరచుకొని ఉద్యమాన్ని నిర్వహించాల్సి ఉంటుంది, ఇది ప్రభావ వర్గం గా పని
చేస్తుంది మరియు ప్రజాస్వామ్య సాధనాల ద్వారా తమ డిమాండ్లను సాధించాలి.
ప్రస్తుత కాలంలో అభివృద్ధికి బదులుగా, రాజకీయ ఉద్దేశాలను
పొందేందుకు భావోద్వేగాల రాజకీయాలు నడుస్తున్నాయి. దేశంలోని బలహీన వర్గాల అభివృద్ధి
కాకుండా వారి గుర్తింపు సమస్యలపై, మతపరమైన సమస్యలపై
ప్రశ్నలు తలయెత్తు తున్నాయి. ప్రతిరోజూ T.V చర్చలు వలన వాతావరణం
వేడెక్కుతుంది.ఇది దేశ అభివృద్ధి కి తోడ్పడదు.
No comments:
Post a Comment