25 July 2018

అల్-బతాని (858 - 929) AL-BATTANI (858 – 929)



.

ఆల్-బతాని పేరు యొక్క లాటిన్ రూపాంతరం ఆల్బాటియస్, అల్బటెని లేదా ఆల్బటేనియాస్ (Albategnius, Albategni or Albatenius). ఇతను  అరబ్ గణిత శాస్త్రజ్ఞుడు మరియు ఖగోళ శాస్త్రవేత్త.అతని పూర్తి పేరు అబూ అబ్దుల్లా మహ్మద్ ఇబ్న్ జబీర్ ఇబ్న్ సినాన్ అల్ రఖ్కి అల్-హరాన్ని అల్-సబీ అల్-బతానీ. అల్-బతానీ తండ్రి జాబిర్ ఇబ్న్ సినాన్ అల్-హర్రాని ఒక ఖగోళ పరికరాల తయారీదారునిగా,శాస్త్రవేత్తగా  హరాన్(Harran)నగరం లో పేరుపొందారు.

అల్-బతాని ఖగోళ పరికరాలను  తయారు చేయడంలో నైపుణ్యాన్ని,తన తండ్రి నుండి నేర్చుకున్నాడు. అబూ అబ్దుల్లా ముహమ్మద్ ఇబ్న్ జాబిర్ ఇబ్న్ సినాన్ అల్ బటాని అల్-హరాన్ని 858 లో హరాన్ లో  జన్మించాడు. బతానీ మొట్టమొదటిగా తన తండ్రి జబీర్ ఇబ్న్ సన్హాన్ అల్-బతానీ వద్ద చదువుకున్నాడు. అతని తండ్రి బాగా ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త. తర్వాత అతను యుఫ్రేట్స్ ఒడ్డున ఉన్న రఖా(Raqqa)కు వెళ్లారు, అక్కడ అతను ఆధునిక విద్యను అబ్యసించి ఒక పండితుడుగా అభివృద్ధి చెందాడు.

9 వ శతాబ్దం ప్రారంభంలో, అతను సమారాకు వలస వచ్చాడు, అక్కడ తన జీవితాంతం వరకు పనిచేశాడు. అతని కుటుంబం హరాన్ కు చెందిన నక్షత్రాలను ఆరాధించే సబియన్ శాఖ యొక్క సభ్యులు. నక్షత్రాల ఆరాధకులుగా సబియన్స్ ఖగోళశాస్త్రం అధ్యయనం పట్ల ఆసక్తి   ప్రదర్శించారు. అల్-బతాని, తాబిత్ (మరొక ప్రముఖ గణిత శాస్త్రవేత్త) వలె సబియన్ మతంలో విశ్వాసం ఉన్నవాడు  కాదు. అతని పేరు "అబూ అబ్దుల్లా మొహమ్మద్" అతను ఖచ్చితంగా ఒక ముస్లిం అని సూచిస్తుంది. ఆల్-బతానీ ఆంటియోచ్(Antioch) మరియు సిరియాలోని ఆర్-రఖా(ar-Raqqah) వద్ద ఖచ్చితమైన ఖగోళ పరిశీలనలు చేశాడు. అల్-బతానీ పరిశీలనలు జరిపిన ఆర్-రాఖ్హా(ar-Raqqah) పట్టణంలో ఖలీఫా  హరున్ అల్-రషీద్ అనేక భవనాలు నిర్మించి సుసంపన్నం చేసాడు.

ఫిహ్రిస్ట్ ఆల్-బతానిని అత్యంత ప్రసిద్ధ పరిశీలకులలో ఒకరిగా మరియు జ్యామితి, సైద్ధాంతిక మరియు ఆచరణాత్మక ఖగోళశాస్త్రం మరియు జ్యోతిషశాస్త్రంలో ఒక నాయకుడిగా వర్ణించాడు. అతను, టోలెమి  యొక్క "అల్మాగేస్ట్"(Ptolemy’s “Almagest”). లో వర్ణించిన దాని కంటే ఖగోళ శాస్త్రం లో తన స్వంత పరిశీలనల ద్వారా  సూర్యడు మరియు చంద్రుని మరియు వాటి  కదలికల గురించి మరింత ఖచ్చితమైన వర్ణన కలిగి ఉన్నరచనలను చేసాడు.

అల్ బాటనీ యొక్క ప్రధాన విజయాలు : అతను 489 నక్షత్రాల జాబితా తయారు చేశాడు. •ఇతడు  సంవత్సరం యొక్క ఖచ్చితమైన కాలమానం మరియు వివిధ రుతువుల కాల మానాలను లెక్కించాడు.సంవత్సరం 365 రోజులు, 5 గంటల 46 నిముషాల 24 సెకన్లు కలిగి ఉందని అన్నాడు . ఇతను ఒక సంవత్సరానికికాలవ్యత్యయము 54.5"గా లెక్కించాడుమరియు కాంతి కక్ష యొక్క వంపు విలువ23° 35′ గా లెక్కించాడు.


సమకాలిన ఇతర శాస్త్రవేత్తల వలే  జ్యామితీయ పద్ధతులను వాడే బదులు, అల్-బతానీ ఆధునిక ట్రీగ్నోమెట్రిక్ పద్ధతులను ఉపయోగించారు. భూమి నుండి సూర్యుని యొక్క దూరం మారుతుందని అల్-బతానీ అన్నాడు  మరియు దాని ఫలితంగా, సూర్యుని సంవత్సరిక   గ్రహణాలు(annular eclipses) అలాగే సంపూర్ణ గ్రహణాలు సాధ్యమవుతున్నాయి అని అన్నాడు. విజ్ఞానశాస్త్ర అభివృద్ధిలో అల్-బతాని పాత్ర ముఖ్యమైనది, మరియు టైకో బ్రేహీ, కెప్లర్, గెలీలియో మరియు కోపర్నికస్(Tycho Brahe, Kepler, Galileo and Copernicus) వంటి  శాస్త్రవేత్తలపైఅల్-బతానీ ప్రభావాన్ని కలిగి ఉన్నాడు.




No comments:

Post a Comment