నేడు ప్రపంచవ్యాప్త
పరిణామాలలో మతం ముస్లింలకు వ్యక్తిగత విషయంగా లేదు. ఇస్లాం
పేరిట జరిగే తీవ్రవాద దాడులతో నిరాశ, నిరుత్సాహం, వేదింపులతో
ముస్లిం సమాజం కొట్టుమిట్టాడుతుంది. దాదాపు ప్రతి రోజూ వారి విశ్వాసం - అంతర్జాతీయ
సంఘటనల్లో చిక్కుకొంటుoది.
మక్కా లో 610 సంవత్సరం లో ఇస్లాం చివరి ప్రవక్త మొహమ్మద్(స)
నోట దైవ వాణి “దివ్య ఖుర్ఆన్” అవతరించందని
ముస్లింలు విశ్వసిస్తారు. రమజాన్ మాస 30 రోజుల పవిత్రత
మరియు ప్రాధాన్యత విశ్వాసులకు తెలుసు. రమదాన్ నెలలో విశ్వాసి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం
ఉంటారు మరియు లైంగికత, మద్యపానం మరియు చెడు పనుల నుండి దూరంగా ఉంటారు.
ఈ నెల స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ, స్వచ్ఛoద దానం కు
ప్రతిబింబం. విశ్వాసి ఆధ్యాత్మిక
లక్ష్యాలను సాధిoచుటకు పోరాటం జరుపుతాడు. అల్లాహ్ తన అనుచరులు అబద్ధాలు మరియు ఇతర
పాపాత్మకమైన క్రియల నుండి దూరంగా ఉండకపోతే, ఆహారం మరియు నీటి
నుండి దూరంగా ఉండటానికి అంగికరించడని ప్రవక్త మొహమ్మద్(స) అన్నారు.
కోపం, దురహంకారం, అసూయ, ప్రతీకారం వంటి ప్రతికూల
లక్షణాలను ఎదుర్కోవటానికి ఒక శక్తివంతమైన అరబిక్ పదం ఉంది. ఆ పదం జిహాద్.
దురదృష్టవశాత్తు, ఇస్లాం యొక్క
అత్యంత ఆధ్యాత్మిక భావన జిహాద్ నేడు అమాయక ప్రజలను చంపే తీవ్రవాదుల చేతుల్లో తన
అర్ధాన్ని కోల్పోయింది. ముంబైలో 26/11 లేదా శ్రీలంకలోని చర్చిలలో జరిగిన దాడుల సమయంలో జరిగినది
జిహాద్ కాదు. దివ్య ఖుర్ఆన్ అలాంటి బుద్ధిహీన హింసలను ఆమోదించలేదు. సిరియా, సోమాలియా మరియు
ఆఫ్గనిస్తాన్లలో ముస్లింలు ఇతర ముస్లింలను చంపటం జిహాద్ కాదు. ప్రవక్త ముహమ్మద్
సల్లల్లాహు అలైహి వసల్లం యుద్దాలను "ఆధ్యాత్మిక శుద్ధీకరణ కోసం లోపలికి
చూసే" "గొప్ప జిహాద్" తో పోలిస్తే "తక్కువ జిహాద్" గా
వర్ణించారు. రమదాన్ ఈ ఆలోచనను ప్రతిబిoబిస్తుంది.
రమదాన్ నెలను విశ్వాసి చెడు ఆలోచనలు వదిలి మంచి ఉత్తమ
ఆలోచనలను జాగృతి పరచటానికి స్వీయ శిక్షణ పొందటానికి వినియోగిస్తాడు.. ప్రవక్త(స)
ఇలా అన్నాడు: " విశ్వాసి ఎవరిని అవమానపరచడు,ఎవరిని శాపం పెట్టాడు. అతను అపవిత్రుడు
మరియు అనాగరికత తో వ్యవహరించడు.
."దివ్య ఖురాన్ ముస్లింలు
సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండమంటుంది. జకాత్ (దాతృత్వం) ఇస్లాం మతం యొక్క ఐదు
స్తంభాలలో ఒకటి మరియు ఇది రమదాన్ సమయంలో ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది.
సంపద కలిగిన ముస్లింలలో జకాత్ తప్పనిసరి. జకాత్ అనేది గొప్ప మరియు పేదల మధ్య అంతరం తగ్గించే వంతెనలాంటిది
మరియు సామాజికoగా నిర్లక్ష్యం చేయబడిన ప్రజల గౌరవం పునరుద్ధరించడానికి ఉంది.
ప్రవక్త ముహమ్మద్
సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించారు: "నల్లవారిపై తెల్లవారికి లేదా
తెల్ల వారిపై నల్ల వారికీ దైవభక్తి మరియు మంచి పనులు చేస్తే తప్ప ఆధిక్యత లేదు."
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిహిత సహాయకులు ఇద్దరు మొదట బానిసలు ఆ తరువాత మొదటి ముస్లిం సమాజంలో అత్యంత గౌరవం పొందారు.
దివ్య ఖుర్ఆన్ ఇలా
అంటుంది: "మేము మిమ్మల్ని మగవానిగా మరియు స్త్రీగా సృష్టించాము మరియు
ఒకరికొకరు తెలుసుకునేలా మిమ్మల్ని దేశాలు మరియు తెగలుగా చేశాము." ఈ వచనం
మరియు దివ్య ఖుర్ఆన్ శాంతి, స్నేహం వ్యక్తుల
మధ్య ప్రేమ లాంటి అనేక ఇస్లాం సందేశాలకు కేంద్రం బిందువు.
ఆధునిక సమాజ లక్షణాలు అయిన భయం, ద్వేషo మరియు
అసమ్మతిని అధిగమించడానికి ఇస్లాం బోధనలు తోడ్పడతాయి. రమదాన్ ఇటువంటి హామీని పునరుద్ధరించడానికి మరియు బంధాలను
పెంచటానికి సరైన సమయం.
No comments:
Post a Comment