20 April 2016

దివ్య ఖురాన్ అనువాదములు


ఖురాన్ ను  కురాన్ఖొరాన్ఖుర్‌ఆన్ఖొర్ఆన్కొరాన్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. కురాన్ అరబ్బీ భాష లో అల్లాహ్ (దేవుడు) ముహమ్మద్ ప్రవక్త ద్వారా మానవాళికి పంపిన ఇస్లాం ధర్మం యొక్క చివరి పవిత్ర గ్రంథము. ఖుర్ఆను గ్రంథం మహాప్రవక్త మహమ్మద్(స)పై రమజాను మాసంలో అవతరించింది. దాదాపు ఇరవైమూడు సంవత్సరాల సుదీర్ఘమైన కాలంలో ఈ గ్రంథం మానవుల అవసరాలకు ఆ కాల పరిస్థితులకు అనుగుణంగా సందేశాలను మోసుకొచ్చింది.
అరబ్బీ భాషలో 'ఖుర్ ఆన్' అనగా 'చదువుట','వల్లె వేయుట' ,'మాటిమాటికి చదివే' గ్రంథం అని అర్ధము.
నేను మీదగ్గర రెండు వస్తువులు వదలిపెట్టి పోతున్నాను. ఈ రెండింటిని దృఢంగా పట్టుకొని ఆచరించేవారు ఎన్నటికీ దారి తప్పలేరు. వాటిలో ఒకటి దైవగ్రంథం (ఖుర్‌ఆన్). రెండవది నా ప్రవచనాలు, సంప్రదాయాలు (హదీసులు) - మహాప్రవక్త ముహమ్మద్ (స)
ముస్లిం ల నమ్మకము ప్రకారము దేవుని సందేశాలు మొదటి ప్రవక్త ఆదమ్ తో ప్రాంభింపబడిషుహుఫ్ ఇ ఇబ్రాహిమ్,  తోరాహ్ (మోషే ధర్మశాస్త్రము, పాతనిబంధన)  జబూర్ (దావీదు కీర్తనలు)ఇంజీల్ (క్రీస్తు సువార్త), వంటివానితో కొనసాగింపబడి, చివరకు మహమ్మదు ప్రవక్తకు తెలుపజేయబడిన ఖురాన్‌తో ముగిసినవి. పైన చెప్పిన గ్రంథాలలోని వివిధ సందేశాలను ఖుర్‌ఆన్ గుర్తిస్తుంది.ఖుర్‌ఆన్ యొక్క సాధికారతను ఖొరానే స్పష్టంగా చెప్పింది. మిగిలిన విషయాన్ని ఇప్పుడు తెలియజేశాము. దీనికి రక్షణకూడా నిశ్చయంగా మేమే అని.
 ఈ ఖుర్ఆను గ్రంథం తన అనుయాయులకు పటిష్ఠమైన విశ్వాసాన్ని కలిగించింది. వారి హృదయాలు దైవభక్తితో పులకించిపోయాయి. ఆ గ్రంథం ద్వారా వ్యక్తమయ్యే ప్రతి ఆజ్ఞను వారు తు.చ. తప్పకుండా పాటించేవారు.

ఖురాన్ అనువాదములు:

కొరాన్ తొలుత అరబిక్ లో అవతరించినది పిదప అనేక ఆసియన్, ఆఫ్రికన్, యురోపియన్ బాషలలోనికి అనువదింప బడినది.
కురాన్ అనువాదం మొదటి నుంచి చాల సమస్య తో కూడుకొన్నది. కురాన్ దైవవాణి కనుక దాన్ని అనువదించలేము అన్న భావన ఉండేది. అందుకు గాను తొలితరం అనువాదకులు అనువాదo తో పక్కనే దాని అరబిక్ మూల ప్రతిని కూడా ఉంచేవారు. పైగా ఒక అరబిక్ పదము నకు అనేక అర్ధాలు కలవు. నిజానికి కురాన్ అనువాదం ఒక మహత్తర కార్యం. 
ముహమ్మద్ ప్రవక్త(స) కాలం లో కురాన్ ఇతర బాష లోనికి అనువదింప బడ లేదు. ఖురాన్ యొక్క మొదటి అనువాదం 7 వ శతాబ్దంలోలి భాగం లో  పెర్షియన్ బాష లోనికి  (సురా అల్- ఫాతిహా) అనువదించినది సల్మాన్  ఫార్సీ. ఆ తరువాత గ్రీక్ బాష లోనికి 855-870 మద్య నిసుతాస్ బైజాన్టియాస్ అనే వానిచే అనువదిoపబడినది.
ఖుర్ఆన్ మొదటి పూర్తి అనువాదాలు పెర్షియన్ బాషలో  10 వ మరియు 12 వ శతాబ్దాల మధ్య జరిగినవి. సమనిడ్ రాజు  మొదటి మన్సూర్ (961-976) ఖురాన్ ను అనువదించమని ఖొరాసాన్  పండితుల సమూహం ను ఆదేశించినాడు. వారు తఫ్సీర్ అల తబరి ని  అరబిక్ నుండి   పెర్షియన్ లోనికి అనువదించారు. తరువాత 11వ శతాబ్దం లో పెర్షియా బాష లో మొదటి కురాన్ తఫ్సీర్ ప్రచురింప బడినది. 12వ శతాబ్దం లో అబూ హఫ్స్ ఒమర్ అల్ నసఫీ కురాన్ ను అరబిక్ నుండి పెర్షియా లోని కి అనువదించి నాడు.

లాటిన్ బాష లో:
1143 లో రాబర్ట్స్ కేటేనేన్సిస్(Robertus Ketenensis) ద్వారా  కురాన్ లాటిన్ బాష లోనికి  అనువదింప బడినది. తొలితరం ఆంగ్ల అనువాదకులు అరబిక్ నుండి కాకుండా ఈ లాటిన్ అనువాదం నుండి అనువాదాలు చేసేవారు.దానితో అవి తప్పుల తడక లాగా ఉండేవి. 13వ శతాబ్ధపు తోలి భాగం లో, 15వ మరియు 16 శతాబ్దం లో ఆ తరువాత 17వ శతాబ్ధపు ప్రారంభం లో అనేక లాటిన్ అనువాదాలు జరిగినవి.
1612-17OO మద్య నివసించిన లుదోవికో మర్రాసి (Ludovico Marracci) అనే అరబిక్ బాష నేర్చిన లాటిన్ పండితుడు 1698 లో కురాన్ ను లాటిన్ బాష లోనికి అనువదించినాడు. ఇది ఇతర యురోపియన్ అనువాదకులకు(ఫ్రెంచ్, జర్మన్) మార్గదర్శకం గా ఉండేది. అందులో ఒకటి మక్కా లో హిజ్రీ 1165 లో ప్రచురింప బడినది.
ఇతర యురోపియన్ బాషల లోని అనువాదాలు:
కురాన్ అనువాదం జరిగిన మొదటి ఆధునిక యురోపియన్ బాష క్యాస్టిలియన్ మరియు అనువదించినది జుయాన్ అంద్రీస్. ఆ తరువాతి దాదాపు డజను కు పైగా అనువాదాలు అతని అనుసరించి జరిగినవి. ఆ తరువాత 1547 లో ఇటాలియన్ లో తరువాత 1616 లో ఇటాలియన్ నుండి  జర్మని లోను, పిదప 1641 లో జర్మని నుండి డచ్ బాషలోనికి అనువదింప బడినది.
1647 లో ఆంద్రీ డు ర్యేర్ చేత  కురాన్  ఫ్రెంచ్ బాషలోనికి అనువదిoప బడినది. 1959 లో ముహమ్మద్ హమిదుల్లాః అనే ముస్లిం ఒరిజినల్ అరబిక్ నుండి ఫ్రెంచ్ బాషలోనికి కురాన్ ను అనువదించాడు. ఇది ఫ్రెంచ్ సరిఅయిన అనువాదం గా పరిగణింప బడి అనేకసార్లు ఫ్రాన్స్,లెబనాన్ లలో పున: ముద్రిత మైనది.
ఆధునిక స్పానిష్ బాషలో నాలుగు సార్లు కురాఅన్ పూర్తిగా అనువదిoపబడినది. అవి దక్షణ అమెరికాలోను, అమెరికాలోను విస్తృతంగా అమలులో ఉన్నవి.
ఆంగ్లము లోనికి లాటిన్ నుండి కురాన్ మొదటిగా 1143 లో మొదటి సారి అనువదిమ్పబడినది. పిదప ఫ్రెంచ్ నుండి ఆంగ్లము లోనికి కురాన్ మొదట అలెక్జాండర్ రాస్ చేత 1649 లో అనువదింప బడినది. అలెక్జాండర్ రాస్ ఆంగ్ల అనువాదం అనేక డచ్,జర్మని అనువాదాలకు మాతృక అయినది. 1734 లో జార్జ్ సేలే మొదటి సారిగా అరబిక్ నుండి ఆంగ్లము లోనికి ప్రత్యక్ష అనువాదం చేసినాడు. ఆతరువాత రాద్వేల్,పాల్మెర్,రిచర్డ్ బెల్, జాన్ అర్బెర్రి ఆంగ్లములోనికి అరబిక్ నుండి అనవదించారు.
మొదటి సారి ఆంగ్లములోనికి అరబిక్ నుండి ఒక ముస్లిం డాక్టర్ మిర్జా అబుల్ ఫజల్ 1910 లో  కురాన్ అనువదించాడు. ముహమ్మద్ అలీ, ముహమ్మద్ పిక్తాల్, యూసుఫ్ అలీ, హిలాలి ఖాన్, డాక్టర్ అమీర్ అలీ, అహ్మద్ అలీ, వహిదుద్దిన్ ఖాన్ ఆంగ్ల అనువాదకులలో ముఖ్యులు.
1716 లో రష్యన్ బాషలోనికి అనువదింప బడినది  
ఆసియా బాషలు:
తుర్కి బాషలోనికి ముహమ్మద్ హంది యజీర్ అనువదించాడు.(1935ప్రింట్ )
మొదటి జపనీస్ కురాన్1920లో రాద్వేల్ ఇంగ్లీష్ కురాన్ అనువాదం పై ఆధారపడి రచించినది సకమోతో కెన్-ఇచి. ఆ     తరువాత 1945 లో  అరబిక్ నుండి మొదట అనువదించినది తోషిహికో ఇజుత్సు.
 చైనా లో      ఇస్లాం 7వ శతాబ్దం లో ప్రవేశించి నప్పటికీ మొదటి చైనా కురాన్ సంపూర్ణ అనువాదం రాద్వేల్ ఆంగ్ల అనువాదం పై ఆధారపడి చేసిన జపాన్ అనువాదం పై ఆధార పడి జరిగింది. 1931 మొదటి చైనా ముస్లిం వాంగ్ జింగ్ జహి కొరాన్ చైనా బాష లోనికి అనువదించినాడు. ఆ తరువాత అనేక అనువాదాలు జరిగినవి.
 ప్రపంచం లో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఇండోనేషియా లోని అనేక బాషలలో కురాన్ అనువాదం జరిగింది. అందులో ఒకటైన ఇండోనేషియా బాష లో 1960 దశకం లో అనువదింపబడినది.
విల్లియం షెలబేర్ మలై బాష లోనికి అనువదించినాడు అతని అనువాదం పూర్తి కాకుండానే 1948 లో మరణించినాడు.
ప్రధాన భారతీయ భాషలు:
884 లో సింది బాష లోనికి కురాన్ అనువదింప బడినది కాని నేడు అది అలబ్యం.9వ శతాబ్దం లో కష్మీరి బాషలోనికి అనువదింప బడినది ఉర్దూ కురాన్ అనువాదకులలో అహ్మద్ రెజా ఖాన్ మొదటి వారు. వారు అనువదించిన కన్జుల్ ఇమాన్ బాగా ప్రసిద్ది నొందినది.  పిదప ముహమ్మద్ తాహిర్ ఉల్-ఖాద్రి, అబ్డులా:  ప్రసిద్ద ఉర్దూ  కురాన్ అనువాదకులు.
బంగ్లా బాష లో కురాన్ అనువాదకులలో గిరీష్ చంద్ర సేన్ మొదటి సంపూర్ణ అనువాదకులు.అబ్బాస్ అలీ మొదటి ముస్లిం బంగ్లా కురాన్ సంపూర్ణ అనువాదకులు.
హిందీ, గుజరాతి లోనికి కన్జుల్ ఇమాన్ ఉర్దూ అనువాదం అనువదింప బడి ప్రాముఖ్యత పొందినవి.
కురాన్ తమిళ్ అనువాదకులలో షేక్ ముస్తఫా, బెరువాల శ్రీలంక, అబ్దుల్ హమీద్ భకావి ముఖ్యులు.
తెలుగు లో కురాన్ అనువాదకులు:
1.              1925-చిలుకూరి నారాయణ రావు ఖురాన్ షరీఫ్ మద్రాసు
2.              1941-ముహమ్మదు ఖాసిం ఖాన్ ఖురాన్ షరీఫ్ 9 సూరా హైదరాబాద్
3.              1948-మున్షీ మౌల్విముహమ్మద్ అబ్దుల్ గఫూర్, కురానె మజీద్ కర్నూలు
4.              1980-షేక్ ఇబ్రాహీం నాసిర్ అహమ్మదియ్యా కురాన్ , హైదరాబాద్
5.              1985-హమీదుల్లా షరీఫ్ ,దివ్య ఖుర్ ఆన్ జమాతె ఇస్లామి హింద్ హైదరాబాద్
6.              2004-అబుల్ ఇర్ఫాన్ , ఖురాన్ భావామృతం , హైదరాబాద్
7.              2007-యస్.ఎం.మలిక్ , ఖుర్ ఆన్ అవగాహనం అబుల్ అలా మౌదూదీ
8.              2008-డాక్టర్ అబ్దుల్ రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా,సౌదీ అరేబియా
9.              2009-ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,అంతిమదైవగ్రంధం ఖుర్ ఆన్ [2870 పేజీలు] (మౌలానా ముహమ్మద్ జునాగడీ) గారి [అహ్ సనుల్ బయాన్] హైదరాబాదు
10.          2010-అబ్దుల్ జలీల్ ,పవిత్ర ఖుర్ ఆన్ ,దారుల్ ఫుర్ ఖాన్,విజయవాడ.862 పేజీలు. 
11.          2012-      డాక్టర్ ముహమ్మద్ అబ్దుల్ సత్తార్,జియాఉల్ ఖురాన్,
                             (
ఆల్లాహ్ అంతిమఆకాశ  పరిశుద్ద గ్రంధము),విశాఖపట్టణం.1100 పేజీలు.                
12.          2012- ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,అల్ ఖురానుల్ మజీద్ ,
                         
మౌలానా హాజీ హాఫిజ్ ఖ్వారీ  ఫహీముద్దీన్   అహ్మద్ సిద్దీఖీ ,హైదరాబాద్ 552 పేజీలు. 
         (2013 'ఖుర్ ఆన్ మజీద్' 695 పేజీలు). 
13.           2013 - ముహమ్మద్ అజీజుర్రహ్మాన్,దివ్యగ్రంధం ఖుర్ ఆన్ ,మౌలానా వహీదుద్దీన్ ఖాన్, 
  
హైదరాబాదు.640 పేజీలు
ప్రొఫెసర్ సత్య దేవ్ వర్మ సంస్కృతం లో 1984 లో తరువాత రజియా సుల్తాన 2010 లో అనువదించినారు.
ఆధునిక  అంతర్జాతీయ బాష అయిన ఎస్పెరాంటో లో మొదట ఇరాన్ కు చెడిన అల్లామా ముజ్తర్ అబ్బాసి కురాన్ ను అనువదించినాడు.  
ఆఫ్రికన్ బాషలైన స్వాహిలి బాష లో షేక్ అలీ ముహసిన్ అల్ బర్వాని కురాన్ అనువదించినారు. హౌసా బాష లో షేక్ ముహమ్మద్ గుమి కురాన్ అనువదించినారు.
2010 నాటికి కురాన్ 112 బాషల లోనికి అనువదింప బడినది.
ఆధారాలు: 
1. వికీ పిడియా
2. తెలుగు ముస్లిం 


2 comments:

  1. షాలోమ్‌ అలెయ్‌ఖేమ్‌ అజ్గర్‌ అలీ గారు, మీరు పైన తెలియజేసిన తెలుగు 13 ఖురాన్‌లు నేడు అందుబాటులో ఉన్నాయా? ఉంటే మేము వాటినెలా పొందుకోగలము తెలియజేయగలరు.

    ReplyDelete
  2. షాలోమ్‌ అలెయ్‌ఖేమ్‌ అజ్గర్‌ అలీ గారు, మీరు పైన తెలియజేసిన తెలుగు 13 ఖురాన్‌లు నేడు అందుబాటులో ఉన్నాయా? ఉంటే మేము వాటినెలా పొందుకోగలము తెలియజేయగలరు.

    ReplyDelete

    ReplyDelete