సంక్షేమ రాజ్య భావన
ఆధునిక కాలం లో చాలా ప్రజాదరణ పొందింది. సంక్షేమ రాజ్యo లో ప్రభుత్వం ప్రతి పౌరుడి కి కనీస ప్రమాణాలు లబించేటట్లు బాధ్యత వహిస్తుంది. సాధారణంగా సంక్షేమ రాజ్యం ఈ క్రింది లక్షణాలను లేదా వీటిలో కొన్ని లక్షణాలను కలిగి ఉంటుంది.
1. నిరుద్యోగులకు సామాజిక భద్రత కల్పన, ప్రజల ఆరోగ్య
సమస్యలు, వృద్దులు, వికలాంగుల
సమస్యలు తీర్చడం
2. ఉచిత లేదా సబ్సిడీ పై విద్య మరియు వైద్య సేవలు
కల్పన.
3. అందరు పౌరులకు ఆదాయం మరియు సంపద సమాన పంపిణీ
మరియు సరి అయిన పన్నుల విధింపు ద్వారా సామాజిక న్యాయ సాధన.
4. విద్య మరియు నైపుణ్యాల ప్రాతిపదికన అందరికీ
పూర్తి సమయ ఉపాధి కల్పన.
5. ప్రబుత్వ రంగ సంస్థల ఏర్పాటు మరియు సరసమైన
రేట్లు, సబ్సిడీ రేట్లపై తక్కువ ఆదాయం ఉన్న సమూహాలకు జివితాసర వస్తువుల అవిరామ
సరఫరా.
ఇస్లాం లో సంక్షేమ రాజ్యం
మానవజాతి మొత్తం సంక్షేమానికి ఉపయోగపడుతుంది. ఇస్లాం లో సంక్షేమ
రాజ్యం భావన ఆర్థిక విలువలకు సంభందించినది
కాదు నైతిక ఆధ్యాత్మిక, సామాజిక మరియు రాజకీయ విలువలకు సంభందించినది. ఇస్లామిక్
సంక్షేమ రాజ్యం పౌరుల సామాజిక, ఆర్థిక సంక్షేమo
సాదిస్తుంది. అది ప్రజల సంక్షేమం కోసం సమగ్ర సామాజిక భద్రతా వ్యవస్థను, సామాజిక న్యాయం ను
కల్పిస్తుంది. అది ప్రజల
ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం పాటుపడటం తో పాటు జీవితం యొక్క అన్ని ప్రాధమిక అవసరాలు తీర్చడం
చేస్తుంది. ముస్లింలకు ఇస్లామిక్ తరహా
జీవన వ్యవస్థ నేలకోల్పడం తో బాటు ముస్లిమేతరులకు సంపూర్ణ జీవిత మరియు మతపరమైన స్వేచ్ఛను ప్రసాదిస్తుంది.
1. ఇస్లామిక్ సంక్షేమ రాజ్యం పేద మరియు అవసరం
ఉన్నవారి కోసం ఆదాయం పంచుతుంది. పౌరుల ప్రాథమిక అవసరాలు తీర్చడం రాజ్యం బాధ్యత. ఇస్లాం మతం ముస్లింలు మరియు
ముస్లిమేతరుల మధ్య వ్యత్యాసం చూపదు. ఖలీఫా ఉమర్ ఒకసారి ఒక జిమ్మీ(ముస్లిమేతరుడు) యాచించడం చూసాడు. వెంటనే ఖలీఫా ఉమర్ అతనికి
పెన్షన్ మంజూరు చేసి జిజియా పన్ను చెల్లించడం నుండి మినహాయింపు ఇచ్చాడు. ఇస్లాం యొక్క ప్రసిద్ధ సైనికాధికారి ఖాలీద్ హిరా
ముస్లిమేతరుల తో ఒక ఒప్పందం చేసుకొన్నాడు
దాని ప్రకారం సాధారణ, పేద మరియు
నిరాశ్రయులైన ముస్లిమేతరులకు ఆర్థిక
సహాయం చేసాడు.
2. ప్రవక్త (స) జీవితం యొక్క కనీస అవసరాలు ఈ
విధంగా నిర్వచించినారు. వారి ప్రకారం “ఆదం పుత్రుడు నివసించడానికి ఇల్లు, శరీరం
కప్పుకోవడానికి బట్ట, కొంత రొట్టె ముక్క మరియు త్రాగటానికి నీరు అవసరం”-తిర్మిజి.
ప్రవక్త(స) యొక్క హదీసుల ప్రకారం మానవుడు
జీవించడానికి కనిస అవసరాలు అయిన ఆహారం, నీరు, బట్టలు మరియు ఒక ఇల్లు కావాలి.
3. ఇస్లామిక్ రాజ్యం లో నివసిస్తున్న ప్రతి
వ్యక్తి తన జీవిత ప్రాథమిక అవసరాలు పొందగలడు. ఆ ఆవసరాలను ఆతను స్వయంగా తన కుటుంబం కోసం సేకరించలేక
పోతే వాటిని అందించ వలసిన బాద్యత ఇస్లామిక్ రాజ్యం దే. అనేక ఇస్లామిక్ న్యాయ నిపుణుల ఇస్లామిక్ రాజ్యం వ్యక్తి జీవితం యొక్క ప్రాధమిక అవసరాలు అందించాలి
అన్నారు. పేదవారికి, అవసరం ఉన్నవారికి, జబ్బుపడినవారికి, వికలాంగులకు, ముసలివారికి లేదా నిరుద్యోగ వ్యక్తులకు కనీస జీవన ప్రామాణాలు ఇవ్వవలసిన బాధ్యత ఇస్లామిక్ రాజ్యం
పై ఉందని అన్నారు.
4. ఇస్లామిక్ రాజ్య ఆర్థిక సిద్ధాంతం సామాజిక
న్యాయం భావన ఆధారంగా పనిచేస్తుంది. ఇస్లామిక్ రాజ్యం జీవనోపాధి కొరకు అందరు పౌరులకు సమాన అవకాశాలు అందిస్తుంది. సామాజిక
న్యాయం నెరవేర్చుటకు ముందుగా ఇస్లాం కొద్దిమంది చేతులలో సంపద కేంద్రికరణను ఖండిస్తోంది
రెండవది ఇది సమర్థవంతమైన చర్యల ద్వారా సంపద ను సమానంగా న్యాయం గా పంపిణీ చేస్తుంది.
సంపద కేంద్రికరణను నివారించుటకు చట్టవిరుద్ధoగా
మరియు అన్యాయo గా సంపాదించుట, వడ్డీ, లంచం, వ్యాపారo లో అక్రమాలు, తప్పుడు తూకాలు, నిధుల దుర్వినియోగం, దొంగతనం మరియు
దోపిడీ, ఆటలలో సంపద పొందటాన్ని నిషేధించినది.
సంపద న్యాయంగా మరియు సమానంగా పంపిణీ చేయుటకు ఇస్లాం జకాత్ మరియు స్వచ్ఛంద దానం
ప్రవేశపెట్టినది. వారసత్వం మరియు వీలునామా చట్టాల ద్వారా వసూలయ్యే పన్నులు ఇస్లామిక్ రాజ్యమే తీసుకుంటుంది.
సామాజిక ఆర్థిక న్యాయం నెరవేర్చుటకు, ఇస్లాం పేద బంధువుల హక్కులు, పొరుగువారి హక్కులు, బానిసలు మరియు పనివారు యొక్క హక్కులు, బాటసారుల హక్కులను తెలియజేస్తుంది. పై సామాజిక
హక్కులను నెరవేర్చడానికి జకాత్ ధనం
సరిపోకపోతే ఇస్లాం అనుసరించే వారు పేదల
అవసరాలను తీర్చ వలసి ఉంటుంది. ప్రవక్త (స)
ఒకని ఆదాయం లో జకాత్ తో పాటు నెరవేర్చవలసిన ఇతర పన్నులు కూడా ఉన్నవి అన్నారు.
కాబట్టి ఇస్లామిక్ సంక్షేమ రాజ్యం పేదల అవసరాలు తీర్చడానికి జకాత్ తో పాటు అదనంగా
ఆదాయం కోరుతుంది.
5. ఇస్లామిక్ సంక్షేమ రాజ్యం బలహీనులను రక్షించడానికి
ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం అనేక చర్యలు
ఇస్లాం తీసుకోంది. ఇస్లామిక్ రాజ్యం లో వడ్డీ పూర్తిగా రద్దుచేయబడింది. లంచం, జూదం, అనాధల సొమ్ము
తినడం ఊహాజనిత వ్యాపారo, నిధుల
దుర్వినియోగం, తూకాలు మరియు కొలతలలో
అక్రమాలు, సంపద అక్రమంగా ఆక్రమించుకోవటం, మోసపూరిత వ్యాపార పద్ధతులను ఇస్లామిక్ రాజ్యం లో నిషేధించారు. అనాథలు, మహిళలు, బానిసలు మరియు
పనివారు, కూలీలు మరియు
కార్మికులు, అద్దెదారులు , వినియోగదారులు తదితర బలహీన ప్రజల
హక్కులకు ఇస్లామిక్ సంక్షేమ రాజ్యం లో
పూర్తి రక్షణ ఉంటుంది.
6. ప్రజల సంక్షేమం మరియు ఒక దేశం యొక్క
అభివృద్ధిలో విద్య మరియు ఆరోగ్యo చాలా కీలక పాత్ర
పోషిస్తాయి. కాబట్టి ఒక సంక్షేమ రాజ్యం తన
సామాజిక ఆర్థిక లక్ష్యాలను సాదిoచుటలో ఈ రెండు రంగాలను విస్మరించజాలదు. అందువలన విద్య
మరియు ఆరోగ్యం ను ఉచితముగా లేదా సబ్సిడీ రేట్లకు అందించుట ఇస్లామిక్ సంక్షేమ
రాజ్యం ప్రధాన విధుల్లో ఒకటి. విద్యపై
ఇస్లాం యొక్క ప్రాధాన్యత నిజానికి ప్రవక్త
ముహమ్మద్ (స) వెల్లడించిన దివ్య
ఖురాన్ యొక్క మొట్టమొదటి ఆయత్ ఇకారా చదువు నుంచి అర్ధం చేసుకోవచ్చు. ప్రవక్త(స)
ముహమ్మద్ విద్య మరియు జ్ఞానం పొందడం ప్రతి ముస్లిం స్త్రీ, పురుషుని విధి గా పెర్కొన్నారు. ఇస్లాం
ఆరోగ్యంపై కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఇస్లాం ప్రవక్త అనారోగ్యం పాలైన వారిని
దర్శించమని తన అనుచరులకు ఉపదేశించారు. రోగగ్రస్తులకు
ఆరోగ్య మరియు వైద్య చికిత్స అందించడం ఇస్లామిక్ సంక్షేమ రాజ్యం మరో ప్రధాన విధి.
7. అతి ముఖ్యమైన ఇస్లామిక్ సంక్షేమ రాజ్యం యొక్క ప్రధాన
విధి దాని పౌరులకు ఆధ్యాత్మిక సంక్షేమo ప్రసాదించుట.
ఈ విధిని నిర్వర్తించుటకు గాను ఇస్లాం సంక్షేమ రాజ్యం దివ్య ఖుర్ఆన్ మరియు సున్నత్ లో వివరించిన
ఉన్న ఇస్లామిక్ ప్రభుత్వ వ్యవస్థ ను స్థాపిస్తుంది. ఇస్లామిక్ సంక్షేమ రాజ్యం లోని
ముస్లిం పౌరులు ఇస్లాం ధర్మం యొక్క బోధనలకు అనుగుణంగా తమ జీవితాలను ప్రారంభించాలి మరియు
ముస్లిం-మతేతరులకు(non-Muslims) పూర్తి మతపరమైన స్వేచ్ఛ ఇస్తారు. వారు ఏటువంటి పరిమితి లేకుండా తమ ప్రార్థనా స్థానాల్లో తమ మతాచారాలను పాటించ వచ్చు. ఇస్లామిక్
రాజ్యం ఇస్లాం ధర్మం యొక్క వ్యాప్తి కోసం పని చేయాలి, మానవత్వం యొక్క
మోక్షానికి పనిచేయడం ఇస్లాం ధర్మం లో ఉంది.
ఈ బోధన ఒప్పించడం ద్వారా జరగాలి కాని బలవంతపు చర్యలు
లేదా ఒత్తిడి ద్వారా జరగదు మరియు వాటిని ఇస్లాం
నిషేధించినది.
No comments:
Post a Comment