10 April 2016

ఇస్లాం ధర్మం లో మసీదు మరియు విద్యా పాత్ర



 



ఇస్లాo తోలి కాలంలో మస్జిద్  అనేక ప్రయోజనాల కోసం పనిచేసినది  మరియు ముస్లింల జీవితాల్లో అనేక బాధ్యతలు నిర్వహించినది.  ఆరాధన, శిక్షణ మరియు ప్రార్థన స్థలంగా మాత్రమే గాక ఇస్లాం సమాజం  యొక్క రాజకీయ మరియు సామాజిక కేంద్రంగా పని చేసినది.

నేడు, మనం విద్య గురించి పేర్కొన్నప్పుడు చాలా అరుదుగా ఇస్లాం గురించి  ఆలోచింతాము. అనేక సార్లు 'లౌకిక విద్య' మరియు 'మత విద్య.' అనే పదాలు వింటాము.  ఇస్లాం ధర్మం లో విద్య యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.ఇది  అనేక విధాలుగా దివ్య ఖురాన్ లోను, హదిసులలోను స్పష్టమైంది. ప్రవక్త ముహమ్మద్(స) కు  వెల్లడి అయిన దివ్య ఖుర్ఆన్ లోని మొదటి ఆయత్ “ ఓ ప్రవక్తా! పఠoచు సర్వాన్ని సృష్టించిన నీ ప్రభువు పేరుతో. అయన పేరుకు పోయిన నెత్తుటి ముద్దతో మానవుణ్ణి సృజించాడు. పఠoచు: నీ ప్రబువు పరమ దయాళువు. అయన కలం ద్వారా జ్ఞానం నేర్పాడు, మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు.”అంటున్నది.-96:1-5.

దివ్య ఖురాన్ మనలను అల్లాహ్ దగ్గరకు    తీసుకొచ్చే జ్ఞాన సముపార్జన చేయమని కోరుతుంది. దివ్య  ఖురాన్ కొన్ని కీలక అంశాలు మన మనస్సు లో పొందుపరచమని కోరుతుంది. ఇల్మ్ (జ్ఞానం) అనే పదం  దివ్య ఖురాన్ లో 750 సార్లు సంభవిస్తుంది.  అల్లాహ్ మరియు రబ్ (పోషకుడు) అనే పదం వరుసగా 2800సార్లు మరియు  950 సార్లు వినిపిస్తుంది. దివ్య ఖుర్ఆన్ తో పాటు ప్రవక్త ముహమ్మద్(స) యొక్క హదీసులు కుడా  ప్రజలను జ్ఞానం పొంద మంటాయి.  

అరబ్బీ బాష కు చెందిన మస్జిద్ అనే పదం నుంచి మసీద్ అనే పదం  వచ్చింది. మస్జిద్ అనగా ప్రార్థనా  స్థలం అని అర్ధం. మసీదు అనే భావన మదీనా లో ప్రవక్త(స) మొదటి మసీదు నిర్మించిన కాలం లో ఉద్భవించినది.  ఇస్లామిక్ తోలి కాలంలో మసీదు అనేక పనులు నిర్వహించినది  మరియు ముస్లింల జీవితాల్లో సమగ్ర బాధ్యతలు స్వీకరించినది. అది ఆరాధన, శిక్షణ  మరియు ప్రార్థన స్థలం గా మాత్రమే కాకా ముస్లిం సమాజం యొక్క ఒక రాజకీయ మరియు సామాజిక కేంద్రంగా విధులు నిర్వహించినది. ఇక్కడే ప్రవక్త(స) అనుచరులు సమావేశమై అతని సందేశాలు  వినేవారు, అతని అనుచరులు చదువు నేర్చుకొనేవారు, ప్రవక్త (స)  తన వహిలను  వినిపించేవారు, తన ప్రతినిదులను కలసి తన సందేశాలను చర్చించే వారు మరియు   అంతర్గత మరియు బాహ్య రాజకీయ కార్యకలాపాలు చర్చించేవారు.

చారిత్రాత్మకంగా మసీదులు విద్యా కేంద్రాలు. మత మరియు ప్రాపంచిక శాస్త్రాలు రెండు అక్కడ భోదించే వారు. అవి ముస్లింల జీవితాల్లో కీలకపాత్ర పోషించినవి. ఇస్లాం మరియు జ్ఞాన సంపాదన కు దగ్గిర సంభంధం  ఇస్లాం  ప్రారంభ దశ నుండి ఉన్నది. ఇస్లాం ధర్మం లో మసీదు విద్యా వ్యాప్తిలో ఒక గొప్ప పాత్రను వహించినది. విద్యతో మసీదుకు  అవినాభావ సంభందం చారిత్రాత్మకంగా  దాని ప్రధాన లక్షణాల్లో ఒకటి. ప్రారంభం నుండి మసీదు ఇస్లామిక్ సమాజమునకు  కేంద్రంగా ప్రార్థన, ధ్యానం, మత సంబంధమైన బోధన, రాజకీయ చర్చకు చోటుగా  మరియు పాఠశాల గా  ఉంది.

ఇస్లాం మతం విస్తరించిన ప్రతి చోట, మసీదులు ఏర్పాటయ్యాయి, మరియు మసీదు లో ప్రాథమిక మత విద్య  ప్రారంభమైంది. ఒకసారి ఏర్పాటు అయిన తరువాత  అటువంటి మసీదులు సుప్రసిద్ధ జ్ఞాన శిక్షణా కేంద్రాలుగా వర్దిలినవి.అటువంటి ప్రసిద్ధ ప్రదేశాలలో వందల, కొన్నిసార్లు వేల మంది విద్యార్థులతో ముఖ్యమైన గ్రంధాలయాలు కలిగి  ఉండేవి. ఉదాహరణకు   మదీనా, కైరో (అల్ అజహర్ ) మరియు డమాస్కస్ మసీదులు.
మసీదుకు అనుభందంగా  మొదటి పాఠశాల,  మదీనా లో 653CE, డమాస్కస్ లో మొదటి పాఠశాల 744CE లో ఆరంభమయ్యింది మరియు 900CE నాటికి ప్రతి మసీదు అబ్బాయిలు మరియు అమ్మాయిలకు  విడివిడిగా ఒక ప్రాథమిక పాఠశాలను కలిగి ఉండేది.  పిల్లలకు సాధారణంగా ఐదేళ్ల వయస్సు లో వారి విద్యాభ్యాసం ప్రారంభించేవారు. వారు నేర్చుకున్న మొదటి విషయం ప్రార్ధన(Salah) చేయడం మరియు దివ్య  ఖురాన్ పారాయణ చేయడంగా ఉండేది.  ప్రాథమిక విద్య పఠనం తరువాత  అరబిక్ నేర్వడం (చదవడం, వ్రాయడం)గా ఉండేది.

ప్రాథమిక అధ్యయనాలతో పాటు, విద్యార్థులకు  ప్రాథమిక అంకగణితo నేర్పించేవారు.జకత్  మరియు వారసత్వానికి సంభందించిన లెక్కలు తెలుసుకోవడానికి ఇది ఉపకరించేది. పైన పేర్కొన్న పాఠాలను ఏ మసీదులో అయిన పొందవచ్చు మరింత ఆధునిక అభ్యాసం కోసం పెద్ద మసీదులలోని మదరసాలలో శిక్షణా ఇవ్వబడేది.  శిక్షణ పొందే వారు విధిగా అరబిక్ వ్యాకరణం మరియు కవిత్వం, తర్కం, బీజగణితము, జీవశాస్త్రం, చరిత్ర, చట్టం, మరియు  వేదాంత శాస్త్రాలను అద్యయనం చేయవలసి ఉండేది.

మసీదుకు అనుభంద  మదర్సాల్లో కొన్ని ప్రపంచ స్థాయి శిక్షణా కేంద్రాలు గా ఉండేవి. .ప్రపంచ ప్రఖ్యాత అల్ అజహర్ యూనివర్శిటీ ప్రపంచంలోని పురాతన విశ్వవిద్యాలయం ఒకటి. ఇది 358AH నుండి  969CE మద్య  ఒక మసీదు వలె స్థాపించబడింది. ఇప్పుడు, అక్కడ వందల వేల చదువు కొంటున్న విద్యార్ధులను చూడవచ్చు.

చారిత్రాత్మకంగా ఇస్లాం మతం యొక్క చరిత్రలో మసీదు ఎల్లప్పుడూ ఒక ముఖ్యమైన సామాజిక పాత్ర పోషించింది ఇది ప్రార్థన, విద్యా సంస్థ, మత, రాజకీయ మరియు సామాజిక  కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది. మస్జిద్ ముస్లిం సమాజం యొక్క ఒక కేంద్ర బిందువు అయింది. ఖుత్బా (ఉపన్యాసం) ముస్లిం సమాజం ను ఉద్దేశించి ప్రసంగించడానికి  ఒక అద్భుతమైన అవకాశంగా ఉండేది.

ఖుత్బా ఎల్లప్పుడూ ముస్లిం ఉమ్మాకు  సూచనలు,సమాచారం ఇవ్వడం  మరియు తగిన చర్యలు తీసుకోవడం లో ప్రముఖపాత్ర ఆక్రమించినది. అల్లాహ్ సలాత్ అల్- జుమ్మా సమయంలో అన్ని వాణిజ్య మరియు ఇతర కార్యకలాపాలు ఆపివేసి  ప్రజలు ఖుత్బా వినడానికి మస్జిద్ కు రావాలని ఆదేశించినాడు.
దివ్య ఖురాన్ లో అల్లాహ్ అంటాడు:” విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజుకై పిలిచి నప్పుడు, అల్లాహ్ సంస్మరణ వైపునకు పరుగెత్తండి; క్రయవిక్రయాలను వదిలి పెట్టండి. మీరు గ్రహించ గలిగితే ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది.” 62:9.

ఖుత్బా ను ఉమ్మా మొత్తం కోసం  ప్రవక్త (స) మొదలుపెట్టినాడు. కాని నేడు ఖుత్బా సందేశం ఇచ్చేవారు ఇస్లాం మతం యొక్క ప్రాధమిక అంశాలను విస్మరిస్తున్నారు.
ఒక ఆదర్శవంతమైన ఇమామ్ ఫజ్ర్ నమాజ్ తర్వాత ఉదయం ఒక చిన్న ఉపన్యాసం ఇచ్చి తరువాత రోజులో ఆవిశ్వాసులకు ఇస్లాం మతం  గురించి వివరించి తరువాత  ఇస్లామిక్ సంస్థలలో (మదరసా, స్కూల్ లేదా కాలేజి లో)మాట్లాడి ఆతరువాత అవసమైతే మీడియా వారితో సమావేశం జరుపవలెను.  




No comments:

Post a Comment