డిజిటల్ లెర్నింగ్ ఆధునిక
విద్య లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పోకడల లో ఒకటి. ఈ రంగంలో
కెరీర్లు పుష్కలంగా ఉన్నాయి. “మీ శక్తి అంత పాత దానితో పోరాటం లో కాదు కొత్త
దానిని నిర్మించడం లో ఉంచండo” అని సోక్రటీస్ మార్పు ను నిర్వచించినాడు.
డిజిటల్ ఆధారిత అభ్యాసం
ఆధునిక విద్యలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పోకడలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు ఈ-లెర్నింగ్ మార్కెట్లో అనేక నూతన సాంకేతికతలను
అంచనా వేసినారు. ఎడ్-టెక్ స్పేస్ ఒక ఉత్తేజకరమైన మార్పు దశ లో కొత్త పరిచయాలు చేయడానికి తొందరగా ఉంది. బోధన మరియు అభ్యాసన ఉద్యమం సమూలంగా కొత్త లెర్నింగ్ గుణకాల ఆవిష్కరణ లోను మరియు ఆ రంగంలో నైపుణ్యాన్ని సాదించడానికి అధ్యాపకులకు
వివిధ నూతన మార్గాలు తెరిచింది. వాటిలో కొన్నింటిని మేము ఇక్కడ ప్రస్తావిస్తున్నాము:
1.అభివృద్ధి చెందిన
శిక్షణ (Augmented Learning)
అభివృద్ధి చెందిన శిక్షణ అనేది ఒక సంచలనం పదం. ఇది ఈ-లెర్నింగ్ యొక్క పొడిగింపు అందులో
స్థానికత, సందర్భం మరియు భౌతిక స్పేస్ కనిపించును. ఇది విద్యలో డిజిటల్ మరియు
ఆడియో టెక్నాలజీ ఉపయోగం అలాగే వర్చువల్ రియాలిటీ ని ఉపయోగించును. అభివృద్ధిచెందిన ఇన్నోవేటివ్
లెర్నింగ్ లో భాగంగా డిజిటల్ లెర్నింగ్ పద్దతులను మీడియా ఫార్మట్ లోనికి విలీనం
చేసి ఒక వినూత్న పద్దతి సిత్యువేతేడ్
లెర్నింగ్ నేర్చుకోవడానికి ఉపకరిస్తుంది. ఈ రిచ్ మీడియా అనుభవం వీడియోలు, చిత్రాలు, యానిమేషన్లు, 3D రూపంలో ఆసక్తికరమైన విషయాన్ని చూపించును మరియు అనుబంధ వాస్తవికత, అప్లికేషన్ తో చిత్రాల స్కానింగ్
ద్వారా, వాటి చుట్టూ ఏమి జరుగు
తుందో తెలుసుకుంటాము.
2.ఎం-లెర్నింగ్( M-Learning)
ఒక మొబైల్ సగటున భారతీయ
విద్యార్థి జీవితంను 12 శాతం నియంత్రణ లోనికి
తీసుకుంటోంది. పరిమిత మౌలిక సదుపాయాలు, అధిక
తీరిక సమయాలు, కళాశాల లేదా వయోజన విద్య ను మొబైల్ విద్య ద్వారా అందించే సంస్థలకు కనెక్ట్ అవుతున్నాయి. విషయాన్ని యాక్సెస్ చేసేందుకు తమ మొబైల్ ను కేవలం వాటితో లాగిన్ చేయాలి. లైవ్ వీడియోలు, స్ట్రీమింగ్ సెషన్ ప్రత్యక్ష పరస్పర సంభాషణ , కోర్సు విషయాలు
మరియు అనేక ఇతర లక్షణాలను వీటినుండి గ్రహించ వచ్చును. M- లెర్నింగ్ ఫ్లిప్పేడ్
తరగతులు మరియు MOOCs వంటి వాటిని చూపిస్తుంది.
HTML5 వివిధ బ్రౌజర్ల
ద్వారా ఎం-లెర్నింగ్ నేర్చుకోవటానికి ఉపయోగ పడును.
3.గామిఫికేషణ్ (Gamification)
గామిఫికేషణ్ ద్వారా విద్య 1980 లలో ప్రారంభం అయినది.
జేల్డా, కార్మెన్ సాన్దిగో దీని ప్రారంభకులు. ప్రస్తుత దశాబ్దంలో గామిఫికేషణ్ (Gamification) ఎన్నడు లేనంతగా భారతీయ
విద్యా విఫణిలో నమోదు చేయబడుతుంది. క్యాస్కేడింగ్ సమాచార సిద్ధాంత భావన అడుగడుగునా సమాచారాన్ని పాఠశాలల్లో ప్రయోగాత్మక
లెర్నింగ్ ద్వారా మరియు ఉన్నత విద్య లో తెరవబడటానికి అనుమతిస్తుంది. క్లాసు దోజో (ClassDojo), డ్యోలింగో వంటి ప్రపంచవ్యాప్త
బ్రాండ్స్ తో ఎడ్-గామిఫికేషణ్ చిత్రం మారిపోతున్నది.
4.అదృశ్య లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టం( Invisible LMS)
పురాతన లెర్నింగ్
మేనేజ్మెంట్ సిస్టం (LMS) విధానం కనపడకుండా పోతుంది. అది కొత్త అవతారం ఎత్తుతుంది. అన్ని లెర్నింగ్
ప్రక్రియలు విద్య వ్యవస్థలో అవసరం. ఒక శుభవార్త
LMS అభ్యాసకులకు తక్కువుగా
కనిపించేది అవుతుంది. ఒక LMS ను సృష్టించడం /
హోస్టింగ్ / రికార్డు కీపింగ్ పరంగా మరింత కఠినమవుతుంది మరియు కొత్తదనం, ప్రయోగాలకు
అవకాసం ఇవ్వదు. భవిష్యత్తు శాండ్బాక్స్ (sand boxing) లో ఉంది: పాఠాల రచన మరియు
ప్రచురణ,స్టూడెంట్ రికార్డుల బద్రపరుచుట మరియు యూజర్ ఇంటర్ఫేస్ నిర్వహణ విద్యా
పర్యావరణ వ్యవస్థల స్వతంత్ర, మాడ్యులర్ భాగాలు నిర్వహించుతాయి.
5. ప్రయోగ శిక్షణ(Experiment Learning)
రోబోటిక్స్, స్వీయ ఎలక్ట్రానిక్ కిట్లు, పాఠశాల కిట్లు, గేమింగ్ ఇలా మీరు ఏదైనా చెప్పండి అది ప్రయోగ శిక్షణ తో (Experiment Learning) ముడిపడి ఉంది. కొత్త బ్రాండ్లు, భావనలు, ఎడ్-టెక్ కంపెనీలు ప్రతి రోజు వస్తున్నాయి. ఉదా: గుగూల్ గ్లాస్ టూర్స్.
ఇండియన్ ఎడ్-టెక్ కంపెనీలు ఈ విషయంలో ముందజ వేసి కిరణజన్య సంయోగ క్రియ నుండి స్వీయ పని నమూనాలు, వక్రిభవనం వరకు ప్రతి మోడల్ వ్యక్తి పరంగా ఉంది.
6.మిశ్రమ
జ్ఞానార్జన
భౌతికoగా పుస్తకాల ద్వారా లెర్నింగ్ రోజుల వెళ్ళాయి. కానీ ఈ-లెర్నింగ్ పై మొత్తం
ఆధారపడటం ఇంకా చాలా దూరంలో ఉంది. ఈ విధానం సాంప్రదాయిక తరగతి బోధన విధానం ను
ఈ-లెర్నింగ్ విధానం తో మిళితం చేసింది. ఇది బహుళ పరికరాల లెర్నింగ్, కోర్స్ లను ఉన్న వనరులతో కలపడం,వివిధ బోధనా వ్యూహాలు
నేర్చుకోవడం తెలుపుతుంది. టెక్నాలజిస్ ను కలపడం, ఫ్లాట్ ఫార్మ్స్, మూలాలు మరియు
కంటెంట్ ప్రొవైడర్లు ఇవి 2016 లో వచ్చే నూతన బోధనా టెక్నాలజీస్.
7.సొంతంగా
విద్యార్జన (సెల్ఫ్ -అసిస్టెడ్ లెర్నర్)
కొత్త తరం విద్యార్ధి కోర్సులు, పుస్తకాలు లేదా కరిక్యులం
కోసం ఎదురు చూచుట లేదు, అతను వాటిని దాటి
వెళ్ళాలని అనుకొంటున్నాడు. కొత్త విషయాలు తెలుసుకోవడo, స్వీకరించడం, మరియు తన సొంత
సంకల్పం మరియు వేగంతో విషయాలు కనిపెట్టాలని
అనుకోoటున్నాడు. ట్యూటర్స్ ద్వార నేర్చుకోవటం కోచింగ్ క్లాసులకు వెళ్ళే రోజులు
పోయాయి. తాజా డేటా ప్రకారం పోటి పరిక్షలలో విజయులైన అబ్యర్ధులు 50 శాతం మంది బాహ్య
కోచింగ్ సహాయం లేకుండా స్వయం శిక్షణ తో ఉత్తిర్నులైనారు. విద్యార్ధి రాజు లాగా తనకి సరిపోయేది ఏమిటో తను స్వయంగా నిర్ణయించు కొంటున్నాడు.
No comments:
Post a Comment