కొబ్బరి నీరు లేదా నారియల్ పానీ వేసవిలో ఆరోగ్యకరమైన
పానీయం. ఇది అన్ని గృహాలలో లభించును.రోజు
ప్రారంభం ఒక గ్లాస్ కొబ్బరి నీరు తో
ప్రారంబించిన అనేక ప్రయోజనాలు కలవు.
క్రీడా పానీయం, కోలా డ్రింక్, పంచదార ప్రీమిక్స్
లేదా పండ్ల రసం కంటే మన శరీరంనకు కొబ్బరి నీరు ఆరోగ్యకరమైనది.
పోషక విలువలు:
లేత కొబ్బరి నీళ్ళ
విటమిన్లు, ఎలెక్ట్రోలైట్స్, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, ఎంజైములు, పైటో హార్మోన్లు
& సైటోకైనిన్స్ తో
నిండిఉండును. ఇది నాలుగు అరటికాయ ల కంటే
ఎక్కువ పొటాషియం కలిగి కేలరీలు, కొవ్వు
లేకుండా సులభంగా జీర్ణం అగును.
ఆరోగ్య
ప్రయోజనాలు:
క్రమం తప్పకుండా రోజు కొబ్బరి నీరు త్రాగుట వలన అనేక లాభాలు
ఉన్నాయి.
1. కొబ్బరి నీరు మూత్రవిసర్జన కారి:
కొబ్బరి నీరు మూత్రపిండ
వ్యవస్థ (మూత్రపిండాలు, మూత్రాశయం, యుటేరస్& ఉరేత్రా) ను ఆరోగ్యకరoగా ఉంచి, కిడ్నీ లో రాళ్ళు ఏర్పడుటను నిరోధిస్తుంది
ఉంచుతుంది. శరీరం నుండి యూరిక్ యాసిడ్, ఫాస్ఫేట్లు వంటి మలినాలను పంపి మూత్ర సమస్యలు
నిరోధిస్తుంది.
2. కొబ్బరి నీరు బరువు తగ్గిస్తుంది:
300 ml కొబ్బరి నీటిలో కేవలం 60 కేలరీలు ఉన్నవి.
ఒక కోలా డ్రింక్ లో 139 కేలరీలు, పండ్ల రసం లో 142 కేలరీలు మరియు ఒక ఆరోగ్య పానీయం లో 200 కేలరీలు కలవు.
ఇది శరీరం కు పోషణ అందిస్తుంది మరియు ఆకలి అణచివేస్తుంది. అల్పాహారం లేదా భోజనం తో
కొబ్బరి నీటిని తీసుకొన్న భోజనం మధ్య
అల్పాహారం అవసరం ఉండదు దీనితో ఇది శరీరం లోని నీటి నిల్వ పై చెక్ ఉంచుతుంది.
3. కొబ్బరి నీరు వయస్సు మీదపడిన ప్రక్రియ వేగాన్ని
తగ్గిస్తుంది:
కొబ్బరి నీరు లోని కణాలు
సెల్యులార్ స్థాయిలో వృద్ధాప్యం ఆలస్యం అగుటకు సహాయపడుతుంది. కాలుష్యం, ఒత్తిడి మరియు చెడు
ఆహార అలవాట్ల పై పోరాడుతుంది. ఇది సైటోకైన్లతో నిండి కణాల నాణ్యతను మెరుగుపరిచేందుకు మరియు రోగనిరోధక శక్తి పెంచేదుకు తోడ్పడుతుంది.
4. కొబ్బరి నీరు రి-హైడ్రేట్ చేస్తుంది:
వేసవి నెలల్లో శక్తి
లేకపోవడం మరియు నీరస అనుభూతి కి ప్రధాన కారణాలలో ఒకటి చెమట ద్వారా కీలక పోషకాలను
నష్టపోవడం. కొబ్బరి నీరు ఆ పోషకాలను శరీరం లో తిరిగి నింపుతుంది మరియు శక్తి ఇస్తుంది. ఎక్కువగా
డి-హైడ్రట్ అయిన సందర్భాలలో ఫలితాల కోసం కొబ్బరి నీరుతో ఒక చిటికెడు ఉప్పు జోడింఛి
ORS ద్రావణం లాగా తాగండి.
5. కొబ్బరి నీరు రక్తపోటును నియంత్రించుటకు సహాయపడుతుంది:
కొబ్బరి నీరు పొటాషియం, మెగ్నీషియం & విటమిన్ సి నిండి
రక్తపోటు నియంత్రణకు సహజ మార్గం గా ఉపయోగ పడుతుంది. పొటాషియం ఉప్పు (సోడియం)
యొక్క ప్రభావాలు అడ్డుకుంటుంది. ఇది చెడు కొలెస్టరాల్ తగ్గింఛి గుండెను కాపాడు తుంది. ధమనులలో కొవ్వు తగ్గిస్తుంది మరియు రక్త ప్రసరణ
పెంచుతుంది. శరీరం లో మంచి
కొలెస్ట్రాల్ పెంచుతుంది.
6. కొబ్బరి నీరు చర్మానికి మంచిది:
కొబ్బరి నీరు మోటిమలు
నిరోధిస్తుంది చర్మం సాగుటను తగ్గిస్తుంది.
చర్మపు రంధ్రాల బిగుసు, మచ్చలు, ముడుతలు తగ్గిస్తుంది మరియు చర్మం యొక్క వార్ధక్యo ను
నివారిస్తుంది. కొబ్బరి నీరు లోపల మరియు
బయట నుండి చర్మం మరియు జుట్టు ను
కాపాడును.
7. కొబ్బరి నీరు అంటి- బ్యాక్టీరియల్:
కొబ్బరి నీరు సహజంగా అంటువ్యాధులను
నిరోధిస్తుంది రోగనిరోధక శక్తి పెంచును మరియు
ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ ను కాపాడును. కొబ్బరి నీటిలో ఉండే సహజ చక్కెరలు మీ
ఆహారంలో వ్యాధి కలిగించే వ్యాధికారక సూక్ష్మజీవులను నాశనం చేయును.
ఈ వేసవి లో కొబ్బరినీళ్ళు
మీరు ఇష్టపడే డ్రింక్. కొబ్బరి నీరు త్రాగండి ఆరోగ్యంగా హ్యాపీ గా ఉండండి!
No comments:
Post a Comment