చియా లేదా
సబ్జా గింజల శాస్త్రియ నామం సాల్వియా హిస్పనికా.
ఇది పుదీనా కుటుంబం లో పుష్పించే మొక్క.
దీని జన్మ స్థలం కేంద్ర మరియు దక్షిణ మెక్సికో మరియు గ్వాటెమాల.
ఇది
పదహారవ శతాబ్దపు అజ్టేక్
ల ద్వారా సాగుచేయబడింది. ఇది ఒక ఆహార పంటగా మొక్కజొన్న లాగా
ముఖ్యమైనది. ఇప్పటికీ పుష్టికరమైన పానీయo మరియు ఆహార వనరుగా పరాగ్వే, బొలీవియా, అర్జెంటీనా, మెక్సికో, మరియు గ్వాటెమాల వారు
దీనిని ఉపయోగిస్తారు. అధిక ప్రోటిన్లతో కూడి సూపర్ ఫుడ్ గా పిలవ బడుచున్నది.
పోషక విలువలు:
ఈ చిన్న గింజలు అధిక
మొత్తం లో ప్రోటీన్స్, ఫైబర్, ఒమేగా -3 & ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, రాగి, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, పొటాషియం, భాస్వరం, జింక్ మరియు
విటమిన్లు A, B, E & డి మరియు
అంటి-అక్సిడెంట్స్ కలిగి కెలోరీలు మరియు కార్బోహైడ్రేట్ల ను తక్కువుగా కలిగి
ఉన్నవి.
చియా లేదా సబ్జా గింజలు
అదిక పోషక విలువలు కలిగి అనేక అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి.
1. బరువు కోల్పోవడం లో సహాయ పడును:
తక్కువ క్యాలరిలను కలిగి చియా
విత్తనాలు అధిక నీరు నిల్వచేసే
సామర్థ్యాలు కలిగి ఉండి దప్పిక తగ్గించును. పలితంగా శరిరం లో నీరు తగ్గి బరువు తగ్గును.
2. కండరాల తయారీ లో సహాయ పడును:
చియా విత్తనాలు అధిక ప్రోటీన్స్ కలిగి ఉన్నాయి. ఖనిజాలతో పాటు, ఈ అధిక ప్రోటీన్ కండరముల శీఘ్ర పెరుగుదలకు తోడ్పడును.
3. బ్లడ్ షుగర్ స్థాయిలు క్రమబద్ధీకరించును.
ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్
మరియు ఫైబర్ యొక్క ఉనికి కారణంగా, చియా విత్తనాలు డయాబెటిస్ నియంత్రణ లో ఉపకరించును.
4. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచును.
ఖనిజాలు, మాంసకృత్తులు
మరియు ఒమేగా -3 & -6 కొవ్వు ఆమ్లాలు
కలిగి చియా విత్తనాలు బ్లడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది మరియు
గుండె కు బలం ఇస్తుంది.
5. వార్ధక్యం ను ఆలస్యం చేయును.
చియా విత్తనాల లోని అంటి-అక్సిడేన్ట్స్
చర్మం పరిస్థితి ని మెరుగు పరుచును మరియు వృద్ధాప్యం ను ఆలస్యం చేయును.
6. ఎముకలను బలోపేతం చేయును.
చియా విత్తనాల ఒక ఔన్స్ 18% శరీరo యొక్క
రోజువారీ కాల్షియం అవసరాలను తీర్చును. పాలలో
కంటే ఎక్కువ క్యాల్సియం దీనిలో ఉండును. ఈ
అధిక కాల్షియం ఎముకలు మరియు అస్థిపంజరo కు
బలం ఇచ్చును.
7. జీర్ణశక్తి మెరుగుపరుచును.
చియా విత్తనాల అధిక
ఫైబర్ కంటెంట్ శరీరంలో జీర్ణక్రియ పెంచి మరియు విసర్జనను మెరుగుపరుస్తుంది.
చియా లేదా సబ్జా విత్తనాల
ను ఉపయోగించడo:
Ø చియా విత్తనాల చాలా
రకాలుగా మన ఆహారంలో చేర్చవచ్చును. విత్తనాలు చాలా తేలికపాటి వగరు రుచి కలిగి
ఉండును. అవి దాదాపుగా అన్నింటిలో వాటి రుచి కి అంతరాయం లేకుండా ఉపయోగించవచ్చు.
Ø చియా విత్తనాల లో
ఉండే అధిక నీరు నిల్వచేసే సామర్ధ్యం కూరలు, రసాలను లేదా పుడ్డింగ్లను గట్టిపరిచును.
Ø ఈ విత్తనాలు ఆహార
పదార్ధములను కరకర లాడునట్లు చేయును.
Ø చియా విత్తనాల ను
తినడానికి ఉత్తమ మార్గం విత్తనాలను నూరి
లేదా సుమారు 2 గంటలు నీటిలో
నానబెట్టి తర్వాత తినవచ్చును.చియా విత్తనాల సుమారు 2-3 టీ-స్పూన్స్ రోజు పెద్దవారు తినవచ్చును.
Ø పొగాకు ను
వ్యతిరేకించే వారు పొగాకు స్థానం లో అధిక ఆదాయం మరియు పోషక విలువలతో కూడిన ఈ పంటను
పండించమని ప్రభుత్వం పై వత్తిడి చేస్తున్నారు.
No comments:
Post a Comment