వర్తమాన యుగం లో పారిశ్రామిక
సంబంధాలలో కార్మిక సంక్షేమం అతి ప్రధాన అంశం గా మారినది. ఆధునిక పారిశ్రామీకరణ, యాంత్రీకరణ, ప్రపంచీకరణ
యుగంలో పరిశ్రమల్లో కార్మిక సంక్షేమ
ప్రాముఖ్యత పెరిగినది మరియు ఆధునిక ప్రపంచo
కార్మిక సంక్షేమ అవశ్యకత గుర్తించినది.
ఇస్లాం ధర్మం భౌతికమైన
మరియు మేధో శ్రమ కు ప్రాధాన్యత ఇచ్చినది. దివ్య ఖురాన్ లో వివరించిన ప్రవక్త నోహ్
పడవ నిర్మాణం, ప్రవక్త మూసా గొర్రెలను కాయటం మరియు జుల్-కర్నైన్ ద్వారా ఒక గోడ నిర్మాణం భౌతిక శ్రమశక్తి ని
సూచిస్తున్నవి. ఈజిప్ట్ రాజు యొక్క సంపదకు నిర్వహణ అధికారిగా నియమితులైన ప్రవక్త యూసుఫ్ కథ మేథో కార్మిక
శక్తిని సూచిస్తుంది.
ప్రవక్త (స) కు ముందు అరేబియా లో కార్మిక
శక్తీని ప్రధానంగా బానిసలు అందించినారు.
కాని బానిసల పట్ల యజమానుల వైఖరి చాలా
అమానుషo గా మరియు క్రూరoగా ఉండేది. ప్రవక్త(స) వారి మానవ గౌరవం(human dignity)
పునరుద్ధరింఛి సోదరులు మరియు సహచరుల స్థాయికి వారి పరపతిని పెంచినారు.
ఇస్లాం సంపద నిర్మాణం
లో కార్మికుల మరియు మూలధనం పాత్రను
సంయుక్తంగా గుర్తిస్తుంది. ఇస్లాం ధర్మం బలహీనులైన కార్మికుల హక్కులను రక్షించడానికి అనేక చర్యలు తీసుకుంది.
కార్మిక హక్కుల కల్పన నిజానికి యజమాని
విధిగా భావిస్తుంది మరియు యజమాని సంక్షేమం కార్మికుల విధిగా భావిస్తుంది.
కార్మిక సంక్షేమo
సంబంధించి ఇస్లాం ఇచ్చిన మార్గదర్శక
సూత్రాలు:
1.శ్రమ ద్వార
సంపాదించటం:
ప్రవక్త ముహమ్మద్
(స) స్వీయ శారీరక శ్రమ ప్రాధాన్యతను కొనియాడారు. వారి అభిప్రాయం లో “తన స్వీయ
శారీరక శ్రమ ద్వార సంపాదించిన ఆహరం భుజించుట కన్నా ఉత్తమమైనది మరియొకటి లేదు మరియు ప్రవక్త దావూద్ ఎల్లప్పుడూ తన శారీరక కష్టం
ద్వారా సంపాదించినదే భుజించేవారు.”-బుఖారి.
2. లిఖిత ఒప్పందం:
ఇస్లాం అన్ని ఒప్పందాలు
లిఖితం గా ఉండాలని కోరుతుంది. దివ్య ఖురాన్ ప్రకారం “వ్యవహారాన్ని వ్రాసి
పదిలపరచండి.వ్యవహారం చిన్నదైనా,పెద్దదైనా, దానిని గడువు నిర్ణయంతో దస్తావేజు రూపం
లో రాయించటానికి అశ్రద్ద చెయ్యవద్దు.” అని ఆదేశిస్తుంది.-2:282.
పై ఆయత్ లో వివరించినట్లు
అన్ని వ్యాపార లావాదేవీలు, రుణ
ఒప్పందాలకు సంబంధించినవి మరియు
కార్మికుడు-యజమానికి మద్య సేవా ఒప్పందం
లిఖిత పూర్వకం గా ఉండాలి. ఇది చాలా సరైనది. ఇది భవిష్యత్తులో తలెత్తే తేడాలు లేదా
వివాదాలను పరిష్కరించడంలో సహాయం చేస్తుంది.
3.వేతన నిర్ణయం:
కార్మికులు న్యాయమైన
మరియు సహేతుకమైన వేతనాలు పొందాలి. లేనియెడల అది వారి లో అసంతృప్తి, నిరాశ, ఆందోళన మరియు
దాడులకు దారి తీస్తుంది. అందువలన కార్మికులు జాతీయ ఆదాయం నుండి తమ వాటా కోల్పోకుండా
చూడాలి లేనియెడల దీర్ఘకాలంలో దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుంది.
ఇస్లాం మతం న్యాయం మరియు
వాస్తవికత ఆధారంగా ఉద్యోగి మరియు యజమానుల ఇద్దరి ప్రయోజనాలను రక్షిస్తుంది. వేతనం
సమస్యలకు చాలా సహేతుకమైన పరిష్కారం అందిస్తుంది. ఇస్లాం ప్రకారం ఎవరి ప్రయోజనాలకు
నష్టం లేకుండా, ఒక
సమాన,న్యాయబద్దమైన పద్ధతిలో వేతనాలు నిర్ణయించవలసి
ఉంది.
“అల్లాహ్ న్యాయం చేయండి,
ఉపకారం చేయండని అజ్ఞాపిస్తున్నాడు”. దివ్య ఖురాన్ -16:90.
ప్రవక్త(స) ప్రకారం “ మీ
బానిసలు మీ సోదరులు. అల్లాహ్ వారిపై మీ అధికారం ను ఉంచాడు, కాబట్టి మీ సోదరుల పట్ల
గౌరవంగా ప్రవర్తించండి. మీరు తినేది వారికి పెట్టండి, మీరు కట్టుకోనేది వారిని
కట్టుకోనియండి. తలకు మించిన భారం వారిపై మోపకండి, అధిక భారం మోయటం లో వారికి సహయం
చేయండి”.-భుకారి & ముస్లిం.
కాబట్టి యజమాని మరియు
ఉద్యోగస్థులు ఒకరినొకరు సోదరులు గా
పరిగణించాలి. ఇద్దరి మద్య న్యాయం మరియు దయ తో కూడిన ప్రవర్తన ఉండాలి. కార్మికుల సహకారం లేనిదే ఉత్పత్తి
సాధించలేదు అనేది యజమాని గుర్తుచుకోవాలి కనుక అతను
సహేతుకమైన వేతనాలు కార్మికులకు చెల్లించాలి.
ప్రవక్త ముహమ్మద్ (స)
ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి గౌరవంగా జీవించేదుకు కావలిసిన కనీస వేతనo
చెల్లించాలి.
యజమానులు మొదట వేతనం
నిర్ణయిoచకుండా కార్మికులను నియమించరాదు.
ప్రవక్త(స) మొదట వేతనాలు
నిర్ణయిoచకుండా కార్మికుడు లేదా ఉద్యోగి
ని నియమించడాన్ని నిషేధించినారు అని అబూ
సయీద్ కాద్రి ప్రకటించారు.
4. వేతనo
చెల్లింపు:
ఇస్లాం పని వెంటనే
కార్మికులకు వేతనాలు చెల్లించమని యజమానులను
ప్రోత్సహిస్తుంది. దివ్య ఖురాన్ లో ప్రవక్త మూసా వృతాంతం లో “ఇద్దరు
స్త్రీలలో ఒకామె సిగ్గుపడుతూ, బిదియపడుతూ మూసా వద్దకు వచ్చి ఇలా చేప్పసాగింది. నా
తండ్రి గారు మిమ్మల్లి పిలుస్తున్నారు, మీరు మా పశువులను నీరు త్రాపించిన దానికి
గాను మీకు ప్రతిఫలమీయడానికి.”28:25.
ప్రవక్త (స) ఇలా అన్నారు:
ఎవరైతే అంతిమ దినమున అల్లాహ్ పేరు ఉపయోగించుకొని విశ్వాసం ను వమ్ము చేస్తాడో మరియు
ఎవరైతే ఒక స్వతంత్ర మనిషిని విక్రయిoచి లాభం పొందుతాడో, మరియు ఒక కూలివానికి వేతనం చేల్లిoచడో అతనికి వ్యతిరేకంగా అల్లాహ్
సాక్షం ఇచ్చును.”-భూకారి.
కార్మికుని చెమట
ఆరకమునుపే అతని వేతనం చేల్లిoచమని ప్రవక్త(స) అదేశించెను.- ఇబ్న్ మాజా.
పై హదీసు రెండు వివరణలను ఇచ్చును. ఒకటి కార్మికుని
వేతనం వెంటనే చెల్లించాలి మరియు కార్మికుని వేతనం కు యజమాని భరోసా కల్పించాలి.
5. కార్మికుల బాద్యతలు:
కార్మికుల బాధ్యతలు
నిజానికి యజమాని హక్కులు. కార్మికుడి ప్రాథమిక బాధ్యత సేవ ఒప్పందం లో భాగంగా తన
బాద్యతలు తీర్చడం. అతను సమర్ధవంతంగా
నిజాయితీగా, సేవా నిబంధనలకు మరియు
పరిస్థితులకు అనుగుణంగా తన విధులను పూర్తి
చేయాలి. అతను విధికి అంకితం అయి ఉండాలి.అతని నైపుణ్యాలు మరియు అర్హతలు మెరుగు
పరుచుకోవడానికి యజమాని శిక్షణ అందిస్తే
అతను మనస్పూర్తిగా ఆ శిక్షణ వలన లాభం పొంది తన జ్ఞానం మరియు నైపుణ్యం ను మెరుగుపరుచుకోవాలి. తన యజమాని పట్ల విశ్వాసo
మరియు నిజాయితీతో ఉండాలి. ఒకవేళ అతనికి
తన యజమాని ఆస్తిని అప్పగిస్తే అతను తన నమ్మకంగా ప్రవర్తించాలి, ఆస్థి కి
నష్టం కలిగించరాదు.
ప్రవక్త ముహమ్మద్ (స)
అన్నారు: ఒక బానిస హృదయపూర్వకoగా తన యజమాని వద్ద విధులు నిర్వహిస్తూ యజమాని
గురించి దువా చేస్తే అతని బహుమానం రెండింతలు ఉంటుంది”.- బుఖారి.
తన యజమాని క్షేమాన్ని
కోరేవాడు మరియు అల్లాహ్ ను ఆరాదించేవాడు మీలో
ఉత్తముడు.(బానిస)” –బుఖారి.
శారీరక సామర్ధ్యం ఒక కార్మికుల కి చాలా అవసరం. ఒక బలమైన మరియు ఆరోగ్యకరమైన
కార్మికుడు మరింత ఉత్పాదకత తో మరియు
సమర్థవంతగా నిజాయితీ గా తన విధులను నిర్వహించగలడు. దివ్య ఖురాన్ లో ప్రవక్త ముసా
కధ దీనికి ఉదాహరణ.
అలాగే ఒక మేధో
కార్మికుడి వద్ద జ్ఞానం, నైపుణ్యం మరియు
తన యజమానిని సంతృప్తి పరిచే తెలితేటలు
ఉండాలి. దివ్య ఖురాన్ లో వివరించిన యూసుఫ్ కధ దీనికి ఒక ఉదాహరణ. దివ్య ఖురాన్ లో
యూసుఫ్ అంటాడు:”దేశం లోని ఖజానాలను నాకు అప్పగించండి. వాటిని నేను రక్షించగలను.
అందుకు తగిన జ్ఞానం నాకు ఉన్నది.”-దివ్య ఖురాన్
12:55.
కాబట్టి నైపుణ్యం’
నమ్మకం వృతిపరమైన యోగ్యత మరియు చిత్తశుద్ధితో తన వృత్తివిధులు కార్మికుడు నిర్వర్తించాలి.
6.కార్మికులతో
ప్రవర్తన:
ఇస్లాం దృష్టి లో స్త్రీ-
పురుషులు ఇరువురు సమానులు. ఇస్లాం ముస్లింలలో సోదర బావం, సౌబ్రాతృత్వం
మరియు సమానత్వం ఏర్పాటు చేసింది మరియు జాతి, రంగు, భాష, జాతీయత లేదా సంపద ఆధారంగా మనిషులమధ్య అన్ని
రకాల వ్యత్యాసాలు రద్దుచేసింది. ఇస్లాం ధనిక లేదా పేద, తెలుపు లేదా
నలుపు, యజమాని లేదా
ఉద్యోగి, అరబ్ లేదా అరబెతరుడు, సంపన్న లేదా కార్మికుడు అందరు మానవులు
ఆదాం సంతానమని నమ్ముతుంది.
ప్రవక్త(స) ప్రకారం “ మీ
క్రింది ఉద్యోగులు మీ సోదరులు. అల్లాహ్
వారిపై మీ అధికారం ను ఉంచాడు, కాబట్టి మీ సోదరుల పట్ల గౌరవంగా ప్రవర్తించండి. మీరు
తినేది వారికి పెట్టండి, మీరు కట్టుకోనేది వారిని కట్టుకోనియండి. తలకు మించిన భారం
వారిపై మోపకండి, అధిక భారం మోయటం లో వారికి సహయం చేయండి”.-భూకారి & ముస్లిం.
ఒక హదీసు ప్రకారం ప్రవక్త(స)
తన సేవకులను తన కుటుంభ సబ్యులుగా చూసేవారు. వారిపట్ల ఎన్నడు కటినంగా ఆఖరికి “ఊప్”
అని కూడా అనే వారు కాదు.వారిలో ఎవరైనా రోగగ్రస్తులు అయితే వారిని స్వయంగా వెళ్లి
పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి
కనుగోనేవారు.-అనస్.
ప్రవక్త (స) తన అనుచరులకు
వారి శక్తికి మించిన పని ఇచ్చే వారు కాదు. పని ఎక్కువగా ఉండి కార్మికుడు దాన్ని చేయలేకపోతే, ఆ పని చేయడం లో అతనికి సహాయ పడేవారు.
ఇస్లాం ప్రకారం
ఒక కార్మికుని హక్కులను మానవ హక్కులుగా
పరిగణించాలి మరియు పనికి తగిన గౌరవం
ఇవ్వాలి. ఉపాధి సమయంలో సహేతుకమని వేతనాలు నిర్ణయిoచాలి మరియు ఆ వేతనo వెంటనే చెల్లించాలి. అలాంటి హక్కుల భావన
పద్నాలుగు వందల సంవత్సరాల పూర్వమే ఇస్లాం
ద్వారా కార్మికులకు ఇవ్వబడింది.
No comments:
Post a Comment