భారతదేశం వేలకొలది
మదరసాలకు నిలయం. అక్కడ అరబిక్ మరియు
ఇస్లామిక్ స్టడీస్ తో పాటు ఆధునిక సబ్జక్ట్స్
ఇంగ్లీష్,
గణితం మరియు కంప్యూటర్ అధ్యయనo నేర్పబడును.
ఆంగ్ల భాష తో పాటు అరబిక్ బాష ఒక్కటే భారతదేశం
లో గ్రామస్థాయి వరకు అధ్యయనం కోసం పూర్తి మౌలిక సదుపాయాలు కలిగిన విదేశీ భాషగా ఉంది. మతపరమైన విద్యను అందించటం
తో పాటు భారతదేశంలోని వందల వేల కొద్ది మదరసాలలో
ఫిజిక్స్,
గణితం, రసాయన శాస్త్రం, హిందీ, ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ అధ్యయనo మొదలైన ఆధునిక విషయాలను
బోధించేదరు. ఈ మదరసా విద్యార్థులు దాదాపు 400 మిలియన్ ప్రజలు మరియు $ 6.0 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆర్థిక వ్యవస్థ ఉన్న అరబిక్
మాట్లాడే ప్రపంచానికి చేరడం లో భారత
కంపెనీల కు సహాయకారి కాగలరు.
జనవరి 2008 లో
నేను ఒక వ్యాపార పర్యటనపై ఆల్జియర్స్, అల్జీరియా కు వెళ్ళాను. పూనే(ఇండియా) కు చెందిన టైర్ వ్యాపారి మరియు 40
సంవత్సరాల IT నిపుణుడు అయిన మరొక భారతీయుడు కూడా అదే హోటల్ లో బస చేసినాడు. మరుసటి రోజు హోటల్ వసారాలో కూర్చొని నేను, అతను ప్రక్కన ఉన్న ఖాతాదారుల తో సంభాషించడం చూసాను.
ఆ సంభాషణ మొత్తం ఘోరం గా విఫలమైనది.
భారతీయ వ్యాపారికి ఫ్రెంచ్ లేదా అరబిక్ రాదు లేదా అతని ఖాతాదారులకు ఆంగ్లము రాదు.
సాయంత్రం మాటల్లో అతను పరిమితంగా ఆంగ్లము మాట్లాడే అరబిక్- వ్యాపార ప్రపంచం, (బహుశా గల్ఫ్ దేశాల్లో తప్ప) గురించి ప్రస్తావించాడు. మోటారు విడిభాగాలు,
బట్టలు,
టైర్లు, పారిశ్రామిక మరియు
నిర్మాణ వస్తువులు మొదలగు రంగాలో డీలర్స్
స్థాయిలో అరబిక్ మాట్లాడటం తప్పనిసరి
అని (గల్ఫ్ దేశాల్లో కూడా) అన్నాడు.
చివరికి నేను అడిగాడు, "ఎందుకు మీరు అరబ్ ప్రపంచం లో వ్యాపారం లో సహాయపడటానికి
ధారాళం గా అరబిక్ మరియు ఆంగ్లం మాట్లాడే ఒక భారతీయని సహాయం తీసుకోకూడదు అని?
అతను ఒక క్షణం ఆగి “అరబిక్ మాట్లాడేవారు భారత దేశం లో
దొరుకుతారా?” అని అన్నాడు.
నేను “అవును” అన్నాను". అతను "ఎక్కడ?" అని అడిగాడు.
నేను అతనిని పూనే లోని అతిపెద్ద మసీదుకు
వెళ్లి ఇమామ్ను కలవమని సూచించాను. "ఇమామ్ ఖచ్చితంగా మీకు అరబిక్ లో ధారాళంగా మరియు ఆంగ్లం లో సహేతుకమైన స్థాయి వరకు మాట్లాడే
నిపుణులను సూచించ గలరు అని అన్నాను. అతను అర్ధమైనట్లుగా నవ్వాడు. నేను మరుసటి రోజు
ఉదయం విమానంలో రియాద్ చేరుకొన్నాను.
క్రిందటి శనివారం, అదే వ్యక్తి రియాద్ లోని ఒక హోటల్ నుండి డిన్నర్ కు నన్ను ప్రేమగా
ఆహ్వానించినాడు.
డిన్నర్ టేబుల్ వద్ద అతను నన్ను 30
సంవత్సరాల ఒక గడ్డముగల మనిషి ని అరబ్ ప్రపంచo లో తన సేల్స్ మేనేజర్ గా పరిచయం చేసాడు. ఎనిమిది సంవత్సరాల క్రితం అల్జీర్స్ లో జరిగిన మా సంభాషణ నుండి ఒక క్లూ తీసుకోని
పూనే లోని ఒక మదరసా నుండి ఒక అరబిక్ మరియు ఇంగ్లిష్ మాట్లాడే టీచర్ ను తనకు
సహాయకునిగా నియమించుకొన్నాడు. అతనికి అమ్మకాలు
మరియు మార్కెటింగ్ లో శిక్షణ ఇచ్చాడు మరియు ఇప్పుడు అదే వ్యక్తి మాతో డైనింగ్ టేబుల్
వద్ద కూర్చున్నవ్యక్తి.
అతను ఒక మంచి ప్రొఫెషనల్ సేల్స్
మ్యాన్ గా కనిపించాడు. అతను టైర్ సంస్థకు
మంచి ఆదాయాన్ని ఇచ్చే ప్రధాన ప్రాంతంగా
అరబ్ ప్రపంచంను రూపొందించాడు.
నా స్నేహితుడు లో మిడిల్ ఈస్ట్ లో పెరుగుతున్న తన వ్యాపార కోసం మదరసాను నుండి మరి
ముగ్గురు అరబిక్ మరియు ఆంగ్లం మాట్లాడే సేల్స్-మెన్స్
ను నియమించాడు మరియు వారు బాగా పనిచేస్తున్నారని అన్నాడు. ఇప్పుడు అతను ఇరాన్
మరియు తజికిస్థాన్ లో వ్యాపారం కోసం ఒక
పెర్షియన్ మరియు ఆంగ్లo మాట్లాడే వ్యక్తి కోసం చూస్తున్నాడు.
మదరసాలో చదువుకున్న అమ్మకాల(sales)
మేనేజర్ కూడా సంతోషంగా తన అదృష్టం ఎలా మారిపోయిందో
తన అభిప్రాయం మాతో పంచుకున్నాడు. అతను ఒక
మిడిల్ క్లాస్ పరిధిని దాటి కొత్త కారు, ఒక మంచి అపార్ట్మెంట్ కొని పూనే లో ఒక మధ్య తరగతి ప్రాంతం మరియు సమాజంలో ఒక మంచి
స్థితి లో ఉన్నాడు. ఈ జీవితం అతను ఎనిమిది సంవత్సరాల క్రిందట ఊహించలేదు!.
అన్నింటికన్నా ముఖ్యం ఆ తయారీదారుడు తన దృక్పదం ను ముస్లిమ్స్ ప్రత్యేకించి మదరసా
విద్యార్థుల పట్ల మార్చుకొన్నాడు. ఇది చాలా సంతోషించదగిన విషయం.
గతంలో, అతను ముస్లిమ్స్
పట్ల అపనమ్మకం మరియు పగ తో ఉండేవాడు కానీ
ఇప్పుడు అపారమైన ప్రశంసలు మరియు భాగస్వామ్యం యొక్క భావనను ముస్లింల పట్ల పెంచుకొన్నాడు. వ్యాపార
సాన్నిహిత్యం స్పష్టంగా అతని సందేహాలు
తొలగింఛి మరియు పరస్పర గౌరవం మరియు
అన్యోన్యత పరిస్థితిని అభివృద్ధి చేసింది.
అతను ఇప్పుడు నలుగురు ముస్లిం ఉద్యోగుల యజమాని ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక్క ముస్లిం ఉద్యోగి
అతని వద్ద లేదు.
కొద్ది మంది కి మాత్రమే తెలుసు ఇంగ్లీష్ తో పాటు అద్యయనం కోసం భారతదేశం లో గ్రామస్థాయి వరకు
పూర్తి మౌలిక సదుపాయాలు కలిగిన విదేశీ భాష
అరబిక్ మాత్రమే అని. భారతదేశంలో ఉన్న వందల
వేల మదరసాలలో మతపరమైన విద్యతో బాటు ఫిజిక్స్,
గణితం, రసాయన శాస్త్రం, హిందీ, ఇంగ్లీష్ వంటి ఆధునిక విషయాలను మరియు కంప్యూటర్ అధ్యయనo
మొదలైనవి అక్కడ బోధన చేస్తారు.
దురదృష్టవశాత్తు,
మదరసాలలో కొన్నింటికి అధికారిక గుర్తింపు మరియు ప్రభుత్వ
సాయం అందుట లేదు. మదరసాలో లో విద్య పొందే విద్యార్థులు మిలియన్ల కొద్ది ఉన్నారు. మదరసాలో విద్యావంతులైన విద్యార్ధులు
వారి విజ్ఞానం మరియు నైపుణ్యాలను ఉపయోగించుకోవడానికి
అవకాశాలు పరిమితంగా ఉన్నాయి మరియు
సాధారణంగా వీరు స్వయం ఉపాధి, అల్పాదాయ
చిన్న వ్యాపార సంస్థలలో మరియు సొంత వ్యాపారo లో ఉన్నారు.
మదరసాలకు ప్రభుత్వ గుర్తింపు మరియు ప్రభుత్వం నుండి
అవసరమైన సాయం మరియు మద్దతు ఇచ్చిన, వారు నాణ్యమైన అరబిక్ మరియు ఇంగ్లీష్ మాట్లాడే గ్రాడ్యుయేట్లు ఉత్పత్తి
చేయగలరు మరియు ' మేడ్ ఇన్ ఇండియా ' ఉత్పత్తులను
ప్రపంచం నలుమూలల తీసుకు వెళ్ళగలరు.
22 అరబ్ దేశాల వారు తమ
పారిశ్రామిక మరియు ఆహార పదార్ధాలను
ఇతర దేశాల నుండి దిగుమతి చేసు కొంటున్నారు. మదర్సాలో విద్యార్థులకు
సరిఅయిన శిక్షణ మరియు అవకాశం ఇస్తే వారు 380 మిలియన్ వినియోగదారులు మరియు $
6.0 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఉన్న విస్తారమైన
అరబ్ ప్రాంతంలో ఉపయోగపడవచ్చు. అరబిక్ లో డబ్బింగ్ భారతీయ చలనచిత్రాలు భారీ వ్యాపారo
చేయగలవు. సాఫ్ట్-వేర్,
గేమ్స్, మరియు కామిక్స్ యొక్క అరబైజేషణ్ కు (Arabization) భారీ సామర్ధ్యం ఉంది. ప్రస్తుతానికి,
ఈజిప్ట్ ఈ వ్యాపారంలో దాదాపు ఒంటరిగా ఉంది. భారత్
అడుగుపెట్టిన మంచి పలితాలను సాదిoచ గలదు.
మన ప్రియతమ ప్రధాని శ్రిమోడి గారు
అన్నాట్లు “మదరసా విద్యార్ధులు ఒక చేతిలో దివ్య ఖురాన్ మరియక చేతిలో
లాప్-టాప్ పట్టుకోవాలి”. అప్పుడే అయన కోరిక డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా
సాకారం కాగలదు మరియు విదేశి మారక ద్రవ్యం మన దేశానికి ఇబ్బడి-ముబ్బడిగా రాగలదు.
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ చెందగలదు.
దురదృష్టవశాత్తు, ప్రస్తుతం, భారత తయారీదారులు పక్కన
పొరుగున ఉన్న $
6.0 ట్రిలియన్ల అరబ్ ఆర్ధిక
వ్యవస్థ ను పక్కన బెట్టి, $ 15.0 ట్రిలియన్ ఆర్ధిక వ్యవస్థ గల యునైటెడ్ స్టేట్స్ లక్ష్యంగా దృష్టి సారించారు.
No comments:
Post a Comment