15 May 2016

ఇస్లాం లో ఇతర మతాల పట్ల సహన వైఖరి -




ఇస్లాం లేదా సత్య ధర్మం  ఈ ప్రపంచంలో  ఇతర మతాల ఉనికిని  తట్టుకోలేదని నమ్మే వారి కోసం ఈ వ్యాసం ప్రధానంగా వ్రాయబడింది మరియు   ప్రవక్త ముహమ్మద్ (స) తన జీవితకాలం లో ఇతర మతస్థుల ప్రజలు పట్ల ప్రదర్శించిన  కొన్ని ఆచరణాత్మక  ఉదాహరణలను ఇది చర్చిస్తుంది.దివ్య ఖురాన్  ప్రవక్త(స) ఇతర మతస్తుల  పట్ల ప్రవర్తించిన తీరు ను వివరిస్తుంది.దివ్య ఖురాన్ లో ప్రవక్త(స) అంటారు: “మీ ధర్మం మీదే, నా ధర్మం నాదే”-109:6

ప్రవక్త(స)  యొక్క సమయoలో  అరేబియా ద్వీపకల్పం లో వివిధ మత విశ్వాసులు ఉన్నారు. వీరిలో క్రైస్తవులు, యూదులు, జొరాస్ట్రియన్లు, బహుదైవారాధకులు మరియు ప్రత్యేకం గా ఏ మతం తో  అనుబంధం లేని  వారు ఉన్నారు. ప్రవక్త(స) సమకాలీనులైన ఇతర మతస్థుల ప్రజల పట్ల అయన చూపిన అధిక సహన వైఖరికి ఈ వ్యాసం అద్దం పడుతుంది.

ఈ సహన వైఖరిని అర్ధo చేసుకోవడానికి ముందు  మనం ఇస్లాం ఏర్పరచిన మదీనా ఆదర్శ  రాజ్యంను, దానియందు ప్రవక్త(స) రూపొందించిన మత/పాలనా  నియమాలను ఒక సారి పరిశీలిoచుదాము. మక్కాలో  తానూ బస చేసిన పదమూడు సంవత్సరాలలో ప్రవక్త ద్వారా చూపిన సహనానికి  అనేక ఉదాహరణలు పరిశీలిస్తే అవి ముస్లింల మరియు ఇస్లాం యొక్క సామాజిక స్థితి పెంచడానికి అతడు చేసిన ప్రయత్నాలు అని అపోహ పడవచ్చు.  ఈ కారణంగా చర్చ ను  ప్రవక్త(స) మదీనా కు వలస పోయిన కాలంతో మరియు ప్రత్యేకంగా అక్కడ రూపొందించిన రాజ్యాంగ కాలానికి పరిమితం చేద్దాము.

సహీఫః (లిఖిత రాజ్యాంగం)
ప్రారంభ చరిత్రకారుల దృష్టి లో  ఇతర మతాల పట్ల ప్రవక్త(స) చూపిన  సహనం వైఖరికి ఉత్తమ ఉదాహరణ మదీనా రాజ్యాంగం, దానిని సహీఫః('Saheefah') అని వారు పిలిచారు. ప్రవక్త(స) మదీనా కు  వలస చేసినప్పుడు,  ఒక మత నాయకుడిగా అతని పాత్ర ముగిసింది; అతను ఇప్పుడు ఇస్లామిక్ న్యాయాలను బట్టి పాలించే  ఒక రాజ్యాదిపతి. అనేక సంవత్సరాలుగా యుద్ధం, అరాచకత్వం తో ఉండిన ప్రదేశం లో క్రైస్తవులు, యూదులు, బహు దైవారాధకులు మరియు ముస్లింలు నివసించే ఒక బిన్న సమాజంలో శాంతియుత సహజీవనo,  సామరస్యం మరియు స్థిరత్వాన్ని కలిగించడానికి కొన్ని స్పష్టమైన న్యాయసూత్రాలను రూపొందించ వలసిన బాద్యత అతని పై ఉంది.  ఈ కారణంగా, ప్రవక్త(స) బాద్యతలను,విధులను, ఆంక్షలను వివరంగా తెలిపే ఒక లిఖిత రాజ్యాంగం  (సహీఫః'Saheefah')  ను రూపొందించారు.మదీనా లో నివసించే అన్ని ధర్మాల ప్రజలు ఈ రాజ్యాంగ సూత్రాలను తప్పకుండ/విధిగా  పాటించాలి లేనియెడల వారి చర్య ద్రోహంగా పరిగణించ బడుతుంది.

రాజ్యాంగంలోని మొదటి నిభందన  మదీనా యొక్క అందరు  నివాసులు(ముస్లింలు అలాగే యూదులు, క్రైస్తవులు, మరియు విగ్రహారాధకులు) మదీనా పౌరులే. మతం, జాతి, లేదా ప్రదేశ  వారసత్వంతో నిమిత్తం   లేకుండా అందరు మదీనా సమాజ సబ్యులే.  ఇతర మతాల సబ్యులు  ముస్లిమ్స్ తో సమానంగా రక్షంచ బడేదరు. మరియొక నిభందన  ప్రకారం   మదీనా రాజ్యాంగం ను అనుసరించే యూదులకు సంపూర్ణ  సహాయం, సమానత్వం మరియు  సురక్షణ లబిస్తుంది. వారికి తమ శత్రువర్గం నుంచి పూర్తి రక్షణ లబిస్తుంది. గతంలోమదీనా లో నివసించే ప్రతి తెగ తమ సొంత మిత్రవర్గం ను, శత్రువర్గంను  కలిగి ఉండేది.

 ప్రవక్త (స) ఈ తెగలన్నింటిని ఏక చత్రాదిపత్యం   క్రిందకు  తీసుకు వచ్చారు. గతం లో జరిగిన వివిధ తెగల పొత్తులు సమర్థించి. అన్ని తెగల వారు రాజ్య ప్రయోజనాల  దృష్ట్యా ఒకటిగానే వ్యవహరించాలి. రాజ్యం లోని ఏఒక్క మతం లేదా తెగ పై జరిగే దాడి మొత్తం రాజ్యంపైన మరియు ముస్లిoలపైన జరిగే దాడిగానే భావించ వలయును.

మదీనా రాజ్యాంగం ప్రకారం సమాజం లోని అన్ని మతాలవారికి ప్రాణరక్షణ హక్కు ప్రసాదించినది. ప్రవక్త(స) ప్రకారం ముస్లిం లతో ఒప్పందం చేసుకొన్న ఇతర మతస్థులను హత్య చేసిన వ్యక్తి స్వర్గం యొక్క పరిమళాన్ని  ఆస్వాదించలేడు.”.-ముస్లిం

ముస్లింలది  పైచేయి అయినప్పటికీ  ప్రవక్త(స) ఇతర మతస్థులతో అవమానకరం ప్రవర్తించ వద్దని ముస్లింలను హెచ్చరించారు. “జాగ్రత్త? ఎవరైతే ముస్లింలు కాని వారి పట్ల అమర్యాధతో లేదా వారి హక్కులకు భంగం కలేగే విధం గా ప్రవర్తిoచునో లేదా వారు మోసే భారం కన్నా వారిపై అధిక భారాన్ని మోపునో లేదా వారి ఆభిస్టానికి వ్యతిరేకం గా వారినుంచి ఏదైనా సంగ్రహించునో నేను అతనికి వ్యతిరేకంగా తీర్పు  దినమున సాక్షమిచ్చేదను అని ప్రవక్త(స) స్వయంగా హెచ్చరించెను.-అబూ దావుద్.

ఇంకో నిభందన లో యూదులు తమ మతం మరియు ముస్లింలు తమ మతం కలిగి ఉండవచ్చు. మత అసహనం క్షమించరాదని స్పష్టం  చేయ బడినది.వారు అందరు ఒకే సమాజం లోని సబ్యులు అయినప్పటికి  ప్రతి వారు వేరుగా తమ ప్రత్యెక మతం ను కలిగి ఉండవచ్చు. దానిని ఎవరు ఉల్లంఘించ రాదు. ప్రతి వారు  స్వేచ్చగా తమ ధార్మిక విశ్వాసాలను ఎటువంటి ఆటంకం లేకుండా పాటించ వచ్చు మరియు   అన్ని రకాల రెచ్చగొట్టే చర్యలు సహించ బడవు.

 ఇంకా ఈ రాజ్యాంగం లో అనేక నిభందనలు ఉన్నప్పటికీ వాటి అన్నింటిలోకి ముఖ్యమైనది “ఏ వివాదం లేదా వివాదంనకు  కారణం  తలెత్తిన దానిని  ప్రవక్త(స) కు పరిష్కారం నిమిత్తం వదిలేయబడుతుంది.”

ఈ నిబంధన  ప్రకారం మదీనా రాజ్యం లోని అందరు నివాసులు ఉన్నత అధికార స్థాయిని  తప్పక గుర్తించాలి మరియు వివిధ తెగల మరియు మతాల విషయoలో వ్యక్తిగత  న్యాయానికి తావులేదు  వాటిని పరిష్కరించే అతున్నత అధికారం రాజ్యాదిపతి లేదా అతని ప్రతినిధికి మాత్రమే ఉంటుంది. అయితే ముస్లింలు కాని తెగలు వాటి వ్యక్తిగత సొంత వ్యవహారాల విషయంలో సంబంధించి తమ సొంత మత గ్రంధములను మరియు వారి జ్ఞానులను సంప్రదించడానికి అనుమతి ఇచ్చారు.

అయితే, వారు కోరుకొంటే ప్రవక్త(స) వారి వ్యవహారాలలో తీర్పును ఇస్తాడు. అల్లాహ్ దివ్య ఖురాన్ లో చెప్పారు:"... వారు నీ వద్దకు వస్తే, నీకు ఇష్టమైతే వారిమద్య  తీర్పు చెప్పే అధికారం నీకు ఇవ్వబడుతుంది లేదా తిరస్కరించు”-దివ్య  ఖురాన్ 5:42

సమాజం లో శాంతియుత ప్రశాంత వాతావరణం దెబ్బతినంతవరకు మరియు మదీనా రాజ్యాంగ నిభందనలు వ్యతిరేకం కానంతవరకు  ప్రతి మతస్తులకు వారి మత గ్రంథాల న్యాయ సూత్రాల  ఆధారంగా తిర్పునిచ్చె  అధికారం ప్రవక్త(స) వారికి ఇచ్చారు.

గమనించ వలసిన అంశాలు:
1.    ఆధునిక సెక్యులర్ రాజ్య లక్షణాలు ఆ నాటి మధీనా రాజ్యాంగం లో కనిపిస్తున్నాయి.
2.    ఆదునిక ప్రజాస్వామ్యానికి ప్రతీక గా భావించే అమెరికా రాజ్యoగం ప్రవక్త(స) మధీనా రాజ్యాంగం ను అనుసరించినది.
3.    అధునిక కాలం లో విస్తృతంగా ప్రచారం లో ఉన్న ప్రాధమిక హక్కులు ఆనాటి  మధీనా రాజ్యాంగం లో ప్రస్తావించబడినవి.
4.    మధీఅనా రాజ్యం లో నివసించే ప్రజలకు జాతి, మత, వర్ణ బేధం లేకుండా ఐటువంటి వివక్షత లేకుండా పౌరులందరికీ ప్రాణ రక్షణ హక్కు ప్రసాదించబడినది.
5.    మదీనా రాజ్యంలోని అల్ఫసంఖ్యాకులకు పర్సనల్ లా సౌకర్యం కల్పించబడినది.
6.    మత సహనం పాటించ బడినది. మత అసహనం ను ప్రోత్సహించేవారు శిక్షిoచ బడేదరు.
7.    ప్రజలు ఇతర వర్గాల వారి హక్కులను భంగ పరచ రాదు.
8.    రాజ్యం లోని ఏఒక్క మతం లేదా తెగ పై జరిగే దాడి మొత్తం రాజ్యంపైన మరియు ముస్లిo లపైన జరిగే దాడిగానే భావించ వలయును.
9.    మదీనా రాజ్యం లోనివసించే బిన్న వర్గాల పౌరులందరూ మదీనా పౌరులే.

10.పౌరలందరూ రాజ్య నియమాలను సంపూర్ణంగా విధిగా పాటించాలి లేనియెడల అది విద్రోహ చర్యగా భావించబడుతుంది.

No comments:

Post a Comment