టిప్పు సుల్తాన్ 217వ వర్ధంతి మే 4,2016 న సందర్భంగా "మైసూరు పులి" టిప్పు సుల్తాన్ ను ఒకసారి స్మరించుకొందాము.
"మైసూర్ పులి" గా పేరొందిన టిప్పు సుల్తాన్ దక్షిణ భారత్ దేశం లోని మైసూర్ రాజ్య పాలకుడు. బ్రిటిష్ వారిని వ్యతిరేకించి వారి
చూపు కూడా దక్షిణ భారత వైపు పడనియకుండా
నిరోదిoచిన సమర్ధ పాలకుడు. తన పరిపాలనా కాలం లో బ్రిటిష్ వారిని వ్యతిరేకించిన
మెట్టమొదటి స్వదేశీ పాలకుడు టిప్పు. తన జీవితం కాలం మొత్తం వరకూ అతను బ్రిటిష్
వారిని దక్షిణ భారతదేశం నుండి వారిని దూరంగా ఉంచడం లో విజయం సాదించాడు. తన తండ్రి
హైదర్ ఆలీ కాలంలో మొదటి మరియు రెండవ ఆంగ్లో-మైసూర్ యుద్ధాల్లో భాగంగా బ్రిటిష్
సైన్యం ను ఓడించిన ఏకైక భారతీయ పాలకుడు. మద్రాసు మరియు మంగళూరు
యుద్ద ఒప్పంద నిబంధనలను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాధించిన పాలకుడు టిప్పు.
నవంబర్ 20, 1750న దేవనహళ్లి (బెంగుళూర్) న జన్మించిన టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి లొంగక వారికి పక్కలో బల్లెం వలే
ఉన్నాడు.టిప్పు సుల్తాన్ యోధుడు,
సైనిక
కమాండర్, సమర్థవంతమైన పాలకుడు మరియు
సంస్కర్త. అతను బ్రిటిష్ వారితో పోరాడుతూ 04 మే 1799 వీర మరణం పొందినాడు. అతని 217th వర్ధంతి సందర్భంగా మే 4,2016 న సందర్భంగా అతనిని ఒకసారి స్మరించుకొందాము.
టిప్పు సుల్తాన్ తన శత్రువులు అయిన బ్రిటిషు వారిని సహితం అబ్బుర పరిచే ఆధునిక
యుద్ధ సాంకేతికను అభివృద్ధి చేసినాడు. తన
సొంత రాకెట్ ఆర్టిలరీ బ్రిగేడ్(కుశూన్) ను అభివృద్ది పరిచిన తొలి భారతీయ రాజు టిప్పు. అతను రాకెట్ ఆర్టిలరీ బ్రిగేడ్(కుశూన్)
సిబ్బందిని 5,000 వరకు పెంచినాడు. అతని
రాకెట్ టెక్నాలజీ ని ఆతరువాత బ్రిటిష్ వారు అబివృద్ది పరిచి నెపోలియన్ తో జరిగిన యుద్ధం సమయంలో ఉపయోగించారు
టిప్పు సుల్తాన్
రాకెట్ రంగము లో కీలక ఆవిష్కరణలు చేస్తూ రాకెట్లు మరియు వాటి ఉపయోగంను సైనిక లాజిస్టిక్స్ రంగములో విస్తరించాడు. అతని
సైన్యంలో రాకెట్ ఆయుధాల ఆపరేటింగ్
నైపుణ్యం కల 1200 దళాలు ఉండేవి మరియు అతను
సుదూర లక్ష్యంలను చేదించే విధంగా తన
రాకెట్ వినియోగ సిబ్బందికి శిక్షణనిచ్చారు. రాకెట్లు బ్లేడ్లులను కలిగి పేల్చినప్పుడు పెద్ద ఎత్తున సైన్య నష్టం కలుగచేసివి.
పొల్లిలూర్ యుద్ధం సమయంలో టిప్పు సుల్తాన్ మోహరించిన రాకెట్లు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా
కంపెనీ రాకెట్ల కంటే చాలా బాగా అభివృద్ధిచెందినవి.
భారతదేశ మాజీ రాష్ట్రపతి మరియు మిస్సైల్ మాన్ గా పిలవబడే ఎపిజె
అబుల్ కలాం మాటలలో “టిప్పు సుల్తాన్ భారతదేశం లో క్షిపణి వ్యవస్థ స్థాపకుడు".
నిజానికి అతను రూపొందించిన రాకెట్
సాంకేతిక జ్ఞానం ఆధారంగా భారత దేశం క్షిపణి సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేసింది.
1786 లో టిప్పు సుల్తాన్ 72 ఫిరంగులతో కూడిన 20 యుద్ధనౌకలు మరియు 62 ఫిరంగులతో కూడిన 20
యుద్ధనౌకలు(ఫ్రిగేట్స్) నావికా దళం ను తయారుచేసినాడు. 1790 లో అతను కమాలుద్దీన్ ను తన మీర్ బహర్ నియమించినాడు
మరియు జమలాబాద్ మరియు మజిదాబాద్ వద్ద భారి నౌకానిర్మాణ కేంద్రాలను (డాక్-యార్డ్)
లను నిర్మించినాడు. టిప్పు సుల్తాన్ నౌకల అడుభాగం కాపర్ తో నిర్మితమై అది తరువాత అడ్మిరల్ సుఫ్రెన్
ద్వారా అభివృద్ధి లోకి వచ్చింది.
టిప్పు సుల్తాన్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించేవాడు.
టిప్పు సుల్తాన్ మరియు ఆయన తండ్రి హైదర్ ఆలీ ఇద్దరు మైసూర్ స్వతంత్ర పాలకులు కాని
వారు అప్పటి మొఘల్ చక్రవర్తి షా ఆలం II కు కొంతవరకు
విధేయత చూపేవారు. హైదర్ ఆలీ మరియు టిప్పు
సుల్తాన్ ఇద్దరు కేంద్రీకృత పాలన మరియు సాంప్రదాయాలను పాటించేవారు. పట్టాభిషేకం
తర్వాత టిప్పు సుల్తాన్ గుర్తింపు కోసం మొఘల్ చక్రవర్తి ని కోరెను కానీ నిజాం ఆలీ
ఖాన్, హైదరాబాద్ నిజాం శత్రు
వైఖరి వలన మొఘల్ కోర్ట్ నుండి గుర్తింపు పొందడంలో విఫలమైనాడు. హైదరాబాద్ నిజాం మైసూర్ పై తన హక్కు ను
సాధించదలచినాడు.
టిప్పు సుల్తాన్ ఇతర పాలకులతో సంబంధాలు ఏర్పాటుచేసుకోవటం ప్రారంభించినాడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా
ఆఫ్ఘన్ రాజు జామాన్ షా దురానీ తో సైన్య సంభందాలను ఏర్పరచుకొని భారత దేశం నుండి
బ్రిటిష్ వారిని పారద్రోలదలచినాడు కాని దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నం సఫలం కాలేదు.
అదేవిధంగా టర్కీ పాలకుడు సుల్తాన్ అబ్దుల్ హమీద్ తో సైనిక సహాకారం పొందదలచినాడు. ఆ
ప్రయత్నం కూడా విఫలం అయినది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫ్రెంచ్ పాలకుడు నెపోలియన్ సైన్య సహాయం పొందదలచినాడు ఆ ప్రయత్నం కార్యరూపం
దాల్చలేదు. బ్రిటిష్ ఈస్ట్-ఇండియా కంపని పాలకులకు వ్యతిరేకంగా ఇతని ప్రయత్నాలు
సఫలం అయితే భారత దేశ చరిత్ర ఇంకోరకంగా ఉండేది!
టిప్పు సుల్తాన్ విద్యావేత్త మరియు బహు భాష ప్రేమికుడు. ఆయన
మైసూర్ రాజ్యం లో ఉర్దూ మరియు పెర్షియన్ విద్యా ప్రచారాలు చేసినాడు. టిప్పు సుల్తాన్ తన
రాజ్యం లోని వివిధ ప్రాంతల ప్రజలు మాట్లేడే వివిధ మాండలికాల స్థానం లో ఒకే బాష గా ఉర్దూ/పెర్షియన్ ను అభివృద్ధి పరిచినాడు.
అతను మైసూర్ రాజ్యానికి అధికారిక భాషగా పెర్షియన్ నిర్ధారించినాడు.
టిప్పు సుల్తాన్ గొప్ప పరిపాలన నిర్వాహణాదికారి. తన
అధికారులమీద, మైసూర్ రాజ్య పాలనా మీద పూర్తి పట్టును సాదిoచినాడు. కొన్ని మంచి పాశ్చాత్య పరిపానలనా పద్దతులను
తన రాజ్యం లో ప్రవేశ పెట్టినాడు. ఆయన హయాంలో వర్తకo మరియు వాణిజ్యo గణనీయంగా పెరిగింది. విశ్లేషకులు టిప్పు సుల్తాన్ ను మైసూర్ రాజ్యం లో లో భూస్వామ్య వ్యవస్థ రద్దు చేసిన మొట్టమొదటి భారతీయ రాజు గా భావిస్తున్నారు. ఆదాయ
సమీకరణ, న్యాయ వ్యవస్థ మరియు నాణేలు మరియు
క్యాలెండర్లు, బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్,
తూనికలు మరియు కొలతల
రంగం
లో కొత్త సంస్కరణలు ప్రవేశ పెట్టాడు.
టిప్పు సుల్తాన్ ఒక లౌకిక పాలకుడు. అతని పరిపాలనలో అమలులో
ఉన్న జ్యుడీషియల్ వ్యవస్థ ఆధునికంగా ఉంది. టిప్పు సుల్తాన్ తన సొంత ప్రజల పట్ల ఏనాడు
పోరాడలేదు కాని తన పరిపాలన ను భంగపరిచి మరియు మైసూర్ రాజ్యం విచ్ఛిన్నం కోరకు ప్రయత్నించిన వారిపట్ల నిర్ధాక్షిణ్యం గా
వ్యవరించినాడు.
పర మత విద్వేషకుని గా టిప్పును బ్రిటిష్ చరిత్రకారులు
చిత్రీకరించారు. కాని నిజానికి టిప్పుసుల్తాన్
అందరి పట్ల సమానం గా వ్యవరించేవాడు. హిందువులకు
ఉన్నత పదవులు ఇచ్చినాడు మరియు హిందూ దేవాలయాలు,
బ్రాహ్మణులకు గ్రాంట్లు మరియు బహుమతులు ఇచ్చినాడు. హిందువులకు, క్రైస్తవులకు పూర్తి మత స్వేచ్ఛ మంజూరు చేసినాడు.
టిప్పు అనేక సాంఘిక సంస్కరణలను ప్రవేశ పెట్టాడు. కొన్ని దేవాలయాలలో
జరిగే నరబలులను అరికట్టినాడు. తన రాజ్యం
లోని కొన్ని ప్రాంతాల అమలు లో ఉన్న మాతృస్వామిక విధానం, బహుబర్తత్వం, బానిసవిధానం
వంటివాటిని నిషేదించినాడు. టిప్పు సుల్తాన్ ప్రజానీకానికి న్యాయం అందించేందుకు
జవాబుదారీతనం మరియు తూర్పు మరియు పశ్చిమ
పరిపాలనా వ్యవస్థలు కలిపి నూతన పాలనా
వ్యవస్థ రూపొందించిన తొలి భారతీయ పాలకుడు.
4 వ మే 1799 న టిప్పు సుల్తాన్ బలిదానం చెందిన రోజు అతని
రాజ్యం లోని అన్ని మతాల ప్రజలు శోకం పాటించారు. అతని మృతదేహం చుట్టూ హిందూ మహిళలు
రోదించారు. సుల్తాన్ యొక్క అంత్యక్రియలకు ఊరేగింపు వెంట హిందవులు ఏడ్చారు మరియు తమ
తలలు గుండు చేయించు కొన్నారు. అనేక బ్రాహ్మణులు ఉపావాసం పాటించారు.
కానీ “మైసూరు పులి” టిప్పు సుల్తాన్ కు భారత చరిత్రలో తగిన గుర్తింపు రాకపోవడానికి ప్రధాన కారణం అతను
అనుసరించిన బ్రిటిష్ వ్యతిరేక వైఖరి మరియు
బ్రిటిష్ చరిత్ర కారుల తప్పుడు చిత్రీకరణ. దీనిని ప్రస్తుత తరం ప్రజలు మరియు ప్రభుత్వం
గుర్తించి అతని పట్ల తగు ఆదరణ చూపాలి. టిప్పు
సుల్తాన్ పేర కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో రక్షణ పరిశోధన కేంద్రాలు స్థాపించాలి.
నావికా రంగం లో అతను సాదించిన ప్రగతికి నిదర్సనం గా భారత దేశ అధునాతన యుద్దనౌకలకు
అతని పేరు పెట్టాలి. చరిత్రకారులు
నిజాయితీగా అతని చరిత్రను అధ్యయనం చేసి భారత చరిత్రలో అతని స్థానం నిలబెట్టాలి.
No comments:
Post a Comment