(“మేము ఈ గ్రంధం లో దేనిని విస్మరించలేదు”-6:38).
భూమి మీదకు తన ప్రవక్త మరియు తన సందేశహరుడు అయిన ముహమ్మద్ ను పంపిన అనంత
కరుణామయుడు, అపార కృపాశీలుడు మరియు మరియు సమస్త
జ్ఞాన సంపన్నుడు అయిన అల్లాహ్ కే సమస్త
సోత్రములు చెందుతాయి . అల్లాహ్ దివ్య ఖురాన్ లో అంటాడు: “మేము ఈ గ్రంధం లో
దేనిని విస్మరించలేదు”-6:38.
అల్లాహ్ ప్రతి ప్రవక్త ద్వారా ప్రజలకు
కొన్ని సూచనలు పంపినాడు. వారు వాటిని అల్లాహ్ పంపినట్లు ఖచ్చితమైన ఋజువులు చూపారు. కాని వారి మరణం తో ఆ సూచనలు కనుమరుగు అయినవి. అయితే
ఒక సూచన మాత్రం అజరామరమైనది, అసమానమయినది,
అది దివ్య ఖురాన్ గ్రంధం. దానిని అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ (స) ద్వారా సమస్త
మానవాళికి పంపినాడు.అది అల్లాహ్ యొక్క ఆదేశం తో సంరక్షించబడి ప్రళయదినం వరకు కాపాడ
బడుతుంది. దాని రక్షణ బాద్యత అల్లాహ్ తాను స్వయంగా తీసుకొన్నాడు. ప్రవక్త ముహమ్మద్
(స) మరణం తరువాత నివసించే ప్రజలు ఎవరైనా,ఎప్పుడైనా, దానిని చూడగలరు, చదవగలరు మరియు దానిలోని నిజాన్ని గ్రహించగలరు.
దివ్య ఖురాన్ లో
వివరించిన అనేక అద్భుతమైన సూచనలు అవి అల్లాహ్ పంపినట్లు రుజువు చేస్తున్నావి. అల్లాహ్
దివ్య ఖురాన్ లో వివరించిన శాస్త్రీయ వాస్తవాలు, వర్ణనలు, గణిత సంకేతాలు, ఆ కాలం నాటి ప్రజలకు తెలియవు అంతియేకాక జరగబోయే
పరిణామాలు కూడా అల్లాహ్ తన దివ్య ఖురాన్ లోని ఆయతుల ద్వారా ప్రజలకు అవగతం చేసాడు.
మనం 20వ మరియు 21వ శతాబ్దపు
టెక్నాలజీతో తెలుసుకొన్న కొన్ని శాస్త్రీయ వాస్తవాలను 1400 సంవత్సరాల
క్రితం దివ్య ఖురాన్ లో వెల్లడైనవి. వాస్తవానికి దివ్య ఖురాన్ ఏ మానవుడి సృష్టి కాదు
అని వాటితో మనకు అవగతమవు తున్నది. సైన్స్
కి ఇస్లాం కు దగ్గిర సంభంధం ఉంది. మానవజాతి కి అంతిమ మార్గదర్శకత్వం చూపే దివ్య ఖురాన్ లోని కొన్ని శాస్త్రీయ అద్భుతాలు పరిశీలించుదాము.
1.విస్తరిస్తున్న
విశ్వం:
దివ్య ఖురాన్ లో అల్లాహ్
అంటాడు:”మేము ఆకాశాన్ని స్వశక్తితో నిర్మించాము.మేము అలా చేసే సామర్ధ్యం కలిగి
ఉన్నాము. మేము ఎంతో చక్కగా పరిచేవారము.” 51:47.
విశ్వం అనంతమైనదా లేదా అది నిలకడగా ఉంటుందా? అనే ప్రశ్న కు జవాబు
మనకు 20వ శతాబ్దం దాకా తెలియదు. 20 వ శతాబ్దం లో ఎడ్విన్ హబుల్ టెలిస్కోప్ ద్వారా, విశ్వం
విస్తరిస్తోంది అని నిరూపించగలిగాడు. విశ్వ విస్తరణ సిద్ధాంతం మొదటగా 1920 లో అభివృద్ధి
చెందింది.
కాని దివ్య ఖురాన్
లో విశ్వం నిరంతరం విస్తరిస్తున్న
చైతన్యవంతమైనది (Universe is dynamic and expanding) అని వర్ణించారు. అంటే అంతవరకు మనకు 20వ శతాబ్దం
వరకు తెలియని ఈ భావనను దివ్య ఖురాన్ 1400 క్రిందటే ప్రకటించినది.
2.జంటల సృష్టి;
సృష్టి లోని సమస్త
జీవ,జంతు,వృక్ష జాలం లోను మగ-ఆడ అనే భేదం కన్పిస్తుంది. ప్రకృతి అనుకూల వ్యతిరేక
శక్తుల జతలను సూచిస్తుంది.
"అన్ని రకాల జంటలను సృష్టించిన అయన పరిశుద్దుడు.
అవి భూమిలో నుండి పుట్టే వృక్ష రాసులలోని వైనా సరే లేదా స్వయంగా వారి జాతి (అంటే
మానవులు) లో నుండి అయిన సరే లేదా వారు అసలే ఎరుగని వస్తువులలో నుండి అయినాసరే.”
అని దివ్య ఖురాన్ -36:36 చెబుతుంది.
3.పర్వతాల సృష్టి:
పర్వతాలను గురించిన ఒక
ముఖ్యమైన సూచన దివ్య ఖురాన్ లో ఉంది.
దివ్య ఖురాన్ లో అల్లాహ్
అంటాడు: మేము భూమిపై పర్వతాలను పటిష్టంగా నిలబెట్టాము, అది వాటితో దోర్లిపోకుండా
ఉండాలని.”-21:31.
పై ఆయత్ ద్వార
భూప్రకంపనలను నిరోదించడానికి పర్వతాలు
ఉపయోగపడునని తెలుస్తుంది. ఈ వాస్తవం ఆధునిక భూగర్భ పరిశోధన యొక్క పలితాల
ఫలితంగా వెలుగు లోనికి వచ్చింది. పర్వతాలు తమ ఎత్తు కు 10-15 రెట్లు భూగర్భంలో
ఉన్నవి.ఉదాహరణకు, మౌంట్ ఎవరెస్ట్ శిఖరం భూమి యొక్క
ఉపరితలం పైన సుమారు 9 కిలోమీటర్ల ఎత్తు
లో ఉంది కాని దాని పునాది భూగర్భం లో సుమారు 125 కిలోమీటర్ల కంటే లోతుగా ఉంది.
దీనిని తెలియ పరుస్తూ దివ్య ఖురాన్ లో
అల్లాహ్ అంటాడు:“మేము భూమిని పాన్పు గా చేసాము; అందులో పర్వతాలను మేకులుగా
పాతాము.”-దివ్య ఖురాన్ 78:6-7.
4.మానవుని సృష్టి:
”మేము మిమ్మల్లి
సృష్టించాము, మరెందుకు మీరు ఈ విషయాన్నీ ద్రువికరించరు?ఎప్పుడైనా మీరు ఇలా
ఆలోచించారా: మీరు విడిచే ఈ రేతస్సు తో బిడ్డను మీరు తయారు చేస్తారా లేక దానిని
సృష్టించేవారము మేమా?”-దివ్య ఖురాన్ 56:57-59.
దివ్య ఖురాన్ లోని అనేక
ఆయత్ లలో సృష్టి ని గురించి వివరించడం జరిగింది. మనం ఏరకంగా ఈ ప్రపంచం లోనికి
అవిర్భావింఛినామో ఎన్ని దశలను దాటామే
వివరించడం జరిగింది. కొన్ని ఆయతులలో సృష్టి కి సంభందించిన వివరణాత్మక వివరణ కలదు
.
1. మానవుడు మొత్తం వీర్యం నుండి రూపొందలేదు.
రూపొందినది వీర్యం లోని చిన్న భాగం(sperm)
నుండి మాత్రమే.
2. ఇది శిశువు యొక్క సెక్స్ ను నిర్ణయించేది
పురుషుడుమాత్రమే.
3. మానవ పిండం ఒక జలగ లాగ తల్లి గర్భాశయమునకు
అంటిపెట్టుకొని ఉంటుంది.
4. పిండ గర్భాశయం లో మూడు కృష్ణ (dark)
ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతుంది.
మనిషి యొక్క సృష్టి రహస్యం
ఆనాటికి అనగా 7వ శతాబ్దం నాటికి తెలియటం అసాద్యం. ఈ వాస్తవాల ఆవిష్కరణ 20 వ శతాబ్దంలో
సాంకేతిక పరిజ్ఞానంతో జరిగింది. కాని దివ్య ఖురాన్ 1500 సంవత్సరాల క్రిందటే
వివరించినది.
5.అవయవాల అభివృద్ధి
క్రమము:
"మీకు వినే శక్తిని చూసే శక్తిని ఇచ్చినవాడు,
ఆలోచించటానికి హృదయం ఇచ్చినవాడు అల్లాహయే. కాని మీరు కృతజ్ఞత చూపటం అనేది చాల
అరుదు.”-దివ్య ఖురాన్ 23:78.
"అల్లాహ్ మిమ్మల్లి మీ మాతృగర్భాలనుండి మీరు ఏమి
ఎరుగని స్థితి లో ఉండగా బయటకు తీసాడు. అయన మీకు చెవులు ఇచ్చాడు. కళ్ళు ఇచ్చాడు.
ఆలోచించే మనసు ఇచ్చాడు- మీరు కృతజ్ఞులు కావాలని.”దివ్య ఖురాన్16:78.
పైన వివరించిన ఆయతులు అల్లాహ్
మానవుల ఇచ్చిన అనేక అవయవాలను గురించి వివరిస్తాయి. వీటిని దివ్య ఖురాన్ లో ఒక
నిర్దిష్ట క్రమంలో: వినడం,
చూడడం, భావన(feeling)
మరియు అవగాహన చేసుకోవటం లాగా వివరించడం జరిగింది.
జర్నల్ ఆఫ్ ది ఇస్లామిక్ మెడికల్ అసోసియేషన్ లో
డాక్టర్ కీత్ మూర్ పిండం యొక్క అభివృద్ధి
సమయంలో మొదట లోపలి చెవి ఆ తర్వాత కన్ను అభివృద్ధి చెందుతాయని చెప్పినాడు. ఆయన భావన
మరియు అవగాహన చేసుకోవటానికి ఉపయోగ పడే మెదడు, చెవి మరియు కంటి
తర్వాత అభివృద్ధి చెందుతాయని చెప్పారు.
పిండం యొక్క 'చెవులు గర్భం దాల్చిన ఇరవై రెండవ రోజు నుండి అభివృద్ధి
చెంది నాల్గవ నెలలో పూర్తిగా పనిచేయడం ప్రారంభమవుతుంది.
ఆ తరువాత, పిండం దాని తల్లి
గర్భంలో శబ్దాలు వింటుంది. ఆ కారణంగా కొత్తగా
పుట్టిన శిశువు కోసం “వినడం” ఇతర కీలక విధులు కన్నా ముందే అభివృద్ధి చెందుతుంది.
దివ్య ఖురాన్ లో వివరించిన వివరణాక్రమం
ప్రకారం పిండాభివృద్ది జరుగు తుంది.
6. పాల తయారి:
“మీకు పశువులలో కూడా ఒక
గుణపాఠం ఉన్నది. వాటి గర్భం లో పేడ,రక్తానికి మద్య ఉన్న ఒక వస్తువును మేము మీకు త్రాగిస్తాము. అంటే స్వచ్చమైన పాలు.
అవి త్రాగేవారికి ఎంతో కమ్మనిది.” –దివ్య ఖురాన్, 16:66.
జీర్ణ వ్యవస్థలోని రసాయనిక మార్పులు
ఫలితంగా శరీర పోషణ కు అవసరమైన ప్రాథమిక పదార్థం
లబిస్తుంది. ఈ జీర్ణ పదార్థాలు పేగు గోడ ద్వారా రక్తంలో ప్రసరించును. రక్త
ప్రసరణ వల్ల, శరిర పోషణ కు అవసరమైన
పదార్ధం సంబంధిత అవయవాలకు చేరుకోనును. ఇతర శరీర కణజాలం వలే పాలు గ్రంథులు రక్తం
ద్వారా వాటికి తీసుకు వచ్చే పోషక
పదార్దముల ద్వారా సంరక్షించబడి ఉంటాయి. రక్తo అందువలన ఆహార ఉత్పత్తులు నుండి పోషక
పదార్ధాల సేకరణలో చాలా ముఖ్యమైన పాత్ర
పోషిస్తుంది. ఈ దశలు అన్ని దాటి పాలు క్షీరగ్రంథులు ద్వారా స్రవిస్తుంది మరియు
దాని లో పోషక విలువలు అధింకగా ఉన్నాయి
అధిక పోషక పాలు రక్తమునుoడి తయారు అగును. పాల తయారీ స్వయంగా అపరిమితమైన సృష్టి కి నిదర్సనం మరియు ఆ
ఏర్పాటు గురించిన వివరణాత్మక సమాచారo ఖురాన్ లో ఉండుట మరొక అద్భుతం. దీనికి గాను క్షీరదాల
'జీర్ణ వ్యవస్థల’
సమగ్ర పరిజ్ఞానం అవసరం అటువంటి సమాచారం ఆ కాలం తెలేసే అవకాశం లేదనుట చాలా స్పష్టం.
7.తేనె యొక్క అద్భుతం:
“ఈగ కడుపులో నుండి రంగు
రంగుల పానకం ఒకటి వేలుబడుతుంది. అందులో ప్రజల కోసం వ్యాధి నివారణ శక్తీ
ఉన్నది.ఆలోచించేవారికి ఇందులో కూడా నిశ్చయoగా ఒక సూచన ఉంది.”-దివ్య ఖురాన్, 16:69.
పైన వివరించిన ఆయత్ ల
ప్రకారం తేనె లో పురుషులకు వైద్యం ఉంది. ఈ రోజుల్లో తేనెటీగల పెంపకము
మరియు తేనెటీగ ఉత్పత్తులు ప్రపంచంలోని శాస్త్రీయంగా పరిశోదిoచ బడుతున్నవి. తేనె యొక్క
ఇతర ప్రయోజనాలు ఈ క్రింద విధంగా ఉన్నవి.:
1.
సులభంగా జీర్ణమయ్యేoదుకు,
2.
వేగంగా రక్తం ద్వారా విస్తరిస్తుంది
3.
నూతన రక్తమును తయారుచేయటం లో
4.
బాక్టీరియా విరోధి
5.
యాంటీ ఆక్సిడెంట్
6.
గాయాలు మాన్పుటకు ఉపయోగ పడును.
తేనె గొప్ప వైద్య
లక్షణాలను కలిగి ఉంది. దివ్య ఖురాన్ లో అల్లాహ్ వివరించిన అద్భుతాలలో ఒకటి తేనే.
8. సముద్రాల మధ్య అడ్డంకులు:
ఇటీవలనే కనుగొన్న సముద్ర
లక్షణాలలో ఒకదాన్ని దివ్య ఖురాన్ క్రింది ఆయత్ వివరిస్తుంది:”రెండు
సముద్రాలు ఒకదానితో ఒకటి కలసిపోయేటందుకు ఆయన వాటిని వదిలి పెట్టాడు. అయినా వాటి
మద్య ఒక తెర అడ్డంగా ఉన్నది.అవి దానిని అతిక్రమించలేవు.”-55:19-20.
రెండు సముద్రాలు కలిసిన
వాటి నీరు పూర్తిగా కలవక పోవడాన్ని ఇటివలే సముద్ర శాస్త్రవేత్తల ద్వారా గుర్తించబడింది.
దీనినే "తలతన్యత"(surface
tension) అంటారు.ఇరుగు- పొరుగు సముద్రాల
జలాలు వాటి జలాల సాంద్రత లో వ్యత్యాసం, ఒత్తిడి కారణంగా కలవవు. తలతన్యత (surface tension) ఒక సన్నని గోడ లాగా వాటి
కలయిక ను నిరోధిస్తుంది. ఈ నిజం దివ్య ఖురాన్ లో వెల్లడి కావటం నిజంగా ఆసక్తికరం
గా ఉంది.
9. వేలిముద్రల గుర్తింపు:
"మేము అతని వ్రేళ్ళ కోనలను సైతం సముచితమైన
రీతిలో రూపొందించగల సమర్ధులం.”-దివ్య ఖురాన్ 75:4
వేలిముద్రలు చాలా ప్రత్యేక
ప్రాధాన్యతను కలిగి ఉన్నవి. ఒకరి వేలిముద్ర ఆకారాలు మరిఒకరి వేలిముద్రల వివరాలతో
కలవవు. ఆఖరికి ఏకరూప కవలలు కూడా వేరు వేరు వేలిముద్రలు కలిగి ఉంటారు. వేలిముద్రలు చాల ప్రత్యేకమైన
గుర్తింపు గా అంగీకరించబడ్డాయి. వీటిని గుర్తింపు నిర్ణయ పద్ధతిగా వాడుతున్నారు.
వేలిముద్రల గుర్తింపును 19 వ శతాబ్దం
చివరిలో కనుగొన్నారు. ఇంత ప్రాధాన్యత ఉన్న వేలుముద్రల వివరాలు అల్లాహ్ దివ్య
ఖురాన్ లో వివరించారు.
ఇంకా అనేకమైన అద్భుతాల వివరాలు దివ్య ఖురాన్
లో అసంఖ్యాకoగా ఉన్నాయి. జీవితం యొక్క అన్ని
రంగాలలో సరైన మార్గదర్శకత్వం పొందడానికి దివ్య ఖురాన్ తోడ్పడుతుంది. అల్లాహ్ మనకు సరిఅయిన మార్గదర్శకత్వం చూపు గాక!
No comments:
Post a Comment