బ్రిటన్ రాజధాని లండన్ మేయర్ గా తొలిసారి ఓ
ముస్లిం వ్యక్తి ఎన్నికయ్యారు. పాకిస్థాన్
నుండి బ్రిటన్ కు వలస వెళ్లిన బస్ డ్రైవర్ కొడుకు సాధిఖ్ ఖాన్ బ్రిటన్ ప్రధాన విపక్ష
పార్టి లేబర్ పార్టీ తరఫున లండన్
మున్సిపాలిటీ మేయర్ ఎన్నికల్లో ఘనవిజయం(landslide) సాధించారు. లండన్ సిటీ హాల్ లో
తొలి ముస్లిం మేయర్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విజయంతో దాదాపు ఎనిమిదేళ్ల
తర్వాత బ్రిటన్ రాజధాని లండన్ పై లేబర్ పార్టీ తన జెండా ఎగురవేసింది. ఇంతకూ క్రితం లండన్ మేయర్ గా బోరిస్ జాన్సన్(కన్సేర్వేటివ్
పార్టి ) పనిచేసారు.
మానవ
హక్కుల న్యాయవాది అయిన సాదిక్ ఖాన్ 2005లో టూటింగ్(సౌత్
లండన్) నుంచి ఎంపీగా గెలుపొందారు. మాజీ ప్రధాని గార్డన్ బ్రౌన్ కేబినెట్ లో కీలక
వ్యక్తిగా పనిచేశారు. బ్రౌన్ ప్రభుత్వంలో
రవాణాశాఖమంత్రిగా పని చేశారు. ఈయన సాలిసిటర్ సాదియా అహ్మద్‌ను వివాహం
చేసుకున్నారు.
ముస్లిం అయిన సాదిక్ అభ్యర్థిత్వాన్ని అధికార పార్టీ(కన్సర్వేటివ్)నేతలు
తొలి నుండీ నీరుగార్చాలని శతధా ప్రయత్నించారు. సాధిఖ్ ను నిలువరించడానికి స్మిత్ వేసిన
ఎత్తుగడలేవి ఓటర్లను ఆకర్షించలేదు. తీవ్రవాదులతో సాధిఖ్ కు సంబంధాలు ఉన్నాయంటూ
స్మిత్ చేసిన దుష్ప్రచారాన్ని అక్కడి ప్రజలు విశ్వసించలేదు. వాటన్నింటినీ తట్టుకుని ఆయన తుదిపోటీకి
నిలిచారు.
స్మిత్ దుష్ప్రచారానికి గట్టిగానే కౌంటర్ ఇచ్చిన సాధిఖ్, దేశ ప్రజల
మధ్య చిచ్చు పెట్టడానికే జాక్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఎన్నికల ప్రచారం
సాగించారు లండన్ లోని భిన్న మతాలు, సంస్కృతుల ప్రజలను విడగొట్టడానికి స్మిత్ ప్రయత్నిస్తున్నారని సాధిఖ్
ప్రచారంలో దూసుకెళ్లారు.తాను
లండన్ మేయరైతే, వర్గాలవారీగా ముక్కలుచెక్కలైన సుందర లండన్ నగరాన్ని
తిరిగి ఒకటిగా ఏకం చేస్తానని వ్యాఖ్యానించారు.
'సూపర్ ధర్స్ డే పోల్స్' గా హోరాహోరీగా జరిగిన లండన్ ఎన్నికల్లో
ప్రతిపక్ష లేబర్ పార్టీ తరఫున సాధిఖ్ ఖాన్ తన ప్రత్యర్థి, కన్జర్వేటివ్
పార్టీ అభ్యర్థి జాక్ గోల్డ్ స్మిత్ పై మొత్తం మీద 14శాతం ఓట్ల ఆధిక్యంతో(రెండు
రౌండ్లు కలిపి) విజయం సాధించారు. ఆయనకు పోలైన ఓట్లలో 46శాతం ఓట్లు
దక్కాయి. ఈ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రావాలంటే 50శాతం ఓట్లు సాధించాలి. కానీ,సాధిఖ్ కు ఆ మేరకు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను
కూడా లెక్కబెట్టారు. రెండో ప్రాధాన్యం ఓట్లలో సాధిఖ్ ఘన విజయం సాదించారు. మొత్తం
మీద 57% వోట్లను సాధించి(గోల్డ్ స్మిత్ కు 43% వోట్లు) లండన్ సిటీ హాల్ లో తొలి
ముస్లిం మేయర్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
సాదిక్ ఖాన్ ఈ ఎన్నికలలో దాదాపు 1.3 మిలియన్
వోట్ల ను సాదించారు. లండన్ నగరం లో మొత్తం జనాభా 8మిలియన్లు కాగా అందులో 1 మిలియన్
మంది ముస్లిమ్స్ ఉన్నారు. సాదిక్ ఖాన్
గెలుపు పై లేబర్ నేత జెరిమి కార్బిన్‌కు (Jeremy Corbyn )సంతోషం వ్యక్త పరిచారు. టోరిలు
(కన్సర్వేటివ్లు)సాగించిన బురద చల్లుడు కార్యక్రమం లండన్ వోటర్లను ఎ మాత్రం
ప్రభావితం చేయలేదని అయన అన్నారు.అది వారికి నిరాశను మిగిలించినదని అయన
పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ నగరాల మేయర్లు
ఆయనకు తమ అభినందనల సందేశాలను పంపడం మొదలుపెట్టారు. న్యూయార్క్ నగర మేయర్ బిల్ డి
బ్లాసియో కూడా సాదిక్ కు తన అభినందనలు తెలిపారు.
ఈ ఎన్నికలు ముఖ్యంగా ప్రధాని డేవిడ్ కెమరాన్ నేతృత్వంలోని
కన్జర్వేటివ్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. త్వరలోనే పార్లమెంట్
ఎన్నికలు జరుగనున్న బ్రిటన్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న ఉక్కు పరిశ్రమ సంక్షోభం, వైద్య నిపుణుల సమ్మె, కెబినెట్ మంత్రి వైదొలగటం వంటి వాటితో
పాటు జూన్‌లో బ్రెగ్జిట్‌పై జరుగనున్న రిఫరెండం వంటి అనేక సమస్యలను అది ఎదుర్కొంటోంది.
2020 లో జరిగే సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికలకు ఇవి
ముందస్తు ఎన్నికలు లాంటివి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తన
విజయం పట్ల ఖాన్ ఆనందం వ్యక్తం చేస్తూ ఈ గెలుపు అందరు లండన్ వాసులదని
పేర్కొన్నారు.నాలాంటి మధ్యతరగతి శ్రామిక వర్గానికి చెందిన వ్యక్తి లండన్ మేయర్ గా
ఎన్నిక కావటం సంతోషంగా ఉన్నదన్నాడు.వోట్లర్లకు కృతఙ్ఞతలు తెలుపుతూ లండన్ లో ఎలాంటి
భయానికి తావు లేదు అని అన్నాడు. ఈ ఎన్నిక భయం మీద ఆశ మరియు విచ్చిన్నం మీద సమగ్రత
గెలుపు లాంటిదని పేర్కొన్నాడు.
జీవిత విశేషాలు:
పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన అమానుల్లా మరియు సేహృన్ ఖాన్
దంపతులకు 1970
లో జన్మించిన సాదిక్ ఖాన్ వయస్సు 45 సంవత్సరాలు. మొత్తం 8మంది సంతానం
లో 5వ వాడు. అందులో 7గురు మగపిల్లలు ఒక ఆడ పిల్ల.ఇతని తండ్రి బస్సు-డ్రైవర్ గా
పనిచేసాడు తల్లి ఇంటివద్ద బట్టలు కుట్టడం అల్లికలు చేస్తుండేది. ఇతని బార్య పేరు
సాదియా అహ్మద్ ఈమె కూడా న్యాయవాది మరియు ఇతనికి ఇద్దరు కుమార్తెలు అనిసా
మరియు అమ్మరా.
లండన్ లోని సౌత్-వెస్ట్
ప్రాంతం లో నివసించిన ఇతను లోకల్ కాలేజి లో చదివినాడు. 15సంవత్సరాల వయస్సు లో
లేబర్ పార్టి లో సబ్యత్వం పొందినాడు. ఇతను చదిన స్కూల్ హెడ్ మాస్టర్ ప్రోత్సాహం తో
రాజకీయాలలో ప్రవేశించినాడు. ఫుట్-బాల్,బాక్సింగ్,క్రికెట్ నందు
ఆసక్తి చూపినాడు.
మొదట్లో డెంటిస్ట్ అవ్వాలనుకొన్నాడు
కాని లాయర్ గా స్థిరపడినాడు.యూనివర్సిటి అఫ్ నార్త్ లండన్ నుంచి న్యాయవాద పట్టాను
పొందినాడు. 1994 ఇతని వివాహం తోటి న్యాయవాది సాదియా అహ్మద్ తో జరిగింది. 2004 లో
న్యాయవాద వృతిని విడిచి చురుకుగా రాజకీయాలలో పాల్గొన్నాడు. 2005 లో టూటింగ్(సౌత్
లండన్) నుంచి లేబర్ ఎం.పి. గా ఎన్నికైనాడుగార్డెన్ బ్రౌన్ మంత్రివర్గం లో మొదట
విప్ గాను పిదప కమ్యూనిటిస్ మినిస్టర్ గాను, పిదప 2009 లో ట్రాన్స్ పోర్ట్ శాఖను
నిర్వహించినాడు. 2010 తిరిగి లేబర్ ఎం.పి. గా ఎన్నికైనాడు.
లేబర్ పార్టి విపక్షం లో ఉండగా షాడో జస్టిస్ మినిస్టర్ గా పనిచేసినాడు. అందరి
అంచనాలను తల్లక్రిందుల చేసి 2015లో లండన్ మేయర్ ఎన్నికలలో విపక్ష లేబర్ పార్టి
అబ్యర్ధిగా ఎన్నిక కాబడినాడు. అధికార కన్సర్వేటివ్ పార్టి అబ్యర్ది గోల్డ్ స్మిత్
పై ఘన విజయం సాదిoచినాడు.
.
.
No comments:
Post a Comment