3 December 2016

మానవతావాద ఇస్లాం మరియు అమెరికన్ ముస్లింల దాతృత్వం (Humanitarian Islam & American Muslims Philanthropy)


అమెరికా, ఫ్రాన్స్, యూరప్ లోని కొన్ని ప్రాంతాలలో ఇస్లాం తివ్రవాదుల కార్యకలాపాలు పెరిగిన నేపద్యం లో అమెరికన్ ముస్లింలు తమను రాడికల్ ఇస్లామిస్ట్లు గాను, జిహాదిలుగాను వర్ణించడం మరియు తమ సముహాo ను క్రిమినాలిటీ, అల్లకల్లోలం మరియు హింసకు  పర్యాయపదంగా అవమానకరమైన బాషలో పిలవడం పట్ల తీవ్ర అబ్యంతరం తెలియజేస్తున్నారు. వారి సంస్కృతి, బాష మరియు వేషధారణ పట్ల అబ్యంతరం తెలియచేయబడటం పట్ల  విచార పడుతున్నారు. రాడికలిజం తో తమ మతం ను ముడిపెట్టడం మరియు కొందరు చేసే అమానివీయ కార్యక్రమాలకు మొత్తం కమ్యునిటీ బాద్యత వహించి రావడం పట్ల విచారం వేలుబుచ్చుతున్నారు.

నిజానికి ఇస్లాం దాని దాని వ్యవస్థాపక నుండి శాంతిని, మానవతను పెంపొందించే మతం గా రూపొందినది. మానవతావాద ఇస్లాం అనే పదం  గత దశాబ్ద కాలంగా  అమెరికా ముస్లింలలో ఉద్భవించింది. తివ్రవాదుల సామూహిక కాల్పులు  మరియు నేరప్రవృత్తి పెరిగిన నేపథ్యంలో కొంతమంది చే కొన్ని ప్రాంతాలలో  ముస్లిం వ్యతిరేక హింస స్థాయి పెరిగిన సందర్భం లో  మైనారిటీ ముస్లిం  సభ్యులు సాంప్రదాయిక ఇస్లామిక్ బోధనలకు అనుగుణంగా  దాతృత్వ చర్యలు ప్రారంభించారు.  "రాడికల్ ఇస్లాం” కు వ్యతిరేకంగా దాతృత్వం ప్రధాన లక్షణంగా గల  “మానవతావాద ఇస్లాం” (Humanitarian Islam) ప్రారంభమైనది.

ఓర్లాండో సామూహిక కాల్పుల నేపథ్యంలో కైర్(CAIR)ఫ్లోరిడా,సెలెబ్రేట్ మెర్సీ, ముస్లిం విమెన్స్ ఆర్గనైజేషన్,  అమెరికన్ ముస్లిం కాకుస్, ఇస్లామిక్ రిలీఫ్-USA వంటి సంస్థలు బాదితులు  మరియు వారి కుటుంభాల  సహాయార్ధం సహాయ  చర్యలు చేపట్టినవి.   ముస్లిం యునైటెడ్ ఫర్ పల్స్ ప్రోగ్రాం దివ్య ఖురాన్ మరియు హదీసులను ఉల్లేఖిస్తూ ఈ కార్యక్రమం లో ముస్లిమ్స్ పాల్గొనడాన్ని ప్రోత్సహిస్తుంది. 75 వేల డాలర్ల విరాళాలు సేకరించినది. రంజాన్ పవిత్ర మాసం లో అమెరికన్ ముస్లింలు రక్త దానం, విరాళాలు ఇవ్వడం,పేదలకు, అన్నార్తులకు, అబాగ్యులకు,ఆహరం పంచడం, మంచి నీరు అందించడం   వంటి సత్కార్యాలు చేసారు.
అమెరికన్ వెస్ట్-కోస్ట్ లోని ఒక సెంటర్ పై ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడులు చేసిన  సందర్భం లో  CAIR-కాలిఫోర్నియా వారు సహాయం కోసం స్పందించారు. ముస్లిం యునైటెడ్ ఫర్ శాన్-బెర్నర్దినో వారు  దివ్య ఖురాన్ మరియు హదీసులను ఉదాహరిస్తూ  అమెరికన్ ముస్లిం కమ్యూనిటి నుంచి " ద్వేషం ను దాతృత్వం మరియు ప్రేమ తో జయించుదాము” అనే నినాదం తో  $ 200,000 విరాళం బాధిత కుటుంబాలు, వ్యక్తుల సహాయం కోసం పోగు చేసారు.

అమెరికాలోని అనేక ప్రాంతాలలో మరియు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మతం గా  ఉన్న ముస్లింలు ఉగ్రవాద దాడులు జరిగిన సందర్భం లో మానవతను చూపిస్తూ భాదిత కుటుంభాల దుఖం లో పాలు పంచుకొన్నారు. న్యుజెర్సీ, మిచిగాన్,శాన్ ఫ్రాన్సిస్కో, బాల్టిమోర్, న్యుయార్క్  వంటి రాష్ట్రాలలో అధిక సంఖ్యలో ఉన్న అమెరికన్ ముస్లిమ్స్  రంజాన్ పవిత్ర నెలలో  ఈద్ వేడుకలను సయితం త్యాగం చేసి బాధితులను ఓదార్చారు. వారి కోసం పెద్ద మొత్తం లో విరాళాలు వసూలు చేసి అందించారు.అనాధలకు, పేదలకు   ఆహారo, నీరు అందించి  తమ దాతృత్వo ప్రదర్శించారు.ఈ విధంగా విషాద కార్యక్రమాల  నేపథ్యంలో ఇస్లాం మానవతావాదo ను ప్రోత్సహిస్తూ   అమెరికన్ ముస్లిం సంస్థలు మరియు నేతలు దాతృత్వ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఇలాంటి మానవతా కార్యక్రమాలు ఇస్లామిక్ మూలవిశ్వాసాలలో కలవు.   స్వచ్ఛందoగా దానమివ్వడం ఇస్లాం ఐదు మూల స్తంభాలలో ఒకటి మరియు విశ్వాసుల  దానిని జకాత్, లేదా సదకా అని అంటారు. ఇది  వారి సామాజిక బాధ్యత. జకాత్ మరియు సదకా తో వారి మిగులు సంపద శుద్ది చెందుతుంది. అమెరికన్ దృక్పదం లో జకాత్ సాధారణంగా పేద మరియు నిరాశ్రయులకు ఉపశమనం అందించడంగా  పరిగణించబడుతున్నది.
దివ్య ఖురాన్ మరియు హదీసుల అందు  జకాత్ విస్తృతంగా వివరించబడినది మరియు ఇస్లామిక్ సంప్రదాయాలలో  స్వచ్ఛందo గా దాన మివ్వడం పుణ్య కార్యక్రమం గా గుర్తిస్తారు.  ప్రవక్త ముహమ్మద్ (స) మాటలలో
·        దానం గా సగం ఖర్జూర పండు ఇవ్వడం ద్వారా నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు.  
·        మీ డబ్బు నిలువ ఉంచవద్దు  అలా చేస్తే అల్లాహ్ దీవెనలు మీకు దక్కవు.
·        ప్రతి ముస్లిం స్వచ్ఛంద దానం తప్పనిసరిగా  చేయాలి.

మొదటి నుంచి ఇస్లాం లో దాతృత్వం కు అగ్రస్థానం ఇవ్వబడినది. జకాత్ లేదా స్వచ్ఛంద దానం లేదా దాతృత్వం మానవత కు మారుపేరు గా ఉంది. దివ్య ఖురాన్ లో అల్లాహ్ అంటాడు "భూమి మీద దయ కలిగ ఉండండి. స్వర్గం  లో అల్లాహ్ మీ పట్ల దయగలిగి ఉంటాడు."  ఈ ప్రచారం స్వచ్ఛంద దానం  కన్నా చాలా ఎక్కువ. ఇది అమెరికన్ ముస్లిం కమ్యూనిటీ అమెరికా లో  మిగిలిన వారిపట్ల ప్రదర్శిస్తున్న  "యాక్షన్ కంపాషన్."

పై వాదన అమెరికన్ ముస్లింల దాతృత్వాన్ని, మానవతను చాటుతుంది దివ్య ఖురాన్ లోని ఆయత్ “చెడును మంచి తో తొలిగించు” ను గుర్తుచేస్తుంది.  
14 వ శతాబ్దం సున్ని పండితుడు ఇస్మాయిల్ ఇబ్న్ కతిర్ యొక్క దివ్య ఖురాన్ వివరణ ప్రకారం చెడు మంచి కన్నా భిన్నమైనది మరియు దయ తో కష్టాలను తొలగిస్తే అది  తాదాత్మ్యం, ప్రేమ మరియు స్నేహం కు  దారి తీస్తుంది.
అమెరికన్ ముస్లిం దాతృత్వం దేనిని తొలగిస్తుంది? అమెరికన్ ముస్లింల మాటలలో మమ్ములను తీవ్రవాదులుగాను  మరియు వికృతమైన అమానవీయ చర్యలకు పాల్పడే వ్యక్తులతో పోల్చడం బాధ కల్గిస్తుంది.  అమెరికా ముస్లింలు సమాజ వికాసానికి  తోడ్పడతారు మరియు  తీవ్రవాదులు నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న సమాజాన్ని కాపాడతారు.
అమెరికన్ ముస్లింలు హింసాత్మక తీవ్రవాదo తో పాటు అమెరికా లో ప్రబలుతున్న ముస్లిం వ్యతిరేక వాదాన్ని వ్యతిరేకిస్తున్నారు.  9/11 సంఘటనల తరువాత ఇటివల కాలం లో ప్రబలుతున్న మరియు అద్యక్ష ఎన్నికలలో అంతిమ స్థాయి కి చేరిన ముస్లిం వ్యతిరేక హింసాకాండను  మరియు బెదిరింపులను ఖండిస్తున్నారు. అమెరికా లో ఇటివల అంటి-ముస్లిం సంఘటనలు  ఐదు రెట్లు పెరిగినవి.
ఇస్లామోఫోబియా ను దూరం చేసి  మానవతాఇస్లాం ను పునరుజ్జీవింప చేయడానికి అమెరికన్ ముస్లింలు మరియు వారి సంస్థలు  ప్రయత్నిస్తున్నాయి. ఇందుకు గాను అవి దివ్య ఖురాన్ భోధనలు మరియు ప్రవక్త(స) హదీసుల సహాయం పొందుతున్నవి. వాస్తవానికి ఇస్లాం ప్రవచించిన మానవతావాదం కు స్వచంద దానం, జకాత్  పేరున కొత్త రూపును ఇచ్చి   అమెరికన్ ముస్లింలు మరియు వారి సంస్థలు దాతృత్వం రూపేణ స్వచ్ఛమైన, పరిశుభ్రమైన ఇస్లాం ను అమెరికన్ ప్రజలకు పరిచయం చేస్తున్నారు. వారి కృషి పలించుగాక. అమీన్.


No comments:

Post a Comment