29 December 2016

భారత దేశం లో అరబిక్ ప్రాచుర్యం -


భారత దేశం లో అరబిక్ మాతృభాష గా కలవారు సుమారు 50వేల మంది ఉన్నారనటం ఆశ్చర్యం గా ఉంది కదూ! 2001 భాషాపరమైన వర్గాల వారిపై జరిగిన సెన్సస్ డేటా ప్రకారం, భారతదేశం లో అరబిక్ మాతృభాష గా కలవారు 51.728 మంది ఉన్నారు.

1974 లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రతి సంవత్సరం డిసెంబర్ 18ని కమ్యూనికేషన్ యొక్క సాధనంగా అరబిక్ బాషా ప్రాధాన్యతను గుర్తిస్తూ ఆ రోజును అరబిక్ దినంగా ప్రకటించినది.  1974 లో ఐక్య రాజ్య సమితి దాని ప్రధాన ఆరు అధికార భాషల్లో ఒకటిగా అరబిక్ ను స్వీకరించింది. అరబిక్ 20 దేశాల వారి మాత్రు బాష –పడమర  ఉత్తర ఆఫ్రికా యొక్క అట్లాంటిక్ తీరం నుండి తూర్పున  ఒమన్ సుల్తానేట్ వరకు  ఉత్తరాన సిరియా నుండి దక్షిణాన సుడాన్ వరకు అరబిక్ వ్యాప్తిలో ఉన్నది.

ప్రపంచీకరణ యుగంలో వాణిజ్య మరియు సాంస్కృతిక రంగాలలో అరబిక్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శతాబ్దాల నాటి సంపన్న సంస్కృతి మరియు నాగరికత కలిగిన  భాష; ఇది దివ్య ఖురాన్ మరియు  ప్రవక్త మహమ్మద్(స) ఉపయోగించిన  భాష.

ప్రాచ్య బాషల నిపుణుడు  ఫిలిప్ K.హిట్టి  ప్రకారం : "మధ్య యుగం లో  అనేక శతాబ్దాలుగా నాగరిక ప్రపంచం అంతటా విద్యాభ్యాస మరియు సాంస్కృతిక మరియు ప్రగతిశీల ఆలోచన కల బాష గా అరబిక్  ఉంది. తొమ్మిదవ మరియు పన్నెండవ శతాబ్దాలలో అనేక రచనలు, -తాత్విక, వైద్య, చారిత్రక మత, ఖగోళ మరియు భౌగోళిక  అరబిక్ మాధ్యమం ద్వారా వేలుబడినవి. "


ప్రపంచం పెట్రోల్ దిగుమతి కొరకు  అరబ్ దేశాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ ఆధారపడటం ఇరవయ్యో శతాబ్దం మొదటి అర్ధభాగంలో గణనీయంగా పెరిగింది. అరబ్బులు మరియు అరబ్బులు కాని వారి మద్య  బలమైన సంబంధాలు ఏర్పడినవి. పలితంగా ప్రపంచ ప్రజలలో అరబిక్ బాష పట్ల, అరబ్ దేశాల పట్ల, అరబ్ సంస్కృతి పట్ల విశేష  ఆసక్తి పెరిగింది.

స్వాతంత్య్రానంతరo, అరబిక్  బాష ప్రాధాన్యం  భారత ప్రభుత్వం గుర్తించినది. అరబిక్ విభాగాలు అనేక కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు మరియు కళాశాల అందు  స్థాపించబడ్డాయి. ప్రస్తుతం  అరబిక్ కళాశాలలతో పాటు భారతదేశం లో 40 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలలో అరబిక్ బాషా విభాగాలు ఉన్నాయి.

అరబిక్ కేవలం మదర్సా లేదా ఇస్లామిక్ పాఠశాల లేదా  ఒక మతం భాషగా భావించబడటం లేదు. వ్యాపార ప్రపంచీకరణతో నగదు లావాదేవీల  జ్ఞానం కొరకు అరబిక్  అవసరం ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగాలు గుర్తించినవి.  ప్రస్తుతం ప్రపంచీకరణ నేపద్యం లో  అరబిక్ ఒక్క ముస్లిం కమ్యూనిటీ కే  పరిమితo కాలేదు అనేక మంది ముస్లిమేతరులు అరబిక్ బాష ను నేర్చుకొంటున్నారు ఈ రోజుల్లో చమురు సంపన్న అరబ్ దేశాల లోని  బహుళజాతి కంపెనీల్లో పనిచేయుటకు మరియు ఆ దేశాల్లోని  పర్యాటక, ఆతిథ్య మరియు రక్షణ రంగాలలో పనిచేయుటకు అరబిక్ జ్ఞానం అవసరం.


నేడు అనేకమంది  ముస్లిమేతరులు విశ్వవిద్యాలయాలు మరియు కళాశాల లో అరబిక్ బాష అబ్యసిస్తున్నారు. భారత దేశ ప్రసిద్ది కేంద్రీయ  విశ్వవిద్యాలయo జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ముస్లిమేతరలు  గణనీయమైన సంఖ్యలో ప్రతి సంవత్సరం అరబిక్ లో గ్రాడ్యుయేట్ అవుతున్నారు. 

No comments:

Post a Comment