ప్రపంచవ్యాప్తంగా సగటున
ముస్లిం మహిళల కంటే పురుషులు మరింత విద్య కలిగి ఉన్నారని నోబెల్ శాంతి
బహుమతి-విజేత మలాలా యూసుఫ్జాయి మరియు
ఇస్లామిక్ స్త్రీవాదుల అభిప్రాయం. విద్యా విషయకంగా ముస్లిం జనాభా లో
స్త్రీ-పురుషుల మద్య అంతరం ఇతర వర్గాల కన్న
అధికంగా ఉంది. అది ఈ మద్య కాలం లో అది బాగా తగ్గినది. అనేక ముస్లిం
ప్రాంతాలలో ముస్లిం స్త్రీలు విద్యావిషయకంగా ముందజలో ఉన్నారని ప్రపంచ ప్రధాన మత
సమూహాల్లో విద్యా ప్రాప్తి మీద అధ్యయనం చేసిన అమెరికన్ ప్యూ రిసెర్చ్ సంస్థ
ప్రకటించినది.
1976-1985 మద్య పుట్టిన మూడు తరాల
ముస్లిమ్స్ పై అధ్యయనం చేసినారు. అందులో 1976 -1985 మద్య పుట్టిన యువ తరం ముస్లిమ్స్ ను
విస్లేషిoచగా వారు 1936-1955లో జన్మించిన వారి కన్న అధిక విద్యావంతులు అయినట్లు
తెలుస్తుంది. స్త్రీ-పురుషులు ఇరువురు లో విద్య లో పురోగతి సాధించగా స్త్రీలలోఅది
ఇంకా శరవేగంతో పురోగతి ఉంది.
పాత తరం స్త్రీ సగటున 2.5
సంవత్సరాల ఫార్మల్ విద్యను పొందగా
పురుషుడు 2.1 సంవత్సరం అధికతతో 4.6 సంవత్సరాల ఫార్మల్ విద్య ను పొందినాడు. యువ మహిళలు
2010 నాటికి 25- 34
సంవత్సరముల మద్య ఉన్నవారు వారి పాత తరం
స్త్రీల కంటే అధికంగా సగటున 6.1 సంవత్సరాల
ఫార్మల్ స్కూల్ విద్య పొందినారు. ఇప్పటి కాలం యువకులు సగటున కేవలం వారికంటే ఒక సంవత్సరం అధికంగా అనగా 7.3 సంవత్సరాల ఫార్మల్
స్కూల్ విద్య పొందినారు. .
ప్రపంచవ్యాప్తంగా ముస్లిం
పాత తరం స్త్రీల లో 64% మంది ఎవిదమైన ఫార్మల్ విద్య
పొందలేదు. నేటి యువతరం స్త్రీలు 33% మంది మాత్రమే ఏవిధమైన ఫార్మల్ విద్యా సౌకర్యం
పొందలేదు. అదే పురుషులను పరిశిలించుతే ముస్లిం పురుషులలో ముడుతరాలుగా ఎటువంటి
ఫార్మల్ విద్య పొందని వారు కేవలం 23%గా ఉన్నారు.
కొద్దిమంది ముస్లిం
పురుషులు మరియు మహిళలు పోస్ట్-సెకండరీ డిగ్రీ స్థాయిలను కలిగి ఉన్నారు. కానీ కొన్ని
ప్రదేశాలలో, పోస్ట్-సెకండరీ విద్యలో
ముస్లిం మహిళల ముందంజ వేసి లింగ వివక్షను తొలగించారు. అనగా నేటి యువ తరం స్త్రీలు ఎక్కువ శాతం మంది కళాశాల
డిగ్రీలు కలిగి ఉన్నారు. ఈ నమూనా
ముఖ్యంగా కతర్, కువైట్, బహ్రెయిన్ మరియు ఇతర గల్ఫ్ కోఆపరేషన్
కౌన్సిల్ సబ్య దేశాల లో కనపిస్తుంది.
ఉదాహరణకు సౌదీ అరేబియాలో పోస్ట్-సెకండరీ డిగ్రీ
పొందిన పాత తరం ముస్లిం మహిళలు 3% పెరిగగా యువ మహిళలలో అది 35% గా ఉంది. సౌదీ ముస్లిం పురుషుల లో ఉన్నత విద్య పొందిన వారు
16నుంచి 28% కు పెరిగారు.
కాని ఉప సహారా ఆఫ్రికా ప్రాంతం
లో ముస్లిం స్త్రీల విద్యాభివృద్ది అంతా సంతృప్తి కరంగా లేదు. మూడు తరాల పరిశిలన
లో ముస్లిం స్త్రీలు కొంత పురోగతి సాధించినప్పటికీ ముస్లిం స్త్రీ-పురుషుల మద్య లింగ వివక్షత విద్యాపరంగా
అధికంగా ఉంది. పురుషల కంటే స్త్రీల
పురోగతి మందగతిలో ఉంది.
ఉప-సహారా ఆఫ్రికాలో అతి
పిన్న తరం ముస్లిం పురుషులు వారి పెద్ద
తరం ముస్లిమ్స్ కంటే సగటున స్కూలింగ్ 2.4 ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు చేసి ఉంటారు.
అదేవిధంగా యువ మహిళలు వారి పెద్ద తరం మహిళలు కంటే సగటున కేవలం 1.7 సంవత్సరాల స్కూలింగ్ పొంది ఉన్నారు.
.కానీ ఇతర ప్రాంతాలలో ముస్లిం మహిళలు పురుషుల
కంటే మిన్నగా ఉన్నారు. ఉదాహరణకు యూరోప్ లో
పిన్న తరం వారిలో ముస్లిం మహిళలు మరియు పురుషులు సమానంగా సగటు విద్య పొంది
ఉన్నారు. ఆసియా-పసిఫిక్ మరియు మధ్య తూర్పు-ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో ముస్లిం
స్త్రీ-పురుషుల మద్య విద్యా విషయం గా అంతరo గణనీయంగా తక్కువ ఉంది.
No comments:
Post a Comment