కొన్ని సంవత్సరాల క్రితం ఇస్లామిక్ ప్రపంచం
నుండి కేవలం ఏడు(07) విశ్వవిద్యాలయాలు మాత్రమె టాప్ 500 ప్రపంచ విశ్వవిద్యాలయాలలో జాబితా
లో చేరినాయి. అయితే, ది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్
యూనివర్శిటీ రాంకింగ్స్ 2018 (2016-2017 కోసం) ప్రకారం, ముస్లిం దేశాలకు
చెందిన తొంభై ఆరు(96) విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోని అగ్ర 1102 విశ్వవిద్యాలయాల
జాబితా లో చేర్చబడ్డాయి. ఇది ఇస్లామిక్
ప్రపంచంలో ఉన్నత విద్యాభ్యాసానికి
ఖచ్చితంగా సానుకూల సంకేతంగా ఉంది. 18 ముస్లిం దేశాలలోని విశ్వవిద్యాలయాలు
మాత్రమె ఈ జాబితాలో చోటు చేసుకొన్నాయి.
ఇతర ముస్లిం దేశాలు కూడా భవిష్యత్ నివేదికల జాబితా లో స్థానం ను పొందుతాయని
భావిస్తున్నాము.
జాబితాలో ఉన్న96
విశ్వవిద్యాలయాలలో 22 టర్కీ నుండి 18ఇరాన్ నుండి,
10పాకిస్థాన్, 9మలేషియా మరియు ఈజిప్ట్ నుండి 9, 5సౌదీ
అరేబియానుండి, 4U.A.E మరియు 4ఇండోనేషియా నుండి, 3జోర్డాన్ మరియు మొరాకో నుండి3, ట్యునీషియా 2 మరియు అల్జీరియా నుండి 2, బంగ్లాదేశ్, కువైట్, లెబనాన్, నైజీరియా. ఒమన్
మరియు కతర్ నుండి 1 చొప్పున స్థానం పొందినవి. .
·
41 విశ్వవిద్యాలయాలలో, స్త్రీ
విద్యార్ధులు, పురుష విద్యార్ధుల కన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
·
11 విశ్వవిద్యాలయాలలో స్త్రీ-పురుష విద్యార్ధుల
శాతం (%) వరుసగా 65:35 ఉన్నది.
·
సౌదీ అరేబియా లోని ఇమాం అబ్డుల్ రహ్మాన్
విశ్వవిద్యాలం లో అత్యధికం
గా మొత్తం విద్యార్ధులలో (22,257) స్త్రీ-పురుష విద్యార్ధుల శాతం 81:19 గా ఉంది.
·
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూనివర్శిటీ (మొత్తం 7,492 మంది
విద్యార్థులు)లో స్త్రీ-పురుష విద్యార్ధుల శాతం 79:21గా ఉంది.
·
కతర్ 79: 21, యూనివర్శిటీ లో (మొత్తం 13,342 మంది
విద్యార్థులు) 73:27గా మరియు కువైట్
యూనివర్శిటీ లో (మొత్తం 37,752 మంది
విద్యార్థులు) 72:28 నిష్పత్తిలో
స్త్రీ-పురుష విద్యార్ధులు ఉన్నారు. ఇది
ఇస్లామిక్ సమాజం లో స్త్రీల విద్యా
సాధికారికతను చాటుతుంది.
కింగ్ అబ్దులజిజ్ యూనివర్శిటీ హాస్పిటల్
1102 ప్రపంచ విశ్వవిద్యాలయాలలో ముస్లిం దేశాల
నుంచి 96 విశ్వవిద్యాలయాలు స్థానం పొందటం
ముస్లిం సమాజానికి ఆధునిక జ్ఞానం
మరియు అధిక అక్షరాస్యత పట్ల ఉన్న ఆసక్తి కి స్పష్టమైన సూచనగా చెప్పవచ్చు. ముస్లిం
దేశాలలో పెరుగుతున్న ప్రస్తుత విద్యా
ధోరణి వెనుక చమురు ఆర్థిక శక్తిని ప్రధాన
కారణం గా చెప్పవచ్చు.
·
సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దులజిజ్
విశ్వవిద్యాలయం ప్రపంచ ఇస్లామిక్ దేశాల విశ్వవిద్యాలయాలలో మొదటి స్థానం పొందినది. అది
ప్రపంచ ర్యాంకింగ్ జాబితా 201-250 లో స్థానం పొందినది.
·
అలాగే ప్రపంచ
ర్యాంకింగ్ జాబితా 301-350లో 1.బాబోల్ నౌషిర్వాని యూనివర్శిటీ అఫ్ టెక్నాలజీ, ఇరాన్, 2.ఖలీఫా యూనివర్శిటీ, యు.ఎ.ఇ. మరియు 3.KOC
యునివర్సితి, టర్కీ స్థానం పొందినవి.
·
ప్రపంచ ర్యాంకింగ్ జాబితా 351-400 లో
1.యూనివర్శిటీ అఫ్ మలయా, మలేషియా,
మరియు 2.సబన్కి యూనివర్శిటీ టర్కీ స్థానం పొందినవి.
1.యూనివర్శిటీ అఫ్ మలయా, మలేషియా,
మరియు 2.సబన్కి యూనివర్శిటీ టర్కీ స్థానం పొందినవి.
·
ప్రపంచ ర్యాంకింగ్ 401-500 లో (1.) బిల్కెంట్ యూనివర్శిటీ టర్కీ; (2.) బోగజిసి
యూనివర్శిటీ టర్కీ; (3.) జోర్డాన్
యూనివర్శిటీ అఫ్. సైన్స్ అండ్ టెక్. జోర్డాన్; (4.) కతర్
యూనివర్శిటీ కతర్;
(5.) క్వాయిడ్-ఐ-అజమ్ యూనివర్శిటీ , పాకిస్థాన్ స్థానం పొందినవి.
(5.) క్వాయిడ్-ఐ-అజమ్ యూనివర్శిటీ , పాకిస్థాన్ స్థానం పొందినవి.
·
ప్రపంచ ర్యాంకింగ్ 501-600 లో మొత్తం ఆరు ఇస్లామిక్
యూనివర్శిటీలు స్థానం పొందినవి.
·
ప్రపంచ ర్యాంకింగ్ 601-800 లో 24 ఇస్లామిక్ యూనివర్సిటీ లు స్థానం
పొందినవి.
·
ప్రపంచ విశ్వవిద్యాలయాలలో ర్యాంకింగ్ 801-1000 లో మొత్తం 32
ఇస్లామిక్ యూనివర్సిటీ లు స్థానం పొందినవి.
·
ప్రపంచ విశ్వవిద్యాలయ
ర్యాంకింగ్ 1001-1102 లో మొత్తం 23 ఇస్లామిక్ యూనివర్సిటీ లు
స్థానం పొందినవి.
No comments:
Post a Comment