దళితులు, ముస్లింల సమస్యలు అన్ని కాక పోయినా చాలావరకు ఒకే రకంగా ఉన్నాయి. దళితులకు అనేక రాజ్యాంగ నిబంధనల సహాయం ఉంది. అవి వారి
పరిస్థితులను మెరుగుపర్చడంలో సహాయపడినవి. ముస్లింలు సమాజం లోని ఇతర వర్గాల కన్నా వెనుకబడి ఉన్నప్పటికీ తమ
మతపరమైన గుర్తింపు కారణంగా ప్రయోజనాలు కోల్పోయారు. దళితులు, ముస్లింలు
అన్ని స్థాయిలలో వివక్షను ఎదుర్కొంటున్నారు. వీరిద్దరూ న్యాయ వ్యవస్థలో వివక్షత
బాధితులుగా ఉన్నారు. దళితులు మరియు ముస్లింలు మెరుగైన భవిష్యత్తు కోసం కలిసిమెలసి పని చేయాలి.
దళితులు
మరియు ఆదివాసీలు మాత్రమే కాకుండా భారతీయులందరు డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ చూసి గర్వపడాల్సిన అవసరం ఉంది. ఆధునిక భారతదేశం పునాది వేయడంలో ఇతరులకన్నా
అతని పాత్ర చాలా ముఖ్యమైనది. దళితులకు గర్వపడేందుకు అదనపు కారణం ఉంది: ఆయన వారిలో
ఒకరు. స్వతంత్ర భారత దేశo లో దళితులు పొందిన వాటికి వెనుక ఆయన హస్తం ఉంది. వారి
పాలిట అయన దేవుడు.
దళితులు
అంబేద్కర్ భావజాలం ను అధిగమించి ముందుకు వెళ్ళే సమయం వచ్చింది. అయన తన కాలములో ఉన్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా
ప్రవర్తించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అర్ధ శతాబ్దం కన్నా ఎక్కువ కాలం గడిచిపోయింది.
దేశ విభజన తరువాత,
దళితులకి ఇస్లాం సరైనది కాదు అని ఆయన భావించాడు మరియు బౌద్ధమతానికి అనుకూలంగా
నిర్ణయించుకున్నారు. ఆనాటి సామాజిక వాస్తవికత యొక్క అవగాహన ఆధారంగా తన వాదనలను
ప్రధానంగా నిర్మించాడు.
విభజన
తరువాత,
దేశంలో మానసిక స్థితి
ముస్లింలకు వ్యతిరేకం గా పెరిగింది. భారతదేశం ఒక లౌకిక దేశంగా
ప్రకటించబడిం.ది
దళితులను తమతో
ఉంచుకోవడానికి,
దళితులు ఇస్లాం వైపు మొగ్గు
చూపరాదని హిందువులు నిశ్చయించుకున్నారు. దళితులకు రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ, వారు ఇస్లాం లేదా క్రైస్తవ మతంలోకి మారారంటే వారి రిజర్వేషన్
పోతుంది అని రాజ్యాంగం ధృవీకరించింది. భారత లౌకికవాదం లో, హిందూ మతం, సిక్కు
మతం,
జైనమతం మరియు బౌద్ధమతం
ఇస్లాం మరియు క్రైస్తవ మతం కంటే అధికoగా ఉన్నాయి. ఇస్లాం మతానికి మారినట్లయితే, తానూ హిందూ మెజారిటీ ద్రుష్టి లో ఒక అవుట్-కాస్ట్
(వెలివేయబడిన వాడు ) అవుతాడు అని అంబేద్కర్ భావించారు. బౌద్ధ మతాన్ని స్వికరించేదుకు ఆయన చేసిన నిర్ణయం భావజాలం
కన్నా సాంఘిక బలహీనతలకు అనుగుణ్యంగా ఉంది.
ముస్లింలతో
దళితులు ఇంకా బలమైన బంధాన్ని అభివృద్ధి చేయక పోయి ఉంటే, ముస్లింలు ఆ నిందను
పంచుకోవాలి. ఇస్లాం సమానత్వం కోసం
నిలుస్తుంది.
దివ్య ఖుర్ఆన్ మొత్తం మానవాళి
(అందరు పురుషులు మరియు స్త్రీలకు ఒకే తండ్రి మరియు తల్లి- ఆడమ్ మరియు హవ్వలు) యొక్క సమానత్వాన్ని గురించి
మాట్లాడుతుంది. పవిత్ర ఖురాన్ గ్రంథం మనిషి యొక్క గొప్పతనం అతని సుగుణాల వల్ల సిద్దిస్తుంది అంటుంది. జాతులు
మరియు కులాలను ఇస్లాం అంగీకరించదు. ఇస్లాం
ప్రకారం మతపరమైన విషయాలలో,
సామాజిక బాధ్యతలు మరియు చట్టo
దృష్టిలో అందరు సమానంగా ఉంటారు. వివక్ష ఉన్నట్లయితే, అది ఒప్పు మరియు తప్పుల మధ్య మరియు చెడు మరియు మంచి మర్యాదల
మధ్య ఉంటుంది.
భారతదేశంలో
దళితుల పరిస్థితి యుగాగాలుగా ఇస్లాం కు ముందు శకంలోని బానిసల స్థితి కంటే
మెరుగైనది కాదు. ముహమ్మద్ ప్రవక్త (స) బానిసల విషయం లో సాధించిన మార్పు మానవజాతి చరిత్రలో అతి పెద్ద మార్పు/విప్లవం
గా నిరూపించబడింది మరియు అల్లాహ్ యొక్క సంపూర్ణ ఏకతత్వం అనే భావన అణగారిన ప్రజలను ఇస్లాం దరికి చేర్చింది. అల్లాహ్ యొక్క ఏకత్వ భావన నుండి వారు ముస్లిం సమాజ ఏకత్వం
అనే భావనను గ్రహించారు. అల్లాహ్ యొక్క ఏకత్వ భావన మానవులలో ఒకరు, మరొకరి కంటే ఎక్కువ
కాదు అని చాటుతుంది.
దళితులు, ముస్లింలు అన్ని స్థాయిలలో వివక్షను ఎదుర్కొంటున్నారు.
వీరిద్దరూ న్యాయ వ్యవస్థలో వివక్షత బాధితులుగా ఉంటారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్
బ్యూరో (ఎన్సీఆర్బి) ప్రకారం, "భారతదేశంలోని
జైలు ఇన్-మేట్స్ (ఖైదిలలో) ముస్లిం, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) మరియు ఇతర వెనుకబడిన వర్గాల (
ఒబిసి) కు చెందినవారు ఎక్కువ.
జనాభా
లెక్కల ప్రకారం దేశంలోని మొత్తం జనాభాలో ముస్లింలు 14.2 శాతం ఉన్నారు, అయితే మొత్తం జైలు
జనాభాలో 26.4 శాతం ఉన్నారు.అంతేకాక, అoదరు ఖైదీలలో 60.3 శాతం మంది ఓబిసి, ఎస్సీ, ఎస్టీ
వర్గాలకు చెందిన వారు, ఇతరులు 40% ఉన్నారు. OBCs మరియు STలకు
చెందిన వారు మొత్తం దేతెన్యుస్ (detenues) లో 38.1 శాతం ఉన్నారు. అందరు ఖైదీలలో
ముస్లింలు 30 శాతం మంది
ఉన్నారు. అందులో శిక్ష పడిన ముస్లిం ఖైదీల
సంఖ్య కేవలం 16.4
శాతం మాత్రమే ఉంది అని నేషనల్
క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బి) నివేదిక పేర్కొంది.
వ్యాపారంలో ఇద్దరికీ చాలా తక్కువ వాటా ఉంది. కార్పొరేట్లచే
ఆధిపత్యం వహించిన ప్రపంచంలో, కార్పోరేట్లను ప్రోత్సహిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా
దేశవ్యాప్త ప్రచారం ద్వారా దళితులు మరియు ముస్లింలు సమన్వయ వ్యూహాన్ని
రూపొందించాలి. వారు ఆర్థిక అసమానతకు వ్యతిరేకంగా పోరాడాలి.
దేశ విభజన నుండి పరిస్థితులు మారాయి. ఈ రోజుల్లో దళితులు
అంబేద్కర్ రోజుల్లో కంటే ఎక్కువగా నిరసన స్వరo
వినిపిస్తున్నారు. వారిలో చాలా ఎక్కువ
మంది విద్యావంతులుగా ఉన్నారు లేదా అధిక పరిపాలనా లేదా విద్యాపరమైన స్థానాలలో
ఉన్నారు. ముస్లింలు కూడా భయం అనే మానసిక స్థితి నుండి బయటికి వచ్చారు. దళితులు,
ముస్లింలు ఇద్దరి
లో కొత్త తరం దేశ పునర్నిర్మాణం లో
చురుకైన పాత్ర పోషించాలి అనుకొంటున్నది. ఇద్దరూ పురోగతి ఫలాలను ఆస్వాదించాలని కోరుకొంటున్నారు.
ఇద్దరూ వారు తాము సాధించాల్సినది ఉంది ఇంకా అని భావిస్తున్నారు మరియు ఏకమైతే మరింత సాధించగలరని నమ్ముతారు. జనాభా వారి వైపు
ఉంది.
దళితులు మరియు ఆదివాసీలు
అంబేద్కర్ మించి ముందుకు చూడాలని నేను కోరుకున్నప్పుడు, అది ఆ గొప్ప
వ్యక్తి పట్ల అగౌరవంగా కాదు. అంతేగాక, ప్రస్తుత
పరిస్థితిలో అంబేద్కర్ జీవించి ఉన్నట్లయితే, అతని వ్యూహం ఖచ్చితంగా 1940 మరియు 50 లలో అతను
ప్రణాళిక వెసిన దాని నుండి భిన్నంగా ఉండేది. ముస్లింలతో సుదీర్ఘకాలం ఉన్న బంధాన్ని
పరిశీలించి, ఇస్లాం తో సుదీర్ఘ బంధాన్ని ఏర్పరుచుకోవచ్చు.
ఇస్లాం నుండి దూరంగా ఉండటానికి
అంబేద్కర్ కు తన కాలములో కొన్ని పరిమితులను కలిగి ఉండవచ్చు,
కానీ అలాంటి కారణాలు ఇప్పుడు లేవు. దళితులు మరియు
ముస్లిమ్స్ కలిసి ఉన్నట్లయితే, సామాజికంగా మరియు రాజకీయంగా, ఆధ్యాత్మికం గా వారి చురుకైన భాగస్వామ్యం లేకుండా
ఎవరు ఏమీ చేయలేరు. వారు భవిష్యత్తులో
భారతదేశంలో మత లేదా కుల వివక్షత కు ఎటువంటి ప్రవేశం లేదని నిర్ధారించవచ్చు.
దళితులు, ముస్లింలు మరియు
ఆదివాసీల కలయిక ఇతర వర్గాలను దూరంగా
ఉంచెoదుకు లక్ష్యం కాకూడదు. మతపరమైన లేదా కుల గుర్తింపుపై ప్రచారం సాధించే బదులు, అది న్యాయం మరియు
అందరికి సమానత్వం కల్పించే లక్ష్యంతో ఉండాలి.
“దృడ నిర్ణయం మరియు పట్టుదలతో పనిచేసేటప్పుడు మాత్రమె దేవుని సహాయం వస్తుంది.”
No comments:
Post a Comment