యాత్రికులు లేదా అన్వేషకులు అనగానే మనకు మార్కో పోలో, ఇబ్న్ బటుట, ఎవిలియా సలేబి (Evliya
Çelebi), క్రిస్టోఫర్ కొలంబస్, మొదలైనవారి పేర్లు గుర్తుకు వస్తాయి. కాని చాలామందికి చైనా కు
చెందిన ప్రముఖ ముస్లిం యాత్రికుకుడు/అన్వేషకుడు జెంగ్ హి (Zheng He), గురించి తెలియదు. జెంగ్ హి 14వ శతాబ్దపు చైనా కు చెందిన ప్రసిద్ద అడ్మిరల్, అన్వేషకుడు మరియు
దౌత్యవేత్త.
మూలం:
జెంగ్ ఒక ముస్లిం ధార్మిక వ్యక్తి. జెంగ్ హు1371 లో దక్షిణ
చైనా ప్రాంతంలోని యున్నన్ ప్రాంతానికి చెందిన హుయ్ (ముస్లిం చైనీస్ జాతి సమూహం) కుటుంబo లో జన్మించాడు. అతని జన్మ పేరు మా హే. చైనాలో
కుటుంబం పేరు మొదట చెప్పబడుతుంది.తరువాత పెట్టిన పేరు వస్తుంది. “మా “అనేది చైనీస్ బాషలో “ముహమ్మద్” కు హస్వ
రూపం. "మా" అనేది జెంగ్ హి యొక్క ముస్లిం వారసత్వంను సూచించును. అతని
తండ్రి మరియు అతని తాత ఇద్దరూ మక్కాకు వెళ్లి హజ్ చేసారు.
చిన్న వయస్సులో, అతని నివసించే పట్టణం పై మింగ్
రాజవంశ సైన్యం దాడి చేసింది. అతను బంధించబడి రాజధాని నాన్జింగ్ కు తరలించబడ్డాడు. ఇక్కడ అతను రాజ గృహంలో బందీగా పనిచేశాడు. అణచివేత మరియు
కష్టమైన పరిస్థితులలో ఉన్న జెంగ్ అప్పటి
రాజకుమారులలో ఒకనితో స్నేహం చేసాడు మరియు ఆ రాజకుమారుడు చక్రవర్తి అయినప్పుడు జెంగ్
హే చక్రవర్తి అంతరంగికులలో ముఖ్యుడిగా పరిగణింప బడ్డాడు. ఈ సమయంలో, అతనికి గౌరవప్రదమైన
బిరుదు "జెంగ్" ఇవ్వబడింది మరియు అతను జెంగ్ హే అని పిలవబడ్డాడు.
యాత్రలు (Expeditions):
యాత్రలు (Expeditions):
1405 లో, చక్రవర్తి ఝు డి (Zhu
Di) ప్రపంచంలోని ఇతర నూతన
ప్రాంతాలను అన్వేషించి వాటితో వాణిజ్యo
చేయటానికి భారీ ఓడల సముదాయం ను పంపాలని
నిర్ణయించుకున్నప్పుడు, అతను జెంగ్ హేను ఆ
భారీ యాత్రకు నాయకుడిగా నియమించాడు. జంగ్ హి చేసిన ప్రతి సముద్రయానంలో 30,000 నావికులు ఉన్నారు.
1405- 1433 మధ్య, జెంగ్ హు, మలేషియా, ఇండోనేషియా, థాయ్లాండ్, భారతదేశం, శ్రీలంక, ఇరాన్, ఒమన్, యెమెన్, సౌదీ అరేబియా, సోమాలియా, కెన్యా మరియు అనేక ఇతర
దేశాలకు సముద్ర యానం చేసాడు. తన సముద్ర ప్రయాణాల్లో, జెంగ్ హజ్ మక్కాకు వెళ్లి హజ్ యాత్ర చేసాడు.
జెంగ్ ఒక్కడే ముస్లిం కాదు. అతని సలహాదారులలో చాలామంది చైనా
ముస్లింలు ఉన్నారు. అటువంటి వారిలో ఒకడైన “మా హున్ Ma
Huan, అరబిక్ భాష మాట్లాడేవాడు
మరియు సముద్ర ప్రయాణాల్లో ఎదురైన ముస్లిం ప్రజలతో మాట్లాడేవాడు. “యింగ్-యై
షెంగ్-లాన్ (Ying-yai
Sheng-lan)” పేరుతో జెంగ్ హి తన ప్రయాణాల గురించి
వ్రాసాడు.అది హిందూ మహాసముద్రం చుట్టూ నివసిస్తున్న
15 వ శతాబ్దపు సమాజాలను అర్థం చేసుకోవడానికి నేడు ఒక ముఖ్యమైన వనరు గా పరిగణిoచ
బడుతుంది.
అతని సాహసయాత్రలను
ప్రజలు సులభంగా మర్చిపోలేని సంఘటనలు గా ఉన్నాయి. జెంగ్ హి ఓడలు 400 అడుగుల పొడవుకలిగి
ఉండి కొలంబస్ ఓడల పరిమాణం
కల్గి అట్లాంటిక్ సముద్రం అంతటా పయనించాయి.
యాంగ్జీ నదీ తీరాన నిర్మించిన ఈ నౌకలు ఆధునిక ఫూట్-బాల్ పిచ్ కంటే పెద్దవిగా ఉన్నయి.వారు
పయనించిన ప్రదేశాల లోని ప్రజలు వారి పట్ల గౌరవం/భయం ప్రదర్శించేవారు మరియు చైనా
చక్రవర్తికి నివాళులు సమర్పించారు. స్థానిక ప్రజల తో వాణిజ్యం నడిపారు మరియు జెంగ్ హున్ చైనాకు ఏనుగు
దంతాలు, ఒంటెలు, బంగారం మరియు ఆఫ్రికా నుంచి జీరాఫీ వంటి విదేశీ వస్తువులతో తిరిగి
ప్రయాణించాడు. ఈ సాహసయాత్ర చైనా ఆర్ధికoగా మరియు రాజకీయ శక్తిగా బలమైనది అని ప్రపంచానికి ఒక సందేశాన్ని పంపింది.
ఇస్లాం వ్యాప్తి (Spreading Islam)
ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలతో పాటు జెంగ్ హి వారు ప్రయాణించిన
చోట ఇస్లాంను ప్రచారం చేసారు. జావా, సుమత్రా, బోర్నియో మరియు
ఇతర ఇండోనేషియా ద్వీపాల్లో, జెంగ్ హే
అప్పటికే అక్కడ ఉన్న ముస్లింల చిన్న సముదాయాలను
కనుగొన్నాడు. అరేబియా మరియు భారతదేశం నుండి వాణిజ్యం ద్వారా కొన్ని వందల
సంవత్సరాల ముందు ఇస్లాం ఆగ్నేయ ఆసియా అంతటా వ్యాపించింది. ఈ ప్రాంతాల్లో ఇస్లాం అభివృద్ధిని
జెంగ్ హి చురుకుగా సమర్ధించారు.
జెంగ్ హి పాంబాంగ్
Palembang జావా, మాలే ద్వీపకల్పం మరియు ఫిలిప్పీన్స్ లో
చైనీస్ ముస్లిం కమ్యూనిటీలను స్థాపించాడు. ఈ సమాజాలు స్థానిక ప్రజలకు ఇస్లాం ధర్మం బోధించాయి మరియు ఈ
ప్రాంతంలో ఇస్లాం వ్యాప్తికి చాలా ముఖ్యమైనవి గా పరిగణించ బడినాయి. ఈ సముదాయం
మస్జిద్లను నిర్మించింది మరియు స్థానిక ముస్లింలకు అవసరమయ్యే ఇతర సామాజిక సేవలను అందించారు.
1433 లో జెంగ్ హేహ్ మరణించిన తరువాత, ఇతర చైనీస్ ముస్లింలు ఆగ్నేయాసియాలో
ఇస్లాం వ్యాప్తి కొనసాగించారు. ఆగ్నేయాసియాలోని చైనీస్ ముస్లిం వర్తకులు ఇండోనేషియన్
ద్వీపాలలోని మరియు మాలే ద్వీపకల్పంలోని స్థానిక ప్రజలతో కలిసిపోయారు. ఇది ఆగ్నేయ
ఆసియాలో ఎక్కువ మందిని ఇస్లాం వైపుకు తీసుకువచ్చింది, అలాగే పెరుగుతున్న
ముస్లిం సమాజాన్ని విస్తృతపరచింది.
ఖ్యాతి (Legacy)
ఒక అడ్మిరల్, దౌత్యవేత్త, సైనికాధికారి
మరియు వర్తకుడిగా జెంగ్ హు చైనీస్
మరియు ముస్లిం చరిత్రలో ఒక అసమాన్యుడు. అతను ఆగ్నేయ ఆసియాలో ఇస్లాం వ్యాప్తి లో
ప్రముఖుడిగా గుర్తించబడ్డాడు. దురదృష్టవశాత్తు, అతని మరణం తరువాత, చైనీస్ ప్రభుత్వం
అతని కృషి మరియు రచనలు మర్చిపోయిoది లేదా అతను విస్మరించబడ్డాడు.
ఆగ్నేయ ఆసియాలో అతని
వారసత్వంమరపురానిది. ఈ ప్రాంతంలోని అనేకమంది మస్జిద్లకు ఆయన జ్ఞాపకార్థం ఆయన పేరు పెట్టారు. వాణిజ్యం, ప్రయాణం చేసే
బోధకులు మరియు వలసలు (ఇమ్మిగ్రేషన్) వంటి పలు రూపాల్లో ఇస్లాం ఆగ్నేయ ఆసియాలో
వ్యాపించింది. అడ్మిరల్ జెంగ్ హే ఆ ప్రాంతంలో ఇస్లాం విస్తరణలో ప్రధాన భాగం
అయినాడు. నేడు, ఇండోనేషియా ప్రపంచంలోని అతిపెద్ద ముస్లిం జనాభాను కలిగి ఉంది, అందుకు ప్రధాన
కారణం ఆ ప్రాంతంలో జెంగ్ హే యొక్క ప్రయాణాలు అతని భోదనలు కారణమని చెప్పవచ్చు.
No comments:
Post a Comment