ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు మైనారిటీ ప్రజలపై పై
అత్యంత క్రూరమైన అణచివేత చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. -ఎడ్మండ్ బర్కే.
ఇటివల భారత దేశం రిపబ్లిక్ గా అవతరించిన 69 వ సంవత్సరాల వేడుకలు ఘనంగా జరుపుకుంది. 2014
నుండి ముస్లింలను క్రమంగా రాజకీయాలనుండి,
సామాజిక రంగం నుండి దూరం చేయాలనే ఒక ప్రమాదకరమైన ధోరణి ప్రారంభం అయ్యింది.
లించింగ్స్/హత్యల (lynchings/
killings) రూపంలో ముస్లింలు (మరియు దళితులు) పై
జరుగుతున్న విషాదకరమైన దాడులు స్వదేశం తో
పాటు విదేశాలలో కూడా ఆగ్రహానికి గురవుతున్నాయి - ఉదాహరణకు న్యూయార్క్
టైమ్స్ పత్రిక, 2014 మే నుండి భారత దేశం లో పెరుగుతున్న అసహనం మరియు స్వేచ్ఛలను
నిరోధించడం మరియు మతపరమైన తీవ్రవాదానికి వ్యతిరేకంగా 16 సంపాదకీయాలు వ్రాసింది.
భారత ఎన్నికల రాజకీయాలనుంచి ముస్లిం రాజకీయ ప్రాతినిధ్యాన్ని నెమ్మదిగా
తొలగించడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ముస్లింలకు వ్యతిరేకంగా జరిగే భౌతిక
దాడులకు భిన్నంగా, ఈ రాజకీయ ప్రక్షాళన అనేది
"చట్టబద్ధమైన" మరియు "ప్రజాస్వామ్య" పద్ధతుల ద్వారా అమలు
చేయబడుతోంది.
అలెక్సిస్ డి టక్విల్లె 19 వ శతాబ్దం ప్రారంభంలోనే దీనిని "మెజారిటీ
నిరంకుశత్వం" గా పిలిచారు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ ఆందోళన కలిగించే ప్రదర్శనను
చూస్తున్నాము.
·
2014 ఎన్నికలలో బిజెపి ఒక్క ఎన్నికైన ముస్లిం ఎం.పి లేకుండా
అధికారం లోకి వచ్చింది. అది మొత్తం 482 మంది అభ్యర్ధులలో కేవలం ఏడుగురు ముస్లింలను పోటికి నిల్పింది.
·
పార్లమెంటులో ముస్లింల ప్రాతినిధ్యం 1957 నుండి అతి తక్కువగా
4% కు పడిపోయింది.
·
ముస్లింలు ఉత్తరప్రదేశ్ జనాభాలో 19.2% ఉన్నారు, లేదా 4.3 కోట్ల
మంది ప్రజలు ఉన్నారు. అది అర్జెంటీనా దేశ జనాభా కన్నా అధికం. అయితే, 2017 శాసనసభ
ఎన్నికలలో బిజెపి ఒక్క ముస్లిం అభ్యర్థిని నిలబెట్టలేదు, అది 403 గాను 312 సీట్లలో విజయం సాధించింది. యు.పి. అసెంబ్లీలో ముస్లిం
శాసన సబ్యుల ప్రాతినిధ్యం 17.1% నుండి
5.9% కు పడిపోయింది.
·
అస్సాంలో (ముస్లిం జనాభా 34.2%), బిజెపి మొత్తం 61
మంది ఏం.ఎల్.ఎ. లలో ఒక ముస్లిం ఎమ్.ఎల్.ఎ.ఉన్నారు.
·
బీహార్ మరియు జార్ఖండ్లలో (16.9% మరియు 14.5% ముస్లిం
జనాభా) బిజెపికి ముస్లిం ఎమ్మెల్యేలు లేరు
·
మహారాష్ట్రలో (11.54% ముస్లిం జనాభా) బిజెపి 122 మంది
ఎమ్మెల్యేలతో గెలిచింది. ఒక ముస్లిం అబ్యర్ధిని పోటికి నిల్పింది అతను ఎన్నికలలో
ఒడి పోయాడు.
·
2002 లో నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యినప్పటి నుండి
లోక్ సభ లేదా అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి
ఒక ముస్లిం అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు.
గుజరాత్ అసెంబ్లీలో ముస్లింల ప్రాతినిధ్యం 1980 లో 6.6 శాతంగా ఉంటే (ముస్లింల
జనాభా 9.67%), రాజకీయ శుద్ధీకరణ జరిగి ఇప్పుడు 1.6
శాతం మాత్రమే ఉంది. గుజరాత్ ఎన్నికలలో 'ముస్లిం' అనే పదాన్ని
ఉచ్చరించే ధైర్యం కాంగ్రెస్ పార్టీ చేయలేక పోయినది.
·
ఇదంతా భయపెడుతున్న వాస్తవాన్ని చూపుతున్నాయి: దేశంలోని 1418
మంది బిజెపి ఎమ్మెల్యేలలో కేవలం నలుగురు ముస్లింలు ఉన్నారు.
·
2014 నవంబర్లో నాన్-బిజెపి పాలిత రాష్ట్రాల్లో 300 మంది
ముస్లిం ఎమ్మెల్యేలు ఉన్నారు, వీరు మొత్తం MLA జనాభాలో 13% మంది
ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
·
సాయుధ దళాలు, న్యాయవ్యవస్థ, పోలీసు మరియు పౌర
సేవలు, అలాగే రాజకీయాల్లో
కూడా ముస్లిం ప్రాతినిద్యం బాగా తగ్గి పోయినది. కాంగ్రెస్-ఆధిపత్య శకంలో
పార్లమెంటులో ముస్లిం ప్రాతినిధ్యం 1952-1977 కాలంలో 2%-7% మధ్య ఉంది. 1980 లో అత్యధిక
ప్రాతినిధ్యం 10% గా ఉంది.
·
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ముస్లింల ప్రాతినిధ్యం 1951-1977
మధ్యకాలంలో 5.9 శాతం నుంచి 9.5 శాతo ఉంది. 2012 చివరినాటికి అది 17.1%
తాకినప్పటికీ, దాని మొత్తం జనాభా వాటాకి అది తక్కువగా ఉంది.
·
బీహార్లో 1985 లో అత్యధికంగా 10.46 శాతం ప్రాతినిద్యం ఉంది
అప్పుడు రాష్ట్రంలో ముస్లిం జనాభా 16.9 శాతంగా ఉoది.
కొంతమంది అన్నట్లు బిజెపి ముస్లింల ప్రాతినిధ్యాన్ని తగ్గించడం
ద్వారా మెజారిటీ కమ్యూనిటీకి వ్యతిరేకంగా జరిగిన చారిత్రక అన్యాయాలను సరిదిద్దుకుంటోంది. బిజెపి ముస్లిం అబ్యర్ధులకు సీట్స్
ఇవ్వకపోవటానికి కారణం "గెలేచే
ముస్లిం అభ్యర్థులు లేక పోవడం”
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటు వేసిన ముస్లిం
మహిళల ప్రయోజనాలను కాపడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది.
ప్రజాస్వామ్యాన్ని బలపర్చడానికి, అత్యంత బలహీనమైన
మరియు అణచివేతకు గురి అయిన వర్గాలు ప్రాతినిధ్యం పొందాలి. అందుకు మొట్టమొదటి మెట్టు మైనారిటీల ప్రయోజనాల రక్షణ.
మరి ఒక వైపు ముస్లిం
సమాజం కులం మరియు వర్గ కలహాలతో నిండి ఉంది. మత రాజకీయాల వలన వారిలోని ఆష్రఫ్స్
Ashrafs (ముస్లింలలో అగ్ర
కులాలు. వారు ముస్లిం జనాభాలో 15-20%
మాత్రమే ఉన్నారు) పాశ్మాండీల
Pasmandas (వెనుకబడిన
మరియు దళిత ముస్లిమ్స్) కన్న అధిక అధిక లాభపడినారు. గత రెండు దశాబ్దాల యుపి
అసెంబ్లీలో, గిల్లెస్ వెర్నియర్స్ ప్రకారం అష్రఫ్స్Ashrafs 70% MLA స్థానాలలో
ఉన్నారు.
ప్రస్తుతమున్న 29
రాష్ట్రాల్లో బిజెపి 19 రాష్ట్రాలలో పాలన
ఉంది, కాని దాని ముస్లిం ప్రతినిధులు కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నారు.
మైనారిటీలు రాజకీయ వివక్షకు
లోబడి, రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోయినప్పుడు ప్రజాస్వామ్యం పెళుసు అవుతుంది.
ప్రజాస్వామ్యం, వాస్తవిక ప్రజాస్వామ్యంగా రూపు దాల్చాలంటే దానిలోని అణచివేత కులాలు మరియు తరగతులు
(oppressed
castes and classes) తగినంత రాజకేయ ప్రాతినిద్యం పొందాలి మరియు వాటి
ప్రయోజనాలు కాపడబడాలి.
No comments:
Post a Comment