మనకి రాజ్యాంగం అవసరం అని
మొట్టమొదట గోపాల కృష్ణ గోఖలే 1914లో చెప్పారు. ఆ తర్వాత 1934లో కమ్యూనిస్ట్ నాయకుడైన ఎం. ఎన్. రాయ్ రాజ్యంగ పరిషత్ యొక్క
ఆవశ్యకత తెలిపారు. 1935లో భారత జాతీయ
కాంగ్రెస్ కూడా దీన్ని డిమాండ్ చేసింది. 1940లో బ్రిటిష్
ప్రభుత్వం ఒక రాజ్యాంగ పరిషత్తును స్థాపించటానికి అంగీకరించింది. 1946లో క్యాబినెట్
మిషన్ ప్లాన్ ద్వారా రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి.
రాజ్యాంగ పరిషత్ లోని మొత్తం 389 మంది సభ్యులలో 292 మంది రాష్ట్రాల నుండి, 93
మంది సంస్థానాల నుండి,
నలుగురు చీఫ్ కమీషనర్ ప్రావిఎన్సేస్ అఫ్ ఢిల్లీ, అజ్మీర్, కూర్గ్, బ్రిటిష్ బలోచిస్తాన్
నుండి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ 208 స్థానలను, ముస్లిం లీగ్ 73 స్థానాలు గెలుచుకున్నాయి.
తర్వాత కాంగ్రెస్ తో విభీదించి ముస్లిం లీగ్ తప్పుకుని పాకిస్తాన్ కు
వేరే రాజ్యంగా పరిషత్ ని ఏర్పాటు చేసుకోంది.
భారత రాజ్యంగ పరిషత్
మొదటి సమావేశం కు ప్రొఫెసర్ సచ్చిదానంద
సిన్హా అద్యక్షత వహించారు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషద్ కు
అద్యక్షుడిగా ఎన్నికైనారు. ప్రొఫెసర్ BN రావు రాజ్యాంగ పరిషత్ కు సలహాదారుగా
పనిచేసారు.
1946 లో ఎన్నికైన భారత
రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని
రూపొందించినది. రాజ్యంత పరిషత్ కు 15 మంది
స్త్రీలు ఎన్నికైనారు. వీరు రాజ్యాంగ నిర్మాణం లో
చురుకుగా పాల్గొన్నారు.
వారి పేర్లు
వరుసగా
1అమ్ము స్వామినాథన్(కేరళ) 2.ద్రాక్షాయణి వేలునాధన్(కేరళ) 3. బేగం ఐజాజ్ రసూల్(యునైటెడ్ ప్రావిన్స్) 4.
దుర్గా బాయి
దేశముఖ్(రాజమండ్రి – ఆంధ్ర ప్రదేశ్) 5.
హన్స్ జీవరాజ్
మెహత(బరోడా) 6. కమలా చౌదరి(లక్నో) 7. లీలా రాయ్(అస్సాం) 8. మాలతి చౌదరి(ఈస్ట్ బెంగాల్ నేటి బంగ్లా
దేశ్) 9. పూర్ణిమా బెనెర్జీ(అలహాబాద్)10. రాజకుమారి అమ్రిత్ కౌర్(లక్నో) 11. రేణుక రాయ్ (బెంగాలీ, ICS అధికారి కుమార్తె,లండన్ లో చదువు)12. సరోజినీ నాయుడు(హైదరాబాద్) 12. సుచేత కృపలానీ(అంబాల – హర్యానా) 14. విజయ లక్ష్మి
పండిట్(అలహాబాద్) 15. అన్నీ మాస్కారేన్(కేరళ)
బేగం ఐజాజ్ రసూల్
భారత రాజ్యాంగ పరిషత్ మహిళా
సబ్యులలో ప్రముఖురాలు బేగం ఐజాజ్ రసూల్.
మలేర్కోట(Malerkota-Punjab) రాచరిక
కుటుంబంలో జన్మించిన బేగం ఐజాజ్ రసూల్ యువ భూస్వామి నవాబ్ ఐజాజ్ రసూల్ ను వివాహం చేసుకున్నారు. ఆమె రాజ్యాంగ అసెంబ్లీకి ఎన్నికైన
ఏకైక ముస్లిం మహిళ. 1935 భారత ప్రభుత్వం చట్టం అమలుతో, బేగం మరియు ఆమె భర్త ముస్లిం లీగ్ లో చేరారు మరియు ఎన్నికల రాజకీయాలలో ప్రవేశించారు.
1937 ఎన్నికలలో, ఆమె U.P(యునైటెడ్ ప్రావిన్స్) రాష్ట్ర శాసన సభ కు ఎన్నికయ్యారు.
ఆమె భారత రాజ్యాంగ అసెంబ్లీలో ఏకైక ముస్లిం మహిళ మరియు ఆమె యునైటెడ్ ప్రొవిన్స్ కు ప్రాతినిద్యం వహించారు.
రాజ్యంగా నిర్మాణ సభ లో ఆమె చేసిన ప్రసంగాలు ఆమెకు గల చట్ట పరిజ్ఞానం మరియు ఇతర
దేశాల రాజ్యాంగాల గురించి ఆమెకున్న జ్ఞానం తెలుపుతాయి. రాజ్యాంగ పరిషత్ చర్చలలో(Debates
of constitute Assambly) ఆమె ముఖ్యమైన సమస్యలను ప్రస్తావించారు మరియు అనేక సవరణలను ప్రతిపాదించారు. మంత్రులు నిజమైన ప్రభావవంతం గా
పనిచేయవలేనంటే వారి పదవి కాలం తగినంతగా
ఉండవలేన్నారు. ఈ విషయం లో ఆమె స్విస్ పద్ధతిని అనుసరించమని అన్నారు మరియు
సింగల్ ట్రాన్స్ఫరబుల్ వోట్ ను సూచించారు.
అనేక మంది సభ్యులు వ్యతిరేకించిన ఆమె కామన్వెల్త్ లో భారత సభ్యత్వానికి గట్టి మద్దతు తెలిపారు. ఆమె
మైనారిటీల కోసం ప్రత్యెక నియోజకవర్గాలను
వ్యతిరేకించారు, మరియు శాసనసభల్లో సీట్ల రిజర్వేషన్
గట్టిగా వ్యతిరేకించారు.
ఆమె అభిప్రాయం ప్రకారం " రిజర్వేషన్ అనేది మైజారిటి
నుండి మైనారిటీలను వేరుచేసే స్వీయ-విధ్వంసక ఆయుధం. ఇది మెజారిటీ యొక్క మంచి
సంకల్పం గెలుచుకోడానికి మైనారిటీలకు అవకాశం ఇవ్వదు.ఇది వేర్పాటువాద మరియు
మతతత్వాన్ని పెంచుతుంది మరియు ఎల్లప్పుడూ దానికి దూరంగా ఉండాలి అని అన్నారు."
ఆ రోజులలో భారతదేశంలో, ఉర్దూ మరియు హిందీల కలయిక హిందూస్థానీ హిందీ కంటే ఎక్కువగా
మాట్లాడబడింది. ఆమె హిందూస్థానీని మరియు దేవనాగరి లిపిని సమర్దించినది.
ప్రాథమిక హక్కుల మీద ఉన్న పరిమితుల గురించి తన ఆందోళనలను
ఆమె వ్యక్తపర్చింది, రాజ్యాంగం యొక్క ప్రాథమిక హక్కులు మరియు
నిర్దేశక నియమాలు అన్ని ప్రావీన్స్లలో సమర్ధవంతంగా అమకుచేయడానికి ఒక స్వతంత్ర
సంస్థను ఏర్పాటు చేయాలనీ కోరింది.. ఆమె ఆస్థి హక్కు (ఆర్టికల్ 31 యొక్క నిబంధన) పై
కొన్ని అబ్యoతరాలను వెలిబుచ్చింది.
రాజ్యాంగ అసెంబ్లీ లో ఆమె వాణి, ఆమె ప్రసంగాలు ఆలోచన, ఉద్దేశ్యం, దీర్ఘకాలిక దృష్టి, ఆశావాదం మరియు ప్రభావం యొక్క స్పష్టత
కలిగి ఉన్నాయి అని విమర్శకులు అభిప్రాయపడ్డారు.
1950 లో, భారతదేశంలోని ముస్లిం లీగ్ రద్దు చేయబడింది మరియు బేగం ఐజాజ్
రసూల్ కాంగ్రెస్ లో చేరారు. స్వాతంత్య్రానికి
ముందు మరియు స్వాతంత్ర్యం తరువాత ఆమె తన రాజకీయ జీవితంలో అనేక ముఖ్యమైన స్థానాలను
చేపట్టారు. వివిధ మంత్రిత్వశాఖలను నిర్వహించినారు.
ఆమె 1952 లో రాజ్యసభకు ఎన్నికయ్యారు మరియు 1969 నుండి 1990
వరకు ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యురాలుగా ఉన్నారు. 1969 మరియు 1971 మధ్యకాలంలో ఆమె సోషల్
వెల్ఫేర్ మరియు మైనారిటీల మంత్రిగా పనిచేసారు. ఆమె అనేక పుస్తకాలు మరియు వ్యాసాలను
ప్రచురించారు మరియు 20 సంవత్సరాల పాటు భారతీయ మహిళల హాకీ సమాఖ్య
అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినారు మరియు ఆసియా మహిళల హాకీ ఫెడరేషన్ ప్రసిడెంట్ గా
వ్యవరించారు. 2000 లో ఆమె చేసిన సామాజిక కృషికి ఆమెకు సాంఘిక సేవా రంగంలో పద్మభూషణ్ పురస్కారం లబించినది.
No comments:
Post a Comment