తాజ్ మహల్ ప్రపంచవ్యాప్తంగా అందానికి ప్రసిద్ధి చెందింది మరియు ప్రేమ కు చిహ్నంగా
ఉంది. కానీ దాని ఆధ్యాత్మిక సందేశం సామాన్య ప్రజల కు అవగతం
కాలేదు.
తాజ్ ముఖద్వారం యొక్క నాలుగు వైపులా గల అతి పెద్ద డబుల్ ఆర్చీల పైన, దివ్య ఖుర్ఆన్ నుండి ఎంచుకున్న ఆయతులు కుడి వైపు దిగువ నుండి ప్రారంభించబడి ఎడమ వైపుకు మరియు అక్కడ నుండి ఎడమ దిగువ భాగంలో క్రిందికి
వచ్చునట్లు అందమైన కాలిగ్రఫీ(నగషీరాత) లో లిఖిoచబడినవి. తెల్ల పాలరాయి ప్యానెల్లలో జాస్పర్ పొదగడం
ద్వారా ఈ నగీషీరాత తయారు చేయబడింది. దిగువ నుండి చూసేటప్పుడు వక్రమార్గపు
ప్రభావాన్ని తగ్గించడానికి హయ్యర్ ప్యానెల్లు కొంచం ఎక్కువగా రాయబడ్డాయి. ప్రధాన ఛాంబర్
లోపల కూడా అలాంటి ఆయతులు మరియు అల్లాహ్ యొక్క తొంభై తొమ్మిది అరబిక్
పేర్లు చెక్కబడి ఉన్నాయి.
సమాధి యొక్క 223 అడుగుల ఎత్తు మరియు 112 అడుగుల వెడల్పు గల ఎనిమిది పాలరాయితో కూడిన అర్చేస్ పైన
కూడా దివ్య ఖురాన్ ఆయతులు సుందరమైన క్యాలిగ్రఫి ద్వారా లిఖించబడినవి. అంతేకాక బయటి
ఎర్రని రాతి ద్వారాల చుట్టూ 70 అడుగుల ఎత్తున పాలరాతి
శిలాశాసనం ఉంది.
ఆదమ్, మరియు ఇతర దైవ దూతలు మరియు
వారి పుస్తకాలు
తాజ్ మహల్ లో ప్రతిబింబిoచిన సందేశo ప్రకారం, ఆదమ్ ప్రపంచం లో మొదటి వ్యక్తి మరియు దేవుని
మొదటి దైవ దూత. మానవాళి పురోగతి సాధించినప్పుడు, అల్లాహ్
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో మరియు మానవ చరిత్ర యొక్క వివిధ దశలలో తాజా దైవ
దూతలను పంపుతాడు. వారిలో కొందరికి ఆయన లేఖన రూపంలో
ప్రసారం చేయగల తన సందేశాన్ని వెల్లడించాడు.
ప్రతి సందేశం సంపూర్ణ మానవజాతి కొరకు ఉద్దేశించబడింది, అయితే
వీటిని ఈ స్వీకర్తలు(సందేశకులు Messengers) తమ సమాజం యొక్క స్థానిక భాషలలో వినిపించారు. అరేబియా
వాసి ప్రవక్త ముహమ్మద్ (స) కు అరబిక్ లో
దివ్య ఖురాన్ వినిపించబడినది. దివ్య ఖుర్ఆన్ లో ముహమ్మద్ (స) యొక్క పూర్వపు సందేశకులు
మరియు వారి పుస్తకాలను ప్రస్తావించబడినవి. ఇరవై ఐదుగురు సందేశకులు మరియు పేరుతో మూడు వెల్లడి పుస్తకాలు
ప్రస్తావించబడ్డాయి.
కాలక్రమానుసారంగా గుర్తించినప్పుడు, ప్రవక్తల జాబితా ఆదం నుండి ప్రారంభమైంది మరియు అందులో అబ్రహం, ఐజాక్, ఇష్మాయేలు, దావీదు, యాకోబు, యోసేపు, మోసెస్
మరియు క్రీస్తు ఉన్నారు. వెల్లడి అయిన(releved) పుస్తకములు పామ్స్(కీర్తనలు), పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన (Psalms, Old Testament and New Testament). అయినప్పటికీ, మానవులు అందరు ప్రవక్తలను మరియు అందరు
ప్రవక్తల ద్వారా వెల్లడైన అన్ని విషయాలను విశ్వసించాలని
మరియు గౌరవించాలని అల్లాహ్ చెప్తాడు. ఈ
ఉత్తర్వు యధాతదం గా (verbatim) దివ్య ఖురాన్(అంతిమ గ్రంధం) లో భాగంగా ఉంది (దివ్య ఖురాన్ 2.285).
సంరక్షించబడిన (శిలా ఫలకం)టాబ్లెట్ - అన్ని
బహిర్గతాల అభయారణ్యం (The Preserved Tablet – Sanctum sanctorum of
all revelations)
అల్లాహ్ స్వర్గం వెలుపల జీవాన్ని సృష్టించే ముందుగా, అతను రక్షిత టాబ్లెట్(శిలాపలకం) (లాహూ
మహ్ఫూజ్) పై మానవాళికి బహిర్గతం చేసే మరియు పదేపదే - రాబోయే వెయ్యి సంవత్సరాలలో వచ్చే
సందేశకుల పరంపర ద్వారా వెల్లడి చేసే అతని గొప్ప సమగ్ర సందేశాన్ని లిఖించాడు.
భూమిపై సృష్టిని ప్రారంభించే సందర్భంగా, ఈ
సమగ్ర సందేశాన్ని భూలోకానికి ఆకాశం ద్వారా
పంపాడు. అప్పటినుండి, వివిధ భాషలలో, వివిధ ప్రపంచ ప్రాంతాలలో అనేక
సార్లు, మానవ చరిత్రలోని వివిధ దశలలో అల్లాహ్ యొక్క ఈ సమగ్ర సందేశo దేవదూతలకు
వెల్లడి అయినది. అందువలన, సంరక్షించబడిన టాబ్లెట్ అనేది అన్ని వెల్లడులకి
సంబంధించిన గర్భగుడి
(The Preserved Tablet – Sanctum sanctorum of
all revelations)
మానవాళి సృష్టించబడిన ఉద్దేశ్యం Purpose of creating humanity
మానవులలో నీతి (ఉన్న లేకపోయిన) యొక్క తులనాత్మక స్థాయిని
పరీక్షిoచడానికి అతడు మానవాళిని సృష్టించినట్లు అల్లాహ్ వివరించాడు. ప్రాపంచిక
జీవితం తాత్కాలికమైనది మరియు అతి చిన్నది, ఇది
ఒక విచారణ(trail) మాత్రమే. ఇక్కడ జరిగే మంచి లేదా చెడు పనుల కోసం అవార్డు లేదా
శిక్షలు నిత్యమైన మరియు శాశ్వతమైనవిగా ఉన్న తరువాతి జీవితంలో ఇవ్వబడతాయి. తుది
నివాస స్థలం స్వర్గం (హెవెన్) లేదా నరకం)హెల్ గా ఉంటుంది. అoదరు మానవులు పునరుత్థానం చేయబడినప్పుడు తీర్పు దినాన
అవి నిర్ణయించబడతాయి.
ఈ కథలోని నీతి ఏమిటంటే, మానవులు
ఈ ప్రపంచంలో తమ పరిమిత జీవిత కాలంలో ఎక్కువ నీతిమంతులుగా ఉండటానికి ప్రయత్నించాలి.
మానవాళి కి షాజహాన్
చేసిన సేవ
(Shahjahan’s service to mankind)
ఈ వాస్తవం తన ప్రియమైన పట్టపు రాణి అకాల మరణం తరువాత
చక్రవర్తి షాజహాన్ పై తీవ్రంగా
కనిపించింది. కాబట్టి
ఆమె
కోసం శాశ్వత మెమోరియల్ (స్మారక మందిరం) ఇటుక, మోర్టార్
మరియు పాలరాయి తో నిర్మించాడు. దీనిని నిర్మించడం తో బాటు చక్రవర్తి ఆధ్యాత్మిక
ఆనందం మరియు మానవాళి యొక్క రాబోయే తరాల ప్రయోజనాల కోసం మానవాతీత పరిపూర్ణతను ప్రసారం చేయడానికి కూడా ఈ
భవనాన్ని ఉపయోగించాడు. మానవజాతికి అల్లాహ్ సందేశం అందించడానికి మరియు మిలియన్ల
కొద్ది సందర్శకులు సందర్శించడానికి
అనువుగా షాజహాన్ తన నిర్మాణ ప్రాజెక్టు
పరిధిని విస్తరించినాడు. మానవులు తమ రోజువారీ కార్యకలాపాలను తోటి జీవుల సేవ వైపు
మొగ్గుచూపేటట్లు ఇది రూపొందించబడినది. ఈ నిర్మాణం ప్రాపంచిక అభిరుచి యొక్క పరిధుల కంటే ఎక్కువ
స్థాయిని పెంచుతుంది మరియు ప్రశంసలు పొందుతుంది.
తాజ్ మహల్ పై బిల్ క్లింటన్ అభిప్రాయం(Bill Clinton on Taj
Mahal):
బిల్ క్లింటన్ ప్రకారం ప్రపంచంలోన రెండు రకాల ప్రజలు ఉన్నారు,
ఒకరు తాజ్ మహల్ చూసినవారు
మరొకరు చూడని వారు. కేవలం పాలరాతి భావన నిర్మాణ అందంను
వర్ణించుట ద్వారా తాజ్ మహల్ పరిపూర్ణతను అర్ధం చేసుకోలేమని క్లింటన్ కు తెలియదు. తాజ్ మహల్ 1609 లో షిరాజ్, ఇరాన్ నుండి భారతదేశానికి వచ్చిన పెర్షియన్ కాలిగ్రాపెర్
అబ్దుల్ హక్ చే నిర్మించబడినది. తాజ్ మహల్ విస్తృత ఖురానిక్ క్యాలిగ్రఫి ద్వారా
చూపించబడిన అల్లాహ్ యొక్క అంతర్గత సౌందర్యనికి ప్రతి రూపం. షాజహాన్ తాజ్ మహల్ యొక్క అద్భుతమైన సౌందర్యం చే ముగ్ధుడై అతనికి "అమనాట్ ఖాన్" అనే పేరును
బహుమతిగా ఇచ్చాడు.
మానవ ప్రవర్తనకు ప్రవర్తనా నియమావళి Code of conduct for
human behavior
తాజ్ మహల్ లో లిఖించబడిన దివ్య ఖుర్ఆన్ అధ్యాయాలలో సూరహ్ ఇఖ్లాస్ (ch
112) ఒకటి. ఇది సృష్టికర్త యొక్క
ఏకత్వాన్ని స్థాపించటం అంటే, తౌహీద్ యొక్క సిద్ధాంతం. అల్లాహ్ అద్వితీయుడు, అల్లాహ్
నిరపేక్షాపరుడు, ఎవరి ఆధారమూ, ఎవరి అక్కర లేనివాడు, అందరు అయన పై ఆధారపడిన వారే, అల్లాహ్
కు సంతానం ఎవరు లేరు, అయన కుడా ఎవరి సంతానం కాదు. ఆయనకు సరిసమానులు ఎవరు లేరు. ఇది 'తన్జీహ్' యొక్క ప్రాథమిక ప్రకటన, అబ్దుల్ మాలిక్ ఇబ్న్ మర్వాన్ చేత జెరూసలేం లోని డోమ్ ఆఫ్
ది రాక్ లో కూడా ఈ సూరా కూడా చెక్కబడింది.
సూర అల్-తక్విర్ (చాప్టర్ 81)
లో ఆడశిశువు హత్యకు శిక్ష విధించబడినది. అంతేకాకుండా,
అనేక సూరాల ద్వారా దైవ పథకం మరియు మానవ ప్రవర్తన నియమం తెలుప
బడ్డాయి. దివ్య ఖురాన్ గ్రంథము
చెప్పుచున్నది: అల్లాహ్ తన ఆత్మను మానవుని లో ఊదినాడు (38.72)
కాబట్టి మానవులు దైవ సంభంధమైన మంచి గుణాలు కలిగి ఉండాలి.
జ్ఞానులందరినీ మించిన జ్ఞానీ ఒకడు ఉన్నాడు (12.76) గనుక ఎవరూ తనకు తెలిసిన దానికి గర్వించకూడదు.
మంచి ఆతిథ్యమిచ్చేవారిని అల్లాహ్ ఇష్టపడతాడు (12.59). అల్లాహ్ పట్ల కృతజ్ఞత ప్రదర్సిoచే వారిని అల్లాహ్ ఇష్టపడతాడు
(2.58). ఒక వ్యక్తి యొక్క సంపదలో అతని పేద బంధువులకు హక్కు (17.26)
ఉంది. వాగ్ధానాన్ని
నెరవేర్చండి. వాగ్దానo విషయం లో మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది (17.34). తీర్పు రోజున ఎటువంటి మధ్యవర్తిత్వం లేదు (2.48).
అల్లాహ్ కు మాత్రమే భయపడాల్సిన అవసరం ఉంది,
మరొకరికి కాదు (16.51,
27.10, 28.31).
అల్లాహ్ అంటాడు: నా తరుఫునుంచి ఏదైనా ఉపదేశం మీవద్దకు వచ్చినప్పుడు, నా ఈ
ఉపదేశాన్ని అనుసరించే వారికి ఏవిధమైన భయం కాని, విచారం కాని, కలిగే అవకాశం ఉండదు. (2.38).
ప్రార్థనను అంగీకరించక ముందే అల్లాహ్ ను విశ్వసించే వాడు తన ప్రాపంచిక సుఖాలు వదులు
కొండి. (2.60). తల్లిదండ్రులతో మర్యాదగా మాట్లాడండి అనే దైవిక ఆదేశం ఉంది (17.24).
ఇతరులకు సలహాలు ఇవ్వడానికి ముందు ధర్మాన్ని స్వయంగా ఆచరించాలి. (2.44).
సంపాదించిన సంపదలో ఒక వ్యక్తి నిత్యావసరాలకు పోగా మిగిలినది ఇతరులపై ఖర్చు పెట్టాలి. (2.219). విస్తృతమైన కుటుంబాలు మరియు పరిసరాలు ప్రయోజనకరమైన క్రియాశీల సమాజం యొక్క ప్రాథమిక విభాగాలు (2.177,
4.36, 17.26, 30.38, 33.6, 47.22). సంపద కొన్ని చేతులలో
కేంద్రికరించబడకుండా సమాజం పంచాలి. (59.7)
బంధుత్వ సంభందాలను తెంచటం మానుకోండి. (4.1).
అల్లాహ్ తనకు సహాయపడే వారికి తప్పకుండ సహాయం చేస్తాడు (22.40).
కాబట్టి, తాజ్ సందర్శన దాని
సౌoదర్యాన్ని మెచ్చుకోవటానికి పరిమితంగా ఉండదు.
ఆ స్మారక చిహ్నంపై వ్రాయబడిన దైవిక ఆజ్ఞలను నేర్చుకోవడమే
కాకుండా,
మంచి మానవుడు మరియు మరింత ఉపయోగకరమైన ప్రపంచ పౌరుడు గా
మారటానికి తోడ్పడుతుంది.
నిగః-ఎ షౌక్ Nigaah-e Shauq
ఈస్ట్ యొక్క ప్రసిద్ద కవి,
డాక్టర్ సర్ మొహమ్మద్ ఇక్బాల్ ప్రకారం:
కుచ్ ఔర్ హి నజార్ ఆత హై కారబోర్-ఎ జహాన్
నిగాః-ఇ షఖ్ అగర్ హొ షరీక్-ఇ బీనాయి గైనే.
ప్రపంచాన్ని పూర్తిగా భిన్నమైన దృగ్విషయంగా గుర్తించవచ్చు,
అవగాహన యొక్క కాన్వాస్ లో నిగాహ-ఎ-షౌక్ ను కలిగి ఉన్నప్పుడు.
(ఇగ్బాల్ యొక్క భావన నిగాహ-ఎ-షౌఖ్ అంటే ప్రతి ఒక్కరిలో దైవిక
రూపకల్పనను చూడటం అని అర్థం).
No comments:
Post a Comment