12 January 2018

అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రబలుతున్న స్ట్రోక్ (పక్షవాతం) దానిని ఎదుర్కోవడం ఎలా! Uptrend Stroke in Developing Countries: How to Combat the Uptrend




స్ట్రోక్ లేదా సెరెబ్రోవాస్కులర్ వ్యాధి (CVD) గత అనేక సంవత్సరాలు గా ప్రపంచవ్యాప్తoగా  ఆందోళనకరం గా ఉంది. ఇది  జీవితంలోని అన్ని రంగాల ప్రజలను ప్రభావితం చేస్తుంది మరియు అన్ని రకాల ఆదాయ వ్యవస్థలు గల దేశాలలోని అధిక శాతం ప్రజలు తమ ఆదాయo లో ఎక్కువ మొత్తం డబ్బును స్ట్రోక్ వైద్యం పైఖర్చు చేయవలసి ఉంటుంది.
  
2015 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 10 మరణాల సూచికలో స్ట్రోక్ 2 వ స్థానంలో నిలచినది. తక్కువ-ఆదాయ ఆర్ధిక వ్యవస్థలను కలిగిన దేశాల లో 3 వ స్థానంలో ఉంది, ఇక్కడ శ్వాసకోశ వ్యాధులు మరియు అతిసార వ్యాధులు మరణం యొక్క మొదటి మరియు రెండవ ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఇస్కీమిక్ గుండె జబ్బుతో కలిపి, స్ట్రోక్ వలన  ప్రస్తుత సంవత్సరo లో  15 మిలియన్ల మంది మరణించారు.

స్ట్రోక్ గురించి  కొన్ని  ప్రాథమిక వాస్తవాలు
స్ట్రోక్ మీ మొత్తం జీవితాన్ని ప్రభావితం చేసే ప్రమాదకరమైన వైద్య పరిస్థితి. ఈ వ్యాధి మీ మెదడులోని ధమనులను (arteries) ప్రధానంగా ప్రభావితం చేస్తుంది.  ధమనులు  ఆక్సిజన్ తో కూడిన  రక్తం మరియు పోషకాలను  మీ మెదడు కణజాలo కు  సరఫరా చేయడానికి బాధ్యత వహిస్థాయి. మెదడు కణజాలం కు రక్తం సరఫరా అగిపొయిన లేదా  తగ్గిపోయిన లేదా  ధమనిలో రక్తపు గడ్డకట్టడo జరిగిన  లేదా చిట్లిన  మెదడు ధమని రక్తస్రావం తో  రక్తం గడ్డకట్టడం జరిగిన మెదడు కణజాలం చనిపోవును. యునైటెడ్ స్టేట్స్ లో  దాదాపు 87% స్ట్రోక్ కేసులు ఇస్కీమిక్ స్వభావంను కలిగి  ఉన్నాయి.

మెదడు  శరీరం యొక్క కమాండ్ సెంటర్. స్ట్రోక్ మెదడు ను ప్రభావితం చేసి బలహీన పరుస్తుంది. స్ట్రోక్  మీ మెదడు యొక్క కుడి వైపున సంభవిస్తే, మీరు దృష్టి సమస్యలు, శరీరం యొక్క ఎడమ భాగం పక్షవాతం మరియు జ్ఞాపకశక్తిని  కోల్పోవటానికి అవకాశం ఉంది. ఎడమ వైపు స్ట్రోక్ వస్తే  మాట (speech) సమస్యలు, మెమరీ నష్టం మరియు కుడి వైపు పక్షవాతాన్ని కలిగి ఉండవచ్చు. మీ మెదడు కణజాలం మొత్తం స్ట్రోక్  వలన ప్రభావితమైతే, రెండు చిహ్నాలు మరియు లక్షణాలు కనిపించ వచ్చు. మీరు కోమా లోనికి వెళ్ళవచ్చు.

స్ట్రోక్ నుంచి రికవరీ అనేది    సాధారణంగా వయస్సు, స్ట్రోక్ యొక్క తీవ్రత, మెదడుకు జరిగిన  నష్టం మరియు మెదడులోని దెబ్బతినిన ప్రాంతాలపై ఆధారపడి ఉంటుంది. వీటితో పాటు, ఔషధాలు మరియు మెడికల్ సౌకర్యాల  లభ్యత, ఫిజియోదేరఫి  కూడా స్ట్రోక్ రికవరీ లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో స్ట్రోక్
అభివృద్ధి చెందుతున్న దేశాలలో స్ట్రోక్ యొక్క పెరుగుతున్న ప్రాబల్యతకు కారణమైన కారణాలను గుర్తించేందుకు పరిశోధకులు,  పరిశోధనలు నిర్వహిస్తున్నారు. జర్నల్ ఆఫ్ న్యూరాలజికల్ సైన్సెస్ లో ప్రచురించబడిన ఒక 2017 అధ్యయనంలో అధిక ఆదాయ దేశాలతో పోల్చితే, తక్కువ-ఆదాయ దేశాలలో  స్ట్రోక్ నివారణ మార్గదర్శకాలు  తక్కువ నాణ్యతను కలిగి ఉన్నాయి. స్ట్రోక్ కేసులను తగ్గించడానికి మరింత మెరుగైన నివారణ ప్రయత్నాలను చేయాలని ఈ అధ్యయనం నొక్కి చెబుతోంది.

తూర్పు ఆంగ్లియా విశ్వవిద్యాలయం యొక్క ప్రొఫెసర్ లాయిడ్-షెర్లాక్ ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాలలో స్ట్రోక్ నివారణ చర్యలకు  సరైన శ్రద్ధ ఇవ్వాలి. జీవనశైల (lifestyle diseases) వ్యాధులకు సంబంధించిన కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, ఈ దేశాలలో ఆరోగ్య కార్యక్రమములు ప్రధానం గా అంటువ్యాధుల నివారణ  (communicable diseases) మీద దృష్టి కేంద్రీకరించాయి. జీవనశైలి వ్యాధుల నివారణ సులభం మరియు అందుబాటులో ఉన్నప్పటికీ, పెరుగుతున్న గణాంకాలు ఈ నిరోధక చర్యల ప్రచారం మరియు అమలు చేయబడటానికి మరింత సమగ్రమైన వ్యూహాలు  అవసరము అని చెబుతున్నాయి.

దీనికి తోడు, అభివృద్ధి చెందుతున్న దేశాలలో, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో అత్యవసర చికిత్సల లభ్యత మరియు అందుబాటు పరిమితంగానే ఉన్నది. ఆ ప్రాంతాలలో స్క్రీనింగ్ ప్రక్రియను ప్రోత్సహించాలి, ఎందుకంటే ఇది చౌక నివారణ విధానం మరియు కేసులను ముందుగా గుర్తించడం కోసం వీలు కల్పిస్తుంది.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అంటువ్యాధులు గా ప్రబలుతున్న హృదయ సంబంధ ప్రమాద కారకాలు cardiovascular risk factors మరియు అథెరోస్క్లెరోటిక్ atherosclerotic diseases వ్యాధులపై టీ మరియు డోకినిష్ ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. వారి పరిశోధన ప్రకారం హృదయ వ్యాధుల వలన మరణాలు  అత్యధిక ఆదాయం ఉన్న దేశాలతో పోలిస్తే తక్కువ-ఆదాయ దేశాలలో ఎక్కువగా ఉన్నాయి. ఔషధాల వాడకం  అధిక మరియు మధ్య-ఆదాయ దేశాలలో తక్కువ అని  వారి అధ్యయనం  గుర్తించింది.

తక్కువ ఆదాయo కలిగిన దేశాల్లో కూడా  మందుల వాడకo తక్కువ. దీనికి ప్రధాన కారణం  ఔషధాల యొక్క అలభ్యత మరియు అందుబాటులో లేని వాటి అధికధరలు. లైఫ్-స్టైల్ మార్పులు మరియు కార్డియోవాస్కులర్ వ్యాధుల ప్రమాద కారకాల నియంత్రణ కూడా తక్కువ-ఆదాయ దేశాలలో తక్కువగా కనిపిస్తాయి.  ఇది స్ట్రోక్ రోగుల యొక్క అధిక మరణాలకు దారితీస్తుంది.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో స్ట్రోక్ సేవలు లేవు,  ఉన్న ఖరీదైనవి. ప్రైవేటు ఆసుపత్రులు  అందించే ఈ ఖరీదైన చికిత్సను పొందగల శక్తి కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉంటుందని జమా న్యూరాలజీలో ప్రచురించిన ఒక వ్యాసం పేర్కొంది. ప్రభుత్వ ఆసుపత్రులలో, థ్రోంబోలిటిక్ థెరపీ thrombolytic therapy అందుబాటులో ఉన్నప్పటికీ, అది ఉచితంగా ఇవ్వబడటం లేదు మరియు చికిత్స ఖర్చులో కొంత భాగాన్ని భరించమని రోగులను కోరుతున్నారు. రోగులు  దానిని భరించలేరు. ఈ పరిస్థితులలో  అభివృద్ధి చెందుతున్న దేశాలలో పెరుగుతున్న సంఖ్య స్ట్రోక్ కేసులను ఎదుర్కోవటానికి చౌకైన వైద్య ఖర్చు గా స్ట్రోక్ నివారణకు సంబంధించిన ప్రయత్నాలను ప్రోత్సహించాలి.

స్ట్రోక్ కారకాలు ఉదా: కు వయస్సు, లింగం మరియు కుటుంబ చరిత్ర వంటి వాటిని  మనం మార్చలేము. సవరించగలిగిన  ప్రమాద కారకాలను నియంత్రించడం వలన  స్ట్రోకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరిగే పోరాటంలో సానుకూల ఫలితాలు పొందవచ్చు. అందులో ఒకటిగా గృహ బిపి పర్యవేక్షణ విస్తృతంగా ప్రోత్సహించబడాలి మరియు  ధూమపాన విరమణ మరియు ఆహారం మార్పు (తక్కువ ఉప్పు మరియు తక్కువ కొవ్వు) ఆవశ్యకతను కూడా ప్రజలకు నొక్కి చెప్పాలి.

No comments:

Post a Comment