2 November 2021

పవిత్ర ఖురాన్ క్విజ్

 

 








1.   1. తొలిసారి గా పవిత్ర ఖురాన్ ఏప్పుడు అవతరించింది?

 క్రీ.శ. 610 రంఙాన్ నెలలొ లైలతుల్ ఖదర్ శుక్రవారం నాడు

 

2.   2. తొలిసారి గా అవతరంచిన పవిత్ర ఖురాన్ అయతులు ఏవి?

96వ సూర అల్ అలఖ్ లొని మొదటి ఐదు అయతులు ఇక్ర బిస్మి రబ్బికల్ లఙి ఖలఖ్

 

3. తొలిసారి గా అవతరంచిన అయతుకు రెండవసారి అవతరంచిన అయతుకు మద్య కాలం ఎంత ?   రెండున్నర సంవత్సరములు

 

4. పవిత్ర ఖురాన్ మొత్తం అవతరించిన కాలం ఏంత?  22 సం,5 నెలల 14 రొజులు

 

5. పవిత్ర ఖురాన్ మొత్తాన్ని ఒకేచొట సమికూర్చమని అబూబకర్ రఙిఅల్లాతాలఅన్హు కు ఎవరు సలహనిచ్చారు?   ఉమర్ రఙిఅల్లాతాలఅన్హు

 

6. తొలి పవిత్ర హఫిఙుల్ ఖురాన్ (దైవప్రవక్త సల్లెల్లహ్అలైవస్సల్లం తర్వాత) ఎవరు? ఉస్మాన్ రఙిఅల్లాతాలఅన్హు

 

7. పవిత్ర ఖురాన్ లొ సఙ్దా అయతులు ఎన్ని వున్నాయి? 14

 

8. పవిత్ర ఖురాన్ లొ తొలిసారిగా సఙ్దా అయతు ఏ సూరలో వుంది? సూర అల్ అరాఫ్ 7:206

 

9. పవిత్ర ఖురాన్ లొ 30 వ పార పేరు ఏమిటి? అమ్మా

 

10. పవిత్ర ఖురాన్ లొ 30 వ పారలో ఎన్ని సూరలు వున్నాయి? 36 (78 వ సూర అన్ నబా నుండి114 వ సూర అన్ నాస్ వరకు)

 

11. ఉస్మాన్ రఙిఅల్లాతాల అన్హు కాలం నాటి ఖురాన్ ప్రతులు ప్రస్తుతము ఎక్కడ వున్నవి? తాష్కెంట్ (రష్యా) లో,ఇస్తాంబుల్ (టర్కీ) లో ఉన్నవి.

 

12. పవిత్ర ఖురాన్ లొ బిస్మిల్లాఇర్రహ్మన్నిరహిం 2 సార్లు చదివె ఎకైకసూర ఏది ? పవిత్ర ఖురాన్ లొని 27 వ సూర అల్ నమ్ల్

 

13. పవిత్ర ఖురాన్ లొ బిస్మిల్లాఇర్రహ్మన్నిరహిం లేకుండ చదివె ఎకైకసూర ఏది ? పవిత్ర ఖురాన్ లొని 9 వ సూర అత్ తౌబ

 

14. తొలి సారిగా ఇస్లాం స్వికరించినది ఎవరు? బీబీ ఖదీఙా రఙిఅల్లాతాలఅన్హ

 

15. తొలి సారిగా ఇస్లాం స్వికరించిన వ్యక్తి ఎవరు? అబూబకర్ రఙిఅల్లాతాలఅన్హు

 

16. దైవప్రవక్త (సల్లెల్లహ్అలైవస్సల్లం) మదీనా కు హిఙ్రత్ చెయ్యకముందు మదీనా పేరు ఎమిటి? యస్రిబ్

 

17. తొలిసారి గా ఏకకాలంలొ అవతరంచిన సూర ఏది? అల్ ఫాతిహ

 

18. చివరిసారి గా ఏకకాలంలొ అవతరంచిన సూర ఏది? అల్ నస్ర్

 

19. పవిత్ర ఖురాన్ లొ అతిపెద్ద సూర ఏది? అల్ బఖరా దీనిలో 286 అయతులు,40 రుకులు ఉన్నాయి

 

20. పవిత్ర ఖురాన్ లొ అతిచిన్న సూర ఏది? అల్ కౌసర్ దీనిలో 3 అయతులు,1 రుకు ఉన్నాయి

 

21. పవిత్ర ఖురాన్ లొ ఏన్ని సురా లు కలవు? మొత్తం 114 కలవు.

 

22. పవిత్ర ఖురాన్ లొ ఏన్ని అయతులు లు కలవు? మొత్తం అయతులు 6236 కలవు.

 

23. పవిత్ర ఖురాన్ లొ అల్లాహ్ పేరు ఏన్నిసార్లు వస్తుంది? 2697 సార్లు వస్తుంది

 

24. పవిత్రఖురాన్ లొ (దైవప్రవక్త మహ్మద్ సల్లెల్లహ్అలైవస్సల్లం) పేరు ఏన్నిసార్లు వస్తుంది? 5 సార్లు వస్తుంది.4 సార్లు మహ్మద్(3:144, 33:40, 47:2 ,46:29 ) పేరుతొ 1 సారి అహ్మద్ (61:6 )పేరుతొ వస్తుంది.

 

25. పవిత్ర ఖురాన్ లొ అత్యధికం గా ఏ ప్రవక్త పేరు ప్రస్తావించబడింది? మూసా అలైస్సలం 136 సార్లు

 

26. తొలిసారి గా పవిత్ర ఖురాన్ లొని అయతులను లెక్కించింది ఎవరు ? అయేషా రఙి అల్లాతాల అన్హ

 

27. పవిత్ర ఖురాన్ లొ ఏ దినము గురించి అత్యధికం గా ప్రస్తావించబడింది? యౌమ్ ఉల్ ఖయమత్

 

28. మక్కా తొలి గవర్నర్ ఏవరు? అకిబ్ ఇబ్న్ ఉసైద్ క్రీ.శ. 630 లొ ఇతను మక్కా గవర్నర్ గా నియమింపబడ్డాడు.

 

29. మదీనా తొలి గవర్నర్ ఏవరు? సాద్ బిన్ ఉబైదా అన్సారి.

 

30. పవిత్ర ఖురాన్ లొ ఏ సహబీ పేరు ప్రస్తావించబడంది? ఙైద్ బిన్ హరిస్ రఙిఅల్లాతాలఅన్హు

 

31. పవిత్ర ఖురాన్ లొ ఏ స్ర్తీ పేరు ప్రస్తావించబడంది? హఙ్రత్ మరియం

 

32. పవిత్ర ఖురాన్ లొ అయతుల్ కుర్సి ఏ సూరల వుంది? సూర బఖరాలో వుంది.2:255

 

33. స్వర్గం లొ (ఙన్నత్) ఏ ఇద్దరు స్త్రీలు దైవప్రవక్త (సల్లెల్లహ్అలైవస్సల్లం) భార్యలు గా వుంటారు? 1.హఙ్రత్ అసియా (ఫిరౌన్ భార్య) 2.హఙ్రత్ మరియం (ఈసా అలైస్సలాం తల్లి)

 

33 వ ప్రశ్న యొక్క జవాబు తప్పు అని ధర్పండితులు చెప్పారు,ఎందుకంటే ఏవైతే ఆధారాలు వాటి గురించి ఉన్నాయో అవి చాలా బలహీనమైనవి (దయీఫ్). తబ్రానీ లో ఉన్నాయి ఇవి.

 

కానీ, ఈ విషయంలో వాటిని (బలహీన ఆధారాలను) ప్రామాణికంగా తీసుకోరాదని ధర్మపండితులు చెప్పారు.

 

34. దైవప్రవక్త (సల్లెల్లహ్అలైవస్సల్లం) తొలి సంతానం ఏవరు? ఖాసిం

 

35. దైవప్రవక్త (సల్లెల్లహ్అలైవస్సల్లం) మదీనా కు హిఙ్రత్ చెసిన తర్వాత ఎవరి ఇంట్లొ వున్నారు? అబూ అయ్యుబ్ అన్సారి

 

36. ఙన్నతుల్ బఖి లొ సమాధి చేయబడ్డ తొలి సహబీ ఏవరు? ఉస్మాన్ బిన్ మాఙున్ రఙిఅల్లాతాలఅన్హు

 

37. తొలిసారిగా దైవ మార్గం లొ హిఙ్రత్ చెసిన సహబీ దంపతులు ఏవరు? ఉస్మాన్ రఙిఅల్లాతాలఅన్హు ,రుఖియా రఙిఅల్లాతాలఅన్హ ఈ దంపతులు అబీసినియా కు దైవ మార్గం లొ హిఙ్రత్ చెసారు.

 

38. ఇస్లాం లొ తొలి ముఅఙ్ఙాన్ ఏవరు బిలాల్ రఙిఅల్లాతాలఅన్హు

 

39. బిలాల్ రఙిఅల్లాతాలఅన్హు తొ కలిసి మదీనా లొ ముఅఙ్ఙాన్ గా వున్నవారు ఏవరు? అబ్దుల్లా ఇబ్నె ఉమ్మె మక్తుం అల్ అమా రఙిఅల్లాతాలఅన్హు

 

40. మక్కాలొ తొలి ముఅఙ్ఙాన్ ఏవరు? అబు మఙురా రఙిఅల్లాతాలఅన్హు

 

41. దైవప్రవక్త (సల్లెల్లహ్అలైవస్సల్లం) నిర్మించిన తొలి మస్ఙిద్ ఏది? మదీనా మునవ్వర లొని మస్ఙిద్ ఏ ఖూబ

 

42. దైవప్రవక్త (సల్లెల్లహ్అలైవస్సల్లం) కాలం ల అబద్దపు ప్రవక్త గా చలామణి అయ్యిన వాడు ఏవడు? ముసైల్మ కఙ్హాబ్

 

43. భూమిలొ పాతబడిన తొలి పర్వతం ఏది? మక్కాలొని కాబ దగ్గరలొ గల ఖు బాయిస్ పర్వతం

 

44. అదం అలైస్సలం తొలిసారిగా భూమిలొ ఏక్కడ దిగాడు? ఇండియా

 

45. హవ్వ అలైస్సలం తొలిసారిగా భూమిలొ ఏక్కడ దిగారు? ఙెద్దా సౌది అరెబియా

 

46. ముస్లింలుతొలిసారిగా హిఙ్రత్ చేసినదేశం ఏది?అబీసినియా (ఇథియొపియ)

 

47. దైవప్రవక్త (సల్లెల్లహ్అలైవస్సల్లం) పేరు మహమ్మద్ అయన తర్వాత తొలిసారిగా ఏవరు పెట్టుకున్నారు?మహమ్మద్ బిన్ హతిబ్ అల్ ఙుమాహి

 

48. ఇస్లాంలొ తొలి సమావేశాలు ఏవరి ఇంట్లొ ఙరిగాయి ? మక్కాలొని అర్ఖామ్ బిన్ అబిల్ అర్ఖామ్ ఇంట్లొ .

 

49. బని ఇస్రాయిల్ అనగా ఎమిటి ? బని ఇస్రాయిల్ అనగా ప్రవక్త యాకుబ్ సంతానం, ప్రవక్త యాకుబ్ కు ఇస్రాయిల్ అని కూడ పిలుస్తారు

 

50. మానవులు చేసే ప్రతిపనినీ వ్రాసి రికార్డు చెసే దూతల పేర్లు ఎమిటి? కిరామున్ కాతిబీన్

 

51. మనిషి మరణాంతరం సమాధిలో ప్రశ్నోత్తరాలు చెసే దూతల పేర్లు ఎమిటి? మున్కర్ నకీర్

 

52. అల్లా చేత పంపించబడ్డ తొలి దైవ సందేశహరుడు (రసూల్) ఎవరు ? నూహ్ అలైస్సలాం

 

53. అదమ్ అలైస్సలం తొలి సంతానం ఎవరు? కూమరులు హబిల్,ఖాబిల్ కూతుళ్లు అక్లిమా, లుయిఙా

 

54. అదమ్ అలైస్సలం సంతానం లొ తొలి ప్రవక్త ఎవరు? షిత్ అలైస్సలం

 

55. ఇస్లాంలొ తొలి మదరసా ఎది? మస్ఙిద్ ఎ నబవి లొని సుఫ్పా చబుత్ర

 

56. ఇస్లాంలొ దైవప్రవక్త (సల్లెల్లహ్అలైవస్సల్లం) చే నియమించబడిన తొలి మదరసా మౌల్వి ఎవరు? ముసాబ్ బిన్ ఉమైర్ రఙిఅల్లాతాలఅన్హు

 

57. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) ఎప్పుడు ఙన్మించారు ? మక్కా లొ క్రి.శ. 570-571 రబ్బిలవ్వల్ 9-12 సొమవారం నాడు ఉదయం 4 - 5 గంటల మద్య ఙన్మించారు.

 

58. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) ఎప్పుడు ఈ లొకం నుండి నిష్క్రమించారు ? 11వ హిఙ్రి క్రి.శ. 632 రబ్బిలవ్వల్ 12న సొమవారం నాడు మదీనా లొ బిబిఅయెషా ఇంట్లొ ఈ లొకం నుండి నిష్క్రమించారు.

 

59. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) ఈ లొకం నుండి నిష్క్రమించెనాటికి అయన వయసు ఎంత ? 63

 

60. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) తల్లిదండ్రుల పేర్లు ఎమిటి? అబ్దూల్లా బిన్ అబ్దుల్ ముతల్లిబ్ ,బీబీ అమినా బింత్ వహబ్

 

61. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) తండ్రి అబ్దూల్లా బిన్ అబ్దుల్ ముతల్లిబ్ ఎప్పుడు మరణించారు? మక్కా లొ దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) ఙన్మించక ముందు మరణించారు.

 

62. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) తల్లి బీబీ అమినా బింత్ వహబ్ ఎప్పుడు మరణించారు? దైవప్రవక్త మహ్మద్ సల్లెల్లహ్అలైవస్సల్లం) 6ఎళ్ల వయసులొ బీబీ అమినా మదీనా దగ్గర అబువా అనేచొట మరణించారు.

 

63. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) వంశవృక్షం 21 తరాల వరకు తెలుపగలరు? మహ్మద్ సల్లెల్లహ్అలైవస్సల్లం బిన్ అబ్దూల్లా బిన్ అబ్దుల్ ముతల్లిబ్ బిన్ హషిం బిన్ అబ్దు మునాఫ్ బిన్ ఖుసై బిన్ కిలాబ్ బిన్ ముర్రా బిన్ కాబ్ బిన్ లొయి బిన్ గాలిబ్ బిన్ ఫహర్ బిన్ మాలిక్ బిన్ నదర్ బిన్ కనాన బిన్ ఖుఙైమా బిన్ ముద్రికా బిన్ ఇలియాస్ బిన్ ముదార్ బిన్ నఙార్ బిన్ మాఅద్ బిన్ అద్నన్

 

64. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) కు తొలిసారిగా పాలు ఎవరు త్రాగించారు? దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) పెదనాన్న అబులహబ్ యొక్క బానిస మహిళ సౌబియా ,తర్వాత హఙ్రత్ హలిమా సాదియా.

 

65. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) పాల సంబందిత సొదర,సొదరి పెర్లు తెలుపగలరు? హఙ్రత్ హలిమా రఙిఅల్లా తాల అన్హ యొక్క కూమరుడు అబ్దుల్లా, కూతుళ్ళు షైమా,ఉనైసా

 

66. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) కు మహమ్మద్ అని పేరు ఎవరు పెట్టారు? తాత అబ్దుల్ ముతల్లిబ్

 

67. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) కు అహమ్మద్ అని పేరు ఎవరు పెట్టారు? తల్లి బీబీ అమినా బింత్ వహబ్

 

68. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) తల్లి మరణించిన తర్వాత ఎవరి సంరక్షణలొ పెరిగారు? తాత అబ్దుల్ ముతల్లిబ్ వద్ద 2ఎళ్లు పెరిగారు. తాత మరణించిన తర్వాత బాబయి అబూతాలిబ్ వద్ద పెరిగారు.

 

69. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) తొలి వివాహము ఎవరితొ ఙరిగింది? దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) వివాహము తన 25 వ ఎటా 40 ఎళ్ల వయసు గల బీబీ ఖతిఙా రఙిఅల్లాఅన్హ తొ ఙరిగింది.

 

70. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) తొ బీబీ ఖతిఙా రఙిఅల్లాఅన్హ వివాహం ఙరగక ముందు అమె స్థితి ఎమిటి? అమె యొక్క తండ్రి పేరు ఖువైలిద్ .అమె మక్కాలొ గొప్ప శ్రిమంతురాలు.అమె వివాహం మొదట అతిఖ్ బిన్ అయాఙ్ తొ ఙరిగింది.అతిఖ్ చనిపొయిన తర్వాత అబూహల బిన్ ఙిరాద తొ ఙరిగింది. అతని ద్వార అమెకు హల.హరిస్,హింద్ అనె ముగ్గురు మగపిల్లలు పుట్టారు.అయితె అబూహల కూడ కొద్దికాలం తర్వాత చనిపొయారు.కొన్నాళ్ల తర్వాత మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) తొ వివాహము ఙరిగింది.

 

71. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) తొ బీబీ ఖతిఙా రఙిఅల్లాఅన్హ ఎన్నాళ్లు దాంపత్యఙివితము గడిపారు? 25 ఎళ్లు

 

72. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) కు బీబీ ఖతిఙా రఙిఅల్లాఅన్హ తొ ఎంతమంది సంతానం కలిగారు? 6 గురు .ఇద్దరు కూమరులు 1.ఖాసిం 2.అబ్దూల్లా (తాహెర్,తయ్యబ్) నలుగురు కూతుళ్లు 1.ఙైనబ్ రఙి అల్లాతాల అన్హ 2.రుఖియ్య రఙి అల్లాతాల అన్హ 3.ఉమ్మె కుల్సుమ్ రఙి అల్లాతాల అన్హ 4. ఫాతిమ రఙి అల్లాతాల అన్హ కాని విరిలొ మగ పిల్లలు పసితనంలొనె మరణించారు.

 

73. బీబీ ఖతిఙా రఙిఅల్లాఅన్హ మరణించిన తర్వాత దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) ఎవర్ని వివాహము చెసుకున్నారు? సౌద బింతే ఙమఅ రఙి అల్లాతాల అన్హ

 

74. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) సతిమణులలొ బీబీ ఖతిఙా రఙిఅల్లాఅన్హ తొ కాక మరెవరితొ సంతానం కలిగింది? మారియా ఖిబ్తియా రఙిఅల్లా తాల అన్హ తొ ఇబ్రాహిం అనె కూమరుడు కలిగాడు. కాని పసితనంలొనె మరణించాడు.

 

75. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) సతిమణుల (అఙ్వఙ్ ఎ- ముతహరత్) పేర్లు తెలుపగలరు? 1.బీబీ ఖతీఙా రఙిఅల్లా తాల అన్హ 2.సౌద రఙిఅల్లా తాల అన్హ 3.బీబీ అయేషా రఙిఅల్లా తాల అన్హ 4.హఫ్సా రఙిఅల్లా తాల అన్హ 5.ఙైనబ్ బింత్ ఖుఙైమా రఙిఅల్లా తాల అన్హ 6.ఉమ్మె సల్మా రఙిఅల్లా తాల అన్హ 7. ఙైనబ్ బింత్ ఙహష్ రఙిఅల్లా తాల అన్హ 8.ఙవేరియా రఙిఅల్లా తాల అన్హ 9.ఉమ్మె హబిబా రఙిఅల్లా తాల అన్హ 10.సఫియా రఙిఅల్లా తాల అన్హ 11.మైమునరఙిఅల్లా తాల అన్హ 12. మారియా ఖిబ్తియా రఙిఅల్లా తాల అన్హ

 

76. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) సతిమణుల (అఙ్వఙ్ ఎ- ముతహరత్) లొ ఒక్కరు తప్ప అందరు వైధవ్య మరియు విడాకుల స్థితిలొ వుండి వివాహం చెసుకున్నారు అ ఒక్కరు ఎవరొ తెలుపగలరు? బీబీ అయేషా రఙిఅల్లా తాల అన్హ

 

77. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) తొ బీబీ అయేషా రఙిఅల్లా తాల అన్హ వివాహం ఙరిగినప్పుడు అమె వయసు ఎంత? 9 లెక 12

 

78. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) కూతుళ్ల వివాహలు ఎవరెవరి తొ ఙరిగాయి తెలుపగలరు? ఙైనబ్ రఙి అల్లాతాల అన్హ కు 9 ఎళ్ల వయస్సులొనె బీబీ ఖతిఙా రఙి అల్లాతాల అన్హ చెల్లెలు హల కూమరుడు అబుల్ అస్ బిన్ ఉమయ్య తొ ఙరిగింది.అప్పట్లొ అరబ్ సంప్రదాయం ప్రకారం అడపిల్లలకు చిన్నవయసు లొనె పెళ్లిళ్లు చెసెవారు. రుఖియ్య రఙి అల్లాతాల అన్హ , ఉమ్మెకుల్సుమ్ రఙి అల్లాతాలఅన్హల వివాహం 7,8 ఎళ్లవయస్సులొ దైవప్రవక్త (సల్లెల్లహ్అలైవస్సల్లం ) పెదనాన్న అబూలహబ్ ఇద్దరు కూమరులు ఉత్బా,ఉతైబా లతొ ఙరిగింది.కాని దైవప్రవక్త (సల్లెల్లహ్అలైవస్సల్లం ) ప్రవక్త అయ్యాక అబూలహబ్ తొఇస్లాం స్వీకరంచమని అడిగితె కక్ష పెంచకుని తన ఇద్దరు కూమరులు ఉత్బా,ఉతైబా లతొ దైవప్రవక్త కూతుళ్లకు విడాకులు ఇప్పించాడు. పిదప రుఖియ్య రఙి అల్లాతాల అన్హ తొ ఉస్మాన్ రఙి అల్లాతాల అన్హు వివాహం ఙరిగింది .కొన్నాళ్ల తర్వాత రుఖియ్య రఙి అల్లాతాల అన్హ మరణించారు, దైవప్రవక్త (సల్లెల్లహ్అలైవస్సల్లం ) కొరిక తొ ఉమ్మెకుల్సుమ్ రఙి అల్లాతాలఅన్హ వివాహం ఉస్మాన్ రఙి అల్లాతాల అన్హు తొ ఙరిగింది. మరియు చిన్నకూతురు ఫాతిమ రఙి అల్లాతాల అన్హ వివాహం అలి రఙి అల్లాతాల అన్హు తొ ఙరిగింది.

 

79. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) కు అబ్దూల్లా బిన్ అబ్దుల్ ముతల్లిబ్ కు ఎంత మంది సొదరులు కలరు వారిలొ ఎంత మంది ఇస్లాం స్వికరించారు? 9 మంది సొదరులు కలరు. వారిలొ ఇస్లాం స్వికరించింది ఇద్దరు 1. హమ్ఙ రఙిఅల్లా తాల అన్హు 2 అబ్బాస్ రఙిఅల్లా తాల అన్హు

 

80. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) వద్ద ఙిబ్రాయిల్ అలైస్సలం తొలిసారిగా వహీ తిసుకువచ్చినప్పుడు దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) వయసు ఎంత? 40 ఎళ్లు

 

81. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) వద్ద ఙిబ్రాయిల్ అలైస్సలం ఎన్నిసార్లు వచ్చారు? దాదాపు 24,000 సార్లు

 

82. ఇస్లాం స్వీకరంచిన తొలి వ్యక్తులు ఎవరొ తెలుపగలరు? 1. బీబీ ఖతిఙా రఙిఅల్లా తాల అన్హ 2. హఙ్రత్ అబూ బకర్ సిద్దిఖ్ రఙిఅల్లా తాల అన్హు 3.హఙ్రత్ అలీ రఙిఅల్లా తాల అన్హు 4.హఙ్రత్ ఙైద్ బిన్ హరిస్ రఙిఅల్లా తాల అన్హు

 

83. ఇస్లాం లో తొలిసారి షహీద్ అయిన వ్యక్తులు ఎవరొ తెలుపగలరు? ఇస్లాం కొసం తొలిసారి షహీద్ అయిన వ్యక్తి హరిస్ బిన్ అబూహల రఙిఅల్లా తాల అన్హు . తొలిసారి షహీద్ అయిన మహిళ సయ్యద సుమయ్య రఙిఅల్లా తాల అన్హ మరియు ఈమె భర్త సయ్యద్ యాసిర్ రఙిఅల్లా తాల అన్హు ,కూమరుడు అమ్మార్ బిన్ యాసిర్ రఙిఅల్లా తాల అన్హు కూడ ఇస్లాం కొసం షహీద్ అయ్యారు.

 

84. ఇస్లాం స్వీకరించిన తొలి పూర్తి కుటుంబం ఎవరిదొ తెలుపగలరు? యాసిర్ రఙిఅల్లా తాల అన్హు కుటుంబం ,ఈయన భార్య సయ్యద సుమయ్య రఙిఅల్లా తాల అన్హ ,కూమరుడు అమ్మార్ బిన్ యాసిర్ రఙిఅల్లా తాల అన్హు ,మరియు విరందరు కూడ ఇస్లాం కొసం షహీద్ అయ్యారు.

 

85. అల్లా తన ప్రవక్తల పై నాలుగు పవిత్రగ్రంథాలు అవతరింపచెశాడు వాటి పేర్లు తెలుపగలరు? 1.తౌరాత్ మూస అలైస్సలాం పై 2. ఙబూర్ దావుద్ అలైస్సలాం పై 3. ఇంఙిల్ ఇసా అలైస్సలాం పై 4. ఖురాన్ షరిఫ్ మహ్మద్ ముస్తాఫ సల్లెల్లహ్అలైవస్సల్లం పై

 

86. పవిత్ర కాబ ఎత్తు ఎంతొ తెలుసా ? 14 మిటర్లు (45.93అడుగులు)

87. పవిత్ర కాబ ను చివరిసారి గా ఎప్పుడు పునర్ నిర్మంచినారు ? పవిత్ర కాబ ను చివరిసారి గా 1996 మే అక్టొబర్ ల మద్య పునర్ నిర్మంచినారు

 

88. స్వర్గపు ఎనిమిది ద్వారల పేర్లు తెలుపగలరు? 1.ఙన్నతుల్ మావ 2.దారుల్ మఖాం 3.దారుల్ సలాం 4.దారుల్ ఖుల్ద్ 5.ఙన్నతుల్ అదాన్ 6.ఙన్నతుల్ నయిం 7.ఙన్నతుల్ ఖషిఫ్ 8.ఙన్నతుల్ ఫిర్దౌస్

 

89. నరకం యొక్క 7 స్థానముల పేర్లు తెలుపగలరు? 1.ఙహన్నుమ్ 2.లాధా 3.హుతామ 4.అస్ సయిర్ 5. సఖిర్ 6.అల్ ఙాహిమ్ 7.అల్ హవియా

 

90. మక్కి,మదని సూరలు అంటె ఎమిటి? మక్కీ,మదని సూరలంటే మక్కీ సూరలంటే హిఙ్రత్ కూ పూర్వం అవతరించిన సూరలనీ, మదనీ సూరలంటే హిఙ్రత్ తర్వాత అవతరించిన సూరలని అర్థము.

 

91. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) ఎన్ని హఙ్ లు చేశారు? 10 వ హిఙ్రి లొ తన తొలి,చివరి,ఎకైక హఙ్ చేసారు.దినినే హఙ్ఙతుల్ విదా అంటారు.

 

92. తొలిసారి గా హఙ్ ఎప్పుడు ఫర్ఙ్ గా విధించబడింది ? 9 వ హిఙ్రి లొ హఙ్ ఫర్ఙ్ గా విధించబడింది.

 

93. తొలి ఙుమా నమాఙ్ ఎప్పుడు మొదలైంది? తొలి ఙుమా నమాఙ్ 12 రబ్బిలవ్వల్ నాడు దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం)మదీనా లొ చదివారు.

 

94. ఏ ప్రవక్త తాత ,తండ్రి ,కూమరుడు ప్రవక్తలు గా కలరు? యాఖుబ్ అలైస్సలాం . ఈయన తాత ఇబ్రాహీం అలైస్సలాం ,తండ్రి ఇసాఖ్ అలైస్సలాం కూమరుడు యూసుఫ్ అలైస్సలాం ,విరందరు ప్రవక్తలె.

 

95. ఇస్లాంలొ తొలి ఖలిఫా గాఎవరు నియమించహడ్డారు? అబూబకర్ రఙిఅల్లా తాల అన్హు

 

96. ఖులుఫాయె రాషిదున్ అని ఎవరిని పిలుస్తారు? 1. అబు బకర్ సిద్దిక్ రఙిఅల్లాతాల అన్హు 2. ఉమర్ ఫారుఖ్ రఙిఅల్లాతాల అన్హు 3. ఉస్మాన్ ఘని రఙిఅల్లాతాల అన్హు 4. అలి ముర్తుఙా రఙిఅల్లాతాల అన్హు

 

97. ముఖ్యమైన నలుగురు ఇమాం ల పేర్లు తెలుపగలరు? 1. ఇమాం అబూ హనిఫా రహ్మతుల్ల అలై 2.ఇమాం మాలిక్ రహ్మతుల్ల అలై 3.ఇమాం షాఫి రహ్మతుల్ల అలై 4.ఇమాం అహ్మద్ ఇబ్న్ హంబల్ రహ్మతుల్ల అలై

 

98. ప్రవక్తలలొ అధిక వయసు ఎవరు ఙివించారు? నూహ్ అలైస్సలాం 1050 లేద 950 సం.లు ఙివించారు.

 

99. ప్రవక్తలలొ అతి తక్కువ వయసు ఎవరు ఙివించారు? ఈసా అలైస్సలాం 33 సం.లు ఙివించారు.

 

100. దైవప్రవక్త మహ్మద్ (సల్లెల్లహ్అలైవస్సల్లం) ఇస్లాం గురించి భొదించడానికి తొలిసారిగా మదీనాకు ఎవరిని పంపారు? ముసబ్ బిన్ ఉమైర్ రఙిఅల్లాతాల అన్హు

 

 

No comments:

Post a Comment