సయ్యద్ మహమూద్ (1889-1971) బీహార్ యొక్క గొప్ప
జాతీయవాద రాజకీయ నాయకులలో ఒకరు. సయ్యద్ మహమూద్ AMU విద్యార్థి.
సయ్యద్ మహమూద్
ఘాజీపూర్ (యుపి)లోని సయ్యద్‌పూర్ బితారి గ్రామంలో జన్మించాడు. సయ్యద్ మహమూద్ తండ్రి
పేరు Md ఉమర్ మరియు తాత పేరు ఖాజీ ఫర్జాంద్ అలీ. సయ్యద్ మహమూద్ పూర్వీకులు లోడిస్
కాలంలో బీహార్ వచ్చారు. సయ్యద్ మహమూద్ రాజకీయ జీవితం అలీఘర్‌లో ప్రారంభమైంది, అక్కడ సయ్యద్ మహమూద్
1901-08లో తన విద్యను అభ్యసించాడు.
సయ్యద్ మహమూద్ భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలో కొనసాగుతున్న వలసవాద వ్యతిరేక జాతీయవాద పోరాటంలో ముస్లింలను చేరేలా చేయడానికి ప్రయత్నిస్తున్న కొద్దిమంది విద్యార్థులలో ఒకరు. 1905లో బెనారస్‌లో జి.కె.గోఖలే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశంలో సయ్యద్ మహమూద్ తన స్నేహితులతో కలిసి పాల్గొన్నారు. గోఖలే, గాంధీ మరియు జిన్నా ఇద్దరికీ రాజకీయ గురువు. ఈ సమావేశంలోనే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య తీర్మానాన్ని ఆమోదించారు.
MAO కాలేజ్ (తరువాత AMU), అలీఘర్‌లో విద్యార్థులు
తమ వలసవాద వ్యతిరేక భావాలను వ్యక్తం చేయడం ప్రారంభించారు. ఫిబ్రవరి 1907లో, సయ్యద్ మహమూద్ MAO కళాశాల యొక్క
బ్రిటిష్ మనుషుల నిర్వహణకు వ్యతిరేకంగా సమ్మెకు నాయకత్వం వహించాడు. కాంగ్రెస్‌తో
విద్యార్థుల సాన్నిహిత్యం పెరగడం పట్ల బ్రిటిష్ అధికారూ వారు ఆందోళన చెందారు. విద్యార్ధులు 1903లో ఒక రహస్య
బ్రిటీష్ వ్యతిరేక 'సమాజం'ని ఏర్పాటు చేశారు, ఇక్కడ భారతదేశం నుండి బ్రిటీష్ వారిని వెళ్లగొట్టే విషయాలు మరియు వ్యూహాలను
చర్చించారు. విద్యార్థుల హాస్టల్ గదులు టర్కీ సుల్తాన్, జర్మన్ కైజర్ మరియు
గోఖలే చిత్రాలతో అలంకరించబడ్డాయి. ఇవన్ని బ్రిటిష్ వ్యతిరేక చిహ్నాలు.
5ఫిబ్రవరి, 1907న, GKగోఖలేకు స్వాగతం
పలికేందుకు అలీఘర్ రైల్వే స్టేషన్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గుమిగూడారు.
సయ్యద్ మహమూద్, సైఫుద్దీన్ కిచ్లేవ్ వంటి వారు ఈ బ్రిటీష్ వ్యతిరేక విద్యార్థుల
బృందంలో చేరారు. వారు బ్రిటిష్ వారి పట్ల విధేయతను ప్రదర్శించిన సయ్యద్ అమీర్ అలీ
మరియు నవాబ్ సలీముల్లా వంటి ముస్లిం లీగ్ నాయకులను వ్యతిరేకించారు. 1908లో అలీఘర్ ముస్లిం
లీగ్ వార్షిక సమావేశానికి వేదికగా ఉన్నప్పుడు, బ్రిటిష్ అనుకూల
భావాలను ప్రదర్శించే తీర్మానాలను సయ్యద్ మహమూద్ తీవ్రంగా ఖండించారు మరియు
వ్యతిరేకించారు.
అలీఘర్ నుండి
బహిష్కరించబడిన తరువాత, సయ్యద్ మహమూద్ బారిస్టర్ కావడానికి లండన్లోని లింకన్స్ ఇన్‌కి వెళ్ళాడు. తరువాత, కేంబ్రిడ్జ్ నుండి
"మొఘల్ పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్" పై థీసిస్ రాశారు. W.S బ్లంట్ మరియు E.G. బ్రౌన్ ప్రభావంతో సయ్యద్
మహమూద్ పాన్ ఇస్లామిజంతో కూడా ప్రభావితమయ్యాడు.. ఇక్కడ సయ్యద్ మహమూద్ కొంతమంది
విద్యార్థులను కలుపు కొని ముస్లిం లీగ్ యొక్క లండన్ శాఖను నడుపుతున్న అమీర్ అలీ (d.1928)తో సైద్ధాంతిక
విభేదాలను పెంచుకున్నాడు. 1909లో లండన్‌లో మహాత్మా గాంధీ మరియు జె.ఎల్.నెహ్రూతో పరిచయం ఏర్పడింది.
సయ్యద్ మహమూద్ జర్మనీ
నుండి Ph.D పొంది భారతదేశానికి తిరిగి వచ్చాడు మరియు 1913 నుండి సయ్యద్
మహమూద్, మజరుల్ హక్ యొక్క మార్గదర్శకత్వంలో పాట్నాలో తన న్యాయవాద వృత్తిని
ప్రారంభించాడు. 1915 లో, సయ్యద్ మహమూద్ మజరుల్ హక్ మేనకోడలిని వివాహం చేసుకున్నాడు. తన కెరీర్
మొత్తంలో సయ్యద్ మహమూద్ మత సామరస్యాన్ని నొక్కిచెప్పాడు,
1916లో లక్నోలో జరిగిన
కాంగ్రెస్-లీగ్ ఒప్పందంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. హోమ్ రూల్ లీగ్, AICCతో పనిచేశాడు మరియు
ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొనడానికి తన న్యాయవాద వృత్తిని విడిచిపెట్టాడు. సయ్యద్ మహమూద్ “ది ఖిలాఫత్ & ఇంగ్లాండ్” అనే
పుస్తకాన్ని కూడా రచించాడు. 1922 లో, సయ్యద్ మహమూద్ జైలు
పాలయ్యాడు. 1923లో ఏఐసీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1929లో, M.A. అన్సారీతో కలిసి, కాంగ్రెస్‌లో ‘ముస్లిం నేషనలిస్ట్
పార్టీ’ని స్థాపించినాడు
మరియు కాంగ్రెస్ ప్రధాన
కార్యదర్శిగా, 1936 వరకు పనిచేశాడు. 1930లో, M.l. నెహ్రూ మరియు J.L. నెహ్రూ తో పాటు శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు అలహాబాద్‌లోని నైని
జైలులో బంధించబడ్డారు.
1939 నాటి సయ్యద్ మహమూద్ మతవాద సమస్యను కాంగ్రెస్ ప్రాధాన్యతపై పరిష్కరించాలని
కోరుకున్నాడని తెలుస్తుంది. నిజానికి, 1937లో, కాంగ్రెస్, ప్రావిన్సులలో మంత్రిత్వ శాఖలను ఏర్పాటు
చేయబోతున్నప్పుడు, మౌలానా ఆజాద్ ప్రకారం, సయ్యద్ మహమూద్ బీహార్‌లో ముఖ్యమంత్రి
పదవికి అత్యంత అర్హులైన అభ్యర్థి, కానీ
రాజేంద్ర ప్రసాద్ సమర్ధించిన S.K. సిన్హా
బీహార్ ముఖ్యమంత్రి గా ‘ఎన్నికయ్యారు’
ఎస్.కె. సిన్హా నేతృత్వంలోని క్యాబినెట్ 1937లో సయ్యద్ మహమూద్ విద్య, అభివృద్ధి మరియు ప్రణాళికా శాఖ మంత్రి
అయ్యారు. సాధ్యమైనంత ఎక్కువ మందికి
ప్రాథమిక విద్యను అందించడంపై సయ్యద్ మహమూద్ దృష్టి సారించారు, పాఠ్యాంశాల సవరణకు కృషి చేశారు, పాట్నా విశ్వవిద్యాలయంలో ఉర్దూ
ఉపాధ్యాయులను నియమించారు.
ప్రభుత్వ ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో ముస్లింల నిష్పత్తి
పెంపు కోసం సయ్యద్ మహమూద్ పోరాడారు. హిందీ-ఉర్దూ ఉద్రిక్తతను తగ్గించడానికి, సయ్యద్ మహమూద్ రౌష్ని అనే ద్విభాషా
(ఉర్దూ & హిందీ) వార్తాపత్రికను ప్రారంభించాడు. సయ్యద్
మహమూద్ “ఎ ప్లాన్ ఆఫ్ ప్రొవిన్షియల్ రీకన్‌స్ట్రక్షన్ (1939)” అనే పుస్తకాన్ని కూడా రాశాడు. ఇది చాలా ప్రజాదరణ పొందింది.
ఇది
బీహార్‌లోని ప్రజారోగ్యం,
విద్య మరియు మానవ వనరులు, వస్తు వనరులు వంటి సమస్యలపై సయ్యద్
మహమూద్ దృష్టిని వివర్శిస్తుంది. ఈ పుస్తకం గ్రామీణ రుణభారం మరియు వ్యవసాయ ఆర్థిక
విషయాల గురించి సుదీర్ఘంగా వివరించింది. 1946-52 కాలంలో సయ్యద్ మహమూద్ బీహార్‌లో రవాణా, పరిశ్రమలు మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా
పనిచేశారు.
1949లో సయ్యద్ మహమూద్ నెహ్రూకు భారత దేశాన్ని చైనా ప్రమాదం నుండి
రక్షించుకోవటానికి పాకిస్తాన్‌తో ప్రత్యేక సైనిక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని
సూచించాడు. సయ్యద్ మహమూద్ భారతదేశం యొక్క మత
విభజనతో బాధపడ్డాడు. 'గంగా-జమునీ తహజీబ్ ఆఫ్ ఇండియా'ని పెంపొదించడానికి “హిందూ ముస్లిం ఒప్పందం (1949)” అనే మరో పుస్తకం రాసాడు. 1954-57లో సయ్యద్ మహమూద్ కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు మరియు చారిత్రాత్మకమైన
బాండుంగ్ కాన్ఫరెన్స్ (1955)లో పాల్గొన్నాడు, అక్కడ పంచశీలను రూపొందించారు. గల్ఫ్
దేశాలు, ఇరాన్ మరియు ఈజిప్ట్‌లతో భారతదేశం
యొక్క ఉపయోగకరమైన దౌత్య సంబంధాలలో సయ్యద్ మహమూద్ విశేషమైన పాత్రను పోషించాడు.
జూన్ 1961లో, మతపరమైన అల్లర్లు సయ్యద్ మహమూద్ ను
కలచి వేసినాయి. 1964 లో సయ్యద్ ముస్లిం మజ్లిస్ మషావేరాత్
(MMM)ని స్థాపించినా, భారతదేశ లౌకిక ప్రజాస్వామ్యంలో ప్రత్యేక గుర్తింపు ఆధారిత రాజకీయ
పార్టీని కలిగి ఉండకూడదని హెచ్చరించాడు. సయ్యద్ మహమూద్. ఏప్రిల్ 1968లో అతను MMMని విడిచిపెట్టాడు.
1940లో గయా (బీహార్) నుండి వేలుబడే ఉర్దూ మాసపత్రిక “నదీమ్” బీహార్ పై వెలువరించిన ప్రత్యెక సంచిక లో “హయత్-ఎ-మహమూద్” అనే సమగ్ర
జీవిత చరిత్రను వ్రాయడానికి దాని ఇదారాలో అన్ని మాన్యుస్క్రిప్ట్‌లు ఉన్నాయని
పేర్కొంది.
No comments:
Post a Comment