చేమ దుంపను ఆహారంగా ప్రాచీన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు.
చేమ దుంపను మనదేశంలో వివిధ రాష్ట్రాలు వివిధ రూపాల్లో ఆహారంగా
ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కోస్తా భారతదేశంలోని గోవా, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఎక్కువగా
ఉపయోగిస్తారు. వీటితో వడలు, ఫోడి వంటి
వంటకాలు చేస్తే.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫ్రై, పులుసు వంటి కూరలను చేస్తారు. ఒడిశాలో
చేమ దుంప.. పప్పుతో చేసిన ప్రసిద్ధ వంటకం సారు బెసర. అంతేకాదు చేమ దుంప వేర్లు కూడా నూనెలో
బాగా వేయించి, ఎర్ర మిరప
పొడి, ఉప్పు చల్లి సారు చిప్స్‌ను తయారుచేస్తారు.
పోషక విలువల పరంగా, 100 గ్రాముల
చామదుంపలు సుమారు 120 కేలరీలను
ఇస్తాయి
ఆరోగ్య ప్రయోజనాలు:
శీతాకాలంలో తినే ఆహారంలో చేమను చేర్చుకోమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
· చేమ దుంప లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, ఇ సమృద్ధిగా ఉన్నాయి.
· రక్తంలో చక్కెర స్థాయిలను సులభంగా
నియంత్రించగలదని, గుండె
జబ్బులు, క్యాన్సర్
ప్రమాదాన్ని నివారిస్తుందని నిరూపించబడింది.
·
చేమ దుంపల్లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం , విటమిన్లు సి , విటమిన్ ఇ లు అధికం. రక్తంలో చక్కెర
స్థాయిని నియంత్రిస్తుంది.
·
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను
అందిస్తుంది.
·
చేమ దుంప రక్తంలో చక్కెర నియంత్రణ చేసే రెండు రకాల కార్బోహైడ్రేట్లను కలిగి
ఉంటుంది. ఫైబర్ , ఇతర
కార్బోహైడ్రేట్లు.. జీర్ణక్రియ, శోషణను నెమ్మదిస్తుంది. భోజనం తర్వాత
రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది.
· చేమ దుంపలో డయటరీ ఫైబర్ ఉండడం వల్ల ఇది
నెమ్మదిగా జీర్ణం అవుతూ, రక్తప్రవాహం
లోకి గ్లూకోజ్ ని నిదానంగా విడుదల చేస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు శరీరములో
చాలినంత శక్తి ఉంటుంది.
· బరువు తగ్గడములో సహకరిస్తుంది. చేమ దుంపలో
ప్రోటీన్లు కొద్దిగానే ఉంటాయి.
No comments:
Post a Comment