ఇటివల గత
కొన్నేళ్లుగా రైట్ వింగ్ శక్తులు భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ముస్లింలకు ఎలాంటి
పాత్ర లేదని పేర్కొంటూ భారతీయ ముస్లింల పట్ల ప్రదర్శిస్తున్న ఆవహేళనలు దాదాపు ప్రతిచోటా రోజువారీ దృశ్యంగా
మారాయి. భారత దేశం మరియు దాని స్వేచ్ఛ కోసం తమ పూర్వీకులు ఏమి త్యాగం చేశారనే దాని
గురించి చాలా మంది ముస్లిములకు నిజంగా తెలియదు.
1947 స్వాతంత్ర్య పోరాటంలోనే కాదు 1857 మొదటి స్వాతంత్ర్య పోరాటంలో కూడా
ముస్లింల త్యాగాల గురించి మన యువ తరానికే కాదు,
చాలా
మంది విద్యావంతులతోపాటు మన పెద్దలకు కూడా కనీస అవగాహన లేదు. ముస్లింలు నాయకత్వం
వహించి పోరాడారు.
తిరుగుబాటుకు
చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్,
అహ్మదుల్లా
షా, బర్కత్ ఖాన్, ఖాన్ బహదూర్ ఖాన్ రోహిల్లా,
బేగం
హజ్రత్ మహల్‌తో పాటు అనేక మంది నాయకత్వం వహించారు. మరియు వారందరూ 1857 తిరుగుబాటులో పాల్గొన్నందుకు భారీగా మూల్యం చెల్లించారు.
చివరి
మొఘల్ చక్రవర్తి పదవీచ్యుతుడయ్యాడు మరియు బర్మాలోని రంగూన్‌కు బహిష్కరించబడ్డాడు, అక్కడ అతను తన జీవితంలోని మిగతా సంవత్సరాలు జైలు శిక్షలో గడిపాడు. ఢిల్లీలో
తిరుగుబాటు దళాలకు నాయకత్వం వహించిన బహదూర్ షా జఫర్ కుమారులు, అతని పెద్ద కుమారుడు మీర్జా మొఘల్‌తో సహా ఆరుగురు మొఘల్ యువరాజులు
నిర్దాక్షిణ్యంగా చంపబడ్డారు.
బ్రిటిష్
వలస పాలకుల చేత 1857 తిరుగుబాటుకు చెందిన అనేకమంది ఇతర
నాయకులు కూడా ఉరితీయబడ్డారు. బరేలీ మరియు రోహిల్‌ఖండ్‌లలో బ్రిటిష్ దళాలను ఓడించి, వారిని హిమాలయాలకు తరిమికొట్టిన ఖాన్ బహదూర్ ఖాన్ రోహిలా, తాంతియా తోపే, నానా సాహెబ్ మొదలగు స్వాతంత్ర్య ఉద్యమ
నాయకులకు ముఖ్యమైన సహాయాన్ని అందించాడు.
ఖాన్ బహదూర్ ఖాన్ రోహిలా చివరకు బరేలీలోని కొత్వాలి సమీపంలో ఉరి వేసుకుని
చనిపోయాడు. మోల్వీ అహ్మదుల్లా షాకు కూడా ఇదే విధమైన శిక్ష లబించినది మరియు మోల్వీ
అహ్మదుల్లా షా శరీరం బ్రిటీష్ వారి మిత్రుడిచే ద్రోహంగా చంపబడిన తరువాత రోజుల
తరబడి వేలాడుతూనే ఉంది.
ఉత్తర
భారతదేశంలోని ఒక ముఖ్యమైన నగరమైన అలహాబాద్ నుండి బ్రిటిష్ దళాలను ఓడించి, తరిమికొట్టిన మోల్వి లియాఖత్ అలీ,
వలస
పాలకులు పట్టణం మరియు చుట్టుపక్కల ప్రాంతాలపై తిరిగి నియంత్రణ సాధించకముందే హిందూ
మరియు ముస్లిం తిరుగుబాటుదారుల సహాయంతో అక్కడ పాలించారు. అండమాన్ దీవుల్లో
కొన్నాళ్లు అమానవీయ పరిస్థితుల్లో ఉండి చివరికి మరణించాడు. స్వాతంత్ర్య ఉద్యమానికి
సంబంధించిన మరొక ప్రఖ్యాత నాయకుడు మరియు తన కాలంలోని గొప్ప పండితుడు అయిన అల్లామా ఫజల్ హక్
కూడా అండమాన్ దీవులలోని కాలాపానిలో చాలా సంవత్సరాలు గడిపాడు, అక్కడ చాలా క్లిష్ట పరిస్థితుల్లో మరణించాడు.
1857 తిరుగుబాటులో బ్రిటీష్ సైనికులు ద్వారా లక్షలాది మంది ముస్లింలు నరికి చంపబడ్డారు. అనేక నగరాలు లేదా నగరాల్లో కొంత భాగం పూర్తిగా నేలమట్టం చేయబడినవి మరియు ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఢిల్లీలోని ముస్లింలు తమ ఇళ్ల నుండి బలవంతంగా బయటకు వెళ్లగొట్టబడ్డారు మరియు తరువాతి మూడు సంవత్సరాల వరకు తిరిగి రానివ్వలేదు. జామా మసీదు, మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ఐకానిక్ మసీదు సైనిక బ్యారక్‌లుగా మార్చబడింది మరియు మూడు సంవత్సరాల తరువాత అవమానకరమైన నిబంధనలతో తిరిగి ఇవ్వబడింది.
ఢిల్లీలోని
మరో గొప్ప మసీదు, చాందినీ చౌక్‌లోని ఫతాపురి జమా మసీదు, ఒక హిందూ వ్యాపారికి తక్కువ ధరకు విక్రయించబడింది. డిల్లి పట్టణంలోని
ముస్లింలు తమ ప్రార్థనా స్థలాన్ని తిరిగి కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తాన్ని
వెచ్చించే వరకు ఇది అతని నియంత్రణలో ఉంది. వారి ఇళ్లను, భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుంది. ముస్లిం భూస్వాములు వారి
ఆస్తులను స్వాధీనం చేసుకున్నందున మరియు వారు పేదలుగా మార్చబడినందున వారు తీవ్రంగా
దెబ్బతిన్నారు.
అయితే, 20వ శతాబ్దపు ప్రథమార్ధంలో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ముస్లిం నాయకులు చేసిన
ఈ త్యాగాలు గురించి కనీసం ముస్లిం యువ తరానికి ఎలాంటి ఆలోచన లేదు.
ఒక
ప్రముఖ చరిత్రకారుడు మొదటి స్వాతంత్ర్య యుద్ధంలో ముస్లింలు చేసిన త్యాగాల గురించి
రాస్తూ, “1857లో బ్రిటిష్ దళాలు నగరాన్ని తిరిగి ఆక్రమించినప్పుడు, ముస్లింలను చంపడంలో మరియు వారి ఆస్తులను దోచుకోవడంలో వారికి పూర్తి స్వేచ్ఛ
లభించింది. నగరవాసులు వెంటనే వారి ఇళ్ళు మరియు
వ్యాపారాలను ఖాళీ చేయాలని మిలటరీ ఆదేశించింది. శతాబ్దాల కాలంగా తమ తండ్రులు మరియు
పూర్వీకులు ఎంతో శ్రమకోర్చి నిర్మించి,
తమ జీవితమంతా
గడిపిన పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడానికి ఢిల్లీ ప్రజలు బలవంతం చేయబడిన
అత్యంత దారుణమైన దృశ్యం ఇది.
ఢిల్లీలో
నివసిస్తున్న లక్షలాది మంది ముస్లింలలో,
ప్రఖ్యాత
ఉర్దూ మరియు పర్షియన్ కవి మీర్జా అసదుల్లా ఖాన్ గాలిబ్ మాత్రమే జీవించడానికి
అనుమతించబడ్డారని చెబుతారు. ఢిల్లీ పతనం నుండి బయటపడిన మొఘల్ కోర్టులోని వారిలో అతను ఒకడు. మిగతా వారందరూ చంపబడ్డారు లేదా
ఢిల్లీ నుండి తరిమివేయబడ్డారు, వారి ఇళ్లు మరియు వ్యాపారాలు
దోచుకున్నారు మరియు ధ్వంసం చేశారు.
“కాంగ్రెస్ నేతృత్వం లో జరిగిన వలసవాద
వ్యతిరేక పోరాటంలో ముస్లింలు కూడా అంతర్భాగంగా ఉన్నారు. జస్టిస్ తయాబ్జీ నుండి
మౌలానా అబుల్ కలాం ఆజాద్ వరకు, దాదాపు తొమ్మిది మంది ముస్లిం నాయకులు
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. మహాత్మా గాంధీ, నెహ్రూ మరియు పటేల్ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించడమే కాదు, మహమ్మద్ అలీ జౌహర్, షౌకత్ అలీ, మౌలానా ఆజాద్, డాక్టర్ ముఖ్తార్ అన్సారీ, హకీమ్ అజ్మల్ ఖాన్, మౌలానా మహమూద్ హసన్ మరియు అనేక
అగ్రశ్రేణి ముస్లిం నాయకులు సమానంగా గౌరవించబడ్డారు మరియు గొప్ప ప్రజాదరణ పొందారు.
స్వాతంత్ర్య ఉద్యమం కోసం సాధ్యమైన ప్రతి త్యాగం వారు చేసారు. వారు మరియు వారి త్యాగాలు లేకుండా, దేశం స్వాతంత్ర్యం పొందినదని ఊహించలేము
స్వాతంత్ర్య
ఉద్యమం మరియు దానిలో ముస్లింల పాత్ర విశేషమైనది.. ముస్లిం వ్యతిరేక ప్రచారం
అత్యధికంగా ఉన్న ఈ సమయంలో భారత ముస్లిముల వారసత్వం,
చరిత్ర
మరియు జాతి స్వాతంత్ర్యం కోసం ముస్లిం పూర్వీకులు చేసిన త్యాగాల గురించి ముస్లిం యువ
తరం మరియు యువత తెలుసుకోవాలి.
No comments:
Post a Comment