మతము
మరియు రాజకీయాల మద్య ఇస్లాం విచక్షణ చూపదు. ఇస్లాం దృష్టిలో రెండు అవసరమైనవే మరియు
అవి పరస్పర పురకాలు అని చెప్పవచ్చును.
దివ్య ఖురాన్ ప్రకారం “ప్రపంచం లో కూడా నీ వాటాను విస్మరించకూ” మరియు
సహీ-అల్-బుఖారి హదీసు ప్రకారం ప్రపంచము పరలోకానికి పునాది వంటిది. కావున మతము మరియు ప్రాపంచిక వ్యవహారాలు రెండు ఇస్లాం
లో మిళితమైఉన్నాయి.
లౌకిక
ప్రపంచ వ్యవహారాలలో రాజకీయాలు ముఖ్యమైనవి. వాటిని సమూహా జీవన వ్యవహారాల నియంత్రణ
గా పేర్కొనవచ్చును.కావున ప్రజల జీవితాలను నియంత్రించే ఎ సిద్దాంతముకుడా రాజకీయాల
ప్రస్తావన లేకుండా ఉండలేదు. ఇది ఒక ప్రాధమిక సత్యము. మరొక సత్యమేమనగా ఇస్లాం తో
రాజకీయాలు ఒక ప్రత్యేకమైన సంబంధాలను కలిగిఉన్నాయి. ఇస్లామిక్ విశ్వాసాల(దీన్) విస్తృత
అద్యయానం లో రాజకీయాలు ఒకభాగం అంతేగానీ ప్రాధమిక ఇస్లామిక్ విశ్వాసాల
ఆద్యయనంలో(దీన్) రాజకీయాలు భాగము కావు. అనగా రాజకీయాల ప్రస్తావనలేని మతవిశ్వాసాలు,రాజకీయాల ప్రస్తావన కలిగిఉన్న
మతవిశ్వాసాలంతా సంపూర్ణమైనవి
అనికూడా అనవచ్చును.
ఇస్లాం
ఒక ఆచరణాత్మక మతం మరియు రాజకీయాలలో విజయము సాధించడానికి ఆచరణాత్మకతను
కలిగిఉండవలయును. ఇస్లాం ఆచరించలేనివాటిని ఆచరించమని తన అనుయాయులను బలవంత పెట్టదు.
"ఐ
ప్రాణిపైన అల్లాహ్ దాని శక్తి సామర్ద్యాలకు మించిన బరువు భాద్యతలను మోపడు.-దివ్య
ఖురాన్ 2:286.
విశ్వాస
రీత్యా రాజకీయాలు ఇస్లాం లో ఒక భాగము. ఇతర మతములలాగా ఇస్లాం రాజకీయాలకు మతానికి
మద్య విచక్షణ చూపదు. కానీ వాస్తవ పరిస్థితుల దృష్ట్యా రాజకీయాలు మతములో ఒక భాగం
కాక పోవచ్చును. అందుకే ఇస్లాం కొన్ని చోట్ల మినాహాయిస్తే ప్రపంచవ్యాప్తంగా తన
మత మరియు దార్మిక విధానాలతో, రాజకీయాలతో సంబంధం లేకుండా
నిలిచి ఉంది. అంతమాత్రాన దానిని కొందరు భావించినట్లు అసంపూర్ణం,లోపమైనదని చెప్పలేము. ఎందుకనగా ఇస్లాం పొందినది దాని రాజకీయ వ్యవస్థకుడా
పొందును అంతేగానీ ఒక వ్యవస్థ రెండో వ్యవస్థ పై ఆదిపత్యము చలాయించలేదు.
No comments:
Post a Comment